- Predictions By Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)
🔍 Search Our Site / మా వెబ్సైట్లో సెర్చ్ చేయండి:
మూల 1,2,3,4 పాదములు లేదా పూర్వాషాడ 1,2,3,4 పాదములు లేదా ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనుర్ రాశి కి చెందును.
Individuals born under Moola 1st, 2nd, 3rd, and 4th Padas, Poorvashada 1st, 2nd, 3rd, and 4th Padas, or Uttarashada 1st Pada belong to Dhanu Rasi (Sagittarius).
శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం - 08, వ్యయం - 11, రాజ పూజ్యం - 06, అవమానం - 03.
In Sri Plavanga Nama Samvatsara, the Kandaya Phalalu for Dhanu Rasi (Sagittarius) are as follows: Aadayam (Income) – 08, Vyayam (Expenditure) – 11, Raja Poojyam (Honor/Respect) – 06, Avamanam (Dishonor/Humiliation) – 03.
పూర్వ పద్దతిలో ధనుర్ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "2". ఇది శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఏర్పడబోతున్న సౌకర్యవంతమైన జీవితాన్ని సూచిస్తుంది.
According to traditional astrological methods, the balance number (Shesa Sankhya) obtained for Dhanu Rasi is "2". This indicates that Dhanu Rasi (Sagittarius) native individuals will enjoy a comfortable and convenient lifestyle during Sri Plavanga Nama Samvatsara.
ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవంగ నామ తెలుగు చాంద్రమాన సంవత్సరంలో అనగా 7 ఏప్రిల్ 2027 బుధవారం నుండి 26 మార్చి 2028 ఆదివారం వరకు గురుగ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. పవిత్ర గోదావరి నది పుష్కరాలు ప్రారంభం వరకు అంటే 25 జూన్ 2027 వరకు ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. ఆరోగ్య పరమైనటువంటి చికాకులు తరచుగా ఎదుర్కొనవలసి వస్తుంది. తలపెట్టిన ప్రతి కార్యక్రమం కష్టం మీద పూర్తవుతుంది. ఆశించిన విధంగా అదృష్టం కలిసి రాదు. మోసం చేసి ఐనా సరే లాభాన్ని పొందాలి అనే ఆలోచన విధానం ఏర్పడటం వల్ల తీవ్రంగా నష్టపోతారు. మానసికంగా సదా ఏదో ఒక తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. జూదం లేదా ఇతర వ్యసనాలకి బానిసలైన వారు మరింత దిగజారి పోతారు. కుటుంబంలో గృహ వాతావరణం పూర్తిగా మీకు వ్యతిరేకంగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహబలం లోపించిన ధనుర్రాశి వారు జారత్వ దోషము వలన కూడా నష్టపోతారు. 26 జూన్ 2027 నుంచి పరిస్థితులు అనుకూలంగా మారడం ప్రారంభం అవుతుంది. ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రత తగ్గుతూ వస్తుంది. పితృ సంబంధ సంబంధీకులు వల్ల లాభపడతారు. దైవచింతన పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పిత్రార్జితం వల్ల మరియు జీవిత భాగస్వామి సంబంధిత ఆర్థిక సహకారం వల్ల ఆర్థిక రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. పరదేశాలందు ధనార్జన చేయాలి అనే ప్రయత్నాలు చేస్తున్న వారు లేదా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విద్యాభ్యాసం పరదేశ విశ్వవిద్యాలయాల నందు అభ్యసించాలి అనే కోరిక కలిగిన విద్యార్ధులకు ఈ కాలం అనుకూలమైన కాలం. వ్యసనాల నుండి బయటపడాలి అనే తలంపు ఏర్పడుతుంది. ఉద్యోగ జీవనంలో ఆశించినటువంటి పురోగతి లేదా ప్రమోషన్లు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగం చేస్తున్న వారికి కోరుకున్న ప్రదేశానికి స్థాన చలనం ఏర్పడుతుంది. వ్యక్తిగత జాతకంలో స్వక్షేత్రంలో లేదా ఉచ్చస్థితిలో గురు గ్రహాన్ని కలిగి ఉన్నటువంటి ధనుర్రాశి వారికి పవిత్ర గోదావరి నది పుష్కరాల ప్రారంభం తదుపరి శ్రీ ప్లవంగ సంవత్సరం పూర్తయ్యేంత వరకు గురువు వల్ల అఖండమైన యోగ భాగ్యాలు లభిస్తాయి.
For Dhanu Rasi (Sagittarius) natives, Jupiter (Guru Graha) will yield mixed results throughout the Telugu lunar year Sri Plavanga Nama Samvatsara—from Wednesday, April 7, 2027, to Sunday, March 26, 2028. Until June 25, 2027 (Prior to the commencement of Holy Godavari Pushkaralu): Unfavorable results will predominate during this period. You will frequently face health-related issues and irritations. Every task undertaken will only be completed with immense effort and difficulty. Luck will not favor you as anticipated. Developing a mindset aimed at gaining profits through unfair or unethical means will result in severe financial losses. An unknown, persistent fear will torment you mentally. Those addicted to gambling or other vices risk slipping into further degradation. The domestic environment in your family will turn entirely against you. Furthermore, Dhanu Rasi individuals whose personal horoscopes lack Jupiterian strength (Guru Balam) may suffer losses due to moral lapses or immoral associations. From June 26, 2027 (Post-Godavari Pushkaralu through the end of Sri Plavanga Samvatsara): Conditions will begin turning favorable. The severity of financial distress will gradually subside. You will gain benefits through paternal relatives. Spiritual inclinations will rise, restoring mental tranquility. You will gain freedom from debt burdens through ancestral property gains and financial support from your spouse. This period is highly favorable for individuals attempting to earn money abroad and students aspiring to pursue higher education in scientific disciplines at foreign universities. A strong desire to break free from bad habits and vices will emerge. In professional life, you will achieve expected career growth and promotions. Government employees will secure desired job transfers to preferred locations. Additionally, Dhanu Rasi natives who have Jupiter positioned in its own sign (Swakkshetra) or exalted state (Uchha Sthiti) in their personal horoscopes will experience immense auspicious fortunes and prosperity (Akhanda Yoga Bhagyalu) due to Jupiter's divine grace from the commencement of Godavari Pushkaralu through the remainder of the year.
ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవంగనామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 21 మే 2027వ తేదీ నుండి గోచార రీత్యా ధనుర్రాశి వారిని ఇబ్బంది పెడుతున్న అర్ధాష్టమ శని దశ పూర్తవుతుంది. 21 మే 2027 వ తేదీ వరకు ధనుర్రాశి వారు తల్లిదండ్రుల వలన లభించేటటువంటి భూమి లేదా గృహ సంపదల వలన లాభపడతారు. కుటుంబ ఆస్తుల కోసం సంబంధించిన వ్యవహారాలలో ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది. సోదర సోదరీ వర్గం వారి యొక్క సహకారం మాత్రం ఆశించిన సమయానికి లభించదు. గనుల సంబంధమైన ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తున్నవారు చక్కటి లాభాలను ఆర్థించగలుగుతారు. కడుపులో నొప్పి లేదా ఉదర సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్య లేదా ఒక ప్రమాదం వలన శస్త్ర చికిత్స జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. 22 మే 2027 నుండి అంటే అర్ధాష్టమ శని దశ పూర్తి అయిన తదుపరి ధనుర్రాశి వారికి శని గ్రహం వలన చక్కటి ఫలితాలు ప్రాప్తిస్తాయి. సంతాన సంబంధ ప్రయత్నాలు చేస్తున్న వారికి మరియు ఉద్యోగ సంబంధమైన అందులోనూ ప్రభుత్వ సంబంధ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ కాలం బాగా కలిసి వస్తుంది. వ్యాపార రంగంలోని వారికి తమ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా నూతన రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఈ కాలం అనుకూలమైన కాలము. సెప్టెంబర్ 2027 నుండి ధనుర్రాశి వారికి శని గ్రహం యొక్క అనుకూలత వల్ల మనోవాంఛ ఫలసిద్ధత లభిస్తుంది. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి అర్థాష్టమ శని దశ పూర్తి అవ్వడం ఒక మంచి విషయంగా చెప్పవచ్చు మరియు శని ధనుర్రాశి వారికి అనుకూలంగా ఉన్నారు.
For Dhanu Rasi (Sagittarius) natives, Saturn (Shani Graha) will prove to be highly favorable throughout the entire Sri Plavanga Nama Samvatsara. Most importantly, the troublesome Ardhashtama Shani period (4th house Saturn transit) comes to an end on May 21, 2027. Until May 21, 2027 (During the final phase of Ardhashtama Shani): You will benefit from land, property, or real estate assets obtained from your parents. You will need to travel frequently regarding affairs related to family properties. However, expected cooperation from siblings will not arrive on time. Those involved in mining-related government contracts will earn lucrative profits. Strong indications point toward health issues like stomach pain/abdominal ailments, or a surgical procedure resulting from an unexpected minor accident. From May 22, 2027 Onward (Post-Ardhashtama Shani Phase): Following the conclusion of Ardhashtama Shani, Saturn will begin yielding excellent results for Dhanu Rasi natives. This period is remarkably favorable for those making progeny efforts as well as individuals seeking job placement, particularly in government service. Businesspersons will find this an ideal time to expand their enterprises or invest in new sectors. From September 2027 Onward: Due to Saturn’s strong positive alignment, Dhanu Rasi natives will achieve fulfillment of long-cherished desires (Mano Vancha Phalasiddhi). Marriage efforts for unmarried individuals will conclude successfully. Ongoing health ailments will subside significantly. Overall, the completion of Ardhashtama Shani is a major blessing for Dhanu Rasi natives in Sri Plavanga Nama Samvatsara, with Saturn standing firmly in your favor.
ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. తరచుగా ధనం సర్దుబాటు చేయడానికి ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగి ఉన్నవారికి లేదా రాహు గ్రహ ప్రతికూలత కలిగి ఉన్న వారికి తరచుగా శరీరానికి నలత చేస్తుంది. ముఖ్యంగా 8వ వేట మరియు 14వ ఏట ఉన్న వారు ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. రాహు గ్రహ ప్రతికూలత వల్ల తీవ్రమైనటువంటి చెడు ఫలితాలు ఎదుర్కొంటున్న వారు రాహు గ్రహ శాంతులు జరిపించుకోవడం అవసరం. శ్రీ ప్లవంగనామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి రాహు గ్రహం వల్ల తమ బంధు వర్గం వల్ల నష్టపోయే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. మానసికంగా అధికమైనటువంటి ఒత్తిడిని అనుభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి రాహు గ్రహము అనుకూలంగా లేదు.
For Dhanu Rasi (Sagittarius) natives, Rahu Graha will yield unfavorable results throughout the entirety of Sri Plavanga Nama Samvatsara. You will frequently encounter difficult situations requiring strenuous effort to manage financial arrangements and liquidity. Individuals who have Kala Sarpa Dosham or an unfavorable Rahu position in their personal horoscopes will experience recurrent bodily discomfort and lingering health ailments. In particular, children or individuals in their 8th year and 14th year of age must take extra precautions regarding health matters. Those facing severe negative repercussions due to Rahu's affliction are strongly advised to perform Rahu Graha Shanti remedial rituals. During Sri Plavanga Nama Samvatsara, strong indications suggest that Dhanu Rasi natives face risks of financial losses or setbacks through relatives. You are likely to undergo periods of intense mental stress and pressure. Overall, Rahu Graha does not hold a favorable alignment for Dhanu Rasi natives during Sri Plavanga Nama Samvatsara.
ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. తరచుగా శారీరక అనారోగ్యం వల్ల ధనవ్యయం ఎదురవుతుంది. ప్రతి పని కష్టంతో కూడి ఉంటుంది. దైవాన్ని, గురువులను మరియు మీకు మంచి చెప్పే వారిని నిందించి వారిని దూరం చేసుకునే పరిస్థితులు ఎదురవుతాయి. అమాయకంగా ఇతరులను నమ్మడం వల్ల శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో ధనుర్రాశి వారు కష్టాలను కొని తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కావున నూతన పరిచయస్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగిన వారు లేదా కేతు గ్రహ బలం లోపించిన వారు ఈ సంవత్సరం అంతా ఆరోగ్య విషయంలోనూ బంధువులను లేదా నూతన పరిచయస్తులను నమ్మవలసిన పరిస్థితులు విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితుల తీవ్రతను బట్టి కేతు గ్రహ శాంతులు జరిపించుకోవడం మంచిది. మొత్తం మీద శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి కేతు గ్రహం వల్ల అనుకూలత లేదు.
For Dhanu Rasi (Sagittarius) natives, Ketu Graha will yield unfavorable results throughout the entire Sri Plavanga Nama Samvatsara. You will frequently face financial expenditure due to bodily ill-health and recurring medical issues. Every task undertaken will be fraught with difficulty and effort. Circumstances will arise where you may criticize or blame God, spiritual gurus, and well-wishers, ultimately distancing yourself from them. Naively trusting others will lead Dhanu Rasi natives to invite unnecessary troubles upon themselves during Sri Plavanga Nama Samvatsara; hence, exercising caution toward new acquaintances is strongly advised. Individuals who have Kala Sarpa Dosham or lack Ketu's strength in their personal horoscopes must remain vigilant throughout the year—both regarding health matters and when placing trust in relatives or new acquaintances. Depending on the severity of the situation, performing Ketu Graha Shanti remedial rituals is recommended. Overall, Ketu Graha is not favorable for Dhanu Rasi natives during Sri Plavanga Nama Samvatsara.
మొత్తం మీద శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో ధనుర్రాశి వారు గురువు మరియు శని గ్రహాల వలన అనుకూల ఫలితాలు పొందుతారు. రాహువు మరియు కేతువు గ్రహాల వల్ల అధిక శాతం ప్రతికూల ఫలితాలు పొందుతారు. మీ వ్యక్తిగత జాతకంలో గురువు, శని, రాహువు మరియు కేతు గ్రహాలలో ఏ గ్రహం అయితే అధిక బలంతో ఉంటుందో ఆ గ్రహ ఫలితాలే ఈ సంవత్సరం అంతా ప్రస్పుటంగా ప్రతిఫలిస్థాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతికూల ఫలితాల వలన అధైర్య పడకండి. మీ వ్యక్తి గత జాతకంలో ప్రతికూల ఫలితాలకు కారణమైన గ్రహం బలమైన స్థానంలో అనుకూలంగా ఉంటే ప్రతికూల ఫలితాల తీవ్రత తగ్గుతుంది.
Overall, during Sri Plavanga Nama Samvatsara, Dhanu Rasi (Sagittarius) natives will enjoy favorable outcomes through Jupiter (Guru) and Saturn (Shani). On the other hand, Rahu and Ketu will yield a higher degree of unfavorable results. In your personal horoscope, whichever among Jupiter, Saturn, Rahu, and Ketu possesses greater strength will manifest its results most prominently throughout the year. Do not lose heart over the unfavorable predictions mentioned here; if a planet causing negative effects in general transit holds a strong and auspicious position in your personal horoscope, the severity of those negative results will be significantly reduced.
నెలవారీ రాశీ ఫలితాలను మరియు ముఖ్య పర్వదినాల వివరాలను క్రింద పొందగలరు...You can find the details of monthly horoscope predictions and important festival dates below...
ఈ మాసంలో ధనుర్రాశి వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. సులభంగా పూర్తి అయ్యే పనులకు కూడా అనేక అడ్డంకులు ఎదురు కావడం వలన లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం అని అనుభవ పూర్వకంగా అర్ధం అవుతుంది. సొంత మనుష్యులతో విరోధములు చికాకులు ఏర్పరచును. సహాయం ఆశించి పొందక నిరాశ చెందుతారు. 17 వ తేదీ వరకు గృహంలో అనవసర ధనవ్యయం ఎదురగును. వ్యవహార చిక్కులు మానసికంగా దిగులు పడేలా చేస్తాయి. తలపెట్టిన అన్ని ప్రయత్నాలలో ఆటంకములతో విజయం పొందుతారు. మూడవ వారం లో ప్రయాసతో కూడిన ప్రయాణములు చేయవలసి వస్తుంది. ఆర్ధిక సంబంధ విషయాలలో సాహసోపేతమైన నిర్ణయాల వలన నష్టం ఎదుర్కొందురు. 24 వ తేదీ తదుపరి కొంత అనుకూలత లభించును. కుటుంబ సభ్యులతో మీ బంధాలపై దృష్టి పెట్టవలసిన పరిస్టితులు ఎదుర్కొంటారు. పూర్వాషాడ నక్షత్ర జాతకులు ఈ మాసంలో నూతన ఆదాయ మార్గములు పొందగలుగుతారు. మాసాంతంలో చక్కటి వాహన సౌఖ్యం అనుభవిస్తారు.
In April 2027, Dhanu Rasi (Sagittarius) native individuals will experience mixed results. Facing numerous obstacles even for tasks that usually complete easily will teach you, through firsthand experience, that patience is key to achieving your goals. Friction, disagreements, and irritations will arise with your own people. Hoping for help and not receiving it will lead to disappointment. Until the 17th, unnecessary financial expenses will arise at home. Complications in affairs and transactions will cause mental worry. However, you will achieve success in all endeavors undertaken, albeit through hurdles. In the third week, you will have to undertake tiring and strenuous journeys. Bold or risky decisions in financial matters will lead to losses. From the 24th onward, some favorable conditions will emerge. You will encounter situations that require focusing on your relationships with family members. Natives born under Poorvashada Nakshatra will be able to secure new sources of income during this month. By the end of the month, you will enjoy fine vehicle comfort and convenience.
ఏప్రిల్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7 తేదీ శ్రీ ప్లవంగ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. 9వ తేదీ మత్స్య జయంతి మరియు సౌభాగ్య గౌరీ వ్రత దినం. 11వ తేదీ శ్రీ పంచమి. 15వ తేదీ శ్రీరామనవమి పర్వదినం. 16వ తేదీ ధర్మరాజ దశమి. 17వ తేదీ మతత్రయ ఏకాదశి మరియు వాడపల్లి తీర్థం. 19వ తేదీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి కల్యాణోత్సవం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం.
Key festivals and auspicious days in April 2027: The divine Sri Plavanga Nama Samvatsara commences on the 7th. Matsya Jayanti and Saubhagya Gauri Vratam fall on the 9th. Sri Panchami takes place on the 11th. The auspicious festival of Sri Rama Navami is celebrated on the 15th. Dharmaraja Dashami falls on the 16th. Matatraya Ekadashi and the famous Vadapalli Teertham take place on the 17th. Ontimitta Kodandarama Swamy Kalyanotsavam is performed on the 19th. Sankashtahara Chaturthi Vratam is observed on the 24th.
ఈ మాసంలో కూడా ధనుర్రాశి వారికి అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. ధనుర్రాశి వారు ఈ మాసంలో ఏ విధమైన వాదనలకు అయినా దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా వారసత్వ సంబంధ వాదనలకు ఈ మాసం అనుకూలమైనది కాదు. అయితే ధనాదాయం మాత్రం సామాన్యం గా ఉండును. ఉద్యోగ జీవనంలో ఒత్తిడితో కూడిన వాతావరణం కొనసాగుతుంది. నూతన వ్యాపారములు ప్రారంభించుటకు లేదా ఉద్యోగ జీవనంలో మీరు కావాలని చేసుకొనే మార్పులకు ఈ మాసం అనుకూలమైనది కాదు. నరముల వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదరగుట వలన ధన వ్యయం ఎదుర్కొందురు. మిత్రు వర్గం వారి వలన సమయానికి కావలసిన సహాయం పొందుతారు. ఈ మాసంలో 11,12,15 తేదీలు అనుకూలమైనవి కావు.
In May 2027, Dhanu Rasi (Sagittarius) native individuals will continue to experience unfavorable results. It is best for Dhanu Rasi natives to avoid any form of arguments or disputes throughout this month. In particular, this month is not suitable for entering into discussions or conflicts regarding ancestral properties and inheritance. However, financial income will remain average. A high-stress environment will persist in your professional life. This month is not auspicious for launching new business ventures or making intentional job changes. You will incur medical expenses due to health issues related to the nervous system. Fortunately, you will receive timely assistance from friends when needed. The 11th, 12th, and 15th days of this month are not favorable.
మే 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ వరూధిని ఏకాదశి. 4వ తేదీ మాస శివరాత్రి మరియు ఈ రోజు నుండి వాస్తు కర్తరి ప్రారంభం అవుతుంది. వాస్తు కర్తరి మే 30వ తేదీన ముగుస్తుంది. 7వ తేదీ వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. 9వ తేదీ అక్షయ తృతీయ మరియు పరశురామ జయంతి మరియు సింహాచల శ్రీ అప్పన్న స్వామి చందనోత్సవ దినం. 15వ తేదీ శ్రీ వాసవి అమ్మ వారి జయంతి. 16వ తేదీ సర్వ ఏకాదశి దినం మరియు అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణోత్సవ పర్వ దినం. 18వ తేదీ నృసింహ జయంతి. 20వ తేదీ శ్రీ అన్నమాచార్య జయంతి మరియు బుద్ధ పౌర్ణమి మరియు మహా వైశాకి పర్వదినం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 25వ తేదీ రోహిణి కార్తె ప్రారంభ దినం. 30వ తేదీ శ్రీ హనుమాన్ జయంతి.
Key festivals and auspicious days in May 2027: Varudhini Ekadashi falls on the 2nd. Masa Shivaratri takes place on the 4th, marking the commencement of Vastu Kartari, which concludes on May 30th. The holy Vaisakha Masa begins on the 7th. Akshaya Tritiya, Parashurama Jayanti, and the revered Simhachalam Sri Appanna Swamy Chandanotsavam fall on the 9th. Sri Vasavi Ammavari Jayanti takes place on the 15th. Sarva Ekadashi and the sacred Annavaram Sri Satyanarayana Swamy Kalyanotsavam fall on the 16th. Nrusimha Jayanti is celebrated on the 18th. Sri Annamacharya Jayanti, Buddha Purnima, and Maha Vaisakhi fall on the 20th. Sankashtahara Chaturthi Vratam is observed on the 24th. Rohini Karte begins on the 25th. Sri Hanuman Jayanti is celebrated on the 30th.
ఈ మాసంలో ఆర్ధిక సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడును. ధనుర్రాశి వారికి ఆదాయం ఆశించిన విధంగా లభిస్తుంది. రుణ ఒత్తిడులు తగ్గుతాయి. నూతన పరిచయాలు జీవన ఉన్నతికి దారితీస్తాయి. లౌఖ్యంతో పనులు పూర్తి చేయగలుగుతారు. శత్రుత్వములు తొలగుట వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్వతంత్ర వృత్తి పరమైన ధనార్జన చేయువారికి ఈ మాసంలో ప్రోత్సాహకర వాతావరణం ఎదురవుతుంది. ద్వితియ వారం మరియు తృతీయ వారములలో అన్ని వర్గముల వారికి ఆశించిన చక్కటి పురోగతి లభిస్తుంది. వివాహ సంబంధ ప్రయత్నాలు , సంతాన ప్రయత్నాలు ఈ మాసం తృతీయ వారం తదుపరి అనుకూల ఫలితాలు ఇచ్చును. నాల్గవ వారం నుండి చేపట్టిన కార్యములందు స్తబ్ధత తొలగి ప్రయత్న పూర్వక విజయాలు లభిస్తాయి. కుటుంబం లో ఒక శుభకార్యా వేడుకకు సంబంధించిన సన్నాహాలు చేస్తారు.
In June 2027, favorable conditions will emerge in financial matters for Dhanu Rasi (Sagittarius) native individuals. Income will be obtained as expected, and debt pressures will decrease. New acquaintances will lead to progress and advancement in your life. You will be able to accomplish your tasks using tact and diplomacy. As rivalries and enmities dissolve, you will attain mental peace and tranquility. Those who earn a livelihood through independent professions will experience an encouraging and supportive environment this month. During the second and third weeks, individuals across all sectors will achieve fine, expected progress. Marriage efforts and progeny endeavors will yield favorable outcomes after the third week. From the fourth week onward, stagnation in undertaken activities will clear away, leading to success achieved through dedicated efforts. Within the family, you will make preparations for an upcoming auspicious ceremony or celebration.
జూన్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ మతత్రయ ఏకాదశి. 3వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. 6వ తేదీ బుద్ధ జయంతి. 13వ తేదీ దశ పాప హర దశమి. 14వ తేదీ నిర్జల ఏకాదశి మరియు స్మార్త ఏకాదశి. 18వ తేదీ ఏరువాక పూర్ణిమ మరియు వట సావిత్రి వ్రత దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీన పవిత్ర గోదావరి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. జూలై 7వ తేదీతో గోదావరి నది ఆది పుష్కరాలు పూర్తి అవుతాయి. 30వ తేదీ సర్వ ఏకాదశి దినం.
Key festivals and auspicious days in June 2027: Matatraya Ekadashi falls on the 1st. Masa Shivaratri takes place on the 3rd. The holy Jyeshtha Masa commences on the 5th. Buddha Jayanti is celebrated on the 6th. Dasha Papa Hara Dashami falls on the 13th. Nirjala Ekadashi and Smarta Ekadashi are observed on the 14th. Eruvaka Purnima and Vata Savitri Vratam fall on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 22nd. The sacred Godavari Nadi Pushkaralu commence on June 26th. The Adi Pushkaralu of the Godavari River conclude on July 7th. Sarva Ekadashi falls on the 30th.
ఈ మాసం యోగదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అంచనాలకు అనుకూలంగా ఫలితాలు లభిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులుగా మారుతారు. మిత్రుల వలన లాభం పొందుతారు. గృహ సంబంధంగా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ మాసం ప్రధమ మరియు ద్వితియ వారాలలో కుటుంబ సభ్యుల సహకారంతో ఒక సదావకాశం పొందుతారు. మాతృ వర్గీయుల ఆరోగ్య సమస్యల వలన మానసిక ఆందోళన ఏర్పడుతుంది. ఈ మాసంలో స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ రంగంలో వ్యాపార పెట్టుబడులు పెట్టు వారు ఆశించిన విధంగా లాభాలు పొందుతారు. తృతీయ వారం నుండి ధనాదాయం పెరుగుతుంది. ఈ మాసంలో 15, 24, 30 మరియు 31 తేదీలు ధనుర్రాశి వారికీ అనుకూలమైనవి కావు.
In July 2027, this month will prove to be highly auspicious and yoga-bestowing for Dhanu Rasi (Sagittarius) native individuals. You will achieve results matching your expectations across professional, business, and employment sectors. Opponents and detractors will transform into close associates. You will reap financial and material benefits through friends. You will purchase new household items and consumer goods for your home. During the first and second weeks of this month, you will secure a great opportunity with the support of your family members. However, health issues concerning maternal relatives will cause mental anxiety. Those investing in speculation and the stock market will reap profits as expected. From the third week onward, financial income will see a noticeable increase. The 15th, 24th, 30th, and 31st days of this month are not favorable for Dhanu Rasi natives.
జూలై 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి ఆషాడమాసం ప్రారంభమవుతుంది మరియు పూరి లోని శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఘనంగా జపరబడుతుంది. ఈ రోజు నుండి శుక్ర మూఢమి ప్రారంభమవుతుంది. శుక్ర మూఢమి 18 సెప్టెంబర్ 2027వ తేదీతో పూర్తి అవుతుంది. 14వ తేదీ తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి మరియు చాతుర్మాస వ్రత ఆరంభ దినం. 17వ తేదీ నుండి దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది.18వ తేదీ గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 29వ తేదీ సర్వ ఏకాదశి దినం. 31వ తేదీ మాస శివరాత్రి మరియు శని త్రయోదశి.
Key festivals and auspicious days in July 2027: Masa Shivaratri falls on the 2nd. The holy Ashadha Masa begins on the 5th, alongside the grand celebration of the Puri Sri Jagannath Rath Yatra. Sukra Modyami also commences on this day and continues until September 18, 2027. Toli Ekadashi (Shayana Ekadashi) and the commencement of Chaturmasa Vratam fall on the 14th. The sacred Dakshinayana Kaalam begins on the 17th. Guru Purnima and Vyasa Purnima take place on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 22nd. Sarva Ekadashi falls on the 29th. Masa Shivaratri and Shani Trayodashi fall on the 31st.
ఈ మాసంలో మూలా నక్షత్ర జాతకులు తలపెట్టిన నూతన కార్యములు విజయవంతం అగును. వ్యక్త్రిగత జీవితానికి సబందించిన సముచిత నిర్ణయాలు తీసుకో గలుగుతారు. సంకల్ప సిద్ధి ప్రాప్తిస్తుంది. ఈ మాసం సంతాన ప్రయత్నములకు అనుకూలమైన కాలం. ఈ మాసంలో అన్ని వర్గముల వారికి ధనాదాయం బాగుండును. పొదుపు పధకాలలో పెట్టుబడులు పెట్టుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఈ మాసం 13, 14 మరియు 15 తేదీలలో ముఖ్యమైన పత్రాలకు సంబందించిన విషయాలలో జాగ్రత్త వహించాలి. 19, 20 తేదీలలో ఉద్యోగ జీవనంలో ఆశించిన ఉన్నతి లభించును. చివరి వారంలో ఉద్యోగ మార్పు సంబంధ ప్రయత్నములకు, విదేశీ జీవన సంబంధ ప్రయత్నములు చేయుటకు అనుకూల కాలం. మీ పై అధికారుల ప్రశంసలు పొందుతారు. మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ మాసంలో ధనాదాయంలో ఆశించిన వృద్ది పొందుతారు.
In August 2027, natives born under Moola Nakshatra will successfully complete new tasks and projects they undertake. You will be able to make appropriate, sound decisions regarding your personal life, leading to the fulfillment of your aims and desires (Sankalpa Siddhi). This month presents a highly favorable period for progeny efforts and family expansion. Individuals across all walks of life will enjoy good financial income. It is also an auspicious time for investing in long-term savings plans and schemes. Extra caution must be exercised regarding important documents, contracts, and paperwork on the 13th, 14th, and 15th days of this month. On the 19th and 20th days, you can expect desired career growth and professional elevation. During the final week, conditions will be favorable for efforts toward job changes as well as opportunities for foreign travel or residing abroad. You will gain praise and appreciation from your superiors. Overall, Dhanu Rasi (Sagittarius) natives will experience significant and expected growth in financial income during this month.
ఆగష్టు 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాన్ని పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు మరియు కర్కాటక రాశికి చెందినవారు చూడకూడదు. పుష్యమి నక్షత్ర జాతకులు మరియు కర్కాటక రాశికి చెందిన జాతకులు గ్రహ శాంతులు జరిపించుకోవాలి. ఈ పాక్షిక సూర్యగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు పూర్తి అవుతుంది. ఆగష్టు 3వ తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. 6వ తేదీ గరుడ పంచమి. 13వ తేదీ శ్రీ వరలక్ష్మీ దేవి వ్రత దినం. 14వ తేదీ శని త్రయోదశి. 15వ తేదీ నుండి గురు మూడమి కాలం ప్రారంభమవుతుంది. ఈ గురు మూడమి 16 సెప్టెంబర్ 2027 వ తేదీన ముగుస్తుంది. 17వ తేదీ శ్రావణ మాస పౌర్ణమి మరియు రాఖీ పండుగ. 20వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి. 28వ తేదీ మతత్రయ ఏకాదశి. 30వ తేదీ మాస శివరాత్రి. 31వ తేదీ పొలాల అమావాస్య పర్వదినం.
Key festivals and auspicious days in August 2027: A partial solar eclipse (Pakshika Surya Grahanam) occurs on the 2nd. Individuals born under Pushyami Nakshatra and Karkataka Rasi (Cancer) should not view this eclipse and are advised to perform remedial rituals (Graha Shanti). This partial solar eclipse begins at 3:58 PM and concludes at 5:40 PM. The auspicious Sravana Masa commences on the 3rd. Garuda Panchami falls on the 6th. The holy Sri Varalakshmi Vratam takes place on the 13th. Shani Trayodashi falls on the 14th. Guru Modyami period begins on the 15th and concludes on September 16, 2027. Sravana Purnima and Rakhi Panduga (Raksha Bandhan) fall on the 17th. Sankashtahara Chaturthi Vratam is observed on the 20th. Sri Krishna Janmashtami is celebrated on the 24th. Matatraya Ekadashi falls on the 28th. Masa Shivaratri takes place on the 30th. Polala Amavasya falls on the 31st.
ఈ మాసంలో వారసత్వ సంబంధమైన లేదా కళత్ర మూలక సంబంధ ధన సంపదల వలన ఆర్ధిక సౌఖ్యం అనుభవిస్తారు. వ్యాపారములు ఆశించిన విధంగా రాణిస్తాయి. లాభములు ఆశించిన స్థాయిలో ఉండడం వలన మీ చిరకాల ఆర్ధిక ఆధార కోరికలు నేరవేర్చుకొంటారు. అవివాహితుల వివాహ ప్రయత్నములలో మాత్రం ఆటంకములు ఎదురగును. సోదర వర్గీయులతో తగాదాలు ఏర్పడు అవకాశం ఉన్నది. మిక్కిలి శ్రమించి కుటుంబ సభ్యుల ఆలోచన విధానంలో మార్పు తీసుకొని రాగలుగుతారు. ఈ మాసంలో మీ ఆద్యాత్మిక భావాలూ పెంపొందుతాయి. తృతీయ వారంలో జీవిత భాగస్వామికి సంబందించిన అనారోగ్య సమస్యలు ఆందోళన కలుగచేయును. 26, 27, 28 తేదీలు గత కాలంలో నిలిపి వేసిన పనులు తిరిగి ప్రారంభించుటకు అనుకూల కాలం. ఈ మాసం మొత్తం ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు వాహన చోదన విషయంలో జాగ్రత్తగా ఉండవలెను.
In September 2027, Dhanu Rasi (Sagittarius) native individuals will enjoy financial comfort and ease through ancestral wealth or monetary gains derived from their spouse. Business enterprises will flourish as anticipated. As profits reach expected levels, you will fulfill your long-cherished financial goals and aspirations. However, unmarried individuals will face obstacles in their marriage efforts. Disputes or disagreements may arise with siblings. Through immense effort, you will succeed in bringing about a positive shift in the mindset of your family members. Spiritual inclinations will deepen during this month. In the third week, health issues concerning your spouse will cause concern and anxiety. The 26th, 27th, and 28th days are favorable for restarting work or projects that were previously put on hold. Throughout this entire month, natives born under Uttarashada Nakshatra must exercise extra caution while driving vehicles.
సెప్టెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. 2వ తేదీ శ్రీ బలరామ జయంతి. 3వ తేదీ శ్రీ వరాహ జయంతి. 4వ తేదీ శ్రీ వినాయక చవితి. 5వ తేదీ ఋషి పంచమి దినం. 11వ తేదీ పరివర్తన ఏకాదశి పర్వదినం. 12వ తేదీ శ్రీ వామన జయంతి. 14వ తేదీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత దినం. 16వ తేదీ గురు మూడమీ పూర్తి అవుతుంది మరియు ఈ 16 వ తేదీ నుండి భాద్రపద మాస అమావాస్య వరకు అనగా 29వ తేదీ వరకు మహాలయ పక్షం జరుగుతుంది. 18వ తేదీన శుక్ర మూఢమి పూర్తి అవుతుంది. 19వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీ సర్వ ఏకాదశి దినం. 28వ తేదీ మాస శివరాత్రి. 29వ తేదీ మహాలయ అమావాస్య.
Key festivals and auspicious days in September 2027: The holy Bhadrapada Masa commences on the 1st. Sri Balarama Jayanti falls on the 2nd. Sri Varaha Jayanti is celebrated on the 3rd. The auspicious festival of Sri Vinayaka Chavithi (Ganesh Chaturthi) takes place on the 4th. Rishi Panchami falls on the 5th. Parivartana Ekadashi is observed on the 11th. Sri Vamana Jayanti falls on the 12th. Sri Ananta Padmanabha Swamy Vratam takes place on the 14th. Guru Modyami concludes on the 16th. The sacred Mahalaya Paksham begins on the 16th and continues through Bhadrapada Amavasya on the 29th. Sukra Modyami concludes on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 19th. Sarva Ekadashi falls on the 26th. Masa Shivaratri takes place on the 28th. Mahalaya Amavasya is observed on the 29th.
ఈ మాసం ధనుర్రాశి వారికీ తమ భవిష్యత్ కు సంబందించిన ప్రణాళికలు రుపొందిన్చుకోనుటకు అనుకూలమైన కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగాదులలోని వారు ఆశాజనకమైన ఫలితాలు పొందుతారు. మీ పై अधिकारियों సహకారంతో స్థాన చలన లేదా ప్రమోషన్ సంబంధ విషయాల్లో మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు. స్త్రీలకు మనోధైర్యం పెరుగుతుంది. మీపై ఇతరులు అకారణంగా చేసే విమర్శలకు ధీటుగా బదులిస్తారు. మహిళలకు పని ఒత్తిడి అధికం అవ్వడం వలన ఆశించిన విధంగా విశ్రాంతి లభించదు. ఈ మాసంలో 23 వ తేదీ తదుపరి ప్రారంభించు పనులు అసంపూర్తిగా ముగించాల్సి వస్తుంది. మీ భాద్యతలు ఇతరులకు అప్పచెప్పడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యక్తిగత జాతకంలో వివాహ సంబంధ కుజ దోషం కలిగిన వారు తమ వైవాహిక జీవనంలో సుఖరాహిత్యత ఎదుర్కొందురు. చివరి వారంలో ఒక ప్రమాదము నుండి త్రుటిలో తప్పించుకొనే సూచనలు ఉన్నవి.
In October 2027, this month presents a highly favorable period for Dhanu Rasi (Sagittarius) native individuals to formulate plans for their future. Those across professional, business, and employment sectors will secure hopeful and encouraging results. With the support and cooperation of your superiors, you will attain your desired outcomes regarding job transfers or promotions. Women will experience a boost in mental courage and confidence, enabling them to fitly counter baseless criticisms made by others. However, due to heavy work pressure, women will not get expected rest. Tasks and projects initiated after the 23rd of this month may have to be left incomplete. Entrusting your responsibilities to others will lead to trouble and complications. Individuals whose personal horoscopes contain marital Kuja Dosham will experience a lack of marital bliss and harmony. During the final week, indications suggest a narrow escape from an unexpected accident.
అక్టోబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది మరియు అమ్మవారి పవిత్ర శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. నవరాత్రుల ప్రారంభ దినమైన ఈ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిని పూజించాలి. 2వ తేదీ శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని పూజించాలి. 3వ తేదీ శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారిని పూజించాలి. 4వ తేదీ శ్రీ మహా చండీ దేవి అమ్మ వారిని పూజించాలి. 5వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించాలి. 6వ తేదీ శ్రీ సరస్వతీ దేవి అమ్మవారిని పూజించాలి. 7వ తేదీ ఈ రోజు రెండు తిధుల సంధి ఏర్పడడం వలన ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించాలి మరియు ఈ రోజును దుర్గాష్టమి పర్వ దినంగా పరిగణించి శ్రీ దుర్గా దేవిని పూజించాలి. 8వ తేదీ మహానవమి పర్వదినం. ఈ రోజున శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారిని పూజించాలి. 9వ తేదీ విజయదశమి. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించాలి. ఈ రోజున మధ్యాహ్నం 1.40 నుండి మధ్యాహ్నం 2.38 గంటల మధ్య శమీ పూజను నిర్వహించాలి. 11వ తేదీ మతత్రయ ఏకాదశి. 18వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 28వ తేదీ నరక చతుర్దశి. 29వ తేదీ దీపావళి పర్వదినం. ఈ రోజునే ధనలక్ష్మి పూజ నిర్వహించాలి మరియు కేదార గౌరీ వ్రతం ఆచరించాలి. 30వ తేదీ బలి పాడ్యమి మరియు ఈ రోజు నుండే పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in October 2027: The holy Ashwayuja Masa and the sacred Sharad Navaratri festivities begin on the 1st. On this opening day, Sri Bala Tripura Sundari Devi is worshiped. Sri Gayatri Devi is worshiped on the 2nd. Sri Annapurna Devi is worshiped on the 3rd. Sri Maha Chandi Devi is worshiped on the 4th. Sri Lalita Tripura Sundari Devi is worshiped on the 5th. Sri Saraswati Devi is worshiped on the 6th. Due to the conjunction of two Tithis on the 7th, both Sri Mahalakshmi Devi and Sri Durga Devi (as Durgashtami) are worshiped on this day. Mahanavami falls on the 8th, honoring Sri Mahishasura Mardhini Devi. Vijayadashami (Dussehra) takes place on the 9th, honoring Sri Rajarajeswari Devi; Shami Puja is to be performed between 1:40 PM and 2:38 PM on this day. Matatraya Ekadashi falls on the 11th. Sankashtahara Chaturthi Vratam is observed on the 18th. Naraka Chaturdashi falls on the 28th. The grand festival of Deepavali is celebrated on the 29th, on which Dhanalakshmi Puja and Kedara Gauri Vratam are performed. Bali Padyami falls on the 30th, marking the commencement of the holy Karthika Masa.
ఈ మాసంలో ధనాదాయం కొద్దిగా తగ్గుతుంది. సంతాన ప్రయత్నములకు కూడా ఈ మాసం అంత అనుకూలమైన కాలం కాదు. ఆశాభంగములు ఎదురగును. కుటుంబ వ్యయం అదుపు తప్పుతుంది. తలపెట్టిన పనులలో దైవ ఆశీస్శులు అవసరం. అనుభవజ్ఞులను సలహాలు కోరుట మంచిది. ప్రభుత్వ సంబంధ సమస్యలు ఎదుర్కొనుటకు సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారములలో సామాన్య ఫలితాలు పొందుతారు. నూతన ఆలోచనలు అంత త్వరగా కార్య రూపం దాల్చవు. అవకాశములు చేజారడం వలన నిరాశావాదం అధికం అవుతుంది. ఎదిగిన సంతానం యొక్క విద్యాభ్యాస పురోగతి మాత్రం చక్కటి సంతృప్తిని కలుగ చేస్తుంది. ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు.
In November 2027, financial income will decline slightly for Dhanu Rasi (Sagittarius) native individuals. This month is also not very favorable for progeny efforts and family expansion, as disappointments may arise. Household expenses will exceed your budget. Undertaken endeavors will require divine blessings to succeed; consulting experienced elders or experts for advice is highly recommended. Indications suggest potential issues or complications related to government matters and authorities. Those in professional and business sectors will experience average results. New ideas and plans will not materialize quickly into action. Missing out on good opportunities will lead to an increase in pessimism and frustration. However, the academic progress and achievement of your grown children will bring great satisfaction and joy. Overall, you will encounter mixed results during this month.
నవంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ నాగుల చవితి. 11వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి మరియు ఈ రోజున చాతుర్మాస వ్రతం పూర్తి అవుతుంది. 13వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినం ఈ రోజునే జ్వాలాతోరణం నిర్వహించాలి. 17వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ మతత్రయ ఏకాదశి దినం. 26వ తేదీ మాస శివరాత్రి మరియు ధన్వంతరి జయంతి. 29వ తేదీ నుండి మార్గశీర్ష మాసము ప్రారంభం అవుతుంది.
Key festivals and auspicious days in November 2027: Nagula Chavithi takes place on the 2nd. Ksheerabdi Dwadashi falls on the 11th, marking the conclusion of the Chaturmasa Vratam. The sacred Karthika Purnima is celebrated on the 13th, on which the Jwala Thoranam ritual is performed. Sankashtahara Chaturthi Vratam is observed on the 17th. Matatraya Ekadashi falls on the 24th. Masa Shivaratri and Dhanvantari Jayanti take place on the 26th. The holy Margashirsha Masa commences on the 29th.
ఈ మాసంలో ధనాదాయం కన్నా వ్యయం అధికంగా ఎదురగును. ఊహించని రీతిలో గౌరవ హాని సంఘటనలు ఎదురగును. ఈ మాసంలో వడ్డీ వ్యాపార రంగం లోని వారికి ఆకస్మిక నష్టములు పొందుటకు అవకాశములు అధికంగా ఉన్నవి. ఈ మాసంలో ధనుర్రాశి వారు నూతన కార్యములు ప్రారంభించుట మంచిది కాదు. ప్రధమ వారంలో మూలా నక్షత్ర జాతకులు అదృష్టహీనత ఎదుర్కోను అవకాశం ఉన్నది. జీవిత భాగస్వామి విషయాల్లో మొండితనం మంచిది కాదు. ద్వితియ వారంలో ధనుర్ రాశి వారికి ఆర్ధికంగా కలసి వచ్చినప్పటికీ మిత్రులే శత్రువులవుతారు. ఇతరులు మీ పట్ల వ్యవహరించు విధానం పట్టించుకోనుట మంచిది కాదు. తృతీయ మరియు చివరి వారములు వివాహ ప్రయత్నములకు అనుకూలం. గృహంలో నిర్మాణ సంబంధ మార్పులు చేపడతారు. మాసాంతంలో ఆహార విషయాలలో జాగ్రత్త అవసరం.
In December 2027, expenditure will outweigh financial income for Dhanu Rasi (Sagittarius) native individuals. Unfavorable situations causing unexpected loss of reputation or honor may arise. Those engaged in the money-lending or interest-based business sector face a high probability of sudden losses this month. It is not advisable for Dhanu Rasi natives to initiate new tasks or ventures during this period. During the first week, individuals born under Moola Nakshatra may encounter a phase of setback or ill fortune. Exercising stubbornness in matters concerning your spouse will prove detrimental. In the second week, although financial conditions improve and bring gains, friends may turn hostile or act like adversaries. It is best to ignore how others treat or perceive you. The third and final weeks are favorable for marriage proposals and alliance efforts. You will undertake structural modifications or renovation work in your home. By the end of the month, caution is necessary regarding diet and food habits.
డిసెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 4వ తేదీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి. 9వ తేదీ సర్వ ఏకాదశి మరియు గీతా జయంతి. 11వ తేదీ శని త్రయోదశి. 13వ తేదీ శ్రీ దత్తాత్రేయ జయంతి. 16వ తేదీ సంకష్టహర చతుర్ధి వ్రత దినం. 20వ తేదీ శ్రీ కాలభైరవ అష్టమి. 23వ తేదీ సర్వ ఏకాదశి. 25వ తేదీ శని త్రయోదశి. 26వ తేదీ మాస శివరాత్రి. 28వ తేదీ నుండి పుష్య మాసం ప్రారంభం అవుతుంది.
Key festivals and auspicious days in December 2027: Sri Subrahmanyeswara Swamy Shashti (Subrahmanya Shashti) takes place on the 4th. Sarva Ekadashi and Gita Jayanti fall on the 9th. Shani Trayodashi falls on the 11th. Sri Dattatreya Jayanti is celebrated on the 13th. Sankashtahara Chaturthi Vratam is observed on the 16th. Sri Kala Bhairava Ashtami takes place on the 20th. Sarva Ekadashi falls again on the 23rd. Shani Trayodashi falls on the 25th. Masa Shivaratri takes place on the 26th. The holy Pushya Masa commences on the 28th.
ఈ మాసం ధనుర్రాశి వారికి మంచి ఫలితాలను కలిగించును. తలపెట్టిన కార్యములందు జయం వరించును. తలచిన పనులు సకాలంలో పూర్తి చేయగలరు. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. సమాజహితమైన పనులు తలపెడతారు. కుటుంబ సభ్యులతో చక్కటి ఆనందకర కాలం గడిపెదురు. లభించిన అవకాశములు తక్షణం వినియోగించుకోనుట అవసరం. మీ వ్యక్తిత్వం పై ఇతరులు పొరపాటు అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. మాసాంతంలో ఉద్యోగ జీవనం లోని వారికి పై అధికారుల సహకారం వలన చక్కటి ఆశించిన ఉద్యోగ అభివృద్ధి లభించును. వ్యాపారములలో కూడా ఆశించిన విధంగా చక్కటి లాభములు ప్రాప్తించును. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారు సుందరమైన స్త్రీ సంతానం వలన సంతాన సౌఖ్యం పొందుతారు.
In January 2028, this month will yield very good results for Dhanu Rasi (Sagittarius) native individuals. Success will crown all the endeavors you undertake, and you will be able to complete planned tasks in a timely manner. Financial income will be good and match your expectations. You will establish contacts and acquaintances with prominent figures in society and undertake activities for the welfare of the community. You will spend quality, joyful time with your family members. It is essential to utilize the opportunities that come your way immediately without delay. However, others may form mistaken opinions or misunderstandings regarding your personality. Toward the end of the month, those in employment sectors will achieve expected career advancement and growth with the support of their superiors. Business owners will also reap excellent profits as anticipated. Those making progeny efforts will experience the joy of parenthood with the birth of a beautiful female child.
జనవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 8వ తేదీ శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినం మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినం. 14వ తేదీ శుక్రవారం భోగి పండుగ. 15వ తేదీ శనివారం మకర సంక్రాంతి రోజున ఉదయం 9 గంటల 21 నిమిషాలకు గ్రహ రాజు శ్రీ సూర్య భగవానుల వారు మకర రాశిలోనికి ప్రవేశిస్తారు. ఈ క్షణం నుండి పవిత్ర ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. 16వ తేదీ ఆదివారం కనుమ పండుగ. 17వ తేదీ సోమవారం ముక్కనుమ పండుగ. 22వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 26వ తేదీ చొల్లంగి అమావాస్య. 27వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in January 2028: The sacred Sri Vaikuntha Ekadashi and Mukkoti Ekadashi fall on the 8th. The festive celebration of Bhogi takes place on Friday, the 14th. On Saturday, the 15th, on the day of Makara Sankranti, the king of planets, Lord Surya, enters Makara Rasi (Capricorn) at 9:21 AM. The auspicious Uttarayana Kaalam commences from this moment. Kanuma is celebrated on Sunday, the 16th, followed by Mukkanuma on Monday, the 17th. Sarva Ekadashi falls on the 22nd. Masa Shivaratri takes place on the 24th. Chollangi Amavasya falls on the 26th. The holy Magha Masa commences on the 27th.
ఈ మాసం ప్రారంభంలో ధనుర్రాశి వారు నూతన బాధ్యతలు చేపడతారు. గౌరవ ప్రధమైన జీవనం అనుభవిస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనాదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మీరు తలపెట్టిన పనులకు శరీర ఆరోగ్యం కూడా సహకరించును. ద్వితీయ వారం వరకూ వృత్తి వ్యాపార విషయాల్లో మంచి లాభములు లభిస్తాయి. తృతీయ వారం ప్రారంభం నుండి అత్యాశకు పోవడం వలన చక్కటి అవకాశములు చేజార్చుకుంటారు. ఉద్యోగ జీవనంలో ఆఖస్మికంగా ప్రతికూల పరిస్థితులు ఎదురగును. కుటుంబ విషయాలలో ప్రతికూలత వలన మానసిక ఆందోళన అనుభవిస్తారు. ఈ మాసం చివరి రెండు వారాలు ధనుర్రాశి వారు యధాతధ స్థితి కొనసాగించడం మంచిది.
In February 2028, Dhanu Rasi (Sagittarius) native individuals will take on new responsibilities at the beginning of the month. You will lead a respectable and honorable life. Ongoing disputes and conflicts will get resolved, and financial income will remain satisfactory. Good physical health will support you in fulfilling your planned tasks. Through the end of the second week, you will reap solid profits and gains in professional and business endeavors. However, from the beginning of the third week, succumbing to greed or overambition may cause you to lose out on fine opportunities. Sudden unfavorable conditions will arise in your professional life. Disagreements or adverse situations in family matters will lead to mental worry and anxiety. During the last two weeks of this month, it is best for Dhanu Rasi natives to maintain status quo and avoid making major changes or impulsive decisions.
ఫెబ్రవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 3వ తేదీ రథసప్తమి పర్వదినం మరియు భీష్మాష్టమి పర్వదినం. 7వ తేదీ భీష్మ ఏకాదశి పర్వదినం మరియు అంతర్వేది తీర్థం. 13వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 21వ తేదీ మతత్రయ ఏకాదశి. 23వ తేదీ పవిత్ర మహా శివరాత్రి పర్వదినం. 26వ తేదీ నుండి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in February 2028: Ratha Saptami and Bhishma Ashtami fall on the 3rd. Bhishma Ekadashi and the revered Antarvedi Teertham take place on the 7th. Sankashtahara Chaturthi Vratam is observed on the 13th. Matatraya Ekadashi falls on the 21th. The sacred festival of Maha Shivaratri is celebrated on the 23rd. The holy Phalguna Masa commences on the 26th.
ఈ మాసంలో కూడా ధనుర్రాశి వారికి ఆశించిన విధంగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. ఉద్యోగ జీవన పరంగా ఆందోళన కలిగించు వాతావరణం కొనసాగుతుంది. మిత్ర వర్గంతో ఆఖస్మిక వివాదాలు ఏర్పడుట భాదించును మరియు ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గును. బంధు వర్గం వలన వ్యక్తిగత జీవనంలో ఒత్తిడులు ఎదురగును. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన విధంగా సహకారం లభించదు. చివరి వారంలో మానసికంగా చికాకులు అధికం అగును. గృహ నిర్మాణ విషయాలలో వ్యయం మీ అంచనాలను మించిపోతుంది. ఆర్ధిక పరంగా మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేరు.
In March 2028, Dhanu Rasi (Sagittarius) native individuals will continue to face unfavorable results that fall short of expectations. A worrying and stressful atmosphere will persist in your professional life. Sudden disputes or misunderstandings arising with friends will cause emotional pain, and financial income will decline to some extent during this month. Pressures in your personal life will mount due to relatives, and expected support from family members will not be forthcoming. In the final week, mental irritation and restlessness will increase significantly. Expenses related to home construction or property development will far exceed your planned budget, and you will be unable to achieve your self-set financial goals and targets.
మార్చి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7వ తేదీ సర్వ ఏకాదశి. 9వ తేదీ కామ దహన దినం. 10 వ తేదీ హోలీ పండుగ. 21వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 27వ తేదీ ఉగాది. ఈ రోజు నుండి నుండి శ్రీ కీలక నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in March 2028: Sarva Ekadashi falls on the 7th. Kama Dahanam takes place on the 9th. The vibrant festival of Holi is celebrated on the 10th. Sarva Ekadashi falls again on the 21st. Masa Shivaratri takes place on the 24th. Ugadi falls on the 27th, marking the divine commencement of the Sri Keelaka Nama Samvatsara.
రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.
Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
Oursubhakaryam.com's Official YouTube Channel - WhatsApp Channel - Instagram - Facebook - Telegram - Contact Us
Connect on WhatsAppWe offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.