- Predictions By Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)
🔍 Search Our Site / మా వెబ్సైట్లో సెర్చ్ చేయండి:
ఉత్తర 2,3,4 పాదములు లేదా హస్త 1,2,3,4 పాదములు లేదా చిత్త 1,2 పాదములలో జన్మించిన వారు కన్యారాశికి చెందును.
Individuals born under Uttara (Phalguni) 2nd, 3rd, and 4th padas, Hasta 1st, 2nd, 3rd, and 4th padas, or Chitra 1st and 2nd padas belong to Kanya Rasi (Virgo).
శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం - 02, వ్యయం - 11, రాజ పూజ్యం - 04, అవమానం - 07.
For Kanya Rasi (Virgo) in the Sri Plavanga Nama Samvatsara, the Kandaya Phalalu (astrological income and expenditure ratios) are as follows: Aadayam (Income) – 02, Vyayam (Expenditure) – 11, Raja Poojyam (Honor/Respect) – 04, Avamanam (Dishonor/Humiliation) – 07.
పూర్వ పద్దతిలో కన్యారాశి వారికి వచ్చిన శేష సంఖ్య "4". ఇది శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి తరచుగా ఎదురగు ఆరోగ్య ప్రతిబంధకాలను సూచించుచున్నది.
In the traditional system (Poorva Paddhati), the remainder number (Shesa Sankhya) obtained for Kanya Rasi (Virgo) is "4". This indicates frequent health impediments and bodily obstacles for Virgo natives throughout the Sri Plavanga Nama Samvatsara.
కన్యారాశి వారికి శ్రీ ప్లవంగ నామ తెలుగు చాంద్రమాన సంవత్సరంలో అనగా 7 ఏప్రిల్ 2027 బుధవారం నుండి 26 మార్చి 2028 ఆదివారం వరకు గురుగ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. సంవత్సర ప్రారంభం నుండి పవిత్ర గోదావరి నది పుష్కరాల ప్రారంభం వరకు కన్యా రాశి వారు గురు గ్రహం వలన విశేషమైన భాగ్య సంపదలను అనుభవించగలుగుతారు. అన్ని విధములా ఆరోగ్యం సహకరిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపసమనాన్ని పొందుతారు. కన్యా రాశికి చెందినవారు ఏదైనా భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటే గోదావరి నది పుష్కరాల ప్రారంభానికి ముందే వ్యాపార ప్రారంభం చేయడం మంచిది. మీ పరోపకార తత్వం వల్ల సమాజంలో చక్కటి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వివాహ సంబంధ ప్రయత్నాలు చేయడానికి కూడా గోదావరి నది పుష్కరాల ముందే ప్రయత్నించడం మంచిది. జీవిత భాగస్వామి నుండి మీరు కోరుకున్నటువంటి సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో పొందడం ద్వారా చక్కటి వ్యక్తిగత జీవిత సౌఖ్యాన్ని అనుభవించ గలుగుతారు. 26 జూన్ 2027 నుండి పవిత్ర గోదావరి నది పుష్కరాల ప్రారంభం అయ్యాక గురు గ్రహం వలన అంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందలేరు. మాతృ వర్గీయులతో అనవసరమైనటువంటి శత్రుత్వాలు ఎదురవుతాయి. మీరు చేసేటటువంటి ప్రయాణాల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. తాంత్రిక విద్యల పట్ల ఆకర్షణ పెరగడం వల్ల మీ యొక్క ఆత్మబలం తగ్గుతుంది. గృహ వాతావరణంలో ఏదో ఒక చికాకు కొనసాగుతూ ఉంటుంది. కెరీర్ రీత్యా ముఖ్యమైన విషయాలలో కొద్దిపాటి మూర్ఖత్వంతో మీరు సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకొని నష్టపోయే సూచనలు ఉన్నాయి. ప్రతి పనిని వాయిదా వేసుకుంటూ వెళ్లడం వల్ల అనుకున్న సమయానికి కార్యక్రమాలను పూర్తి చేయలేరు. దుర్వ్యసనాల పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి గారి ప్రవర్తనపై అనవసరమైనటువంటి అనుమానం వల్ల వైవాహిక జీవన సుఖరాహిత్యం ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి గారి ఆరోగ్య సంబంధ విషయాల వల్ల కూడా ధన వ్యయం అధికమవుతుంది. కన్యా రాశి వారు పవిత్ర గోదావరి నది పుష్కరాల ప్రారంభం వరకు గురు గ్రహం వల్ల అతి చక్కటి ఫలితాలను పొందుతారు కావున కన్యా రాశి వారు ఏదైనా ముఖ్య నిర్ణయాలను జీవితానికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలను తీసుకోవాలనుకుంటే గోదావరి నది పుష్కరాల ప్రారంభానికి ముందుగానే తీసుకోవడం మంచిది.
For Kanya Rasi (Virgo) native individuals, Jupiter (Guru Graham) will deliver mixed results during the Sri Plavanga Nama Telugu Chandramana Samvatsaram, spanning from April 7, 2027 (Wednesday) to March 26, 2028 (Sunday). From the beginning of the year until the commencement of the sacred Godavari Pushkaralu, Virgo natives will enjoy extraordinary fortune, prosperity, and wealth due to Jupiter's favorable grace. Your overall health will remain supportive, and those suffering from long-standing health issues will find relief and recovery. If Virgo natives intend to start any partnership business, it is best to launch it before the start of the Godavari Pushkaralu. Your altruistic and philanthropic nature will earn you excellent recognition and respect in society. It is also advisable to pursue marriage alliance efforts prior to the Godavari Pushkaralu. By receiving full cooperation and support from your spouse, you will enjoy wonderful personal and domestic bliss. However, after Jupiter's transit transition following the start of the Godavari Pushkaralu on June 26, 2027, Jupiter will no longer yield very favorable outcomes. You will face unwarranted enmity or conflicts with maternal relatives. Frequent travels will adversely affect your health. An increasing attraction toward occult sciences (Tantrika Vidyalu) will weaken your willpower and inner strength. A persistent sense of friction or unrest will linger in your household environment. In key career matters, a tendency toward stubbornness or foolish risk-taking may lead to financial or professional losses. Habitual procrastination will prevent you from completing planned tasks on time, and you may develop inclinations toward bad habits or vices. In marital life, unnecessary suspicions regarding your spouse's behavior will disrupt conjugal happiness, and expenditure will rise due to your spouse's health concerns. Since Virgo natives will reap excellent planetary benefits from Jupiter until the commencement of the sacred Godavari Pushkaralu, it is highly recommended to take all major life decisions before the start of the Pushkaralu.
కన్యారాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. 21 మే 2027 వరకు కొంచెం అనుకూలంగా ఫలితాలు ఉన్నప్పటికీ 22 మే 2027 నుండి కన్యా రాశి వారికి గోచార రీత్యా అష్టమ శని దశ ప్రారంభం అవడం వల్ల సమస్యలు అధికమవుతాయి. కన్యా రాశి కి చెంది వివాహ పరమైన కుజ దోషం కలిగి ఉన్న వారు వైవాహిక జీవనంలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వస్తుంది.. సర్వ విషయాలలో ధర్మయుక్తంగా ప్రవర్తించే మీరు ధర్మాన్ని విడిచిపెట్టి అసంబద్దమైన నిర్ణయాలను తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. సంతాన సంబంధ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం శ్రీ శనైచ్చరుల వారి వల్ల ఆశిస్తున్న ఫలితాలు ఏర్పడవు. మీ కిందిస్థాయి సేవకా వర్గంతో అనవసరమైన తగాదాలు ఏర్పడతాయి. హీనస్థాయి వ్యక్తులతో పరిచయాల వల్ల అనవసరమైన చిక్కులను జీవితంలో ఎదుర్కొంటారు. జూదం వలన నష్టాన్ని పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అనవసరంగా కుటుంబ పెద్దలతో వైరాన్ని కొని తెచ్చుకుంటారు. వ్యక్తిగతంగా మిమ్మల్ని శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా ఆరోగ్య సంబంధ విషయాలలో కాలేయము మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్న వారు ఆ సమస్యల యొక్క తీవ్రత అధికం అవ్వడం వల్ల మరింత ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. మీ వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం కలిగి ఉన్న వారు కొద్దిపాటి ఆరోగ్య సమస్యలతో బయట పడతారు. వ్యక్తిగత మరియు గృహంలోని పరిశుద్ధతను పట్టించుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి. కన్యా రాశి వారు శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో నిత్యం శని గ్రహ స్తోత్రం పటించడం మంచిది. వ్యక్తిగత జాతకంలో శని గ్రహ బలం అనుకూలంగా లేనివారు శనికి శాంతి జపములు జరిపించుకోవడం వల్ల ఈ ప్రతికూల ఫలితాల తీవ్రతను తగ్గించుకోగలరు.
For Kanya Rasi (Virgo) native individuals, Saturn (Shani Graham) will deliver adverse and challenging results throughout the Sri Plavanga Nama Samvatsaram. Although conditions remain somewhat favorable until May 21, 2027, the onset of Ashtama Shani (Saturn in the 8th house) in transit from May 22, 2027 onward will significantly escalate problems and difficulties. Virgo natives who have a marital Mars flaw (Kuja Dosha) in their personal horoscopes will have to face severe ups and downs in their married life. Although you generally conduct yourself righteously in all matters, circumstances will arise that tempt you to abandon righteousness and make irrational decisions. Those making efforts for progeny or family expansion will not achieve their expected results this year due to Lord Shani's influence. Unnecessary disputes and conflicts will erupt with subordinate staff and service class personnel. Acquaintances with low-minded individuals will drag you into unwanted complications in life. Clear indications suggest financial losses through gambling or speculative ventures. You will unnecessarily invite enmity with family elders. On the personal health front, you are highly susceptible to respiratory ailments. Furthermore, individuals long suffering from liver and digestive system issues will experience an intensification of these ailments, leading to increased hardship. However, those who possess strong planetary positioning of Jupiter (Guru Graham) in their personal horoscopes will escape with only minor health issues. Circumstances will arise where maintaining personal and domestic hygiene becomes neglected. Virgo natives are strongly advised to recite the Shani Graha Stotram daily throughout the Sri Plavanga Nama Samvatsaram. Those whose personal horoscopes lack favorable Saturnian strength can reduce the severity of these adverse effects by getting Shani Graha Shanti Japas performed.
కన్యారాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సామాన్యమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. సంతాన సంబంధిత విషయాలలో మానసిక ఆవేదనను కలగజేసే పరిస్థితులను రాహువు కలుగ చేస్తారు. సంతాన దత్తతకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం చక్కటి సంతానము దత్తతకు లభిస్తుంది. మానసికంగా కోపస్వభావము అధికమవుతుంది. ఉద్యోగ జీవితం బాగున్నప్పటికీ మీరు కోరుకొని ప్రదేశానికి స్థాన చలనాన్ని ఉద్యోగరీత్యా పొందవలసి వస్తుంది. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కానీ లేదా ప్రతికూల రాహు గ్రహ బలం కలిగిన వారు అనవసరంగా ఇతరుల పట్ల అసూయాద్వేషాలను పెంచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
For Kanya Rasi (Virgo) native individuals, Rahu Graham will yield average and moderate results during the Sri Plavanga Nama Samvatsaram. Rahu will create circumstances that bring mental distress and anxiety concerning children. However, for those making efforts toward child adoption, Rahu will favor the successful adoption of a good child. Your psychological temperament will incline toward increased anger and irritability. Although your professional and employment life will remain stable, you will have to undergo an unwanted job transfer to an undesired location. Those who have Kala Sarpa Dosha or an unfavorable positioning of Rahu in their personal horoscopes may develop unnecessary feelings of envy, jealousy, and malice toward others.
కన్యారాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. సొంత గృహ సౌఖ్యాన్ని ఆశిస్తున్న వారికి సొంత గృహాన్ని లేదా భూసంపదను కేతువు ప్రసాదిస్తారు. విద్యార్థులకు కేతువు వలన వారు ఆశించినటువంటి విజయవంతమైన విద్యా సంబంధ ఫలితాలు లభిస్తాయి. విలాసవంతమైనటువంటి జీవితం కోసం ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత జాతకంలో కేతు గ్రహబలం లోపించిన వారు ఆసన సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యల వల్ల బాధ పడే సూచనలు ఉన్నాయి.
For Kanya Rasi (Virgo) native individuals, Ketu Graham will yield highly favorable and positive results during the Sri Plavanga Nama Samvatsaram. For those aspiring for the comfort of owning a home, Ketu will bless you with a self-owned house or landed property. Students will achieve their desired success and excellent educational outcomes through Ketu's gracious alignment. Conditions indicate that you will spend money toward enjoying a comfortable and luxurious lifestyle. However, individuals who lack strong planetary strength of Ketu in their personal horoscopes are susceptible to suffering from rectal or anal health ailments (Aasana sambandha arogya samasyalu).
మొత్తం మీద శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కన్యారాశి వారు గురు, శని , రాహు మరియు కేతు గ్రహముల వలన అధిక శాతం మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ వ్యక్తిగత జాతకంలో గురువు, శని, రాహువు మరియు కేతు గ్రహాలలో ఏ గ్రహం అయితే అధిక బలంతో ఉంటుందో ఆ గ్రహ ఫలితాలే ఈ సంవత్సరం అంతా ప్రస్పుటంగా ప్రతిఫలిస్థాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతికూల ఫలితాల వలన అధైర్య పడకండి. మీ వ్యక్తి గత జాతకంలో ప్రతికూల ఫలితాలకు కారణమైన గ్రహం బలమైన స్థానంలో అనుకూలంగా ఉంటే ప్రతికూల ఫలితాల తీవ్రత తగ్గుతుంది.
Overall, during the Sri Plavanga Nama Samvatsaram, Kanya Rasi (Virgo) native individuals will predominantly experience mixed results due to the planetary influences of Jupiter (Guru), Saturn (Shani), Rahu, and Ketu. Whichever among these planets—Jupiter, Saturn, Rahu, or Ketu—holds greater strength in your personal horoscope, its corresponding results will manifest most prominently throughout this year. Do not lose heart or feel discouraged by the adverse results mentioned here. If the planet responsible for negative outcomes in general transit occupies a strong and favorable position in your individual natal chart, the intensity of those unfavorable results will be significantly reduced.
నెలవారీ రాశీ ఫలితాలను మరియు ముఖ్య పర్వదినాల వివరాలను క్రింద పొందగలరు...You can find the details of monthly horoscope predictions and important festival dates below...
ఈ మాసంలో ఉద్యోగ జీవనంలో మీరు ఆశించిన గుర్తింపు లభించును. పదోన్నతి లేదా వేతనంలో పెరుగుదల ఆశించవచ్చు. యువతులు తమ వ్యక్తిగత సమస్యల నుండి బయట పడతారు. వృత్తి వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో లాభములు ప్రాప్తించును. కుటుంబములో మీ మాటకు విలువ ఇవ్వడం పెరుగుతుంది. హస్తా నక్షత్ర జాతకులకు ఆర్ధిక సంబంధ విషయాలలో తమ సంకల్ప సిద్ధి ప్రాప్తిస్తుంది. తృతీయ వారంలో కుటుంబంతో దూర ప్రాంత ప్రయాణాలు చేయుట వలన సంతోషకర సమయం గడుపుతారు. 20వ తేదీ నుండి ఉత్తరా నక్షత్ర జాతకులకు ధనార్జన పరంగా నిలకడైన జీవనం ఆరంభం అగును. నూతన వాహనం కొరకు లేదా గృహ సంబంధమైన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కళత్ర జీవనంలో సౌఖ్యం లభించును. ఉన్నత వర్గం వారితో స్నేహం - తన్మూలక లాభం పొందుతారు. కుటుంబ సభ్యులకు మీ మీద ఉన్న విశ్వాసాన్ని నిలుపుకోగలుగుతారు.
In April 2027, Kanya Rasi (Virgo) native individuals will obtain their desired recognition and appreciation in professional and employment life. You can expect a promotion or an increment in salary. Young women will overcome and break free from their personal problems. In professional and business ventures, you will reap expected profits. Your words and opinions will gain greater value and respect within the family. Individuals born under the Hasta nakshatra will realize their financial goals and resolve (Sankalpa Siddhi). During the third week, undertaking long-distance travel with family members will allow you to spend happy and memorable time together. From the 20th onward, individuals born under Uttara nakshatra will enter a phase of stable income and financial growth. Efforts to secure loans for a new vehicle or house will prove successful. You will enjoy comfort and harmony in marital life. Acquaintances and friendships with high-status individuals will bring tangible gains. You will successfully uphold and maintain the trust your family members place in you.
ఏప్రిల్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7 తేదీ శ్రీ ప్లవంగ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. 9వ తేదీ మత్స్య జయంతి మరియు సౌభాగ్య గౌరీ వ్రత దినం. 11వ తేదీ శ్రీ పంచమి. 15వ తేదీ శ్రీరామనవమి పర్వదినం. 16వ తేదీ ధర్మరాజ దశమి. 17వ తేదీ మతత్రయ ఏకాదశి మరియు వాడపల్లి తీర్థం. 19వ తేదీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి కల్యాణోత్సవం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం.
Key festivals and auspicious days in April 2027: The sacred Sri Plavanga Nama Samvatsaram commences on the 7th (Ugadi). Matsya Jayanti and Saubhagya Gauri Vratam fall on the 9th. Sri Panchami takes place on the 11th. The holy festival of Sri Rama Navami is celebrated on the 15th. Dharmaraja Dashami falls on the 16th. Matatraya Ekadashi and Vadapalli Teertham take place on the 17th. Ontimitta Kodandaramaswamy Vriksha Kalyanam / Kalyanotsavam is celebrated on the 19th. Sankashtahara Chaturthi Vratam is observed on the 24th.
ఈ మాసంలో కన్యారాశి వారికి అన్ని విధాలా ఆదాయం బాగుంటుంది. స్వశక్తితో సర్వ కార్యములు పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధ నివాస లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నములకు , అవివాహితుల వివాహ ప్రయత్నములకు , నూతన దంపతుల సంతాన ప్రయత్నములకు ఈ మాసం చక్కటి అనువైన కాలం. ముఖ్యంగా చిత్తా నక్షత్ర జాతకులు తమ ఆర్ధిక రుణాల నుండి బయట పడతారు. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు పొందుట వలన ప్రోత్సాహకర వాతావరణం అనుభవిస్తారు. ఈ మాసం చివరి వారంలో మిత్ర సంబంధ వ్యవహారములలో మీరు కలుగచేసుకొనడం వలన ఒక నష్టం ఎదుర్కోను సూచన ఉన్నది. అర్హత లేని వ్యక్తుల పట్ల కృతజ్ఞత చూపకూడదు అనే విషయం అనుభవ పూర్వకంగా తెలిసివస్తుంది. ఈ మాసంలో కన్యారాశి వారికి 8,9,12,15,18 తేదీలు అనుకూలమైనవి.
In May 2027, Kanya Rasi (Virgo) native individuals will enjoy good income from all directions and sources. You will successfully complete all your tasks through your own self-effort and determination. This month serves as a highly suitable period for foreign residence or overseas employment efforts, marriage alliance efforts for unmarried individuals, and progeny planning for newly married couples. Individuals born under Chitra nakshatra, in particular, will break free from their financial debts. You will experience an encouraging and supportive environment at home as you receive the love and affection of your family members. In the final week of this month, intervening in matters related to friends may lead to an unexpected loss. You will realize through practical experience that gratitude should not be shown to undeserving individuals. During this month, the 8th, 9th, 12th, 15th, and 18th days are favorable for Kanya Rasi natives.
మే 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ వరూధిని ఏకాదశి. 4వ తేదీ మాస శివరాత్రి మరియు ఈ రోజు నుండి వాస్తు కర్తరి ప్రారంభం అవుతుంది. వాస్తు కర్తరి మే 30వ తేదీన ముగుస్తుంది. 7వ తేదీ వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. 9వ తేదీ అక్షయ తృతీయ మరియు పరశురామ జయంతి మరియు సింహాచల శ్రీ అప్పన్న స్వామి చందనోత్సవ దినం. 15వ తేదీ శ్రీ వాసవి అమ్మ వారి జయంతి. 16వ తేదీ సర్వ ఏకాదశి దినం మరియు అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణోత్సవ పర్వ దినం. 18వ తేదీ నృసింహ జయంతి. 20వ తేదీ శ్రీ అన్నమాచార్య జయంతి మరియు బుద్ధ పౌర్ణమి మరియు మహా వైశాకి పర్వదినం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 25వ తేదీ రోహిణి కార్తె ప్రారంభ దినం. 30వ తేదీ శ్రీ హనుమాన్ జయంతి.
Key festivals and auspicious days in May 2027: Varudhini Ekadashi falls on the 2nd. Masa Shivaratri takes place on the 4th, marking the commencement of Vastu Kartari, which concludes on May 30th. The sacred Vaishakha Masa commences on the 7th. Akshaya Tritiya, Parashurama Jayanti, and Simhachalam Sri Appanna Swamy Chandanotsavam all fall on the 9th. Sri Vasavi Ammavari Jayanti takes place on the 15th. Sarva Ekadashi and Annavaram Sri Satyadeva Kalyanotsavam fall on the 16th. Nrusimha Jayanti is celebrated on the 18th. Sri Annamacharya Jayanti, Buddha Purnima, and Maha Vaishaki take place on the 20th. Sankashtahara Chaturthi Vratam is observed on the 24th. Rohini Karte commences on the 25th. Sri Hanuman Jayanti is celebrated on the 30th.
ఈ మాసంలో కన్యరాశి వారిని ఆఖస్మిక ఆరోగ్య సమస్యలు ఎదురగుట వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమస్యల పరిష్కారానికి మీ చాకచక్యత ఉపయోగపడుతుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. భాత్రువర్గం వారితో ఊహించని విధంగా విరోధములు ఏర్పడుట మానసిక విచారతను కలుగచేస్తుంది. 18, 19 తేదీలలో వృధా ధనవ్యయం వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. 20 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో కొంత అనుకూల సమయం ప్రారంభం అవుతుంది. మొత్తం మీద ఈ మాసం కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగచేయును.
In June 2027, Kanya Rasi (Virgo) native individuals will face difficulties due to sudden health issues. However, your tactfulness and cleverness will help resolve these problems effectively. Financial income will remain average during this month. Unexpected animosity or disputes with brothers and siblings will cause mental sadness and sorrow. On the 18th and 19th, you will face troubles due to wasteful expenditure. From the 20th onward, a somewhat favorable period will commence in professional, employment, and business matters. Overall, this month will deliver mixed results for Virgo natives.
జూన్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ మతత్రయ ఏకాదశి. 3వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. 6వ తేదీ బుద్ధ జయంతి. 13వ తేదీ దశ పాప హర దశమి. 14వ తేదీ నిర్జల ఏకాదశి మరియు స్మార్త ఏకాదశి. 18వ తేదీ ఏరువాక పూర్ణిమ మరియు వట సావిత్రి వ్రత దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీన పవిత్ర గోదావరి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. జూలై 7వ తేదీతో గోదావరి నది ఆది పుష్కరాలు పూర్తి అవుతాయి. 30వ తేదీ సర్వ ఏకాదశి దినం.
Key festivals and auspicious days in June 2027: Matatraya Ekadashi falls on the 1st. Masa Shivaratri takes place on the 3rd. The sacred Jyeshtha Masa commences on the 5th. Buddha Jayanti falls on the 6th. Dasha Papa Hara Dashami takes place on the 13th. Nirjala Ekadashi and Smarta Ekadashi fall on the 14th. Eruvaka Purnima and Vata Savitri Vratam are observed on the 18th. Sankashtahara Chaturthi Vratam takes place on the 22nd. The sacred Godavari Nadhi Pushkaralu commence on the 26th (with the Aadi Pushkaralu concluding on July 7th). Sarva Ekadashi falls on the 30th.
ఈ మాసంలో కన్యారాశి వారి ఆలోచనలు కొంచెం ఉద్రేకపూరితంగా ఉండును. ఎటువంటి సరైన కారణం లేకుండా ఈ మాసంలో కుజ గ్రహ ప్రభావం వలన కోపం, చిరాకు ఎదుర్కొందురు. కుటుంబ ఆచార సంప్రదాయములను విడిచి ప్రవర్తిస్తారు. మీ ఇష్టానుసారం అనవసర వ్యయం చేయుదురు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఈ మాసంలో కూడా కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు కొనసాగును. వ్యక్తిగత జీవితంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొనవలసి వస్తుంది. ఈ మాసంలో బంధు మిత్రుల ఆదరణ, వారి నుండి మీకు కావలసిన చేయూత ఆశించిన విధంగా ఉండవు. చివరి వారంలో ఉద్యోగ జీవనంలో కొన్ని అనుకూలమైన మార్పులు ఏర్పడును. ఈ మాసంలో 2,7,12,13,16 తేదీలు కన్యారాశి వారికి అంత అనుకూలమైనవి కావు.
In July 2027, Kanya Rasi (Virgo) native individuals will harbor somewhat agitated and impulsive thoughts. Due to the planetary influence of Mars (Kuja Graham) during this month, you will experience anger and irritability without any proper reason. You may act in disregard of family customs and traditions. You will indulge in unnecessary expenditure according to your personal whims. Financial income will remain average throughout this month. Health issues will continue to persist for Virgo natives during this month as well. You will be forced to take a few tough or stern decisions in your personal life. Support and encouragement from relatives and friends will not meet your expectations. However, during the final week, a few favorable changes will take place in your professional and employment life. During this month, the 2nd, 7th, 12th, 13th, and 16th days are not very favorable for Kanya Rasi natives.
జూలై 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి ఆషాడమాసం ప్రారంభమవుతుంది మరియు పూరి లోని శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఘనంగా జపరబడుతుంది. ఈ రోజు నుండి శుక్ర మూఢమి ప్రారంభమవుతుంది. శుక్ర మూఢమి 18 సెప్టెంబర్ 2027వ తేదీతో పూర్తి అవుతుంది. 14వ తేదీ తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి మరియు చాతుర్మాస వ్రత ఆరంభ దినం. 17వ తేదీ నుండి దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది.18వ తేదీ గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 29వ తేదీ సర్వ ఏకాదశి దినం. 31వ తేదీ మాస శివరాత్రి మరియు శని త్రయోదశి.
Key festivals and auspicious days in July 2027: Masa Shivaratri falls on the 2nd. The sacred Ashadha Masa commences on the 5th, and the grand Rath Yatra of Lord Jagannath Swamy at Puri is celebrated. Shukra Moodhami (combustion of Venus) begins on this day and continues until September 18, 2027. Toli Ekadashi, Shayana Ekadashi, and the commencement of Chaturmasya Vratam take place on the 14th. Dakshinayana Kaalam begins on the 17th. Guru Purnima and Vyasa Purnima fall on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 22nd. Sarva Ekadashi falls on the 29th. Masa Shivaratri and Shani Trayodashi occur on the 31st.
ఈ మాసంలో కన్యరాశి వారికి ఆదాయములో పెరుగుదలకు సూచనలు కలవు. శరీర అరోగ్యం సహకరిస్తుంది. గత మాసాలలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు. మానసికంగా కొంత ప్రశాంతత లభిస్తుంది. గత కాలపు పెట్టుబడుల నుండి ఆశించిన ధనాదాయం ప్రారంభం అవుతుంది. కొన్ని వివాదాల నుండి ఉహించని విధంగా బయట పడతారు. ఈ మాసంలో 11, 14 మరియు 17 తేదీలలో కార్యానుకులత ప్రాప్తిస్తుంది. ప్రభుత్వ రంగం ఉద్యోగ జీవనం చేయు వారికి అదనపు భాద్యతలు లభిస్తాయి. కార్య భారం పెరుగుతుంది. అన్ని రకముల లోహ సంబంధ వ్యాపార రంగాములలోని వారికి ఈ మాసం చక్కటి లాభాలు ప్రాప్తిస్తాయి. విద్యార్ధుల ఆలోచనలు సక్రమ మార్గంలో ఉంటాయి. ఏకాగ్రతతో తమ విధ్యాభ్యాస లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఈ మాసంలో బాలారిష్ట దశలో ఉన్న చిన్న పిల్లల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. దైవ సంబంధమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
In August 2027, Kanya Rasi (Virgo) native individuals will see clear indications of an increase in income. Your physical health will remain supportive, and you will overcome and recover from the health issues faced in previous months. You will regain mental peace and composure. You will begin receiving expected returns and income from your past investments. You will unexpectedly emerge free from certain disputes and conflicts. During this month, work and task accomplishment (Karyanukulata) will be favored on the 11th, 14th, and 17th days. Those employed in the government sector will be entrusted with additional responsibilities, resulting in an increased workload. Individuals involved in all types of metal-related business and trading sectors will reap fine profits during this month. Students will maintain constructive and focused thoughts, achieving their educational goals through steady concentration. However, caution is required regarding the health of young infants and children who are undergoing Balarishta Dasha. You will also purchase divine and devotional items during this period.
ఆగష్టు 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాన్ని పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు మరియు కర్కాటక రాశికి చెందినవారు చూడకూడదు. పుష్యమి నక్షత్ర జాతకులు మరియు కర్కాటక రాశికి చెందిన జాతకులు గ్రహ శాంతులు జరిపించుకోవాలి. ఈ పాక్షిక సూర్యగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు పూర్తి అవుతుంది. ఆగష్టు 3వ తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. 6వ తేదీ గరుడ పంచమి. 13వ తేదీ శ్రీ వరలక్ష్మీ దేవి వ్రత దినం. 14వ తేదీ శని త్రయోదశి. 15వ తేదీ నుండి గురు మూడమి కాలం ప్రారంభమవుతుంది. ఈ గురు మూడమి 16 సెప్టెంబర్ 2027 వ తేదీన ముగుస్తుంది. 17వ తేదీ శ్రావణ మాస పౌర్ణమి మరియు రాఖీ పండుగ. 20వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి. 28వ తేదీ మతత్రయ ఏకాదశి. 30వ తేదీ మాస శివరాత్రి. 31వ తేదీ పొలాల అమావాస్య పర్వదినం.
Key festivals and auspicious days in August 2027: A partial solar eclipse (Pakshika Surya Grahanam) occurs on the 2nd. Individuals born under Pushyami nakshatra and Karkataka Rasi (Cancer) should not view this eclipse and must perform eclipse pacification rituals (Graha Shanthi). This partial solar eclipse begins at 3:58 PM and concludes at 5:40 PM. The sacred Shravana Masa commences on August 3rd. Garuda Panchami falls on the 6th. Sri Varalakshmi Vratam is observed on the 13th. Shani Trayodashi takes place on the 14th. Guru Moodhami (combustion of Jupiter) begins on the 15th and concludes on September 16, 2027. Shravana Purnima and Rakhi Festival (Raksha Bandhan) fall on the 17th. Sankashtahara Chaturthi Vratam is observed on the 20th. Sri Krishna Janmashtami is celebrated on the 24th. Matatraya Ekadashi falls on the 28th. Masa Shivaratri takes place on the 30th. Polala Amavasya is observed on the 31st.
ఈ మాసంలో కన్యారాశి వారికి ఆరంభములో ప్రయత్న ఆటంకములుఎదురైనా అంతిమంగా విజయం లభిస్తుంది. ధనాదాయం సామాన్యం గా ఉంటుంది. దైవ సంబంధమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పరమైన సమస్యల నుండి బయట పడతారు. ద్వితియ మరియు తృతీయ వారములు వివాహ ప్రయత్నాలకు అనుకూలమైనవి. ఈ మాసంలో నూతన ఆదాయ మార్గముల కొరకు చేయు ప్రయత్నాలు విఫలం అవుతాయి. ఆర్ధిక సంబంధ విషయాలలో ఇతరులు తమ మాట నిలబెట్టుకోరు. దీని ప్రభావం వలన మీ ఆర్ధిక అంచనాలు తలక్రిందులు అవుతాయి. 22 వ తేదీ నుండి 28 వ తేదీ మధ్య కాలంలో కుటుంబ సంబంధ విషయాలలో పెద్దలతో మాట కలయికలో ఇబ్బంది ఎదురగుట వలన మానసికంగా అశాంతి అనుభవించెదరు. మీ మాట తీరులో అహంకారతత్త్వం ఉండకుండా చూసుకోవడం మంచిది. ముఖ్యంగా కన్యరాశి కి చెందిన యువత ఈ మాసంలో తమ వ్యక్తిగత జీవిత విషయాలలో మధురంగా మాట్లాడే వారి వలన నమ్మకద్రోహానికి గురి అగు సూచన ఉన్నది.
In September 2027, Kanya Rasi (Virgo) native individuals will face initial obstacles in their efforts, but will ultimately achieve success. Financial income will remain average throughout the month. You will actively participate in divine and devotional service activities (Daiva Seva). You will successfully overcome and break free from domestic and family-related problems. The second and third weeks are highly favorable for marriage alliance efforts. However, efforts made to establish new sources of income during this month will fail. In financial matters, others will fail to keep their commitments, causing your financial estimates and plans to go upside down. Between the 22nd and the 28th, you will experience mental unrest and friction due to communication difficulties with family elders. It is advisable to ensure that your tone and speech remain free from arrogance. Young individuals belonging to Kanya Rasi must exercise special caution, as conditions indicate a risk of betrayal in personal matters by sweet-talking individuals.
సెప్టెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. 2వ తేదీ శ్రీ బలరామ జయంతి. 3వ తేదీ శ్రీ వరాహ జయంతి. 4వ తేదీ శ్రీ వినాయక చవితి. 5వ తేదీ ఋషి పంచమి దినం. 11వ తేదీ పరివర్తన ఏకాదశి పర్వదినం. 12వ తేదీ శ్రీ వామన జయంతి. 14వ తేదీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత దినం. 16వ తేదీ గురు మూడమీ పూర్తి అవుతుంది మరియు ఈ 16 వ తేదీ నుండి భాద్రపద మాస అమావాస్య వరకు అనగా 29వ తేదీ వరకు మహాలయ పక్షం జరుగుతుంది. 18వ తేదీన శుక్ర మూఢమి పూర్తి అవుతుంది. 19వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీ సర్వ ఏకాదశి దినం. 28వ తేదీ మాస శివరాత్రి. 29వ తేదీ మహాలయ అమావాస్య.
Key festivals and auspicious days in September 2027: The sacred Bhadrapada Masa commences on the 1st. Sri Balarama Jayanti falls on the 2nd. Sri Varaha Jayanti is celebrated on the 3rd. Sri Vinayaka Chavithi (Ganesh Chaturthi) takes place on the 4th. Rishi Panchami falls on the 5th. Parivartana Ekadashi is observed on the 11th. Sri Vamana Jayanti takes place on the 12th. Sri Ananta Padmanabha Swamy Vratam falls on the 14th. Guru Moodhami concludes on the 16th, and Mahalaya Paksham commences on the same day, continuing through Bhadrapada Amavasya on the 29th. Shukra Moodhami concludes on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 19th. Sarva Ekadashi falls on the 26th. Masa Shivaratri takes place on the 28th. Mahalaya Amavasya falls on the 29th.
ఈ మాసంలో కన్యారాశి వారికి వృత్తి , ఉద్యోగ , వ్యాపారములలో ఆశించిన స్థాయిలో లాభములు ఏర్పడవు. ముఖ్యంగా చిత్తా నక్షత్ర జాతకులు ఇతరుల నుండి ఆశించిన సహకారము పొందలేరు. ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గుతుంది. ప్రయాణాలు తీవ్ర ప్రయాసలతో కూడి ఉంటాయి. సంతాన సంబంధ అనారోగ్య మూలక ధనవ్యయం ఎదుర్కొందురు. మాసం మధ్యలో దైవదర్శన లేదా పుణ్య క్షేత్ర సందర్శన భాగ్యం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక వేత్తలతో పరిచయం ఏర్పడటం జీవితం పై మీకు ఉన్న దృక్పదాన్ని మారుస్తుంది. ఈ మాసంలో 16 వ తేదీ తదుపరి సంతాన ప్రయత్నాలకు అనుకూలమైన కాలం. మాసాంతంలో చక్కటి ప్రశాంతత లభిస్తుంది. ఈ మాసంలో వ్యక్తిగత జీవితానికి సంబందించిన ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయుట మంచిది.
In October 2027, Kanya Rasi (Virgo) native individuals will not experience profits at expected levels in professional, employment, and business ventures. Individuals born under Chitra nakshatra, in particular, will fail to secure the anticipated support from others. Financial income will decrease somewhat during this month. Travels will be fraught with severe strain and exertion. You will face monetary expenditure arising from health issues concerning your children. In the middle of the month, you will be blessed with opportunities for divine darshan or visits to sacred pilgrimage sites. Acquaintances formed with spiritual personalities will transform your perspective on life. From the 16th onward, conditions become favorable for progeny-related efforts. By the end of the month, you will enjoy deep peace of mind and serenity. It is advisable to postpone taking major decisions related to personal life during this month.
అక్టోబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది మరియు అమ్మవారి పవిత్ర శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. నవరాత్రుల ప్రారంభ దినమైన ఈ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిని పూజించాలి. 2వ తేదీ శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని పూజించాలి. 3వ తేదీ శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారిని పూజించాలి. 4వ తేదీ శ్రీ మహా చండీ దేవి అమ్మ వారిని పూజించాలి. 5వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించాలి. 6వ తేదీ శ్రీ సరస్వతీ దేవి అమ్మవారిని పూజించాలి. 7వ తేదీ ఈ రోజు రెండు తిధుల సంధి ఏర్పడడం వలన ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించాలి మరియు ఈ రోజును దుర్గాష్టమి పర్వ దినంగా పరిగణించి శ్రీ దుర్గా దేవిని పూజించాలి. 8వ తేదీ మహానవమి పర్వదినం. ఈ రోజున శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారిని పూజించాలి. 9వ తేదీ విజయదశమి. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించాలి. ఈ రోజున మధ్యాహ్నం 1.40 నుండి మధ్యాహ్నం 2.38 గంటల మధ్య శమీ పూజను నిర్వహించాలి. 11వ తేదీ మతత్రయ ఏకాదశి. 18వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 28వ తేదీ నరక చతుర్దశి. 29వ తేదీ దీపావళి పర్వదినం. ఈ రోజునే ధనలక్ష్మి పూజ నిర్వహించాలి మరియు కేదార గౌరీ వ్రతం ఆచరించాలి. 30వ తేదీ బలి పాడ్యమి మరియు ఈ రోజు నుండే పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in October 2027: The sacred Ashvija Masa commences on the 1st, marking the beginning of the holy Sharad Navaratri celebrations. On this first day of Navaratri, Sri Bala Tripura Sundari Devi is worshiped. Sri Gayatri Devi is worshiped on the 2nd. Sri Annapurna Devi is worshiped on the 3rd. Sri Maha Chandi Devi is worshiped on the 4th. Sri Lalita Tripura Sundari Devi is worshiped on the 5th. Sri Saraswati Devi is worshiped on the 6th. On the 7th, due to a conjunction of two tithis (Tithi Sandhi), Sri Mahalakshmi Devi is worshiped; this day is also observed as Durgashtami, dedicated to the worship of Sri Durga Devi. Mahanavami falls on the 8th, dedicated to the worship of Sri Mahishasura Mardhini Devi. Vijayadashami (Dussehra) is celebrated on the 9th, with the worship of Sri Rajarajeswari Devi; Shami Puja should be performed between 1:40 PM and 2:38 PM on this day. Matatraya Ekadashi falls on the 11th. Sankashtahara Chaturthi Vratam is observed on the 18th. Naraka Chaturdashi takes place on the 28th. The grand festival of Deepavali falls on the 29th, on which Dhanalakshmi Puja and Kedara Gauri Vratam are performed. Bali Padyami falls on the 30th, marking the commencement of the sacred Kartika Masa.
ఈ మాసంలో కన్యారాశి వారు తమకు ఇష్టమైన వ్యక్తులతో అదిక సమయం గడపగలుగుతారు. ఈ మాసంలో ధనాదాయం ఆశించిన విధంగా ఉండదు. సంతాన సంబంధ విషయాలలో ఆశించిన సౌఖ్యత అనుభవిస్తారు. ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వలన సమస్యలు ఎదుర్కొందురు. ప్రధమ వారంలో భాగస్వామ్య వ్యాపారములు చేయువారు నష్టములు పొందుటకు సూచనలు ఉన్నవి. ప్రారంభించిన నూతన వ్యవహారాలు ఆశించిన రీతిలో ముందుకు సాగవు. ద్వితియ వారంలో ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టములు లేదా అధిక కార్య భారం ఎదుర్కొందురు. ఉత్తరా నక్షత్ర జాతక స్త్రీలకు గౌరవ హాని కలిగించు సంఘటనలు ఎదురగు సూచన. మాసాంతంలో కుటుంబ సమేత ప్రయాణ మూలక ధనవ్యయం ఎదురవుతుంది మరియు ఆరోగ్య భంగములకు కూడా సూచనలు ఉన్నవి.
In November 2027, Kanya Rasi (Virgo) native individuals will be able to spend quality time with their loved ones and cherished companions. However, financial income during this month will not meet your expectations. You will experience desired happiness and comfort regarding child-related matters. Delays in decision-making concerning crucial matters will lead to problems and complications. During the first week, conditions indicate potential financial losses for those engaged in partnership businesses. Newly initiated ventures will not progress as anticipated. In the second week, you will face sudden setbacks or an overwhelming workload in your professional life. Women born under Uttara nakshatra are advised to exercise caution, as circumstances point to events that could cause loss of reputation or honor. By the end of the month, you will incur financial expenses due to travels undertaken with your family, and there are also indications of health disturbances.
నవంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ నాగుల చవితి. 11వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి మరియు ఈ రోజున చాతుర్మాస వ్రతం పూర్తి అవుతుంది. 13వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినం ఈ రోజునే జ్వాలాతోరణం నిర్వహించాలి. 17వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ మతత్రయ ఏకాదశి దినం. 26వ తేదీ మాస శివరాత్రి మరియు ధన్వంతరి జయంతి. 29వ తేదీ నుండి మార్గశీర్ష మాసము ప్రారంభం అవుతుంది.
Key festivals and auspicious days in November 2027: Nagula Chavithi falls on the 2nd. Ksheerabdi Dwadashi takes place on the 11th, marking the formal conclusion of the Chaturmasya Vratam. The sacred Kartika Purnima falls on the 13th, on which Jwala Thoranam is observed. Sankashtahara Chaturthi Vratam takes place on the 17th. Matatraya Ekadashi falls on the 24th. Masa Shivaratri and Dhanvantari Jayanti occur on the 26th. The holy Margashirsha Masa commences on the 29th.
ఈ మాసంలో కన్యారాశి వారు ఆశించిన రుణాలు పొందగలుగుట వలన ఆర్ధిక భారం నుండి కొంత ఉపసమనం లభిస్తుంది. శ్రమకు తగిన విధంగా శరీర ఆరోగ్యం సహకరించును. ఈ మాసంలో 12 వ తేదీ వరకూ తలపెట్టిన ప్రయత్నములు అతి కష్టం మీద విజయవంతం అగును. 13 వ తేదీ తదుపరి నూతన వ్యాపార విస్తరణ సంబందిత పనులకు అనుకూలమైన సమయం. ఈ కాలంలో మీరు తలపెట్టిన మధ్యవర్తిత్వ కార్యములు విజయవంతం అవుతాయి. కోర్టు వ్యవహారములు మీకు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణంలో సంతోషములు మధ్యమ ఆనందములు కలుగచేయును. ఈ మాసంలో 18,24, 25, తేదీలు అనుకూలమైనవి. తృతీయ వారం వివాహ సంబంధ ప్రయత్నములకు అనుకూలమైనది. ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గుతుంది. కాబట్టి మీ ఆర్ధిక వ్యయం అదుపు తప్పకుండా చూసుకోవడం మంచిది.
In December 2027, Kanya Rasi (Virgo) native individuals will secure their expected loans, bringing welcome relief from financial burdens. Your physical health will remain supportive in proportion to your effort and hard work. Until the 12th of this month, initiated tasks and efforts will reach completion only with considerable effort and difficulty. However, from the 13th onward, conditions become highly favorable for tasks related to new business expansion. During this period, mediation and arbitration efforts undertaken by you will yield successful results. Court cases and legal matters will turn in your favor. The domestic environment will bring moderate happiness and joy. During this month, the 18th, 24th, and 25th days are favorable. The third week is suitable for marriage alliance efforts. Financial income will decrease somewhat during this month, so it is advisable to keep your monetary expenses under control.
డిసెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 4వ తేదీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి. 9వ తేదీ సర్వ ఏకాదశి మరియు గీతా జయంతి. 11వ తేదీ శని త్రయోదశి. 13వ తేదీ శ్రీ దత్తాత్రేయ జయంతి. 16వ తేదీ సంకష్టహర చతుర్ధి వ్రత దినం. 20వ తేదీ శ్రీ కాలభైరవ అష్టమి. 23వ తేదీ సర్వ ఏకాదశి. 25వ తేదీ శని త్రయోదశి. 26వ తేదీ మాస శివరాత్రి. 28వ తేదీ నుండి పుష్య మాసం ప్రారంభం అవుతుంది.
Key festivals and auspicious days in December 2027: Sri Subramanyeswara Swamy Shashti falls on the 4th. Sarva Ekadashi and Gita Jayanti take place on the 9th. Shani Trayodashi falls on the 11th. Sri Dattatreya Jayanti is celebrated on the 13th. Sankashtahara Chaturthi Vratam is observed on the 16th. Sri Kala Bhairava Ashtami falls on the 20th. Sarva Ekadashi takes place on the 23rd. Shani Trayodashi falls on the 25th. Masa Shivaratri takes place on the 26th. The holy Pushya Masa commences on the 28th.
ఈ మాసం కన్యారాశి వారికి అన్ని విధములా కలసి వస్తుంది. ఈ మాసం నూతన పనులు ప్రారంభించుటకు మంచిది. భూ సంబంధ లేదా వారసత్వ సంబంధ తగాదాలు పరిష్కారం అవుతాయి. నూతన వస్త్ర లేదా వస్తు కొనుగోలు చేయుదురు. ధనదాయంలో కూడా కొంత పెరుగుదల కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో గత కాలపు మనఃస్పర్ధలు చక్కబడడం వలన చక్కటి ఆహ్లాదకరమైన సమయం గడపడం మానసికంగా మిమ్మల్ని ఉత్తేజ పరుస్తుంది. చివరి వారం ప్రారంభం నుండి మాసాంతం వరకూ ఆశించిన విధంగా చేతిలో నిలువ ధనం నిలువ ఉండును. వృధా వ్యయం అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. చట్ట పరమైన తగాదాలు ఎదుర్కొంటున్న వారికి ఈ మాసం రాజీ ప్రయత్నాలకు అనుకూలమైనది.
In January 2028, Kanya Rasi (Virgo) native individuals will find conditions coming together favorably on all fronts. This month is auspicious for initiating new projects and endeavors. Property-related or ancestral disputes will be resolved smoothly. You will purchase new clothes, household articles, or valuable items. A noticeable increase in financial income will take place. Past misunderstandings with family members will clear up, allowing you to spend refreshing, enjoyable time together that boosts your mental enthusiasm. From the beginning of the final week through the end of the month, cash reserves and savings will remain steady as expected. You will successfully bring wasteful expenditure under control. For those facing legal disputes or litigation, this month serves as a favorable period for compromise and settlement efforts.
జనవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 8వ తేదీ శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినం మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినం. 14వ తేదీ శుక్రవారం భోగి పండుగ. 15వ తేదీ శనివారం మకర సంక్రాంతి రోజున ఉదయం 9 గంటల 21 నిమిషాలకు గ్రహ రాజు శ్రీ సూర్య భగవానుల వారు మకర రాశిలోనికి ప్రవేశిస్తారు. ఈ క్షణం నుండి పవిత్ర ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. 16వ తేదీ ఆదివారం కనుమ పండుగ. 17వ తేదీ సోమవారం ముక్కనుమ పండుగ. 22వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 26వ తేదీ చొల్లంగి అమావాస్య. 27వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in January 2028: The sacred Sri Vaikunta Ekadashi and Mukkoti Ekadashi take place on the 8th. Bhogi festival falls on Friday, the 14th. On Makara Sankranti (Saturday, the 15th), the lord of planets, Lord Surya Bhagavan, enters Makara Rasi (Capricorn) at 9:21 AM, marking the commencement of the auspicious Uttarayana Kaalam from this exact moment. Kanuma festival falls on Sunday, the 16th. Mukkanuma festival takes place on Monday, the 17th. Sarva Ekadashi falls on the 22nd. Masa Shivaratri takes place on the 24th. Chollangi Amavasya falls on the 26th. The holy Magha Masa commences on the 27th.
ఈ మాసంలో గృహంలో విందు భోజనములు, అతిధులకు ఆతిధ్య సత్కార సంబంధ వ్యయం ఎదుర్కొంటారు. గృహంలో నిర్మాణ సంబంధ మార్పులు చేయుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఈ మాసంలో ఎదిగిన సంతానం తో మాట తగాదాలు ఏర్పడినప్పటికీ మాసాంతమునకు పరిస్థితులలో ఉద్రిక్తతలు తగ్గుట సంతోషకరంగా ఉంటుంది. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఉన్నవారు తాము ఆశించిన ఉన్నతి మరియు ఆశించిన పదవులు పొందగలుగుతారు. మీ ఉదార స్వభావం వలన అందరి మన్ననలు లభిస్తాయి. ఈ మాసాం చివరి వారంలో సామాన్య ఫలితాలు ఎదురగును. ఉత్తర జన్మ నక్షత్ర జాతకులు ఈ మాసంలో నూతన వస్తువులు కొనుగోలు చేయుట అంత మంచిది కాదు.
In February 2028, Kanya Rasi (Virgo) native individuals will face expenses related to hosting feasts, banquets, and entertaining guests at home. This month is a favorable time for carrying out construction-related alterations or renovations to your residence. Although verbal disagreements or disputes may arise with your grown-up children during this month, tensions will ease by the end of the month, bringing relief and happiness. During the third week, those in employment and professional life will achieve their desired advancement and secure expected positions. Your generous and philanthropic nature will earn you the appreciation and respect of everyone. During the final week of the month, ordinary or average results will be experienced. Individuals born under Uttara nakshatra are advised that purchasing new articles or household items during this month is not very advisable.
ఫెబ్రవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 3వ తేదీ రథసప్తమి పర్వదినం మరియు భీష్మాష్టమి పర్వదినం. 7వ తేదీ భీష్మ ఏకాదశి పర్వదినం మరియు అంతర్వేది తీర్థం. 13వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 21వ తేదీ మతత్రయ ఏకాదశి. 23వ తేదీ పవిత్ర మహా శివరాత్రి పర్వదినం. 26వ తేదీ నుండి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in February 2028: Ratha Saptami and Bhishma Ashtami fall on the 3rd. Bhishma Ekadashi and the renowned Antarvedi Teertham take place on the 7th. Sankashtahara Chaturthi Vratam is observed on the 13th. Matatraya Ekadashi falls on the 21st. The holy festival of Maha Shivaratri is celebrated on the 23rd. The sacred Phalguna Masa commences on the 26th.
ఈ మాసంలో వ్యాపార వర్గం వారికి ఆశించిన లాభములు లభించును. వ్యాపార పరంగా చక్కటి ప్రోత్సాహ వంతమైన కాలం లభించును. మీ వ్యాపార రంగంలోని మీ పోటీదారులు మీరు ఊహించని విధంగా వ్యాపార రంగం నుండి తొలగిపోవుదురు. ఆశావాదులకు ఆశించిన ప్రభుత్వ కాంట్రాక్టులు లభించును. ప్రధమ వారంలో జీవిత భాగస్వామి సంబంధ అనారోగ్యం వలన తీవ్ర మనస్తాపం అనుభవించవలసి వస్తుంది. ద్వితీయ వారంలో ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి వారి మిత్రుల సహకారంతో నూతన ఉద్యోగ అవకాశములు లభించును. తృతీయ వారంలో కుటుంబ పరమైన ఆకస్మిక ధన వ్యయములు ఎదురగును. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం మరియు ప్రభుత్వ సంబంధ అడ్డంకులు ఎదుర్కొందురు. తృతీయ వారం నుండి మాసాంతం వరకూ సామాన్య ఫలితాలు ఏర్పడును. ఈ మాసంలో 10,15,18 తేదీలు కన్యారాశి వారికి అంత అనుకూలమైనవి కాదు.
In March 2028, Kanya Rasi (Virgo) native individuals in the business sector will secure their expected profits. You will enjoy an encouraging and favorable environment for business growth. Unexpectedly, your business competitors will step aside or withdraw from the market field. Optimistic individuals will successfully secure desired government contracts. During the first week, health issues concerning your spouse will cause you deep distress and worry. In the second week, job seekers will land new employment opportunities with the helpful support of their friends. In the third week, you will face sudden family-related monetary expenses. Those making overseas job efforts will encounter delays and administrative or government-related obstacles. From the third week through the end of the month, average results will prevail. During this month, the 10th, 15th, and 18th days are not very favorable for Kanya Rasi natives.
మార్చి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7వ తేదీ సర్వ ఏకాదశి. 9వ తేదీ కామ దహన దినం. 10 వ తేదీ హోలీ పండుగ. 21వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 27వ తేదీ ఉగాది. ఈ రోజు నుండి నుండి శ్రీ కీలక నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in March 2028: Sarva Ekadashi falls on the 7th. Kama Dahanam is observed on the 9th. The festival of Holi takes place on the 10th. Sarva Ekadashi falls on the 21st. Masa Shivaratri takes place on the 24th. Ugadi is celebrated on the 27th, marking the grand commencement of the new Sri Keelaka Nama Samvatsaram.
రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.
Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
Oursubhakaryam.com's Official YouTube Channel - WhatsApp Channel - Instagram - Facebook - Telegram - Contact Us
Connect on WhatsAppWe offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.