OurSubhakaryam Banner

2027 - 2028 శ్రీ ప్లవంగ నామ సంవత్సర కర్కాటకరాశీ రాశీ ఫలాలు

Sri Plavamga Nama Samvatsara Karkataka Rasi / Cancer Sign Telugu Rasi Phalalu

- Predictions By Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)

🔍 Search Our Site / మా వెబ్‌సైట్‌లో సెర్చ్ చేయండి:

పునర్వసు నక్షత్ర 4వ పాదం లేదా పుష్యమీ నక్షత్ర 1,2,3,4 పాదములు లేదా ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.

Individuals born under the 4th Pada of Punarvasu Nakshatra, or any of the 4 Padas (1, 2, 3, 4) of Pushyami Nakshatra, or any of the 4 Padas (1, 2, 3, 4) of Aslesha Nakshatra belong to Karkataka Rasi (Cancer).

📊 2027 - 2028 ఆదాయ వ్యయాలు & రాజపూజ్యావమానాలు (Kandaya Phalalu):

ఆదాయం (Income): 11
వ్యయం (Expenditure): 08
రాజపూజ్యం (Honor): 05
అవమానం (Dishonor): 04

శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం - 11, వ్యయం - 08, రాజ పూజ్యం - 05, అవమానం - 04

Sri Plavanga Nama Samvatsaram – Financial Aspect & Social Position (Income, Expenditure, Honor & Dishonor) for Karkataka Rasi (Cancer): Income (Adayam) – 11, Expenditure (Vyayam) – 8, Honor / Respect (Raja Pujyam) – 5, Dishonor / Insult (Avamanam) – 4.

పూర్వ పద్దతిలో కర్కాటక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "2". ఇది శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎదురగు సౌఖర్యవంతమైన జీవనాన్ని సూచిస్తున్నది.

According to the traditional method, the remainder number (Sesha Sankhya) obtained for Karkataka Rasi (Cancer) is "2". This indicates a comfortable, pleasant, and smooth lifestyle for Karkataka Rasi natives during Sri Plavanga Nama Samvatsaram.

2027-2028 నవగ్రహ గోచార ఫలితాల విశ్లేషణ (Planetary Transits Summary):

🪐 గురు గ్రహ ఫలితాలు (Jupiter Transit):

కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవంగ నామ తెలుగు చాంద్రమాన సంవత్సరంలో అనగా 7 ఏప్రిల్ 2027 బుధవారం నుండి 26 మార్చి 2028 ఆదివారం వరకు గురుగ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఎదురవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు ఎంత కాలంగానో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న తగాదాల నుండి బయటపడతారు. ఎవరైనా కర్కాటక రాశికి చెంది ఉండి చెడు వ్యసనాలకు బానిసలై బాధపడుతూ ఉంటే వారు ఈ సంవత్సరం ఆ చెడు వ్యసనాల నుండి బయటపడతారు. చక్కటి గుణ గణాలు , రూప శీల సంపన్న లక్షణాలు కలిగిన వ్యక్తిగా తిరిగి గుర్తింపుని పొందగలుగుతారు. కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకు శ్రీ ప్లవంగ నామ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి కాలం. విద్యాభ్యాసం చేస్తున్న వారికి గురువు సంపూర్ణంగా యోగించుట వల్ల విద్యార్థులు తాము కోరుకున్నటువంటి విద్యాభ్యాసము లేదా విద్యా సంబంధ పోటీ పరీక్షల్లో అతి చక్కటి విజయాన్ని పొందగలుగుతారు. మీరు తలపెట్టిన పనులకు అదృష్టం కలిసి వస్తుంది. పరదేశాలందు నివసించడానికి లేదా ఉద్యోగ సంబంధ ప్రయాణ ప్రయత్నాలు చేయడానికి ఈ సంవత్సరము చక్కటి అనుకూల కాలము. మీ యొక్క కుటుంబ మరియు స్నేహ వర్గంలో మీరు చక్కటి రాజ్య పూజ్యతను అనుభవించ గలుగుతారు. బందు వర్గం వల్ల లాభపడతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మీరు చేయాలని అనుకుంటున్నా సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలను ఈ సంవత్సరం పూర్తి చేయగలుగుతారు. 2027 జూన్, జూలై మరియు ఆగస్టు మాసాలలో కొంచెం అనారోగ్య మూలక ధన వ్యయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అవివాహితులకు అతి చక్కటి వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతాన సంబంధ ప్రయత్నాలు చేస్తున్న వారికి అతి చక్కటి పుత్ర సంతాన భాగ్యం ప్రాప్తించే సూచనలు అధికంగా ఉన్నాయి. మీ యొక్క కెరియర్ రీత్యా మీరు సాధించే ఉన్నతి వలన మీరు మీ వంశంలోనే ప్రసిద్ధత కలిగిన వారు అవుతారు. కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని సద్వినియోగంలో పెట్టడంలో నైపుణ్యాన్ని సాధిస్తారు. మొత్తం మీద శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురు గ్రహం వల్ల సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలే ఏర్పడతాయి.

During the entire Sri Plavanga Nama Telugu Lunar Year (from Wednesday, April 7, 2027 to Sunday, March 26, 2028), Jupiter (Guru Graham) will bestow exceptionally favorable and auspicious outcomes upon Karkataka Rasi (Cancer) native individuals. You will achieve victory over adversaries and break free from disputes that have troubled you for a long time. If any Cancer natives have been suffering due to bad habits or addictions, they will successfully overcome them this year and regain recognition as individuals of good virtues, fine character, and noble qualities. Sri Plavanga Nama Samvatsaram is an extraordinarily favorable period for Cancer native students. Due to Jupiter's complete yoga and benevolent influence, students pursuing education will achieve grand success in their desired fields of study or competitive examinations. Fortune and luck will favor all your endeavors. This year offers a wonderful period for those making efforts toward foreign residency or job-related overseas travel. You will enjoy high esteem, respect, and social honor (Raja Pujyata) among your family and circle of friends, and you will reap substantial benefits through relatives. You will successfully accomplish courageous or ambitious projects that you have been contemplating for a long time. During June, July, and August 2027, you may face some health-related financial expenditures. For unmarried individuals, excellent matrimonial alliances will materialize. For those attempting to have children, there are strong astrological indications of being blessed with noble male progeny (Putra Santana Bhagyam). The career heights and professional progress you achieve will earn you great fame and make you distinguished within your lineage. You will master the skill of productively utilizing your hard-earned money. Overall, due to the beneficial transit of Jupiter, Karkataka Rasi natives will enjoy highly positive results throughout Sri Plavanga Nama Samvatsaram.

🪐 శని గ్రహ ఫలితాలు (Saturn Transit):

కర్కాటక రాశి వారికి శ్రీ శనైచ్చరుల వారి వల్ల శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ముఖ్యంగా పితృ వర్గానికి సంబంధించిన విషయాలలో ఏర్పడేటటువంటి నష్టాలు తీవ్రంగా ఉండవచ్చు. తండ్రి గారితో అకారణంగా విభేదాలు ఏర్పడటం వల్ల కుటుంబంలో మీరు ఒంటరి వారు గా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆర్థిక లేదా కెరియర్ పరమైన అవసరాలకు మీ స్నేహ వర్గం అండగా నిలిచే సూచనలు అధికంగా ఉన్నాయి. పురుషులు స్త్రీ సంబంధిత విషయాలలో ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి గారి ఆరోగ్య సంబంధ విషయాలు కూడా ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండవు. జీవిత భాగస్వామి గారి వలన ఆర్థికపరమైన విషయాలలో మాత్రం చక్కటి అనుకూల ఫలితాలను పొందుతారు. ఎవరికైతే కర్కాటక రాశికి చెంది ఉండి తమ వ్యక్తిగత జాతకంలో వివాహపరమైన కుజదోషం కలిగి ఉంటారో వారు తప్పక ఈ సంవత్సరం కుజ మరియు శనైచ్చరులకు శాంతులు జరిపించుకోవడం మంచిది. వ్యక్తిగత జాతకంలో శ్రీ శనైచ్చరుల వారి అనుకూలత పూర్తిగా లోపించిన వారు ఈ సంవత్సరం పితృ మరియు మాతృ వర్గ విషయాలలో చెడు కర్మలు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి గోచార రీత్యా ఈ సంవత్సరము ఏలినాటి శని దశ లేదా అర్ధ అష్టమ శని దశ లేదా అష్టమ శని దశ లేనప్పటికీ శని యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉన్నందున ఎన్ని శనివారాలు వీలైతే అన్ని శనివారాలు శ్రీ శనైచ్చరుల వారికి తైలాభిషేకం చేయడం మంచిది. నిత్యం శ్రీ శని గ్రహ స్తోత్ర పటణం చేయుట మంచిది. ఈ సంవత్సరం మీరు శ్రీ శనైచ్చరుల వారి వల్ల ఎదుర్కొనబోయే ప్రతికూల ఫలితాల తీవ్రత ఆధారంగా మీ వ్యక్తిగత జాతక పరిశీలన తదుపరి గ్రహశాంతులు జరిపించుకోవడం మంచిది.

Throughout Sri Plavanga Nama Samvatsaram, Lord Saturn (Sri Shanaischarula Varu) will bring unfavorable and challenging results for Karkataka Rasi (Cancer) native individuals. Losses regarding paternal affairs and father-side matters may be particularly severe. Unwarranted misunderstandings or disputes with your father may arise, creating a situation where you feel isolated within the family. However, strong indications suggest that your circle of friends will stand by you and support your financial or career-related needs. Men must exercise caution regarding interactions and matters involving women throughout this year. Your spouse's health conditions will also not be very favorable this year. Nevertheless, you will gain positive outcomes in financial matters through your spouse. Individuals belonging to Karkataka Rasi who possess marital Kuja Dosha in their personal birth charts must perform propitiatory remedies (Shantis) for Mars (Kuja) and Saturn (Shani) this year. Those who completely lack favorable Saturn placements in their individual horoscopes may face adverse karmic consequences regarding paternal and maternal relatives. Although Karkataka Rasi natives do not run Elinati Shani, Ardhashtama Shani, or Ashtama Shani by planetary transit (Gochara) this year, the overall influence of Saturn remains adverse. Therefore, it is advisable to perform Tailabhishekam for Sri Shanaischara Bhagavan on as many Saturdays as possible and regularly recite the Sri Shani Graha Stotram. Depending on the intensity of the unfavorable results experienced, it is recommended to get your personal horoscope analyzed and perform targeted Graha Shanti rituals.

🪐 రాహు గ్రహ ఫలితాలు (Rahu Transit):

కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన కూడా ప్రతికూల ఫలితాలే ఎదురవుతున్నాయి. ఈ సంవత్సరము రాహువు కూడా శని గ్రహం లానే కళత్ర సంబంధమైన విషయాలలో నష్టాలను కలగజేసే సూచనలు అధికంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయాల విషయంలో కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అన్యస్త్రీ సంబంధాల వల్ల మీ యొక్క దాంపత్య జీవితాన్ని చేజేతులారా పాడు చేసుకొనే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆరోగ్య విషయాలలో కూడా తరచుగా హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగిన వారు లేదా రాహు గ్రహాన్ని ప్రతికూల స్థానంలో కలిగి ఉన్నవారు ఈ సంవత్సరము తరచుగా రాహు గ్రహ శాంతులు జరిపించుకోవడం మంచిది.

During Sri Plavanga Nama Samvatsaram, Rahu Graham will also bring adverse and unfavorable results for Karkataka Rasi (Cancer) native individuals. Similar to Saturn, Rahu shows strong indications of causing losses and complications in marital and spousal affairs (Kalatra Sambhandham). Cancer natives must exercise extreme caution when forming acquaintances with new people this year, as extramarital entanglements or improper relationships with women carry a high risk of ruining your married life through your own actions. Regarding personal health, it is advisable to undergo frequent health check-ups. Individuals who possess Kala Sarpa Dosha or have Rahu in an adverse placement in their personal horoscopes should perform Rahu Graha Shanti rituals frequently throughout this year.

🪐 కేతు గ్రహ ఫలితాలు (Ketu Transit):

కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా అనుకూలమైన ఫలితాలు ఏర్పడడం లేదు. హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవారు ఈ సంవత్సరము మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మీ యొక్క కుటుంబంలో లేదా మీ యొక్క కులంలో మిమ్మలను దోషిగా నిలబెట్టే పరిస్థితులు ఎదురవ్వవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషాన్ని కలిగి ఉన్న కర్కాటక రాశికి చెందిన వారు ఈ సంవత్సరం తప్పకుండా కాలసర్పదోష నివారణ, రాహు కేతువు లకు మరియు శనికి శాంతి జరిపించుకోవడం మంచిది.

During Sri Plavanga Nama Samvatsaram, Ketu Graham will also not yield favorable outcomes for Karkataka Rasi (Cancer) native individuals. Those suffering from heart-related health ailments or cardiovascular issues must exercise utmost caution throughout this year. Certain decisions you make may create circumstances where you are held accountable or blamed within your family or community. Specifically, Cancer natives who have Kala Sarpa Dosha in their personal birth charts should perform Kala Sarpa Dosha Nivarana rituals, along with Rahu, Ketu, and Shani Graha Shanti pujas this year.

మొత్తం మీద శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఒక్క గురు గ్రహం మాత్రమే అనుకూల ఫలితాలను ప్రసాదిస్తున్నారు. శని, రాహు మరియు కేతు గ్రహాల అనుకూల దృష్టి లోపించింది. మీ వ్యక్తిగత జాతకంలో గురువు, శని, రాహువు మరియు కేతు గ్రహాలలో ఏ గ్రహం అయితే అధిక బలంతో ఉంటుందో ఆ గ్రహ ఫలితాలే ఈ సంవత్సరం అంతా ప్రస్పుటంగా ప్రతిఫలిస్థాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతికూల ఫలితాల వలన అధైర్య పడకండి. మీ వ్యక్తి గత జాతకంలో ప్రతికూల ఫలితాలకు కారణమైన గ్రహం బలమైన స్థానంలో అనుకూలంగా ఉంటే ప్రతికూల ఫలితాల తీవ్రత తగ్గుతుంది.

Overall, during Sri Plavanga Nama Samvatsaram, Jupiter (Guru Graham) alone bestows highly favorable and beneficial outcomes upon Karkataka Rasi (Cancer) native individuals, while the favorable aspect of Saturn, Rahu, and Ketu is lacking. In your personal horoscope, whichever among Jupiter, Saturn, Rahu, and Ketu possesses greater strength will predominantly reflect its results throughout this year. Do not lose heart or feel discouraged due to the unfavorable outcomes mentioned here. If the planet causing negative results is favorably and strongly placed in your individual birth chart, the severity of those adverse effects will be significantly reduced.

2027 - 2028 మాసవారీ కర్కాటకరాశి ఫలితాలు (Monthly Predictions):

నెలవారీ రాశీ ఫలితాలను మరియు ముఖ్య పర్వదినాల వివరాలను క్రింద పొందగలరు...You can find the details of monthly horoscope predictions and important festival dates below...

ఏప్రిల్ 2027 కర్కాటకరాశి రాశీఫలితాలు / April 2027 Cancer Predictions

ఈ మాసంలో కర్కాటక రాశి వారు గృహ వాతావరణంలో వివాదాల వలన చికాకులు ఎదుర్కొందురు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. అన్ని వర్గముల వారి వృత్తి వ్యాపారములలో వాతావరణం ఆశించిన విధంగా కొనసాగును. సంతాన సంబంధ ప్రయత్నాలు చేస్తున్నవారు శుభకరమైన ఫలితాలు పొందుతారు. దీర్గాకలికంగా మీ ఆప్తుల నుండి మీరు ఆశిస్తూ వస్తున్న బహుమతులు ఈ మాసంలో పొందగలుగుతారు. పుష్యమీ నక్షత్ర జాతకులు ఈ మాసంలో వ్యక్తిగత జీవితంలో నష్టపోవు సూచనలు ఉన్నాయి. కావునా మీ వ్యక్తిగత జీవితానికి సంబందించిన వారి ఆంతర్యం గ్రహించడం చాలా ముఖ్యం. తృతీయ వారం కర్కాటక రాశి వారికి అంతగా కలసి రాదు. శారీరక రుగ్మతలు , సమయ పాలన పాటించ లేకపోవడం వంటి చికాకులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి తరపు బంధువులతో అనిశ్చితి కొనసాగుతుంది. చివరి వారంలో సామాన్య ఫలితాలు ఎదురవుతాయి. కుటుంబ మరియు వ్యక్తిగత జీవితంలో అవసరాలు పెరిగినా ఈ మాసంలో ధనానికి లోటు రాదు. సమయానికి ధనం సర్దుబాటు జరుగుతుంది.

In April 2027, Karkataka Rasi (Cancer) native individuals will face mental unrest and irritations due to domestic conflicts and household disputes. Financial income during this month will remain average. Across all sectors, professional work and business operations will progress smoothly as anticipated. Those attempting to have children will receive positive and auspicious news. Long-awaited gifts or favors from your close loved ones will materialize during this month. Individuals born under the Pushyami nakshatra carry risk of suffering losses in their personal lives; hence, understanding the inner motives and true intentions of people close to you is crucial. The third week will not be particularly favorable for Cancer natives, as physical ailments, bodily discomforts, and an inability to maintain regular routines or time management will cause frustration. Uncertainties and strained relations with spouse-side relatives will continue. The final week will yield moderate results. Even if personal and family expenses increase, there will be no shortage of money this month, as necessary funds will be arranged on time.

ఏప్రిల్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7 తేదీ శ్రీ ప్లవంగ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. 9వ తేదీ మత్స్య జయంతి మరియు సౌభాగ్య గౌరీ వ్రత దినం. 11వ తేదీ శ్రీ పంచమి. 15వ తేదీ శ్రీరామనవమి పర్వదినం. 16వ తేదీ ధర్మరాజ దశమి. 17వ తేదీ మతత్రయ ఏకాదశి మరియు వాడపల్లి తీర్థం. 19వ తేదీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి కల్యాణోత్సవం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం.

Key festivals and auspicious days in April 2027: The sacred Sri Plavanga Nama Samvatsaram commences on the 7th. Matsya Jayanti and Saubhagya Gauri Vratam take place on the 9th. Sri Panchami falls on the 11th. The auspicious Sri Rama Navami is celebrated on the 15th. Dharmaraja Dashami takes place on the 16th. Matatraya Ekadashi and the holy Vadapalli Teertham fall on the 17th. Ontimitta Kodandarama Swamy Vari Kalyanotsavam is celebrated on the 19th. Sankashtahara Chaturthi Vratam is observed on the 24th.

మే 2027 కర్కాటకరాశి రాశీఫలితాలు / May 2027 Cancer Predictions

ఈ మాసంలో కర్కాటక రాశి వారికి కొద్దిగా మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. కానీ ఈ మాసంలో ధన ఆదాయం బాగుండును. రావలసిన పాత బకాయిల ధనం చేతికి వచ్చును. ద్వితియ వారంలో పునర్వసు నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు ఎదుర్కోను సూచన ఉన్నది. తృతీయ వారం కర్కాటక రాశి వారికి అంతగా బాగుండదు. ముఖ్యంగా ధన వ్యయం అదుపు తప్పుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం ఆశించిన విషయాలలో ఆశాభంగములు ఎదురగును. రాజకీయ పదవుల కోసం తీవ్రంగా శ్రమించవలెను. ఇంటి విషయాలపై శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితులు ఎదురగును. తలపెట్టిన పనులు మందకొడిగా ముందుకు సాగును. వ్యక్తిగత జాతకంలో కుజ గ్రహ బలం లోపించిన కర్కాటక రాశి జాతకులు తమ ఆగ్రహవేశాలు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకనగా ఈ మాసంలో 24 మరియు 25 తేదీలలో ఉద్రేకం వలన నష్టం మరియు మిత్రు వర్గీయులతో శత్రుత్వములు ఎదుర్కొనే సూచనలు ఉన్నవి.

In May 2027, Karkataka Rasi (Cancer) native individuals will experience a slight increase in mental stress. However, financial income will remain good during this month, and long-pending dues or outstanding funds will be recovered. During the second week, individuals born under the Punarvasu nakshatra must exercise caution regarding health matters, as there are indications of potential vehicle accidents. The third week will not be very favorable for Cancer natives; specifically, financial expenditures will go out of control, and you may face disappointments in expected matters. Those aspiring for political positions will have to put in severe effort. Circumstances will demand greater attention and focus on domestic/household affairs, and tasks undertaken will progress slowly. Cancer natives whose personal horoscopes lack Mars (Kuja) strength must keep their temper and anger under control, as impulsiveness on the 24th and 25th of this month carries a risk of financial/personal losses and enmities with friends.

మే 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ వరూధిని ఏకాదశి. 4వ తేదీ మాస శివరాత్రి మరియు ఈ రోజు నుండి వాస్తు కర్తరి ప్రారంభం అవుతుంది. వాస్తు కర్తరి మే 30వ తేదీన ముగుస్తుంది. 7వ తేదీ వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. 9వ తేదీ అక్షయ తృతీయ మరియు పరశురామ జయంతి మరియు సింహాచల శ్రీ అప్పన్న స్వామి చందనోత్సవ దినం. 15వ తేదీ శ్రీ వాసవి అమ్మ వారి జయంతి. 16వ తేదీ సర్వ ఏకాదశి దినం మరియు అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణోత్సవ పర్వ దినం. 18వ తేదీ నృసింహ జయంతి. 20వ తేదీ శ్రీ అన్నమాచార్య జయంతి మరియు బుద్ధ పౌర్ణమి మరియు మహా వైశాకి పర్వదినం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 25వ తేదీ రోహిణి కార్తె ప్రారంభ దినం. 30వ తేదీ శ్రీ హనుమాన్ జయంతి.

Key festivals and auspicious days in May 2027: Varudhini Ekadashi falls on the 2nd. Masa Shivaratri takes place on the 4th, which also marks the commencement of Vastu Kartari (concluding on May 30th). The holy Vaishakha Masa begins on the 7th. Akshaya Tritiya, Parashurama Jayanti, and the grand Simhachalam Sri Appanna Swamy Chandanotsavam take place on the 9th. Sri Vasavi Ammavari Jayanti falls on the 15th. Sarva Ekadashi and the holy Annavaram Sri Satyanarayana Swamy Kalyanotsavam fall on the 16th. Nrusimha Jayanti is celebrated on the 18th. Sri Annamacharya Jayanti, Buddha Purnima, and Maha Vaishaki take place on the 20th. Sankashtahara Chaturthi Vratam is observed on the 24th. Rohini Karte commences on the 25th. Sri Hanuman Jayanti is celebrated on the 30th.

జూన్ 2027 కర్కాటకరాశి రాశీఫలితాలు / June 2027 Cancer Predictions

ఈ మాసం కర్కాటక రాశి వారికి బాగుంటుంది. ఆశించిన విధంగా ఈ మాసంలో ధనాదాయం పెరుగుతుంది. వృత్తి వ్యపారాదులలో ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవనం లోని వారికి పని భారం అధికం అవ్వడం వలన కొద్దిగా ఒత్తిడి ఎదురగును. ఆశ్లేషా నక్షత్ర జాతకులకు మూత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు భాదించును. కానీ గండం ఉండదు. విద్యార్ధులకు విద్యా అవకాశ సంబంధ పరీక్షలు సానుకూలంగా పూర్తి అగును. గృహంలో ఆకస్మిక శుభకార్యములు నిర్వహించవలసి రావచ్చు. కుటుంబంలో నడుస్తున్న ఆధిపత్య పోరు తగ్గుతుంది. మాసం ముగిసే సమయానికి కర్కాటక రాశి వారు మానసికంగా చక్కటి ప్రశాంత వాతావరణం అనుభవిస్తారు.

In June 2027, Karkataka Rasi (Cancer) native individuals will experience a favorable month. Financial income will increase as expected, and an encouraging, prosperous environment will prevail across professional work and business enterprises. However, employed individuals may face slight mental stress due to an increased work burden and heavier job responsibilities. Individuals born under the Aslesha nakshatra may suffer from urinary health issues or related ailments, but there will be no critical danger (gandam). For students, academic examinations and educational opportunities will conclude on a highly positive note. Sudden auspicious events or religious ceremonies may need to be conducted at home. Ongoing dominance struggles or power friction within the family will subside, and by the end of the month, Cancer natives will enjoy a serene and peaceful mental state.

జూన్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ మతత్రయ ఏకాదశి. 3వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. 6వ తేదీ బుద్ధ జయంతి. 13వ తేదీ దశ పాప హర దశమి. 14వ తేదీ నిర్జల ఏకాదశి మరియు స్మార్త ఏకాదశి. 18వ తేదీ ఏరువాక పూర్ణిమ మరియు వట సావిత్రి వ్రత దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీన పవిత్ర గోదావరి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. జూలై 7వ తేదీతో గోదావరి నది ఆది పుష్కరాలు పూర్తి అవుతాయి. 30వ తేదీ సర్వ ఏకాదశి దినం.

Key festivals and auspicious days in June 2027: Matatraya Ekadashi falls on the 1st. Masa Shivaratri takes place on the 3rd. The holy Jyeshtha Masa commences on the 5th. Buddha Jayanti is celebrated on the 6th. Dasha Papa Hara Dashami falls on the 13th. Nirjala Ekadashi and Smartha Ekadashi fall on the 14th. Eruvaka Purnima and Vata Savitri Vratam take place on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 22nd. The sacred Godavari Nadhi Pushkaralu commence on the 26th (with the Godavari Adi Pushkaralu concluding on July 7th). Sarva Ekadashi falls on the 30th.

జూలై 2027 కర్కాటకరాశి రాశీఫలితాలు / July 2027 Cancer Predictions

ఈ మాసంలో కుటుంబం లోనూ , వృత్తి వ్యాపార ఉద్యోగాది జీవనంలోనూ అనుకూలమైన పరిస్థితులు ఎదురగును. ముఖ్యంగా ఆశ్లేషా నక్షత్ర జాతకులు ఆశించిన విధంగా లాభకరమైన వాతావరణం అనుభవిస్తారు. నవ దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్ర వర్గం వారి కోసం అనవసరంగా ధనం వ్యయం చేయవలసి వస్తుంది. వాహన కొనుగోలు సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంత కాలంగా వాయిదా వేస్తూ వస్తున్న పనుల వలన ఊహించని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. చివరి నిమిషంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటారు. ఈ మాసంలో 17 నుండి 22 వ తేదీ మధ్య ఆహార సంబంధ విషయాలలో అనారోగ్యత బాధించును. 24 వ తేదీ తదుపరి నుండి మాసాంతం వరకు సంతోషకరమైన రోజులు ఎదురగును. మొత్తం సంవత్సరంలో ఆశ్లేషా నక్షత్ర జాతకులకు ఈ జూలై మాసం అత్యంత అనుకూలమైనదిగా చెప్పవచ్చు.

In July 2027, Karkataka Rasi (Cancer) native individuals will experience favorable conditions in both family life and professional/business activities. Specifically, those born under the Aslesha nakshatra will enjoy a profitable and highly rewarding environment as anticipated. Newly married couples attempting to have children will see their efforts bear fruit. However, you may have to incur unnecessary monetary expenses for the sake of friends. Efforts toward purchasing a new vehicle will prove successful. On the other hand, tasks that have been repeatedly postponed or delayed will cause unexpected difficulties, leading to intense last-minute stress. Between the 17th and 22nd of this month, dietary habits may trigger health ailments and bodily discomfort. From the 24th until the end of the month, you will enjoy joyful and prosperous days. Overall, July stands out as the most favorable month of the entire year for Aslesha nakshatra natives.

జూలై 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి ఆషాడమాసం ప్రారంభమవుతుంది మరియు పూరి లోని శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఘనంగా జపరబడుతుంది. ఈ రోజు నుండి శుక్ర మూఢమి ప్రారంభమవుతుంది. శుక్ర మూఢమి 18 సెప్టెంబర్ 2027వ తేదీతో పూర్తి అవుతుంది. 14వ తేదీ తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి మరియు చాతుర్మాస వ్రత ఆరంభ దినం. 17వ తేదీ నుండి దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది.18వ తేదీ గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 29వ తేదీ సర్వ ఏకాదశి దినం. 31వ తేదీ మాస శివరాత్రి మరియు శని త్రయోదశి.

Key festivals and auspicious days in July 2027: Masa Shivaratri falls on the 2nd. The holy Ashadha Masa commences on the 5th, alongside the grand celebration of the Sri Jagannatha Swamy Ratha Yatra in Puri. Sukra Mudhami (combustion of Venus) begins on this day and continues until September 18, 2027. Toli Ekadashi, Sayana Ekadashi, and the commencement of Chaturmasya Vratam fall on the 14th. The sacred Dakshinayana Period begins on the 17th. Guru Purnima and Vyasa Purnima take place on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 22nd. Sarva Ekadashi falls on the 29th. Masa Shivaratri and Shani Trayodashi occur on the 31st.

ఆగష్టు 2027 కర్కాటకరాశి రాశీఫలితాలు / August 2027 Cancer Predictions

ఈ మాసంలో కర్కాటక రాశి వారు ద్రవ్య సంబంధ నష్టములు ఎదుర్కొందురు. మీరు బాగా నమ్మిన మనుష్యుల గురించిన మీ అభిప్రాయాలు తలక్రిందులు అవుతాయి. కుల సంబంధ వృత్తి జీవనంలోని వారికి అనుకోని రీతిలో ఖర్చులు ఎదురగును. కుటుంబంలో పితృ వర్గీయులకు ఈ మాసంలో ఆరోగ్య గండాలు ఉన్నవి. విదేశీ ఉద్యోగ జీవనం చేయువార్కి తమ విదేశీ నివాశ సంబందిత ఇబ్బందులు ఎదురగుటకు అవకాశం ఉన్నది. ఈ మాసంలో కర్కాటక రాశికి చెందిన ముఖ్యంగా పుష్యమీ నక్షత్ర స్త్రీలకు వారి వ్యక్తిగత జీవనం పై అనవసరమైన అపవాదులు ఎదుర్కొనవలసి వస్తుంది. మనశ్శాంతి లోపించుట వలన విపరీత ధోరణితో కూడిన ఆలోచనలు ఎదుర్కొంటారు. ఈ మాసంలో కర్కాటక రాశి వారు అనవసర విలాసాల విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. గర్భిణి స్త్రీలు కూడా తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించవలెను. ఈ మాసంలో పుష్యమీ నక్షత్ర జాతకులు ఒక ఆదివారం నాడు 1250 గ్రాముల గోధుమలు దానం ఇవ్వడం మంచిది.

In August 2027, Karkataka Rasi (Cancer) native individuals will face financial losses and monetary setbacks. Your opinions and trust regarding people you believed in deeply will be turned upside down. Individuals engaged in hereditary or traditional caste occupations will encounter unexpected expenses. Regarding family affairs, elderly relatives on the father's side face serious health perils (Arogya Gandam) during this month. Cancer natives working abroad may face complications and difficulties concerning their foreign residency status or visa affairs. Specifically, Pushyami nakshatra women belonging to Karkataka Rasi may have to endure unwarranted allegations and character slurs affecting their personal lives. A severe lack of mental peace may trigger extreme or negative thought patterns. Cancer natives must exercise restraint regarding unnecessary luxuries and extravagance this month. Expectant mothers must also take special care of their health. As an astrological remedy, individuals born under the Pushyami nakshatra are advised to donate 1,250 grams (1.25 kg) of whole wheat grains on a Sunday during this month.

ఆగష్టు 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాన్ని పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు మరియు కర్కాటక రాశికి చెందినవారు చూడకూడదు. పుష్యమి నక్షత్ర జాతకులు మరియు కర్కాటక రాశికి చెందిన జాతకులు గ్రహ శాంతులు జరిపించుకోవాలి. ఈ పాక్షిక సూర్యగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు పూర్తి అవుతుంది. ఆగష్టు 3వ తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. 6వ తేదీ గరుడ పంచమి. 13వ తేదీ శ్రీ వరలక్ష్మీ దేవి వ్రత దినం. 14వ తేదీ శని త్రయోదశి. 15వ తేదీ నుండి గురు మూడమి కాలం ప్రారంభమవుతుంది. ఈ గురు మూడమి 16 సెప్టెంబర్ 2027 వ తేదీన ముగుస్తుంది. 17వ తేదీ శ్రావణ మాస పౌర్ణమి మరియు రాఖీ పండుగ. 20వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి. 28వ తేదీ మతత్రయ ఏకాదశి. 30వ తేదీ మాస శివరాత్రి. 31వ తేదీ పొలాల అమావాస్య పర్వదినం.

Key festivals and auspicious days in August 2027: A Partial Solar Eclipse (Pakshika Surya Grahanam) occurs on the 2nd. Individuals born under the Pushyami nakshatra and those belonging to Karkataka Rasi (Cancer) must not view this eclipse and are strongly advised to perform Graha Shanti rituals. This partial solar eclipse begins at 3:58 PM and ends at 5:40 PM. The holy Sravana Masa commences on August 3rd. Garuda Panchami falls on the 6th. The sacred Sri Varalakshmi Vratam takes place on the 13th. Shani Trayodashi falls on the 14th. Guru Mudhami (combustion of Jupiter) begins on the 15th and concludes on September 16, 2027. Sravana Purnima and Rakhi Festival (Raksha Bandhan) take place on the 17th. Sankashtahara Chaturthi Vratam is observed on the 20th. Sri Krishna Janmashtami is celebrated on the 24th. Matatraya Ekadashi falls on the 28th. Masa Shivaratri takes place on the 30th. Polala Amavasya falls on the 31st.

సెప్టెంబర్ 2027 కర్కాటకరాశి రాశీఫలితాలు / September 2027 Cancer Predictions

ఈ మాసంలో ఆరోగ్య సమస్యల వలన బాధపడుతున్న కర్కాటక రాశికి చెందిన స్త్రీలకు ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య సమస్యల తీవ్రత తగ్గుతుంది. శారీరక బాధలు తొలగును. నూతన గృహ నిర్మాణ లేదా వాస్తు సంబంధ మార్పులకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఈ మాసంలో ఉద్యోగ జీవనంలో పదోన్నతి ని ఆశించవచ్చు. మీ పని నైపుణ్యత వలన పేరు ప్రఖ్యాతలు పొందుతారు. జీవిత భాగస్వామి సహకారం మీ మనోబలమును పెంచుతుంది. గురువులు మరియు కుటుంబ పెద్దలు మీకు ఒక ముఖ్యమైన విషయంలో మార్గదర్శనం చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారములు పొందగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగ పరంగా ఎదురుచూస్తున్న శుభవార్త పొందుతారు. ఈ మాసంలో 8, 10, 13, 15, 16 తేదీలు కర్కాటక రాశి వారికి అనుకూలమైనవి కావు. ఈ రోజులలో ఏదైనా ఒక అశుభ వార్త వినవలసి వస్తుంది.

In September 2027, Karkataka Rasi (Cancer) women who have been suffering from health ailments will find much-needed relief. The severity of health issues will lessen, and physical discomforts will dissipate. This month presents a highly favorable period for commencing new house construction or undertaking Vastu-related structural modifications. In your professional career, you can expect job promotions and advancements. Your work efficiency and technical skills will earn you great name and fame. The steady support of your spouse will boost your morale and inner confidence. Spiritual gurus and family elders will guide you in a crucial matter, and you will receive full cooperation and support from your family members. Unemployed individuals will receive long-awaited good news regarding job opportunities. However, the 8th, 10th, 13th, 15th, and 16th days of this month are not favorable for Cancer natives, as you may have to hear distressing or sad news on these dates.

సెప్టెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. 2వ తేదీ శ్రీ బలరామ జయంతి. 3వ తేదీ శ్రీ వరాహ జయంతి. 4వ తేదీ శ్రీ వినాయక చవితి. 5వ తేదీ ఋషి పంచమి దినం. 11వ తేదీ పరివర్తన ఏకాదశి పర్వదినం. 12వ తేదీ శ్రీ వామన జయంతి. 14వ తేదీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత దినం. 16వ తేదీ గురు మూడమీ పూర్తి అవుతుంది మరియు ఈ 16 వ తేదీ నుండి భాద్రపద మాస అమావాస్య వరకు అనగా 29వ తేదీ వరకు మహాలయ పక్షం జరుగుతుంది. 18వ తేదీన శుక్ర మూఢమి పూర్తి అవుతుంది. 19వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీ సర్వ ఏకాదశి దినం. 28వ తేదీ మాస శివరాత్రి. 29వ తేదీ మహాలయ అమావాస్య.

Key festivals and auspicious days in September 2027: The holy Bhadrapada Masa commences on the 1st. Sri Balarama Jayanti falls on the 2nd. Sri Varaha Jayanti is celebrated on the 3rd. Sri Vinayaka Chavithi (Ganesh Chaturthi) takes place on the 4th. Rishi Panchami falls on the 5th. Parivartana Ekadashi is observed on the 11th. Sri Vamana Jayanti falls on the 12th. Sri Ananta Padmanabha Swamy Vratam takes place on the 14th. Guru Mudhami concludes on the 16th, and the sacred Mahalaya Paksham period commences on this day, continuing until Bhadrapada Amavasya on the 29th. Sukra Mudhami ends on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 19th. Sarva Ekadashi falls on the 26th. Masa Shivaratri takes place on the 28th. Mahalaya Amavasya falls on the 29th.

అక్టోబర్ 2027 కర్కాటకరాశి రాశీఫలితాలు / October 2027 Cancer Predictions

ఈ మాసంలో కర్కాటక రాశి వారు కొంత అననుకూల పరిస్థితులు ఎదుర్కొందురు. ప్రధమ వారంలో ఉద్యోగ పరంగా మనసుకు నచ్చని పనులు చేయవలసి వస్తుంది. విద్యార్ధులకు ఈ మాసంలో విద్యావిఘ్నత ఎదురగును. మహిళలు శరీర గాయాలు పాలగుట వంటి ప్రతికూల ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపార రంగం వారికి కూడా తమ ఆదాయంలో తగ్గుదల ఏర్పడుతుంది. వ్యవహార చిక్కుల వలన మానసిక అశాంతి అనుభవించెదరు. మాసం చివరి రోజులకు వచ్చేసరికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ జీవులకు ఈ మాసం కొంత శ్రమకరంగానే ఉంటుంది. ఈ మాసంలో కర్కాటక రాశి వారు అన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. ప్రతికూల పరిస్థితులు అధికం అయినచో కర్కాటక రాశి వారు చంద్ర గ్రహ శాంతి జపములు జరిపించుకోనుట మంచిది.

In October 2027, Karkataka Rasi (Cancer) native individuals will face somewhat unfavorable conditions. During the first week, employed individuals will be forced to perform tasks at work that do not align with their liking or preferences. Students will encounter obstacles, disruptions, and hurdles in their education (Vidya Vighnata) during this month. Women must exercise extra caution, as there are risks of suffering physical injuries or bodily harm. Those in the business sector will experience a noticeable decline in their income and revenues. Complications in ongoing transactions or official affairs will lead to mental unrest. Toward the final days of the month, unnecessary and unanticipated expenses will rise. For salaried workers, this month will prove to be quite demanding and strenuous. Cancer natives must exercise vigilance and care across all matters throughout October. If negative circumstances escalate, it is advisable for Cancer natives to perform Chandra Graha Shanti Japa (propitiatory remedies for the Moon).

అక్టోబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది మరియు అమ్మవారి పవిత్ర శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. నవరాత్రుల ప్రారంభ దినమైన ఈ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిని పూజించాలి. 2వ తేదీ శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని పూజించాలి. 3వ తేదీ శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారిని పూజించాలి. 4వ తేదీ శ్రీ మహా చండీ దేవి అమ్మ వారిని పూజించాలి. 5వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించాలి. 6వ తేదీ శ్రీ సరస్వతీ దేవి అమ్మవారిని పూజించాలి. 7వ తేదీ ఈ రోజు రెండు తిధుల సంధి ఏర్పడడం వలన ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించాలి మరియు ఈ రోజును దుర్గాష్టమి పర్వ దినంగా పరిగణించి శ్రీ దుర్గా దేవిని పూజించాలి. 8వ తేదీ మహానవమి పర్వదినం. ఈ రోజున శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారిని పూజించాలి. 9వ తేదీ విజయదశమి. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించాలి. ఈ రోజున మధ్యాహ్నం 1.40 నుండి మధ్యాహ్నం 2.38 గంటల మధ్య శమీ పూజను నిర్వహించాలి. 11వ తేదీ మతత్రయ ఏకాదశి. 18వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 28వ తేదీ నరక చతుర్దశి. 29వ తేదీ దీపావళి పర్వదినం. ఈ రోజునే ధనలక్ష్మి పూజ నిర్వహించాలి మరియు కేదార గౌరీ వ్రతం ఆచరించాలి. 30వ తేదీ బలి పాడ్యమి మరియు ఈ రోజు నుండే పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతుంది.

Key festivals and auspicious days in October 2027: The holy Ashvija Masa commences on the 1st, marking the beginning of the sacred Ammavari Sharad Navaratri celebrations. On this first day of Navaratri, Goddess Sri Bala Tripura Sundari Devi is worshiped. Goddess Sri Gayatri Devi is worshiped on the 2nd. Goddess Sri Annapurna Devi is worshiped on the 3rd. Goddess Sri Maha Chandi Devi is worshiped on the 4th. Goddess Sri Lalita Tripura Sundari Devi is worshiped on the 5th. Goddess Sri Saraswati Devi is worshiped on the 6th. On the 7th, due to the overlap of two tithis (Tithi Sandhi), Goddess Sri Mahalakshmi Devi is worshiped, and the day is celebrated as Durgashtami, worshiping Goddess Sri Durga Devi. Mahanavami falls on the 8th, on which Goddess Sri Mahishasura Mardhini Devi is worshiped. Vijayadashami is celebrated on the 9th, worshiping Goddess Sri Rajarajeswari Devi; Shami Puja should be performed on this day between 1:40 PM and 2:38 PM. Matatraya Ekadashi falls on the 11th. Sankashtahara Chaturthi Vratam is observed on the 18th. Naraka Chaturdashi falls on the 28th. The grand festival of Deepavali takes place on the 29th, on which Dhanalakshmi Puja and Kedara Gauri Vratam are performed. Bali Padyami falls on the 30th, which also marks the commencement of the holy Kartika Masa.

నవంబర్ 2027 కర్కాటకరాశి రాశీఫలితాలు / November 2027 Cancer Predictions

ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఏర్పడుతుంది. ఆశించిన విధంగా నిల్వ ధనం ఏర్పరచుకోగలరు. ఈ మాసంలో మీరు చేసే పెట్టుబడులు, కార్య సఫలత కోసం మీరు పెట్టె శ్రమ వృధా అవ్వవు. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి బుధ గ్రహం అనుకూలంగా ఉండుట వలన ప్రతీ పనిలో చక్కటి చాకచక్యత ప్రదర్శిస్తారు. మీ వ్యతిరేకుల సంఖ్య తగ్గుతుంది. మీకు సన్నిహితులుగా మారి మీకు సహకరించడం మిమ్మల్ని ఆచ్చర్య పరుస్తుంది. క్రీడా రంగం లోని వారికి ఈ మాసంలో మనోవంచా ఫలసిద్ధత లభిస్తుంది. ముఖ్యంగా రక్షణ రంగంలో మీ క్రీడా నైపుణ్యం వలన ఉద్యోగ లాభములను పొందగలుగుతారు. ఈ మాసంలో 16,17,25 మరియు 26 తేదీలలో మానసిక ధైర్యం పెరిగి వ్యక్తిగత జీవితంలోని సమస్యల నుండి బయటపడే మార్గాలు అన్వేషిస్తారు. దీర్ఘకాలిక వ్యసనాల నుండి బయట పడతారు.

In November 2027, Karkataka Rasi (Cancer) native individuals will enjoy a fairly favorable month. There will be a noticeable growth in your income, enabling you to build up long-term savings and financial reserves as anticipated. The investments you make and the hard work you put into executing your plans will not go to waste. Due to the beneficial positioning of Mercury (Budha Graham) during this month, Cancer natives will demonstrate remarkable tact, intelligence, and diplomatic skill in every endeavor. The number of your opponents or rivals will decrease, and surprisingly, former adversaries will turn into close associates and offer you their support. Those in the sports field will achieve their desired goals and ambitions; specifically, your sports talents and athletic proficiency may help you secure employment or recruitment benefits within the defense sector. On the 16th, 17th, 25th, and 26th of this month, your mental fortitude and inner courage will surge, empowering you to discover effective solutions to personal problems and break free from long-standing bad habits or addictions.

నవంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ నాగుల చవితి. 11వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి మరియు ఈ రోజున చాతుర్మాస వ్రతం పూర్తి అవుతుంది. 13వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినం ఈ రోజునే జ్వాలాతోరణం నిర్వహించాలి. 17వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ మతత్రయ ఏకాదశి దినం. 26వ తేదీ మాస శివరాత్రి మరియు ధన్వంతరి జయంతి. 29వ తేదీ నుండి మార్గశీర్ష మాసము ప్రారంభం అవుతుంది.

Key festivals and auspicious days in November 2027: Nagula Chavithi falls on the 2nd. Kshirabdi Dwadashi takes place on the 11th, which also marks the completion of the Chaturmasya Vratam. The sacred Kartika Purnima falls on the 13th, on which Jwala Thoranam is celebrated. Sankashtahara Chaturthi Vratam is observed on the 17th. Matatraya Ekadashi falls on the 24th. Masa Shivaratri and Dhanvantari Jayanti take place on the 26th. The holy Margashirsha Masa commences on the 29th.

డిసెంబర్ 2027 కర్కాటకరాశి రాశీఫలితాలు / December 2027 Cancer Predictions

ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ఆర్ధికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబ పరమైన చికాకులు మాత్రం కొనసాగును. మహిళలు నమ్మిన మనుష్యుల నిరాదరణ వలన భాదించబడతారు. దూర ప్రాంత నివాస లేదా ఉద్యోగ ప్రయత్నాలు కష్టం మీద ఫలించును. ఈ మాసం 13, 14 తేదీలలో శరీర అలసట అధికం అగుట మరియు 21 నుండి 26 వ తేదీ మధ్య ఉద్యోగ జీవనము లో ఒత్తిడి అధికం అగుట, నడుస్తూ ఉన్న పనులలో ఊహించని విఘ్నతలు ఎదురగుట చికాకులు ఏర్పరచును. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ మాసంలో తలపెట్టిన ఆలోచనలు సజావుగా కార్యరూపం దాల్చవు. జీవన విధానంలో నూతన మార్పులు ప్రయత్నించకుండా యధాతధ స్థితి కొనసాగించుట మంచిది.

In December 2027, although financial conditions remain favorable for Karkataka Rasi (Cancer) native individuals, domestic and family-related irritations will persist. Women will feel hurt and distressed due to the indifference or neglect of people they trusted. Efforts toward foreign or long-distance relocation and job opportunities will yield success only after significant hardship. On the 13th and 14th of this month, physical exhaustion and bodily fatigue will increase. Between the 21st and 26th, workplace pressure will intensify, and unexpected disruptions in ongoing tasks will cause frustration. Overall, the plans and ideas initiated by Cancer natives will not materialize smoothly during December. It is advisable not to attempt major changes in your lifestyle or routine during this month and instead maintain the status quo.

డిసెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 4వ తేదీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి. 9వ తేదీ సర్వ ఏకాదశి మరియు గీతా జయంతి. 11వ తేదీ శని త్రయోదశి. 13వ తేదీ శ్రీ దత్తాత్రేయ జయంతి. 16వ తేదీ సంకష్టహర చతుర్ధి వ్రత దినం. 20వ తేదీ శ్రీ కాలభైరవ అష్టమి. 23వ తేదీ సర్వ ఏకాదశి. 25వ తేదీ శని త్రయోదశి. 26వ తేదీ మాస శివరాత్రి. 28వ తేదీ నుండి పుష్య మాసం ప్రారంభం అవుతుంది.

Key festivals and auspicious days in December 2027: Sri Subrahmanyeshwara Swamy Shashti falls on the 4th. Sarva Ekadashi and Gita Jayanti take place on the 9th. Shani Trayodashi falls on the 11th. Sri Dattatreya Jayanti is celebrated on the 13th. Sankashtahara Chaturthi Vratam is observed on the 16th. Sri Kalabhairava Ashtami falls on the 20th. Sarva Ekadashi falls on the 23rd. Shani Trayodashi falls on the 25th. Masa Shivaratri takes place on the 26th. The holy Pushya Masa commences on the 28th.

జనవరి 2028 కర్కాటకరాశి రాశీఫలితాలు / January 2028 Cancer Predictions

ఈ మాసంలో పరిస్టితులు కొంత మెరుగుపడును. భాగస్వామ్య వ్యాపారములు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూల కాలం. మీ పై గతకాలంలో వచ్చిన అభియోగాలకు, విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వగల పరిస్థితులు లభిస్తాయి. ఈ మాసంలో పునర్వసు నక్షత్ర జాతకులకు చక్కటి వ్యవహార అనుకూలత ఉంది. సమాజంలోని పెద్ద మనుషుల సంస్థలలో సభ్యత్వాలు తీసుకొనుట సామాజిక హోదా పరంగా కలసి వస్తుంది. మిత్రుత్వాలు బలపడతాయి. మాస మధ్యమంలో కుటుంబ సమేత దైవ దర్శన సంబంధ ప్రయాణాలు ఏర్పడతాయి. సంతానం మీపై చూపించే ప్రేమానురాగాల వలన ఆహ్లాదకరమైన వాతావరణం అనుభవిస్తారు. ఈ మాసంలో ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వివాహ ప్రయత్నములు మధ్యమ ఫలితాలు ఏర్పరుస్తాయి. మాసం చివరి వారంలో తక్కువ స్థాయి వ్యక్తుల పరిచయం వలన నష్టపోవు సంఘటనలు ఎదురగును.

In January 2028, conditions will improve noticeably for Karkataka Rasi (Cancer) native individuals. This month offers a highly favorable time for initiating partnership business ventures. Circumstances will align enabling you to deliver fitting responses to past allegations and criticisms leveled against you. During this month, individuals born under the Punarvasu nakshatra will enjoy excellent administrative and transactional smooth sailing. Securing memberships in prestigious organizations or forums alongside prominent societal figures will enhance your social status and reputation. Friendships will deepen and strengthen. Around the middle of the month, you will undertake spiritual pilgrimages and temple visits together with your family. The affection and respect shown by your children will create a delightful and heartwarming atmosphere at home. Financial conditions will remain satisfactory throughout the month. Marriage alliance efforts will yield moderate results. However, during the final week of the month, acquaintances or interactions with low-minded individuals may lead to regrettable losses or unpleasant incidents.

జనవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 8వ తేదీ శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినం మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినం. 14వ తేదీ శుక్రవారం భోగి పండుగ. 15వ తేదీ శనివారం మకర సంక్రాంతి రోజున ఉదయం 9 గంటల 21 నిమిషాలకు గ్రహ రాజు శ్రీ సూర్య భగవానుల వారు మకర రాశిలోనికి ప్రవేశిస్తారు. ఈ క్షణం నుండి పవిత్ర ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. 16వ తేదీ ఆదివారం కనుమ పండుగ. 17వ తేదీ సోమవారం ముక్కనుమ పండుగ. 22వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 26వ తేదీ చొల్లంగి అమావాస్య. 27వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది.

Key festivals and auspicious days in January 2028: Sri Vaikuntha Ekadashi and Mukkoti Ekadashi fall on the 8th. Bhogi Festival takes place on Friday, the 14th. On Makar Sankranti, Saturday, the 15th, the sun god Sri Surya Bhagavan enters Makara Rasi (Capricorn) at 9:21 AM, marking the sacred commencement of the Uttarayana Period. Kanuma Festival is celebrated on Sunday, the 16th. Mukkanuma Festival takes place on Monday, the 17th. Sarva Ekadashi falls on the 22nd. Masa Shivaratri takes place on the 24th. Chollangi Amavasya is observed on the 26th. The holy Magha Masa commences on the 27th.

ఫెబ్రవరి 2028 కర్కాటకరాశి రాశీఫలితాలు / February 2028 Cancer Predictions

ఈ మాసం కర్కాటక రాశి వారికి అనుకూలమైన కాలం. మీ యొక్క నూతన గృహ లేదా వాహన సంబంధ కోరికలు నెరవేరుతాయి. అవసరమైన ధనం సమయానికి చేతికి లభించును. ఇరుగుపొరుగు వారి వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందురు. యువకుల ఆలోచనలు సక్రమ మార్గంలో నడచును. మహిళలకు సంతాన సంబంధమైన పనుల భారం వలన అలసట ఎదురగుతుంది. ఉద్యోగ జీవనం లోని వారికి తోటి ఉద్యోగులతో విభేదాలు ఏర్పడుట బాధించును. నూతన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వారసత్వ సంబంధ స్థిరాస్థి పత్రాలు మీ చేతికి వస్తాయి. ఈ మాసంలో 2,5, 9, 11, 18, 20 తేదీలు కర్కాటక రాశి వారికి అనుకూలమైనవి.

In February 2028, Karkataka Rasi (Cancer) native individuals will experience a favorable and positive period. Your desires regarding the purchase or construction of a new house or buying a new vehicle will be fulfilled. Required funds will be arranged and available on time. However, you may encounter minor troubles or annoyances due to neighbors. Youth will stay focused with their thoughts moving in the right direction. Women may experience physical fatigue due to heavy responsibilities related to their children's activities and needs. Salaried employees may feel distressed due to friction or disagreements with colleagues at the workplace. Your interest in learning new subjects or exploring new domains will grow. Inherited property documents and ancestral real estate papers will come into your hands. During this month, the 2nd, 5th, 9th, 11th, 18th, and 20th days will be particularly favorable for Cancer natives.

ఫెబ్రవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 3వ తేదీ రథసప్తమి పర్వదినం మరియు భీష్మాష్టమి పర్వదినం. 7వ తేదీ భీష్మ ఏకాదశి పర్వదినం మరియు అంతర్వేది తీర్థం. 13వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 21వ తేదీ మతత్రయ ఏకాదశి. 23వ తేదీ పవిత్ర మహా శివరాత్రి పర్వదినం. 26వ తేదీ నుండి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది.

Key festivals and auspicious days in February 2028: Ratha Saptami and Bhishma Ashtami take place on the 3rd. Bhishma Ekadashi and the holy Antarvedi Teertham fall on the 7th. Sankashtahara Chaturthi Vratam is observed on the 13th. Matatraya Ekadashi falls on the 21st. The grand festival of Maha Shivaratri takes place on the 23rd. The holy Phalguna Masa commences on the 26th.

మార్చి 2028 కర్కాటకరాశి రాశీఫలితాలు / March 2028 Cancer Predictions

ఈ మాసంలో శరీరక ఆరోగ్యం బాగుండును. బంధు మిత్రులతో కలయిక వలన మానసిక ఉల్లాసం పొందుతారు. అతిధి సత్కారములకు ధన వ్యయం చేయవలసి వస్తుంది. ఉద్యోగ జీవనం లోని వారికి కోరుకున్న విధంగా స్థాన చలన ప్రయత్నములకు అనుకూలత ఉంది. గతకాలంలో తలపెట్టిన పనులలో ఆటంకములు తొలగుతాయి. మీ పై అధికారులతో మీకు ఉన్న వివాదాలు ఈ మాసంలో క్రమక్రమంగా సద్దుమనుగుతాయి. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు మాత్రం విఫలం అగును. ఆశించిన ప్రమోషన్లు లభించుట కష్టం. ఆర్ధిక సంబంధ విషయాలలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్దల సలహాలు పాటించుట మంచిది. ఈ మాసంలో 14, 21 మరియు 22 తేదీలు కర్కాటక రాశి వారికి అనుకూలమైనవి కావు.

In March 2028, Karkataka Rasi (Cancer) native individuals will enjoy good physical health. Reunions and gatherings with relatives and friends will bring mental happiness and refreshment. You will need to spend money on hospitality and hosting guests. For employed individuals, efforts toward desired job transfers or relocations will encounter favorable conditions. Obstacles in long-standing tasks initiated in the past will be cleared. Disputes and misunderstandings with your superiors will gradually subside during this month. Financial income will remain good. However, efforts for a job switch or changing companies will meet with failure, and securing expected promotions will prove difficult. Avoid taking adventurous or high-risk decisions in financial matters, and it is best to strictly follow the advice of elders. During this month, the 14th, 21st, and 22nd days are not favorable for Cancer natives.

మార్చి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7వ తేదీ సర్వ ఏకాదశి. 9వ తేదీ కామ దహన దినం. 10 వ తేదీ హోలీ పండుగ. 21వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 27వ తేదీ ఉగాది. ఈ రోజు నుండి నుండి శ్రీ కీలక నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.

Key festivals and auspicious days in March 2028: Sarva Ekadashi falls on the 7th. Kama Dahanam takes place on the 9th. The festival of Holi is celebrated on the 10th. Sarva Ekadashi falls on the 21st. Masa Shivaratri takes place on the 24th. Ugadi falls on the 27th, marking the official commencement of the new Sri Keelaka Nama Samvatsaram.

Useful Links & Personalised Services (ఇతర ముఖ్యమైన లింకులు):

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

Oursubhakaryam.com's Official YouTube Channel - WhatsApp Channel - Instagram - Facebook - Telegram - Contact Us

Connect on WhatsApp

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.