Oursubhakaryam Banner

పవిత్ర గోదావరి నది పుష్కరాలు 2027 - సంపూర్ణ వివరాలు

Godavari River Pushkarams 2027 - Complete Guide & Nakshatra Schedule (26 June 2027 to 7 July 2027)

— Article by Dr. Aravind Sidhanthi M.A. (Astrology)

మన సనాతన భారతీయ సాంప్రదాయ ధర్మంలో నదులను దేవతలుగా భావిస్తారు. నీరు అనేది జీవానికి మూలాధారం. అటువంటి నీటిని అందించే నదులను పూర్వ కాలంలో ప్రతీ రోజు పూజించేవారు. దక్షిణ భారతదేశంలో గోదావరి నది ఎంతో ఘనమైనది, పూజనీయమైనది. అందుకే గోదావరి నదిని 'దక్షిణ గంగ' లేదా 'గోదావరి మాత' అని భక్తితో పిలుస్తాము. మహారాష్ట్రలోని నాసిక్ సమీకంలో ఉన్న త్రయంబకేశ్వరం ప్రదేశంలోని బ్రహ్మగిరి పర్వతాలు వద్ద గోదావరి జన్మించింది. పుట్టిన ఈ పవిత్ర నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రయాణించి, చివరికి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

In our ancient Sanatana Hindu tradition, rivers are revered as goddesses, and since water is the fundamental source of life, these life-giving rivers were worshipped daily in ancient times. In South India, the Godavari River is exceptionally magnificent and sacred, which is why we devoutly call it the 'South Ganges' or 'Mother Godavari'. Born in the Brahmagiri Hills at Trimbakeshwar near Nashik in Maharashtra, this sacred river flows through the states of Maharashtra, Telangana, and Andhra Pradesh before finally merging into the Bay of Bengal at Antarvedi.

దక్షిణ భారతదేశానికి గోదావరి నదిని తీసుకురావడానికి మహర్షి గౌతముడు తీవ్రమైన తపస్సు చేశాడు. భూమిపై తీవ్రమైన కరువు కాటలాలు ఏర్పడి, వర్షాలు పడక ప్రజలు అల్లాడిపోతున్నప్పుడు గౌతమ మహర్షి తన తపోశక్తితో శక్తివంతమైన వరుణ యాగం తలపెట్టి, ఆ వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకుని ప్రతిరోజూ ఒక ధాన్యపు పంటను పండిస్తూ, ఆ ప్రాంతంలోని మునులందరికీ ఆకలి తీర్చేవారట. ఇది చూసి అసూయ పడిన కొందరు మునులు, గౌతముడిని ఇబ్బంది పెట్టాలని ఒక మాయోపాయం పన్నారు. ఒక బలహీనమైన ఆవును సృష్టించి, అది గౌతముడు పండిస్తున్న ధాన్యపు పొలంలోకి వెళ్లేలా చేశారు. గౌతముడు ఆ ఆవును పొలం నుండి పంపడానికి ఒక తేలికపాటి కర్రతో సున్నితంగా స్పృశించగానే, ఆ ఆవు అప్పటికప్పుడే ప్రాణాలు కోల్పోయింది. తాను చేసిన ఈ చర్యను గోహత్య మహాపాపంగా భావించిన గౌతమ మహర్షి తీవ్ర మానసిక అశాంతికి గురయ్యాడు. ఆ పాప విమోచనం కోసం ఆ పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, "ఈ పాపం పోవాలంటే నువ్వు గంగాదేవిని ఈ భూమిపైకి తీసుకువచ్చి, ఆమెతో అభిషేకం చేయించుకోవాలి" అని తెలియచేసారు.

To bring the Godavari River to South India, Sage Gautama performed intense penance. When severe droughts occurred, Sage Gautama performed a powerful Varuna Yagna and grew grain daily to feed the sages. Envious sages created a weak cow that died when Gautama gently touched it to drive it out of the field. Distressed by this sin of cow slaughter, Gautama performed severe penance to Lord Shiva, who instructed him to bring Goddess Ganga down to the earth for purification.

అప్పుడు గౌతముడు తన తపస్సుతో పరమశివుడిని మళ్లీ ప్రసన్నం చేసుకోగా, శివుడు తన జటాజూటంలోని గంగను భూమిపైకి విడుదల చేసారు. ఆ గంగతో పాటు గౌతముడి తపశ్శక్తి తోడవడంతో ఆ నది 'గౌతమి' నదిగా రూపాంతరం చెందింది. ఆ నదిలో స్నానం చేయగానే గౌతముడికి గోహత్య పాపం తొలగిపోయింది. అందుకే గోదావరిని 'గౌతమీ నది' అని కూడా పిలుస్తారు.

Then, Sage Gautama once again appeased Lord Shiva, and Shiva released Ganga from his matted locks onto the earth. With Ganga combining with Gautama's ascetic energy, the river transformed into the "Gautami" River. As he bathed, his sin was absolved, which is why Godavari is also known as the "Gautami River".

గోదావరి నది ప్రవహించే మార్గంలో అనేక ఉపనదులుగా విడిపోయి ప్రవహిస్తుంది. ఇలా గోదావరి నది చీలిపోవడానికి ఒక పురాణ గాథ ఉంది. వశిష్ఠ మహర్షి తన పుత్రులను కోల్పోయిన శోకంలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా, గోదావరి మాత తన ప్రవాహవేగంతో ఆయనను బయటపడేసింది. అప్పుడు కృతజ్ఞతగా వశిష్ఠుడు ఈ నదిని ఏడు పాయలుగా ప్రవహించమని దీవించాడు. అప్పటి నుండి గోదావరి నది సప్తగోదావరిగా ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నది తుల్య, ఆత్రేయ, వశిష్ఠ, వైనతేయ, గౌతమి, భరద్వాజ, విష్ణుపుత్రి అనే ఏడు పాయలుగా చీలి ఏడు పవిత్ర సంగమాలను ఏర్పరుస్తుంది.

పుష్కరాల ఉద్భవం & రాశుల వారీగా నదులు (Origin & Zodiac Rivers for Pushkaralu):

ఈ సృష్టిలోని సమస్త జీవరాశుల తలరాతలు నిర్ణయించే ఆ బ్రహ్మ దేవుడి కమండలంలోని తీర్ధమే ఈ భూమిపై ఉన్న సమస్త జలరాశికి మూలాధారం. ఆ బ్రహ్మ దేవుడి కమండలంలోని నీటికి ఉన్న ఆ అమూల్యమైన ప్రాణశక్తికి ఉన్న పేరే పుష్కరుడు. నవగ్రహాలలో బృహస్పతి (గురు గ్రహం) ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు, బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి.

The holy water in Lord Brahma's kamandalu contains the life force named Pushkaru. According to astrology, whenever Brihaspati (Jupiter) enters a specific zodiac sign, the Pushkaralu festival is observed for the river associated with that sign.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాశుల వారీగా పుష్కర నదులు (Rivers corresponding to Zodiac Signs):

సింహరాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు జరుగుతాయి. మొదటి 12 రోజులను 'ఆది పుష్కరాలు' అని, చివరి 12 రోజులను 'అంత్య పుష్కరాలు' అని అంటారు.

2027 గోదావరి ఆది పుష్కరాల వివరాలు (2027 Godavari Pushkaralu Schedule):

2027 వ సంవత్సరం జూన్ 25వ తేదీ రాత్రి 5 గంటల 29 నిమిషాలకు బృహస్పతి కర్కాటక రాశి నుండి సింహరాశి ప్రవేశంతోటి గోదావరి నదికి పవిత్ర పుష్కరాలు ప్రారంభమవుతాయి. అయితే బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించే సమయానికి సూర్యోదయం జరగకుండా ఉండటం వల్ల గోదావరి నదికి పుష్కరాలు 2027 వ సంవత్సరం జూన్ 26వ తేదీ శనివారం నుండి ప్రారంభమవుతాయి. పంచాంగ పరిభాషలో చెప్పాలంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ ప్లవంగ నామ సంవత్సర జ్యేష్ట మాస బహుళ షష్టి శనివారం శతభిషా నక్షత్రంలో సూర్యోదయం ఉదయం 5 గంటల 56 నిమిషాలకు పవిత్ర గోదావరి నది పుష్కరాలు ప్రారంభమై 12 రోజులపాటు కొనసాగి 7 జూలై 2027తో గోదావరి నది యొక్క పవిత్ర ఆది పుష్కరాలు పూర్తి అవుతాయి.

The sacred Pushkaralu for the Godavari River commence with the transit of Jupiter from Cancer to Leo on the night of June 25, 2027, at 5:29 PM. However, since sunrise has not occurred by the time Jupiter enters Leo, the Godavari Pushkaralu officially begin on Saturday, June 26, 2027, concluding on July 7, 2027.

12 రోజుల నక్షత్రాల వారీగా పుష్కర స్నాన మరియు తర్పణ విధివిధానాలు (Day-by-Day Nakshatra Schedule):

1. మొదటి రోజు - 26 జూన్ 2027 (శనివారం / Saturday):

ఈ రోజున పుష్యమి, అనురాధ మరియు ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.

On the first day of the Godavari River Pushkaralu, this day is favorable for those born under the Nakshatras of Pushyami, Anuradha, and Uttarabhadra to perform the sacred river bathing or ancestral tarpanam rituals.

2. రెండవ రోజు - 27 జూన్ 2027 (ఆదివారం / Sunday):

ఈ రోజున కృత్తిక, ఉత్తర మరియు ఉత్తరాషాడ జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.

On the second day, this day is favorable for those born under the Nakshatras of Krittika, Uttara (Uttaraphalguni), and Uttarashadha to perform the sacred river bathing or ancestral tarpanam rituals.

3. మూడవ రోజు - 28 జూన్ 2027 (సోమవారం / Monday):

ఈ రోజున రోహిణి, హస్త మరియు శ్రవణం నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.

On the third day, this day is favorable for those born under the Nakshatras of Rohini, Hasta, and Shravana to perform the sacred river bathing or ancestral tarpanam rituals.

4. నాలుగవ రోజు - 29 జూన్ 2027 (మంగళవారం / Tuesday):

ఈ రోజున మృగశిర, చిత్త మరియు ధనిష్ట జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.

On the fourth day, this day is favorable for those born under the Nakshatras of Mrigasira, Chitra, and Dhanishta to perform the sacred river bathing or ancestral tarpanam rituals.

5. అయిదవ రోజు - 30 జూన్ 2027 (బుధవారం / Wednesday):

ఈ రోజున ఆశ్లేష, జ్యేష్ట మరియు రేవతి జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.

On the fifth day, this day is favorable for those born under the Nakshatras of Ashlesha, Jyeshtha, and Revati to perform the sacred river bathing or ancestral tarpanam rituals.

6. ఆరవ రోజు - 01 జూలై 2027 (గురువారం / Thursday):

ఈ రోజున పునర్వసు, విశాఖ మరియు పూర్వాభాద్ర జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.

On the sixth day, this day is favorable for those born under the Nakshatras of Punarvasu, Vishakha, and Poorvabhadra to perform the sacred river bathing or ancestral tarpanam rituals.

7. ఏడవ రోజు - 02 జూలై 2027 (శుక్రవారం / Friday):

ఈ రోజున భరణి, పుబ్బ మరియు పూర్వాషాడ జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.

On the seventh day, this day is favorable for those born under the Nakshatras of Bharani, Pubba (Purvaphalguni), and Purvashadha to perform the sacred river bathing or ancestral tarpanam rituals.

8. ఎనిమిదవ రోజు - 03 జూలై 2027 (శనివారం / Saturday):

ఈ రోజున సన్యాసాశ్రమం స్వీకరించిన వారు (సాధువులు, అఘోరాలు), వైధవ్యం పొందినటువంటి స్త్రీలు లేదా పురుషులు, మరియు తమ వంశ గోత్రనామాలు తెలియని వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.

On the eighth day, this day is favorable for those who have taken up monkhood/renunciation (Sanyasasramam) such as sadhus and aghoras, widowed individuals, and those who do not know their family gotra and lineage names, to perform the sacred river bathing or ancestral tarpanam rituals.

9. తొమ్మిదవ రోజు - 04 జూలై 2027 (ఆదివారం / Sunday):

ఈ రోజున ఆరుద్ర, స్వాతి మరియు శతభిషం జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.

On the ninth day, this day is favorable for those born under the Nakshatras of Arudra, Swati, and Satabhisha to perform the sacred river bathing or ancestral tarpanam rituals.

10. పదవ రోజు - 05 జూలై 2027 (సోమవారం / Monday):

ఈ రోజున తమ యొక్క జన్మ నక్షత్రము లేదా తమ యొక్క జన్మ తేదీ, సమయము, జన్మ వివరాలు తెలియని వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.

On the tenth day, this day is favorable for those who do not know their birth star (Nakshatra), birth date, birth time, or other birth details, to perform the sacred river bathing or ancestral tarpanam rituals.

11. పదకొండవ రోజు - 06 జూలై 2027 (మంగళవారం / Tuesday):

ఈ రోజున అశ్విని, మఖ మరియు మూల జన్మ నక్షత్రాలలో జన్మించిన వారు పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.

On the eleventh day, this day is favorable for those born under the Nakshatras of Ashwini, Makha, and Moola to perform the sacred river bathing or ancestral tarpanam rituals.

12. పన్నెండవ రోజు (ఆఖరి రోజు) - 07 జూలై 2027 (బుధవారం / Wednesday):

ఈ రోజున ప్రకృతి సంబంధమైన మైల వలన కానీ, తమ గోత్రీకులు మరణించడం వలన ఏర్పడిన మరణ సంబంధ మైల వలన కానీ, లేదా ఇతర ఏ కారణాల వలన అయినా పైన పేర్కొన్నటువంటి 11 రోజులలో పుష్కర నది స్నాన సంస్కారం ఆచరించని వారందరూ ఈ చివరి రోజున పుష్కర నది స్నాన సంస్కారం లేదా పితృ తర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైనది.

On the 12th and final day, this day is favorable for anyone who could not perform the sacred river bathing ritual on the aforementioned 11 days for any reason—such as ritual impurity due to nature, ashoucham (death in the family), or any other reason—to perform the sacred river bathing or ancestral tarpanam rituals on this final day.

కుటుంబ సభ్యులకు వేర్వేరు నక్షత్రాలు ఉంటే ఏమి చేయాలి? (Family Head Nakshatra Rule):

సాధారణంగా ఒక కుటుంబంలో ఉండే వ్యక్తులందరూ కలిసి ఒకేసారి పుష్కర స్నానం ఆచరిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క జన్మ నక్షత్రం అవుతుంది. కుటుంబంలో ఉన్న వారందరికీ ఒకే రోజు కలసి రానప్పుడు, ఎవరైతే కుటుంబ యజమానిగా (పెద్దగా) ఉంటారో లేదా తమ వంశ పెద్దలకు పితృ తర్పణ సంస్కారం చేస్తారో వారి నక్షత్రమే ప్రధానంగా చూసుకోవాలి. కుటుంబ యజమాని నక్షత్రానికి ఏ రోజైతే కేటాయించబడిందో ఆ రోజునే కుటుంబం మొత్తం పుష్కర నది స్నాన సంస్కారాన్ని ఆచరించాలి.

Generally, all members of a family take the Pushkara bath together at the same time. Since each person has a different birth star (Nakshatra), you should primarily consider the Nakshatra of the head of the family (the eldest member or the one who performs ancestral tarpanam), and the entire family should perform the sacred river Pushkara bath on that specific day.

పుష్కర స్నాన మంత్రం & ముఖ్యమైన నియమాలు (Mantra & Important Rules):

పుష్కర నది స్నానం చేస్తున్నప్పుడు కేవలం మూడు మునకలు వేయడం వల్ల సరిపోదు. ముఖ్యంగా మనసులో పటించాల్సినటువంటి మంత్రం:

“ఓం నమో భగవతే పుష్కరాయచ బృహస్పతే స్వాహా”

ఈ మంత్రాన్ని పఠిస్తూ మూడు మునకలు వేయడం ద్వారా పుష్కరుని మరియు గురు గ్రహ అంశ శక్తిని పొందగలుగుతాము.

ముఖ్య గమనిక: పితృతర్పణం చేసిన తదుపరి నేరుగా తమ ఇంటికే వెళ్లాలి. పితృతర్పణం చేశాక వేరే దైవ దర్శనానికి వెళ్ళకూడదు. మీరు తీర్థయాత్రకు వెళ్లేటప్పుడే దారిలో దేవాలయాలను దర్శించుకుని, పుష్కర స్నానం మరియు తర్పణాలు ముగిసిన తర్వాత నేరుగా ఇంటికి చేరుకోవాలి.

Chant the mantra "Om Namo Bhagavate Pushkarayacha Brihaspate Svaha" while taking three dips. Remember to return directly home after performing ancestral tarpanam without visiting other temples afterwards.

ఈ విధంగా పుష్కర నది స్నాన సంస్కారం చేసిన తదుపరి మీకు తోచిన విధంగా దానధర్మాలు చేయండి. రాబోయే పవిత్ర గోదావరి నది పుష్కరాల సమయంలో నేను చెప్పిన విధంగా ఆచరించి పుష్కర స్నాన ఫలితాన్ని పొందండి. నవగ్రహాల అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సెలవు.

Perform acts of charity according to your capacity. Wishing that the grace of the Navagrahas be upon us all, and praying that everyone prospers with health, longevity, and wealth.

రోజూవారీ మా పంచాంగం, జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి:

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

YouTube Channel | WhatsApp Channel | Instagram | Facebook | Telegram | Contact Us

Connect on WhatsApp

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.