OurSubhakaryam Banner

2027 - 2028 శ్రీ ప్లవంగ నామ సంవత్సర సింహరాశి రాశీ ఫలాలు

Sri Plavanga Nama Samvatsara Simha Rasi / Leo Sign Telugu Rasi Phalalu

- Predictions By Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)

🔍 Search Our Site / మా వెబ్‌సైట్‌లో సెర్చ్ చేయండి:

మఘ 1,2,3,4 పాదములు లేదా పుబ్బ 1,2,3,4, పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందును.

Individuals born under Makha 1st, 2nd, 3rd, and 4th pada, Pubba 1st, 2nd, 3rd, and 4th pada, or Uttara 1st pada belong to Simha Rasi (Leo).

📊 2027 - 2028 ఆదాయ వ్యయాలు & రాజపూజ్యావమానాలు (Kandaya Phalalu):

ఆదాయం (Income): 14
వ్యయం (Expenditure): 02
రాజపూజ్యం (Honor): 01
అవమానం (Dishonor): 07

శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఆదాయం - 14, వ్యయం - 2, రాజ పూజ్యం - 01, అవమానం - 07.

In the Sri Plavanga Nama Samvatsara, the financial and social status indicators (Kandaya Phalalu) for Simha Rasi (Leo) are as follows: Income (Adayam) – 14, Expenditure (Vyayam) – 2, Honor (Raja Pujyam) – 1, and Dishonor (Avamanam) – 7.

పూర్వ పద్దతిలో సింహ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో సింహరాశి వారు తమ వ్యక్తిగత జీవితంలో పొందే విజయాలను సూచించుచున్నది.

In the traditional astrological calculation method, the remainder (Shesa Sankhya) obtained for Simha Rasi (Leo) is "7". This indicates the personal achievements and successes that Leo natives will attain in their individual lives during the Sri Plavanga Nama Samvatsaram.

2027-2028 నవగ్రహ గోచార ఫలితాల విశ్లేషణ (Planetary Transits Summary):

🪐 గురు గ్రహ ఫలితాలు (Jupiter Transit):

సింహరాశి వారికి శ్రీ ప్లవంగ నామ తెలుగు చాంద్రమాన సంవత్సరంలో అనగా 7 ఏప్రిల్ 2027 బుధవారం నుండి 26 మార్చి 2028 ఆదివారం వరకు గురుగ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి.. ఆదాయం కంటే వ్యయం అధికంగా ఎదురవుతుంది. సంతాన సంబంధిత విషయాలలో మీ యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా సంతానం ప్రవర్తించడం వల్ల దుఃఖము, ధన నాశనము ఎదుర్కొనవలసి వస్తుంది. ముఖ్యంగా పుత్ర సంతానం వల్ల మానసికంగా ఆందోళనను ఎదుర్కొనవలసిన సూచనలు కనిపిస్తున్నాయి. సంతాన సంబంధ ప్రయత్నాలు చేయు వారికి కూడా దైవ ఆశీస్సులు, వంశ పెద్దల ఆశీస్సులు అవసరం అవుతాయి. పరిశోధనా రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం బృహస్పతి యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది..విదేశీ నివాస సంబంధ ప్రయత్నాలు చేయు వారికి అవకాశాలు కలసి వస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఆఖరి నిమిషంలో సఫలమవుతాయి. గురు గ్రహ ప్రతికూల ప్రభావం వల్ల మీకు తెలియకుండానే మీరు కఠిన స్వభావాన్ని కలిగిన వారుగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. తమ వ్యక్తిగత జాతకంలో గురు గ్రహబలం లోపించిన యువత క్రూరమైన పనులను చేయడం, మోసం చేయడం ద్వారా అడ్డదారిలో ధనార్జన చేయాలి అనే తలంపును ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల వల్ల నష్టపోతారు. ఆరోగ్యపరమైన విషయాలలో సింహ రాశి వారు శ్రీ ప్లవంగ నామ సంవత్సరం అంతా కూడా మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. ముఖ్యంగా దేహ వ్రణాలకు సంబంధించిన వైద్య పరీక్షలు తరచుగా చేయించుకోవడం మంచిది. మీ యొక్క ప్రతికూల పరిస్థితుల ప్రభావం వల్ల ఆ దైవాన్ని మరియు గురువులను నిందించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పవిత్ర గోదావరి నది పుష్కరాల ప్రారంభం తర్వాత సింహ రాశి వారికి గురుగ్రహం యొక్క ప్రతికూల ఫలితాలు ప్రభావం తగ్గుతుంది. ఆర్థికంగా అనుకూలమైన కాలాన్ని పొందుతారు. మొత్తం మీద శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి బృహస్పతి వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి.

During the Sri Plavanga Nama Telugu lunar year—spanning from Wednesday, April 7, 2027, to Sunday, March 26, 2028—Jupiter (Guru Graham) will yield mixed results for Simha Rasi (Leo) natives. Expenditure will tend to outweigh income. In matters concerning children, their actions or behavior contrary to your wishes will cause grief and financial loss. Indications particularly suggest mental anxiety and distress on account of male offspring. Those making efforts for progeny or family expansion will require divine blessings and the guidance/blessings of family elders. Those in the field of research will abundantly receive the divine grace of Jupiter this year. Opportunities will turn favorable for individuals seeking foreign travel or foreign residence, with efforts bearing fruit in the final moment. Due to the adverse impact of Jupiter, you may inadvertently exhibit harsh or aggressive behavior. Young individuals lacking Jupiter's strength in their personal horoscope may feel tempted to adopt unrighteous paths, resort to deception, or pursue shortcut methods for wealth creation. You stand to incur losses through romantic or love affairs. Regarding health, Simha Rasi natives must exercise extreme caution throughout the entire Sri Plavanga Nama Samvatsaram; specifically, undergoing regular medical tests for bodily ulcers, lesions, or skin issues (Deha Vrana) is highly advisable. Under the weight of adverse conditions, situations may arise where you feel inclined to blame the Divine or spiritual gurus. However, following the commencement of the sacred Godavari Pushkaralu, the negative impacts of Jupiter will gradually subside for Leo natives, leading to a more financially favorable period. On the whole, Jupiter brings mixed results for Simha Rasi in the Sri Plavanga Nama Samvatsaram.

🪐 శని గ్రహ ఫలితాలు (Saturn Transit):

సింహరాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో శని వలన కూడా మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. 2027 మే నెల వరకు శని వల్ల సింహ రాశి వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. భూ సంబంధమైన లేదా గృహ సంబంధమైన విషయాల వల్ల ఆర్థిక నష్టాలని పొందుతారు. మీరు ఎవరినైతే విశ్వాస పాత్రులు అని నమ్ముతారో వారి వల్ల మోసగింపబడతారు. తరచుగా అతిసార సంబంధమైనటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పెద్దలతో తగాదాల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత పట్ల శ్రద్ధ లోపిస్తుంది. సులువుగా ధనాన్ని సంపాదించాలి అనే తలంపు పెరుగుతూ వస్తుంది. ఇటువంటి ఆలోచన విధానం వలన మీ పూర్వపు కష్టార్జితాన్ని అధిక మొత్తంలో పోగొట్టుకొని ఋణ గ్రస్తులు అయ్యే అవకాశం ఉంది. 22 మే 2027 వ తేదీ నుండి సింహ రాశి వారికి గోచార రీత్యా జరుగుతూ వస్తున్నఅష్టమ శని దశ పూర్తవుతుంది. గత కాలంలో ఎదుర్కొన్న ఆర్థిక నష్టాల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. సొంత గృహము లేదా భూ సంపదను కుటుంబానికి ఏర్పాటు చేయగలుగుతారు. మీ వాక్చాతుర్యం ఉపయోగించుకొని అనేకమైన పనులను పూర్తి చేసుకోగలుగుతారు. మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి వలన మీ వంశంలోనే ప్రసిద్ధత కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంటారు. పరదేశాలందు నివసించాలి లేదా పరదేశాలందు ధనార్జన చేయాలి అనే ఆలోచన కలిగిన వారికి ఈ కాలం అనుకూలమైన కాలం. సెప్టెంబర్ 2027 తదుపరి అవివాహితుల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అతి చక్కటి జీవిత భాగస్వామి లభించడం వలన వారి వల్ల ఆర్థికంగానూ మరియు సామాజికంగానూ అభివృద్ధి చెందుతారు. డిసెంబర్ 2027 తదుపరి ఆర్థికంగా మీరు కోరుకున్నంత ధనార్జన లభిస్తుంది మరియు సదా నిలువ ధనాన్ని కలిగి ఉంటారు. గోచార రీత్యా సింహ రాశి వారిని ఇబ్బంది పెడుతున్న అష్టమ శని దశ ఈ సంవత్సరం పూర్తి అవ్వడం ఒక పెద్ద ఉపశమనంగా భావించవచ్చు.

In the Sri Plavanga Nama Samvatsara, Saturn (Shani Bhagavan) will also yield mixed results for Simha Rasi (Leo) natives. Until May 2027, Saturn will bring adverse results for Leo natives. You may incur financial losses due to land- or real estate-related matters. You risk being deceived by individuals you trusted implicitly. Frequent digestive health issues and ailments such as diarrhea or gastrointestinal troubles may cause distress. Quarrels and disputes with family elders will disturb your peace of mind. Attention toward personal hygiene may decline. The temptation to make quick or easy money will grow; adopting such an approach could lead to losing a substantial portion of your hard-earned savings and falling into debt. From May 22, 2027 onward, the transit period of Ashtama Shani (8th house Saturn) ends for Simha Rasi. This will mark a major relief for Leo natives. You will find relief from past financial losses and will be able to acquire a house or land property for your family. Utilizing your eloquence and persuasive speech, you will successfully execute and complete various endeavors. Your personal growth and progress will earn you recognition as a prominent figure within your lineage/family. This period is highly favorable for those aspiring to reside or earn a livelihood in foreign lands. After September 2027, marriage efforts for eligible bachelors/unmarried individuals will meet with success. Securing an excellent life partner will foster both financial and social elevation through them. After December 2027, you will achieve your desired levels of income and consistently maintain accumulated savings and reserves. On the whole, the conclusion of the troublesome Ashtama Shani transit this year serves as a monumental relief for Simha Rasi natives.

🪐 రాహు గ్రహ ఫలితాలు (Rahu Transit):

సింహరాశి వారికి శ్రీ ప్లవంగనామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వారసత్వ సంబంధ విషయాలలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది. శత్రు విజయం ప్రాప్తిస్తుంది. కోర్టు తీర్పుల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరినా ఉన్నట్లయితే వారికి అనుకూలమైన తీర్పు పొందగలుగుతారు.నిత్య జీవన విధానంలో సౌకర్యతను పెంచుకోగలుగుతారు. భోగవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. వ్యక్తిగత జాతకంలో రాహు గ్రహ బలం కలిగి ఉన్నవారు గురు గ్రహం వల్ల ఎదుర్కొనవలసిన ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం లేదా నీచ స్థాన రాహువు ఉన్నటువంటి వారు పైన పేర్కొన్న అనుకూల ఫలితాలను పూర్తిస్థాయిలో పొందలేకపోయినా సాధారణ యోగవంతమైనటువంటి ఫలితాలను మాత్రం పొందగలుగుతారు.

In the Sri Plavanga Nama Samvatsara, Rahu (Rahu Graham) will deliver highly favorable results for Simha Rasi (Leo) natives throughout the entire year. Most notably, long-standing disputes and problems concerning ancestral properties will be resolved, leading to gains through hereditary assets. You will achieve victory over enemies and rivals. Those awaiting court verdicts or legal judgments will receive decisions in their favor. You will enhance comfort and convenience in your daily lifestyle, enjoying a luxurious and prosperous life. Individuals who possess a strong positioning of Rahu in their personal horoscopes will overcome the health ailments triggered by Jupiter's transit. However, individuals whose personal horoscopes feature Kala Sarpa Dosha or a debilitated Rahu (Neecha Rahu) may not experience the full extent of these auspicious benefits, though they will still enjoy moderately favorable results.

🪐 కేతు గ్రహ ఫలితాలు (Ketu Transit):

సింహరాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కేతు గ్రహం వల్ల మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. తరచుగా కుటుంబ కారణాల వలన దూరప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విశేషమైన సత్కార్యాలు మీ చేతి పైన నిర్వహించబడతాయి. జీర్ణ సంబంధమైన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. మీరు మంచి చేయాలి అని ఆలోచించినా సర్వ కార్యాలను పాడు చేయు వ్యక్తి అనే నిందని భరించవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. మరణానంతర మోక్షం గురించిన ఆలోచనలు అధికమవుతాయి. కేతు గ్రహ అనుకూలత వల్ల విదేశీ నివాసము లేదా విదేశీ పర్యటనలు చేయగలుగుతారు. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం లేదా కేతు గ్రహ బలం లోపించిన వారు రహస్య పాప కార్యాచరణ చేసే వారవుతారు. వీరి చేతి పై ధనం తమ కుటుంబానికి కాకుండా అన్యులకు వృధాగా వ్యయం అవుతుంది.

In the Sri Plavanga Nama Samvatsara, Ketu (Ketu Graham) will deliver mixed results for Simha Rasi (Leo) natives. You will frequently need to undertake long-distance journeys due to family obligations or domestic reasons. Noble deeds and highly auspicious charitable activities will be performed through your hands. However, digestive health issues and stomach troubles are likely to cause discomfort. Even when your intentions are good and noble, situations may arise where you face false blame or accusations of spoiling endeavors. Thoughts regarding spiritual liberation and post-death salvation (Moksha) will increase. On the positive side, favorable Ketu placements will facilitate foreign residence or overseas travel. Conversely, individuals who have Kala Sarpa Dosha or lack Ketu's strength in their personal horoscope may feel inclined toward secret unrighteous acts or hidden misdeeds. Money passing through their hands will be wasted on outsiders rather than benefiting their own family.

మొత్తం మీద శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో సింహరాశి వారు గురు, శని , రాహు మరియు కేతు గ్రహముల వలన అధిక శాతం మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ వ్యక్తిగత జాతకంలో గురువు, శని, రాహువు మరియు కేతు గ్రహాలలో ఏ గ్రహం అయితే అధిక బలంతో ఉంటుందో ఆ గ్రహ ఫలితాలే ఈ సంవత్సరం అంతా ప్రస్పుటంగా ప్రతిఫలిస్థాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతికూల ఫలితాల వలన అధైర్య పడకండి. మీ వ్యక్తి గత జాతకంలో ప్రతికూల ఫలితాలకు కారణమైన గ్రహం బలమైన స్థానంలో అనుకూలంగా ఉంటే ప్రతికూల ఫలితాల తీవ్రత తగ్గుతుంది.

Overall, in the Sri Plavanga Nama Samvatsara, Simha Rasi (Leo) natives will experience predominantly mixed results due to the transits of Jupiter, Saturn, Rahu, and Ketu. In your personal horoscope, whichever of these planetary bodies—Jupiter, Saturn, Rahu, or Ketu—possesses the greatest structural strength will exert the most prominent and visible influence throughout this year. Do not feel discouraged or disheartened by the negative results mentioned here. If a planet causing adverse transits happens to be positioned strongly and favorably in your individual birth chart, the severity of those negative outcomes will diminish significantly.

2027 - 2028 మాసవారీ సింహరాశి ఫలితాలు (Monthly Predictions):

నెలవారీ రాశీ ఫలితాలను మరియు ముఖ్య పర్వదినాల వివరాలను క్రింద పొందగలరు...You can find the details of monthly horoscope predictions and important festival dates below...

ఏప్రిల్ 2027 సింహరాశి రాశీఫలితాలు / April 2027 Leo Predictions

ఈ మాసంలో సింహరాశి వారికి ధన ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. తలపెట్టిన సర్వ కార్యములందు సామాన్య ఫలితాలు పొందుతారు. మీరు ఆశించిన ఫలితాలు లభించక పోవడం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలలో కష్టం మీద సఫలత ఏర్పడుతుంది. పుబ్బ నక్షత్ర జాతకులు అతిగా ఆలోచించడం వలన చక్కటి అవకాశము లను కోల్పోవుదురు. అనుభవజ్ఞుల సలహాలు ఆచరించక పోవడం వలన నష్టపోవుదురు. ఈ మాసంలో అన్ని వర్గముల వృత్తి వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. ఈ మాసంలో ద్వితీయ మరియు తృతీయ వారములలో పితృ వర్గీయులకు ఆరోగ్య గండములు ఉన్నవి. వ్యక్తిగత జాతకంలో కుజ గ్రహ బలం లోపించిన సింహరాశి వారు తమ పితృ వర్గీయుల ఆరోగ్య విషయాలలో గ్రహ శాంతులు జరిపించుకోనుట మంచిది. ఈ మాసంలో 9,17,23 మరియు 25తేదీలు సింహరాశి వారికి అనుకూలమైనవి కావు.

In April 2027, financial income for Simha Rasi (Leo) native individuals will not reach expected levels. You will obtain only ordinary or average outcomes across all initiated tasks and endeavors. Falling short of your expected results will lead to significant disappointment and frustration. Unmarried individuals seeking marriage alliances will achieve success only after encountering considerable hardship and effort. Those born under the Pubba nakshatra may lose out on excellent opportunities due to overthinking. Failing to heed and follow the advice of experienced individuals will result in losses. Professional activities and business operations across all sectors will progress at a moderate pace during this month. During the second and third weeks of April, health risks or critical conditions (Arogya Gandamulu) are indicated for paternal relatives. Leo natives who lack Mars (Kuja Graham) strength in their personal horoscopes are advised to perform planetary propitiatory rituals (Graha Shanti) for the well-being of their paternal family members. During this month, the 9th, 17th, 23rd, and 25th days are not favorable for Simha Rasi natives.

ఏప్రిల్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7 తేదీ శ్రీ ప్లవంగ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. 9వ తేదీ మత్స్య జయంతి మరియు సౌభాగ్య గౌరీ వ్రత దినం. 11వ తేదీ శ్రీ పంచమి. 15వ తేదీ శ్రీరామనవమి పర్వదినం. 16వ తేదీ ధర్మరాజ దశమి. 17వ తేదీ మతత్రయ ఏకాదశి మరియు వాడపల్లి తీర్థం. 19వ తేదీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి కల్యాణోత్సవం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం.

Key festivals and auspicious days in April 2027: The Sri Plavanga Nama Samvatsaram officially commences on the 7th. Matsya Jayanti and Saubhagya Gauri Vratam fall on the 9th. Sri Panchami takes place on the 11th. The auspicious festival of Sri Rama Navami is celebrated on the 15th. Dharmaraja Dashami falls on the 16th. Matatraya Ekadashi and Vadapalli Teertham take place on the 17th. Ontimitta Kodandaramaswamy Vari Kalyanotsavam is celebrated on the 19th. Sankashtahara Chaturthi Vratam is observed on the 24th.

మే 2027 సింహరాశి రాశీఫలితాలు / May 2027 Leo Predictions

ఈ మాసం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి సంబంధిత ఆర్ధిక సహకారం లభించడం వలన ఆర్ధిక భారం తగ్గించుకోగలరు. ముఖ్యంగా మఖ నక్షత్ర జాతకులకు ఈ మాసంలో చక్కటి ధన లాభములు ఏర్పడును. వారసత్వ పరంగా , వ్యాపార పరంగా ఆర్ధికంగా ఆశించిన వృద్ధి పొందగలుగుతారు. సింహరాశి వారికి ఈ మాసంలో చివరి వారం ప్రారంభం వరకు చక్కటి మానసిక ఉల్లాసం లభిస్తుంది. చివరి వారంలో ఉద్యోగంలో తోటివారిచే అవమానములు పొందడం లేదా అకారణ తగాదాలు ఎదుర్కొనవలసి రావడం వంటి అననుకూలమైన ఫలితాలు ఎదుర్కొంటారు. మీరు ఎవరి నుండి అయితే సహాయ సహకారాలు ఆశిస్తారో వారు చివరి నిమిషంలో తమ మాట మారుస్తారు. ఈ మాసం చివరి వారంలో ఏ విషయం లోనూ పరులపై ఆధార పడకుండా ఉండడం మంచిది. వివాహ ప్రయత్నాలు చేయువారికి ఆశాభంగములు ఎదురగును. వివాహ ప్రయత్నములు చేయు సింహరాశి వారికి ఈ మాసంలో శుక్ర గ్రహ బలం లోపించింది.

In May 2027, conditions will be favorable for Simha Rasi (Leo) native individuals. Notably, receiving financial support and cooperation from your spouse will help alleviate your financial burden. Individuals born under the Makha nakshatra, in particular, will enjoy excellent monetary gains during this month. You will achieve expected financial growth through inheritance as well as business endeavors. Leo natives will experience great mental cheerfulness and joy until the beginning of the final week of the month. However, during the last week, you may face adverse outcomes such as experiencing humiliation from colleagues at the workplace or confronting baseless conflicts and arguments. People from whom you expect help and support will go back on their word at the last moment. It is advisable not to depend on others for any matter during the final week of this month. Those making marriage alliance efforts will encounter disappointments, as planetary support from Venus (Shukra Graham) is lacking for Leo natives seeking marriage proposals this month.

మే 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ వరూధిని ఏకాదశి. 4వ తేదీ మాస శివరాత్రి మరియు ఈ రోజు నుండి వాస్తు కర్తరి ప్రారంభం అవుతుంది. వాస్తు కర్తరి మే 30వ తేదీన ముగుస్తుంది. 7వ తేదీ వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. 9వ తేదీ అక్షయ తృతీయ మరియు పరశురామ జయంతి మరియు సింహాచల శ్రీ అప్పన్న స్వామి చందనోత్సవ దినం. 15వ తేదీ శ్రీ వాసవి అమ్మ వారి జయంతి. 16వ తేదీ సర్వ ఏకాదశి దినం మరియు అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణోత్సవ పర్వ దినం. 18వ తేదీ నృసింహ జయంతి. 20వ తేదీ శ్రీ అన్నమాచార్య జయంతి మరియు బుద్ధ పౌర్ణమి మరియు మహా వైశాకి పర్వదినం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 25వ తేదీ రోహిణి కార్తె ప్రారంభ దినం. 30వ తేదీ శ్రీ హనుమాన్ జయంతి.

Key festivals and auspicious days in May 2027: Varudhini Ekadashi falls on the 2nd. Masa Shivaratri takes place on the 4th, which also marks the beginning of Vastu Kartari (concluding on May 30th). The holy Vaishakha Masa commences on the 7th. Akshaya Tritiya, Parashurama Jayanti, and the famous Simhachalam Sri Appanna Swamy Chandanotsavam are celebrated on the 9th. Sri Vasavi Ammavari Jayanti falls on the 15th. Sarva Ekadashi and the grand Kalyanotsavam of Sri Satyadeva Swamy at Annavaram take place on the 16th. Nrusimha Jayanti falls on the 18th. Sri Annamacharya Jayanti, Buddha Purnima, and Maha Vaishakhi are celebrated on the 20th. Sankashtahara Chaturthi Vratam is observed on the 24th. Rohini Karte commences on the 25th. Sri Hanuman Jayanti is celebrated on the 30th.

జూన్ 2027 సింహరాశి రాశీఫలితాలు / June 2027 Leo Predictions

ఈ మాసంలో సింహరాశి వారు సామాన్య ఫలితాలు ఎదుర్కొంటారు. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ మరియు వ్యాపార రంగాలలోని వారు ఆశించిన స్థాయిలో అభివృద్ది ని పొందుదురు. ఉత్తరా నక్షత్ర జాతకులు ఈ మాసంలో తలపెట్టిన నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మీరు ఆశించిన విధంగా గౌరవ ప్రదమైన జీవనం లభిస్తుంది. ఈ మాసంలో 10 వ తేదీ నుండి 19 వ తేదీ మధ్య దగ్గరి బంధువులకు మీరు సహాయ పడవలసి వస్తుంది. సింహరాశి కి చెందిన స్త్రీలు తాము తలపెట్టిన పనులను ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరి నిమిషంలో పూర్తి చేయగలుగుతారు. మీరు చేసే కొన్ని పనులు ఇతరులకు ఆదర్శ వంతంగా ఉంటాయి. ఈ మాసంలో నూతన భాద్యతలు తీసుకొనుటకు వెనుకాడవద్దు. సింహరాశి వారి సహజ స్వభావం అయిన అనవసర ఆవేశానికి గురి అవ్వకుండా నిర్ణయాలు తీసుకొనవలసి వస్తుంది. ధనం యొక్క విలువ తెలుసుకొని ధనార్జన కు సంబందించిన మార్పు నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

In June 2027, Simha Rasi (Leo) native individuals will experience moderate and mixed results. Financial income will remain average. However, individuals in the employment and business sectors will witness expected levels of growth and progress. Those born under the Uttara nakshatra (1st pada) will achieve notable success in new business ventures initiated during this month. You will enjoy a dignified and respectable lifestyle as envisioned. Between the 10th and 19th of this month, you will be required to extend assistance and support to close relatives. Leo women will successfully accomplish their chosen tasks at the final moment, despite encountering numerous obstacles along the way. Certain actions and endeavors you undertake will serve as an inspiration to others. Do not hesitate or step back from taking on new responsibilities this month. It is important to make decisions calmly without giving in to unnecessary anger or impulsiveness—which is a natural trait of Leo natives. Understanding the true value of money and making prudent financial decisions regarding wealth accumulation will prove beneficial.

జూన్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ మతత్రయ ఏకాదశి. 3వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. 6వ తేదీ బుద్ధ జయంతి. 13వ తేదీ దశ పాప హర దశమి. 14వ తేదీ నిర్జల ఏకాదశి మరియు స్మార్త ఏకాదశి. 18వ తేదీ ఏరువాక పూర్ణిమ మరియు వట సావిత్రి వ్రత దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీన పవిత్ర గోదావరి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. జూలై 7వ తేదీతో గోదావరి నది ఆది పుష్కరాలు పూర్తి అవుతాయి. 30వ తేదీ సర్వ ఏకాదశి దినం.

Key festivals and auspicious days in June 2027: Matatraya Ekadashi falls on the 1st. Masa Shivaratri takes place on the 3rd. The holy Jyeshtha Masa commences on the 5th. Buddha Jayanti falls on the 6th. Dasha Papa Hara Dashami is celebrated on the 13th. Nirjala Ekadashi and Smartha Ekadashi take place on the 14th. Eruvaka Purnima and Vata Savitri Vratam fall on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 22nd. The sacred Godavari Nadi Pushkaralu commences on the 26th (with the Adi Pushkaralu concluding on July 7th). Sarva Ekadashi takes place on the 30th.

జూలై 2027 సింహరాశి రాశీఫలితాలు / July 2027 Leo Predictions

ఈ మాసంలో సింహరాశి వారు శరీర అనారోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ముఖ్యంగా పుబ్బ నక్షత్ర జాతకులకు శ్రమానంతర కార్య జయం ఎదురగును. ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగుతుంది. విద్యార్ధులకు మాత్రం ఈ మాసంలో వారు ఆశించిన విధంగా మంచి అవకాశములు లభిస్తాయి. నూతన వధూవరులకు సంతాన ప్రాప్తి యోగం ఏర్పడుతుంది. ఈ మాసంలో ద్వితీయ వారంలో వ్యక్తిగత జీవనానికి సంబందించిన విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి తమ వ్యక్తిగత జీవితం పట్ల ఒక స్పష్టత వస్తుంది. తృతీయ వారంలో సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. 20వ తేదీ తదుపరి సింహరాశి వారికి ధనాదాయంలో పెరుగుదల లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల అవసరములకు తగిన ధనం సర్దుబాటు చేయగలుగుతారు. ఈ మాసంలో 22, 23 మరియు 26 తేదీలు సింహరాశి వారికి ఆర్ధికంగా అనుకూలమైనవి.

In July 2027, Simha Rasi (Leo) native individuals will face certain physical health issues. Specifically, those born under the Pubba nakshatra will achieve success in their endeavors only after putting in hard work and persistent effort. Professional life for employed individuals will continue at an average pace. Students, however, will secure excellent opportunities in line with their expectations during this month. Newlyweds will enjoy auspicious indications for progeny and family expansion. During the second week of the month, individuals experiencing personal life issues will gain clarity regarding their future direction. The third week will bring moderate or ordinary results. From the 20th onward, Leo natives will see an increase in financial income, enabling you to arrange and manage funds required for your family members' needs. During this month, the 22nd, 23rd, and 26th days are financially favorable for Simha Rasi natives.

జూలై 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి ఆషాడమాసం ప్రారంభమవుతుంది మరియు పూరి లోని శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఘనంగా జపరబడుతుంది. ఈ రోజు నుండి శుక్ర మూఢమి ప్రారంభమవుతుంది. శుక్ర మూఢమి 18 సెప్టెంబర్ 2027వ తేదీతో పూర్తి అవుతుంది. 14వ తేదీ తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి మరియు చాతుర్మాస వ్రత ఆరంభ దినం. 17వ తేదీ నుండి దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది.18వ తేదీ గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 29వ తేదీ సర్వ ఏకాదశి దినం. 31వ తేదీ మాస శివరాత్రి మరియు శని త్రయోదశి.

Key festivals and auspicious days in July 2027: Masa Shivaratri falls on the 2nd. The holy Ashadha Masa commences on the 5th, along with the grand celebration of the Sri Jagannath Swamy Ratha Yatra in Puri. Shukra Mudhami also begins on this day (concluding on September 18, 2027). Toli Ekadashi, Sayana Ekadashi, and the commencement of Chaturmasa Vratam take place on the 14th. Dakshinayana Period begins on the 17th. Guru Purnima and Vyasa Purnima fall on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 22nd. Sarva Ekadashi falls on the 29th. Masa Shivaratri and Shani Trayodashi take place on the 31st.

ఆగష్టు 2027 సింహరాశి రాశీఫలితాలు / August 2027 Leo Predictions

ఈ మాసం 5,6 మరియు 7 తేదీలలో సింహరాశి వారు కళత్ర జీవన సంబంధమైన చికాకులు ఎదుర్కొనవలసి వస్తుంది. మీరు తప్పిదం వలన వ్యక్తిగత జీవితంలో అపసవ్యతలు చోటుచేసుకుంటాయి. అయితే నూతన వ్యాపార వ్యవహరాలు ప్రారంభించడానికి ఈ మాసం అనువైన కాలం. అన్ని వర్గముల వృత్తి వ్యాపారములలో చక్కటి ధనయోగాలు ఉన్నవి. 13 వ తేదీ తదుపరి కుటుంబ అభివృద్ధికి సంబందించిన చక్కటి శుభ సంకల్పములు చేయగలుగుతారు. ఉద్యోగ జీవనంలోని వారికి సామాన్య ఫలితాలు ఎదురగును. ఈ మాసంలో 25,26, 27 తేదీలలో ప్రారంభించిన ప్రతీ విషయంలో కార్య జయం పొందుతారు. మాసాంతానికి క్రమంగా ఆశించిన అభివృద్ధి ని సాధిస్తారు. ముఖ్యంగా ఆర్ధిక పరమైన అంశాలు శుభప్రదం అవుతాయి. వివాహ మూలక ప్రయత్నాలకు కూడా ఈ మాసం అనుకూలమైనది. అయితే వివాహ పరమైన కుజ లేదా శుక్ర గ్రహ దోషములు కలిగిన వారు ఈ మాసంలో ఒక పర్యాయం నవగ్రహ మండపారధన హోమం చేయించుకొనుట మంచిది. దీని వలన మీ వివాహ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి.

In August 2027, Simha Rasi (Leo) native individuals will face hassles and friction in martial life (Kalatra Jeevanam) on the 5th, 6th, and 7th days. Distortions or issues in your personal life will arise due to your own missteps or errors. However, this month is highly auspicious for starting new business ventures. Favorable financial opportunities (Dhana Yogalu) are indicated across all professional and business sectors. After the 13th, you will make excellent, auspicious resolves and plans regarding family progress. Those in employed positions will experience moderate or ordinary outcomes. On the 25th, 26th, and 27th days of this month, you will achieve success in every task or initiative you undertake. Towards the end of the month, you will gradually accomplish expected growth and progress. Financial matters, in particular, will turn out to be prosperous. This month is also favorable for marriage efforts. However, Leo natives whose personal charts contain marital flaws associated with Mars (Kuja) or Venus (Shukra) are advised to perform Navagraha Mandaparadhana Homam once during this month, which will bring positive transformations in your marriage alliance efforts.

ఆగష్టు 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాన్ని పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు మరియు కర్కాటక రాశికి చెందినవారు చూడకూడదు. పుష్యమి నక్షత్ర జాతకులు మరియు కర్కాటక రాశికి చెందిన జాతకులు గ్రహ శాంతులు జరిపించుకోవాలి. ఈ పాక్షిక సూర్యగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు పూర్తి అవుతుంది. ఆగష్టు 3వ తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. 6వ తేదీ గరుడ పంచమి. 13వ తేదీ శ్రీ వరలక్ష్మీ దేవి వ్రత దినం. 14వ తేదీ శని త్రయోదశి. 15వ తేదీ నుండి గురు మూడమి కాలం ప్రారంభమవుతుంది. ఈ గురు మూడమి 16 సెప్టెంబర్ 2027 వ తేదీన ముగుస్తుంది. 17వ తేదీ శ్రావణ మాస పౌర్ణమి మరియు రాఖీ పండుగ. 20వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి. 28వ తేదీ మతత్రయ ఏకాదశి. 30వ తేదీ మాస శివరాత్రి. 31వ తేదీ పొలాల అమావాస్య పర్వదినం.

Key festivals and auspicious days in August 2027: A partial solar eclipse (Pakshika Surya Grahanam) occurs on the 2nd. Individuals born under Pushyami nakshatra and Karkataka Rasi (Cancer) must not view this eclipse and are advised to perform eclipse propitiatory rituals (Graha Shanti). This partial solar eclipse commences at 3:58 PM and concludes at 5:40 PM. The holy Shravana Masa commences on August 3rd. Garuda Panchami falls on the 6th. The auspicious Sri Varalakshmi Devi Vratam is observed on the 13th. Shani Trayodashi takes place on the 14th. Guru Mudhami period begins on the 15th (concluding on September 16, 2027). Shravana Purnima and Rakhi / Raksha Bandhan are celebrated on the 17th. Sankashtahara Chaturthi Vratam is observed on the 20th. Sri Krishna Janmashtami is celebrated on the 24th. Matatraya Ekadashi falls on the 28th. Masa Shivaratri takes place on the 30th. Polala Amavasya is celebrated on the 31st.

సెప్టెంబర్ 2027 సింహరాశి రాశీఫలితాలు / September 2027 Leo Predictions

ఈ మాసంలో సింహరాశి వారికి అంతగా అనుకూలమైన ఫలితాలు ఏర్పడవు. విఘ్నలతో కూడిన ప్రయాణ సంబంధ చికాకులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి తరపు బందువులకు సంబందించిన ఒక అశుభ వార్త వినవలసి వస్తుంది. వ్యాపారములు చేయువారికి ఆశించిన లాభములు లభిస్తాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములు విజయవంతం అగును. తృతీయ వారంలో మాత్రం చిన్న అనారోగ్య సూచన ఉన్నది. లేదా ఒక వాహన ప్రమాదం నుండి తప్పించుకొను సంఘటనలు ఎదుర్కొంటారు. ఈ మాసంలో 17 వ తేదీ తదుపరి సింహరాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మొత్తం మీద సింహరాశి వారికి ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. స్థిరాస్థి లేదా వాహన కొనుగోలు సంబంధ విషయాలలో ఎక్కువ ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇటువంటి ప్రయత్నాలు ఈ మాసంలో వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్ధిక సంబంధ విషయాలలో ఇతరులు తమ మాట నిలపెట్టుకోరు.

In September 2027, Simha Rasi (Leo) native individuals will not experience very favorable results. You will face travel-related hassles accompanied by obstacles and interruptions. You may have to hear unpleasant or distressing news regarding relatives from your spouse's side. On the commercial front, business owners will obtain their expected profits. Unemployed individuals seeking employment will find success in their job efforts. During the third week, however, there are indications of minor health issues or incidents where you narrowly escape a vehicle accident. After the 17th of this month, Leo natives must refrain from taking adventurous or high-risk decisions. Overall, financial income for Simha Rasi natives will remain average this month. You may have to spend a substantial amount of money on matters related to real estate or vehicle purchases; it is advisable to postpone such endeavors during this month. In financial affairs, others will fail to keep their promises or honor their word.

సెప్టెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. 2వ తేదీ శ్రీ బలరామ జయంతి. 3వ తేదీ శ్రీ వరాహ జయంతి. 4వ తేదీ శ్రీ వినాయక చవితి. 5వ తేదీ ఋషి పంచమి దినం. 11వ తేదీ పరివర్తన ఏకాదశి పర్వదినం. 12వ తేదీ శ్రీ వామన జయంతి. 14వ తేదీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత దినం. 16వ తేదీ గురు మూడమీ పూర్తి అవుతుంది మరియు ఈ 16 వ తేదీ నుండి భాద్రపద మాస అమావాస్య వరకు అనగా 29వ తేదీ వరకు మహాలయ పక్షం జరుగుతుంది. 18వ తేదీన శుక్ర మూఢమి పూర్తి అవుతుంది. 19వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీ సర్వ ఏకాదశి దినం. 28వ తేదీ మాస శివరాత్రి. 29వ తేదీ మహాలయ అమావాస్య.

Key festivals and auspicious days in September 2027: The holy Bhadrapada Masa commences on the 1st. Sri Balarama Jayanti falls on the 2nd. Sri Varaha Jayanti takes place on the 3rd. The grand festival of Sri Vinayaka Chavithi is celebrated on the 4th. Rishi Panchami falls on the 5th. Parivartana Ekadashi is observed on the 11th. Sri Vamana Jayanti takes place on the 12th. Sri Ananta Padmanabha Swamy Vratam falls on the 14th. Guru Mudhami concludes on the 16th; from this day through the Bhadrapada Amavasya on the 29th, Mahalaya Paksham is observed. Shukra Mudhami concludes on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 19th. Sarva Ekadashi falls on the 26th. Masa Shivaratri takes place on the 28th. Mahalaya Amavasya falls on the 29th.

అక్టోబర్ 2027 సింహరాశి రాశీఫలితాలు / October 2027 Leo Predictions

ఈ మాసం కూడా సింహరాశి వారికి అంతగా కలసి రాదు. అకారణంగా మిత్రులతో కలహములు లేదా ఆత్మీయుల నుండి ఎడబాటు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ మాసంలో చంద్ర గ్రహ బలం సింహరాశి వారికి ప్రతికూలంగా ఉండుట వలన తలపెట్టిన ప్రయత్నములలో ఆటంకములు ఎదురగును. తీవ్రంగా శ్రమించ వలసి ఉంటుంది. ఈ మాసంలో సింహరాశి వారి ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. అయితే దీర్ఘకాలికంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడిని అధిగమించగలుగుతారు. ఈ మాసంలో 19, 20,21, 22 తేదీలు సింహరాశి వారికి అనుకూలమైనవి. సంతాన సంబంధ ప్రయత్నములు చేయువారికి ద్వితీయ తృతీయ వారములు శుభప్రదంగా ఉన్నవి. వ్యాపార రంగంలోని వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ఆర్ధికంగా ధనం సమయానికి సర్దుబాటు కాదు. మంచి అవకాశములు చివరి నిమిషములో కోల్పోనవలసి వస్తుంది. వ్యాపార రంగంలో వున్న సింహరాశి వారు ఈ మాసంలో నిత్యం శని గ్రహ స్తోత్ర పటనం చేసుకొనుట మంచిది.

In October 2027, conditions will not be very favorable for Simha Rasi (Leo) native individuals. You may face unwarranted conflicts with friends or experience separation from close loved ones. Due to the adverse strength of the Moon (Chandra Graham) for Leo natives this month, obstacles and interruptions will arise in your planned endeavors, requiring intense effort and hard work. Financial income for Simha Rasi natives will remain average during this month; however, you will successfully overcome the prolonged mental stress you have been enduring. During this month, the 19th, 20th, 21st, and 22nd days are favorable for Simha Rasi natives. For those making efforts for progeny or family expansion, the second and third weeks are auspicious and promising. Individuals in the business sector will experience mixed results this month; funds will not be arranged on time financially, and excellent opportunities may be lost at the last moment. Businesspersons belonging to Simha Rasi are advised to recite the Shani Graha Stotram daily throughout this month.

అక్టోబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది మరియు అమ్మవారి పవిత్ర శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. నవరాత్రుల ప్రారంభ దినమైన ఈ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిని పూజించాలి. 2వ తేదీ శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని పూజించాలి. 3వ తేదీ శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారిని పూజించాలి. 4వ తేదీ శ్రీ మహా చండీ దేవి అమ్మ వారిని పూజించాలి. 5వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించాలి. 6వ తేదీ శ్రీ సరస్వతీ దేవి అమ్మవారిని పూజించాలి. 7వ తేదీ ఈ రోజు రెండు తిధుల సంధి ఏర్పడడం వలన ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించాలి మరియు ఈ రోజును దుర్గాష్టమి పర్వ దినంగా పరిగణించి శ్రీ దుర్గా దేవిని పూజించాలి. 8వ తేదీ మహానవమి పర్వదినం. ఈ రోజున శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారిని పూజించాలి. 9వ తేదీ విజయదశమి. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించాలి. ఈ రోజున మధ్యాహ్నం 1.40 నుండి మధ్యాహ్నం 2.38 గంటల మధ్య శమీ పూజను నిర్వహించాలి. 11వ తేదీ మతత్రయ ఏకాదశి. 18వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 28వ తేదీ నరక చతుర్దశి. 29వ తేదీ దీపావళి పర్వదినం. ఈ రోజునే ధనలక్ష్మి పూజ నిర్వహించాలి మరియు కేదార గౌరీ వ్రతం ఆచరించాలి. 30వ తేదీ బలి పాడ్యమి మరియు ఈ రోజు నుండే పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతుంది.

Key festivals and auspicious days in October 2027: The holy Ashwayuja Masa commences on the 1st, marking the beginning of the sacred Devi Sharad Navaratri. On this first day of Navaratri, worship is offered to Sri Bala Tripura Sundari Devi. Goddess Sri Gayatri Devi is worshipped on the 2nd. Goddess Sri Annapurna Devi is worshipped on the 3rd. Goddess Sri Maha Chandi Devi is worshipped on the 4th. Goddess Sri Lalitha Tripura Sundari Devi is worshipped on the 5th. Goddess Sri Saraswati Devi is worshipped on the 6th. On the 7th, due to the overlap of two Tithis, Goddess Sri Mahalakshmi Devi is worshipped, and the day is also observed as Durgashtami, worshipping Goddess Sri Durga Devi. Mahanavami falls on the 8th, on which Goddess Sri Mahishasura Mardhini Devi is worshipped. Vijayadashami is celebrated on the 9th, worshipping Goddess Sri Rajarajeshwari Devi; Shami Puja is to be performed between 1:40 PM and 2:38 PM on this day. Matatraya Ekadashi falls on the 11th. Sankashtahara Chaturthi Vratam is observed on the 18th. Naraka Chaturdashi falls on the 28th. The grand festival of Diwali is celebrated on the 29th, on which Dhanalakshmi Puja and Kedara Gauri Vratam are performed. Bali Padyami falls on the 30th, which also marks the commencement of the holy Kartika Masa.

నవంబర్ 2027 సింహరాశి రాశీఫలితాలు / November 2027 Leo Predictions

ఈ మాసంలో సింహరాశి వారికి వ్యపారాదులలో మరియు ఉద్యోగ జీవనంలో ఆశించిన ఉత్సాహకరమైన అవకాశములు లభించును. ఉద్యోగ జీవనం లోని వారికి వారు ఆశించిన పదోన్నతి పొందడానికి అవకాశాలు ఉన్నవి. ఈ మాసంలో సింహరాశి వారు తలపెట్టిన ప్రతీ నూతన ఆలోచన కార్యరూపం దాల్చును. మీ ప్రయత్నాలకు అడ్డుపడుతున్న ప్రభుత్వ సంబంధ ఆటంకములు తొలగిపోవును. మీ రంగములోని పోటీదారుల పై విజయం పొందగలుగుతారు. ఈ మాసంలో ప్రధమ మరియు ద్వితీయ వారములలో వ్యాపారములు లాభదాయకంగా కొనసాగును. మాసాంతంలో సంతానం మీపై చూపించే ప్రేమాభిమానాలకు మీ మనస్సు మార్చుకుంటారు. కుటుంబ సభ్యులతో వీలు అయినంత ఎక్కువ సమయం గడపడం వలన కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ మాసంలో ఆఖస్మికంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావచ్చు.

In November 2027, Simha Rasi (Leo) native individuals will obtain encouraging and enthusiastic opportunities across business activities and professional life. Those in employed positions will have strong prospects of securing their desired promotions. During this month, every new idea and plan initiated by Leo natives will materialize into action. Government-related hurdles and administrative obstacles that were hindering your efforts will be removed. You will achieve victory over competitors and rivals in your respective field. During the first and second weeks of this month, business ventures will operate profitably. Towards the end of the month, the love and affection shown by your children will lead to a positive change of heart. Spending as much time as possible with family members will help resolve certain disputes and misunderstandings. Sudden, unexpected long-distance travel may also become necessary during this month.

నవంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ నాగుల చవితి. 11వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి మరియు ఈ రోజున చాతుర్మాస వ్రతం పూర్తి అవుతుంది. 13వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినం ఈ రోజునే జ్వాలాతోరణం నిర్వహించాలి. 17వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ మతత్రయ ఏకాదశి దినం. 26వ తేదీ మాస శివరాత్రి మరియు ధన్వంతరి జయంతి. 29వ తేదీ నుండి మార్గశీర్ష మాసము ప్రారంభం అవుతుంది.

Key festivals and auspicious days in November 2027: Nagula Chavithi falls on the 2nd. Ksheerabdi Dwadashi takes place on the 11th, which also marks the conclusion of Chaturmasa Vratam. Kartika Purnima is celebrated on the 13th, on which Jwala Toranam is performed. Sankashtahara Chaturthi Vratam is observed on the 17th. Matatraya Ekadashi falls on the 24th. Masa Shivaratri and Dhanvantari Jayanti take place on the 26th. The holy Margashirsha Masa commences on the 29th.

డిసెంబర్ 2027 సింహరాశి రాశీఫలితాలు / December 2027 Leo Predictions

ఈ మాసంలో భూ లేదా గృహ సంబంధమైన విక్రయాల వలన ధన ప్రాప్తి లభిస్తుంది. సువర్ణ సంబంధమైన లాభములు పొందుతారు. కుటుంబ జీవనంలో సంతోషకరమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగ పరమైన లాభములు కూడా ఉన్నవి. విద్యార్ధులకు ఆశించిన రంగంలో విజయం వరిస్తుంది. మాస మధ్యమంలో ధర్మ కార్య సంబంధమైన వ్యయం చేస్తారు. ఇష్ట దైవ సందర్శన భాగ్యం ఏర్పడుతుంది. ఇతరుల సహకారంతో నిర్దేశించుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నూతన పెట్టుబడులు పెట్టుటకు ఈ మాసం మంచి సమయం. అయితే వ్యక్తిగత జాతకంలో బుధ గ్రహ బలం కూడా అవసరం. అవివాహితుల వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ సామజిక స్థాయికి మించిన సంబంధం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్న వారు వివాహ సంబంధ కుజ దోష పరిశీలన చేసుకొని ఈ మాసంలో మీ కుటుంబ పెద్దలతో మీ వ్యక్తిగత విషయాలు చర్చించవచ్చు.

In December 2027, Simha Rasi (Leo) native individuals will obtain financial gains through the sale of land or house properties. You will also experience profits and gains related to gold and precious ornaments. Happy and joyful transformations will take place in family life. Career and employment-related benefits are also indicated. Students will achieve victory and success in their desired fields. During the middle of the month, you will spend money on charitable, religious, and righteous deeds (Dharma Karyamulu). You will have the fortunate opportunity to visit your favorite deity (Ishta Daiva). With the cooperation of others, you will successfully complete scheduled tasks on time. This month is a favorable time for making new investments; however, planetary strength of Mercury (Budha Graham) in your personal horoscope is essential for optimal results. Marriage alliance efforts for unmarried individuals will bear fruit, yielding proposals that exceed your social standing. Those in romantic relationships should review marital Mars flaws (Kuja Dosha) and may discuss their personal matters with family elders during this month.

డిసెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 4వ తేదీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి. 9వ తేదీ సర్వ ఏకాదశి మరియు గీతా జయంతి. 11వ తేదీ శని త్రయోదశి. 13వ తేదీ శ్రీ దత్తాత్రేయ జయంతి. 16వ తేదీ సంకష్టహర చతుర్ధి వ్రత దినం. 20వ తేదీ శ్రీ కాలభైరవ అష్టమి. 23వ తేదీ సర్వ ఏకాదశి. 25వ తేదీ శని త్రయోదశి. 26వ తేదీ మాస శివరాత్రి. 28వ తేదీ నుండి పుష్య మాసం ప్రారంభం అవుతుంది.

Key festivals and auspicious days in December 2027: Sri Subramanyeshwara Swamy Shashti falls on the 4th. Sarva Ekadashi and Gita Jayanti take place on the 9th. Shani Trayodashi falls on the 11th. Sri Dattatreya Jayanti is celebrated on the 13th. Sankashtahara Chaturthi Vratam is observed on the 16th. Sri Kalabhairava Ashtami falls on the 20th. Sarva Ekadashi takes place on the 23rd. Shani Trayodashi falls again on the 25th. Masa Shivaratri is observed on the 26th. The holy Pushya Masa commences on the 28th.

జనవరి 2028 సింహరాశి రాశీఫలితాలు / January 2028 Leo Predictions

ఈ మాసంలో రాజకీయ పరంగా ఆశక్తి కలిగిన వారికి నూతన పదవులు ప్రాప్తించును. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. గౌరవ ప్రధానమైన జీవనం చేస్తారు. మీ పై అధికారుల మన్ననలు పొందడం ఆనందాన్ని కలుగచేస్తుంది. ఈ మాసంలో సింహరాశి వారు వినోద సంబంధమైన వ్యయం అధికంగా చేస్తారు. ద్వితియ వారంలో సోదరీ వర్గం వారికి ఒక నష్టం లేదా వారి కొరకు మానసిక ఆందోళన అనుభవిస్తారు. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాల పై జరుపు చర్చలు ఫలవంతం అవుతాయి. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. వ్యాపారములలో ఆశించిన ప్రోత్సాహం ఉండదు. ఈ మాసంలో 2,6,15, 26 తేదీలు సింహరాశి వారికి అంత అనుకూలమైనవి కావు.

In January 2028, Simha Rasi (Leo) native individuals with an interest in politics will obtain new positions and responsibilities. Your status and stature in society will rise, leading to a respectable and dignified life. Earning the appreciation and praise of your superiors will bring immense happiness. During this month, Leo natives will incur high expenditure on entertainment and leisure activities. In the second week, you may experience worry, mental anxiety, or a loss concerning a sister or female sibling. Discussions held with family members on key issues will prove fruitful and constructive. Financial income will remain average during this month. Business activities will lack the expected encouragement or momentum. During this month, the 2nd, 6th, 15th, and 26th days are not very favorable for Simha Rasi natives.

జనవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 8వ తేదీ శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినం మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినం. 14వ తేదీ శుక్రవారం భోగి పండుగ. 15వ తేదీ శనివారం మకర సంక్రాంతి రోజున ఉదయం 9 గంటల 21 నిమిషాలకు గ్రహ రాజు శ్రీ సూర్య భగవానుల వారు మకర రాశిలోనికి ప్రవేశిస్తారు. ఈ క్షణం నుండి పవిత్ర ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. 16వ తేదీ ఆదివారం కనుమ పండుగ. 17వ తేదీ సోమవారం ముక్కనుమ పండుగ. 22వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 26వ తేదీ చొల్లంగి అమావాస్య. 27వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది.

Key festivals and auspicious days in January 2028: The holy Sri Vaikuntha Ekadashi and Mukkoti Ekadashi fall on the 8th. Bhogi festival falls on Friday, the 14th. On Saturday, the 15th, on the occasion of Makara Sankranti, the planetary king Sri Surya Bhagavan enters Makara Rasi (Capricorn) at 9:21 AM; from this moment onward, the holy Uttarayana period commences. Kanuma festival falls on Sunday, the 16th. Mukkanuma festival takes place on Monday, the 17th. Sarva Ekadashi falls on the 22nd. Masa Shivaratri takes place on the 24th. Chollangi Amavasya falls on the 26th. The sacred Magha Masa commences on the 27th.

ఫెబ్రవరి 2028 సింహరాశి రాశీఫలితాలు / February 2028 Leo Predictions

ఈ మాసంలో కూడా సింహరాశి వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగ జీవనం లోని వారు ఆశించిన విధంగా నివాస పరమైన స్థానచలనము పొందుట వలన కుటుంబం తో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుంది. దైవం పై నమ్మకం కలిగించే సంఘటనలు మీ జీవితంలో చోటుచేసుకుంటాయి. స్వదేశానికి తిరిగి రావాలనే తలంపు కలిగిన సింహరాశి వారికి ఈ మాసం అనుకూలమైన కాలం. మాస ప్రారంభంలో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఎదురైనా ప్రమాదం ఉండదు. ఉత్తరా నక్షత్ర జాతకులకు మాత్రం ఈ మాసంలో అదృష్ట ప్రాప్తి ఉంది. తలవని తలంపుగా ముఖ్య కార్యములను విజయవంతంగా పూర్తీ చేయగలుగుతారు. ఉత్తరా నక్షత్ర జాతకులకు ఈ మాసంలో చక్కటి కార్య సిద్ధత ఉంది. రవి గ్రహ బలం వలన ఈ మాసం చివరి పది రోజులలో చక్కటి అవకాశములు పొందగలుగుతారు.

In February 2028, Simha Rasi (Leo) native individuals will continue to experience mixed results. Employed individuals will obtain their expected residential relocation or transfer, which will provide them with an opportunity to spend more quality time with their families. Events that deepen your faith and belief in the Divine will take place in your life. This month serves as a favorable period for Leo natives who wish or plan to return to their homeland. Although minor health issues may arise at the beginning of the month, there is no major threat or danger indicated. Individuals born under the Uttara nakshatra (1st pada), in particular, will enjoy luck and good fortune during this month. You will successfully accomplish important tasks unexpectedly and effortlessly. Those born under Uttara nakshatra will have excellent task fulfillment (Karya Siddhi) this month. Due to the favorable strength of the Sun (Ravi Graham), you will secure excellent opportunities during the final ten days of this month.

ఫెబ్రవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 3వ తేదీ రథసప్తమి పర్వదినం మరియు భీష్మాష్టమి పర్వదినం. 7వ తేదీ భీష్మ ఏకాదశి పర్వదినం మరియు అంతర్వేది తీర్థం. 13వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 21వ తేదీ మతత్రయ ఏకాదశి. 23వ తేదీ పవిత్ర మహా శివరాత్రి పర్వదినం. 26వ తేదీ నుండి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది.

Key festivals and auspicious days in February 2028: Ratha Saptami and Bhishma Ashtami fall on the 3rd. The auspicious Bhishma Ekadashi and Antarvedi Teertham take place on the 7th. Sankashtahara Chaturthi Vratam is observed on the 13th. Matatraya Ekadashi falls on the 21st. The holy festival of Maha Shivaratri is celebrated on the 23rd. The sacred Phalguna Masa commences on the 26th.

మార్చి 2028 సింహరాశి రాశీఫలితాలు / March 2028 Leo Predictions

ఈ మాసంలో సింహరాశి వారు గృహంలో భారీ స్థాయిలో శుభకార్య సంబంధ వేడుకలు నిర్వహిస్తారు. ఇతరులతో సామరస్యంగా సంభాషించడం అలవాటు చేసుకుంటారు. చక్కటి భోజన ప్రాప్తి ఏర్పడుతుంది. సకాలంలో ముఖ్య కార్యములు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ పరంగా దూర ప్రయాణములు చేయవలసి వస్తుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. విద్యార్ధులు దూర ప్రాంత విద్య కొరకు చేయు ప్రయత్నములు ఫలిస్తాయి. న్యాయ వ్యవస్థకు సంబందించిన విషయాలు మాత్రం ప్రతికూలంగా ఉంటాయి.

In March 2028, Simha Rasi (Leo) native individuals will host grand auspicious ceremonies and celebrations at home. You will cultivate the habit of communicating harmoniously and pleasantly with others. You will enjoy fine dining and comfortable living (Bhojana Prapti) and will successfully complete key tasks on time. On the professional front, job-related long-distance travel will become necessary. Financial income will remain average during this month. Students making efforts for higher education in distant places or overseas will achieve success. However, matters pertaining to the legal and judicial system will prove unfavorable.

మార్చి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7వ తేదీ సర్వ ఏకాదశి. 9వ తేదీ కామ దహన దినం. 10 వ తేదీ హోలీ పండుగ. 21వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 27వ తేదీ ఉగాది. ఈ రోజు నుండి నుండి శ్రీ కీలక నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.

Key festivals and auspicious days in March 2028: Sarva Ekadashi falls on the 7th. Kama Dahanam takes place on the 9th. The festival of Holi is celebrated on the 10th. Sarva Ekadashi falls again on the 21st. Masa Shivaratri takes place on the 24th. Ugadi is celebrated on the 27th, marking the sacred commencement of the new Sri Keelaka Nama Samvatsaram.

Useful Links & Personalised Services (ఇతర ముఖ్యమైన లింకులు):

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

Oursubhakaryam.com's Official YouTube Channel - WhatsApp Channel - Instagram - Facebook - Telegram - Contact Us

Connect on WhatsApp

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.