- Predictions By Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)
🔍 Search Our Site / మా వెబ్సైట్లో సెర్చ్ చేయండి:
పూర్వాభాద్ర 4వ పాదము లేదా ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు లేదా రేవతి 1,2,3,4 పాదములలో జన్మించిన వారు మీన రాశికి చెందును.
Individuals born under the 4th pada of Purvabhadra, all 4 padas of Uttarabhadra (1st, 2nd, 3rd, and 4th), or all 4 padas of Revati (1st, 2nd, 3rd, and 4th) belong to Meena Rasi (Pisces).
శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం - 08, వ్యయం - 11, రాజ పూజ్యం - 01, అవమానం - 02
- In Sri Plavanga Nama Samvatsaram, the financial and astrological transit results (Kandaya Phalalu) for Meena Rasi (Pisces) are as follows: Income (Aadaya) - 08, Expenditure (Vyaya) - 11, Honor/Royal Patronage (Raja Pujyam) - 01, and Humiliation/Disgrace (Avamanam) - 02.
పూర్వ పద్దతి లో మీన రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "2". ఇది శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో మీనరాశి వారికి సౌకర్యవంతమైన జీవనం ఏర్పడుటను సూచించుచున్నది.
- Under the traditional calculation system, the remainder number (Sesha Sankhya) obtained for Meena Rasi (Pisces) is "2". This indicates that Meena Rasi natives will enjoy a comfortable and harmonious lifestyle in Sri Plavanga Nama Samvatsaram.
మీనరాశి వారికి శ్రీ ప్లవంగ నామ తెలుగు చాంద్రమాన సంవత్సరంలో అనగా 7 ఏప్రిల్ 2027 బుధవారం నుండి 26 మార్చి 2028 ఆదివారం వరకు గురుగ్రహం వలన సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఎదురగును. సంవత్సరం ప్రారంభం నుండి పవిత్ర గోదావరి నది పుష్కరాల ప్రారంభం వరకు మీన రాశి వారికి గురుగ్రహం వలన అతి చక్కటి ఫలితాలు ఎదురవుతాయి. విద్యార్థులు తమ మేధాశక్తిని పెంచుకోగలుగుతారు. పలు రకాలైన అధునాతన విద్యలను అభ్యసించగలుగుతారు. ఉపాధ్యాయ రంగంలోని వారికి ఆశించిన పదోన్నతి లభిస్తుంది. కుటుంబానికి కావలసిన విలాసవంతమైన వస్తువులను ఏర్పాటు చేసుకోగలుగుతారు. క్రీడారంగంలోని వారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. సంతాన సంబంధ ప్రయత్నాలు చేయు వారికి చక్కటి సంతాన లాభం ప్రాప్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ రంగంలోని వారికి తమ పై అధికారుల వలన చక్కటి గుర్తింపు మరియు లాభము లభిస్తాయి. మీ మనోబలం అధికమవుతుంది. నిత్యం సంతోషకరంగానే గడుస్తుంది. గోదావరి నది పుష్కరాల ప్రారంభం తదుపరి అనగా 26 జూన్ 2027 నుండి శ్రీ ప్లవంగ నామ సంవత్సరం పూర్తయ్యేంతవరకు మీన రాశి వారికి బృహస్పతి వలన అనుకూల ఫలితాలు ఏర్పడవు. శత్రుత్వాల వల్ల మరియు ఆరోగ్య సమస్యల వల్ల, తరచుగా అధిక ధన వ్యయం ఎదురవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ తప్పు లేకుండానే మీ మిత్రులే మీకు ప్రత్యర్థులుగా తయారవుతారు. వైద్యరంగంలోని వారికి లేదా వైద్య మరియు ఔషధ సంబంధ వ్యాపార రంగంలోని వారికి మరియు వస్త్ర రంగ సంబంధిత వ్యాపారాలు చేయు వారికి మాత్రం ఈ ప్లవంగ నామ సంవత్సరం కలిసి వస్తుంది. పరదేశ జీవనము లేదా పరదేశ విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలు బహు అవరోధాలు ఎదుర్కొని చివరికి విజయవంతమవుతాయి. ఉద్యోగ జీవనంలోని వారికి నిత్య బాధలు ఎదురవుతాయి. గోదావరి నది పుష్కరాల ప్రారంభం తదుపరి శ్రీ ప్లవంగ నామ సంవత్సరం పూర్తి అగు వరకు మీనరాశి వారు ఆర్థిక సంబంధ విషయాలలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది.
For Meena Rasi (Pisces) natives, Jupiter (Guru) will deliver mixed results throughout the Telugu lunar year Sri Plavanga Nama Samvatsaram (from Wednesday, April 7, 2027, to Sunday, March 26, 2028). From the beginning of the year until the commencement of the sacred Godavari Pushkarams, Jupiter will bestow highly favorable results. Students will enhance their intellect and succeed in learning advanced subjects. Those in the teaching profession will secure expected promotions. You will be able to acquire luxury items required for the household. Sports professionals will achieve remarkable victories, and couples trying for children will be blessed with progeny gains. Government employees will receive recognition and benefits from superior officers. Your willpower will increase, and days will pass happily. However, following the start of Godavari Pushkarams—from June 26, 2027, until the end of Sri Plavanga Nama Samvatsaram—Jupiter will not yield favorable results for Meena Rasi natives. You may encounter difficulties due to enmities, health issues, and frequent heavy expenses. Even without any fault on your part, friends may turn into adversaries. On the other hand, individuals in the medical field, medical & pharmaceutical businesses, and textile/garment businesses will experience favorable outcomes throughout this Plavanga Nama Samvatsaram. Efforts made for overseas education or living abroad will face numerous hurdles before ultimately succeeding. Employed individuals may experience persistent troubles at work. Meena Rasi natives are advised to refrain from making risky financial decisions from the start of Godavari Pushkarams until the conclusion of the Plavanga Nama year.
మీనరాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కూడా గోచార రీత్యా ఏలినాటి శని దశ కొనసాగుతూ ఉండడం వలన సంవత్సరం అంతా ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడవు. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శని గ్రహబలం లోపించిన వారు సౌకర్యం లేని జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఉద్యోగ జీవనంలో నిలకడ లోపిస్తుంది. జీవిత సంబంధమైన ముఖ్యమైన విషయాలలో సక్రమమైన ఆలోచనలు చేయలేక పోతారు. వైవాహిక జీవనంలో సుఖం లోపిస్తుంది. వ్యక్తిగత జాతకంలో శని గ్రహం అనుకూల స్థానంలో కలిగిన వారు కొద్దిపాటి యోగవంతమైన ఫలితాలను పొందుతారు. ఇటువంటి వారికి ధనం చేతి పై నిల్వకపోయినా ధన సంపాదన మాత్రం ఆగదు. సాత్విక తత్వం అలవడుతుంది. అందరినీ సమదృష్టితో చూడడం వలన కొన్ని సమస్యల నుండి బయటపడతారు. స్థాన చలనం కోసం చేసే ప్రయత్నాలు లాబిస్తాయి. కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం దానధర్మాలు చేయవలసి వస్తుంది. దైవభక్తి పెరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో శని గ్రహబలం లోపించిన వారు మరియు వ్యక్తిగత జాతక రీత్యా ప్రతికూలమైన శని మహాదశ జరుగుతున్న వారు ఈ సంవత్సరం అంతా శని గ్రహ శాంతులు జరిపించుకోవడం మంచిది.
For Meena Rasi (Pisces) natives, the transit phase of Elinati Shani (Sade Sati) continues through Sri Plavanga Nama Samvatsaram, because of which expected results may not fully materialize throughout the year. Particularly, individuals whose personal natal horoscopes lack planetary strength for Saturn may experience a comfortable lifestyle eluding them. Stability in employment or career may be lacking, and proper decision-making regarding important life matters could prove challenging. Marital bliss may also see some strain or lack of harmony. Conversely, individuals having Saturn placed in a favorable position in their personal horoscopes will experience moderately favorable yoga results. For them, even if money does not stay retained in hand, earning and inflow of wealth will not cease. You will cultivate a peaceful, virtuous nature (Sattvika Tattva), and viewing everyone with an equal perspective will help you overcome several issues. Efforts made toward relocation or job transfer will bear fruit. You will engage in charitable acts and donations to uphold family prestige, and your devotion to God will increase. Those who lack Saturn's strength in their natal horoscopes or are undergoing an unfavorable Saturn Mahadasha/Antardasha are advised to perform remedial Shani Graha Shanti rituals throughout this year.
మీనరాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో రాహు గ్రహము అధికమైనటువంటి ధనాన్ని ఆర్జించే పరిస్థితులను కలుగచేస్తారు. దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ సంవత్సరం కొంత ఉపసమనాన్ని పొందుతారు. పరదేశ నివాసం చేస్తున్నవారు లేదా విదేశాలకు వెళ్లి ధనార్జన చేయాలనే తపన కలిగిన వారు ఈ సంవత్సరము రాహు గ్రహ అనుకూలత వల్ల లాభపడతారు. మానసికంగా మీ యొక్క ధైర్య సాహసాలు అధికమవుతాయి. పాత ఇనుము లేదా ఇతర లోహ సంబంధ వ్యాపారాలు చేయు వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషము లేదా రాహు గ్రహబలము లేనివారు తక్కువ అనుకూలత కలిగిన ఫలితాలను పొందుతారు.
For Meena Rasi (Pisces) natives, Rahu will bestow highly favorable results throughout Sri Plavanga Nama Samvatsaram. Particularly in financial matters, Rahu creates conditions that enable substantial earnings and wealth creation. Individuals suffering from long-term health ailments will experience significant relief this year. Those living abroad or aspiring to travel overseas to earn wealth will benefit greatly from Rahu's favorable positioning. Mentally, your courage and valor will increase. Businesses related to scrap iron, metals, or hardware will prove highly lucrative this year. However, individuals whose personal natal charts contain Kalasarpa Dosha or lack Rahu's planetary strength will experience relatively reduced benefits.
మీనరాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. గణిత సంబంధమైనటువంటి విద్యాభ్యాసం చేస్తున్న వారికి బాగా కలిసి వస్తుంది. మీరు ఆశిస్తున్నటువంటి అవకాశాలు లభించడం వలన జీవితంలో ఎదుగుదలను అనుభవిస్తారు. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషము లేదా కేతు గ్రహ బలము లోపించిన వారు మాత్రం శ్రీ ప్లవంగనామ సంవత్సరంలో తండ్రి గారితో లేదా పితృ వర్గయులతో విభేదాలను ఎదుర్కొంటారు. సంతాన సంబంధ విషయాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలను గర్భ సంబంధమైన వ్యాధులు బాధిస్తాయి. తరచుగా గృహంలో మానసిక విచారతను కలగచేసే విధంగా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ప్రతికూల ఫలితాలు యొక్క తీవ్రతను బట్టి మీన రాశి వారు ఈ సంవత్సరం అంతా కేతు గ్రహ శాంతులు జరిపించుకోవడం మంచిది.
For Meena Rasi (Pisces) natives, Ketu will bestow very good and favorable results throughout Sri Plavanga Nama Samvatsaram. Students pursuing mathematics and related fields of education will see great success. You will experience progress and growth in life as expected opportunities present themselves. However, individuals whose personal natal charts contain Kalasarpa Dosha or lack Ketu's planetary strength will face disputes or disagreements with their father or paternal relatives during Sri Plavanga Nama Samvatsaram. Troubles or worries regarding progeny matters may arise. Women may suffer from health issues related to the reproductive system or uterus. Frequently, situations causing mental distress or grief at home may occur. Based on the intensity of these adverse outcomes, Meena Rasi natives are advised to perform remedial Ketu Graha Shanti rituals throughout this year.
మొత్తం మీద శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో మీనరాశి వారికి గురువు మరియు రాహువు వలన అనుకూల ఫలితాలు ఎదురగును. శని మరియు కేతు గ్రహాల వలన ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత జాతకంలో గురువు, శని, రాహువు మరియు కేతు గ్రహాలలో ఏ గ్రహం అయితే అధిక బలంతో ఉంటుందో ఆ గ్రహ ఫలితాలే ఈ సంవత్సరం అంతా ప్రస్పుటంగా ప్రతిఫలిస్థాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతికూల ఫలితాల వలన అధైర్య పడకండి. మీ వ్యక్తిగత జాతకంలో ప్రతికూల ఫలితాలకు కారణమైన గ్రహం బలమైన స్థానంలో అనుకూలంగా ఉంటే ప్రతికూల ఫలితాల తీవ్రత తగ్గుతుంది.
Overall, during Sri Plavanga Nama Samvatsaram, Meena Rasi (Pisces) natives will experience favorable results due to Jupiter (Guru) and Rahu, while encountering adverse outcomes on account of Saturn (Shani) and Ketu. Whichever among Jupiter, Saturn, Rahu, and Ketu holds maximum strength in your personal natal horoscope will predominantly shape your life outcomes throughout this year. Do not lose courage over the negative impacts mentioned here; if the planet responsible for adverse transits occupies a strong and favorable position in your natal chart, the intensity of those unfavorable results will be significantly diminished.
నెలవారీ రాశీ ఫలితాలను మరియు ముఖ్య పర్వదినాల వివరాలను క్రింద పొందగలరు...You can find the details of monthly horoscope predictions and important festival dates below...
ఈ మాసం సంతోషకరమైన ఫలితాలను ఏర్పరచును. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు విహార యాత్రల ప్రణాళికలు రచించడానికి ఈ మాసం అనుకూలమైనది. ఈ మాసంలో ఆశించిన ధనాదాయం లభించును. కోరుకున్న విధంగా శత్రు విజయం ప్రాప్తిస్తుంది. ద్వితీయ మరియు తృతీయ వారాలు కార్య విజయాలు కలుగచేయును. అయితే సంసార సంబంధమైన సంతోషాలు మాత్రం లోపించును. జీవిత భాగస్వామి తో మాట కలయికలో తరచుగా ఇబ్బందులు ఎదురగును. వ్యాపార జీవనంలో దీర్ఘకాలికంగా పరిష్కారం పొందని తగాదాలు ఈ మాసంలో శుక్ర గ్రహ బలం వలన పరిష్కారం పొందును. ప్రభుత్వ సంబంధ అనుమతులకు సంబంధించిన వ్యవహారములు విజయవంతం అవుతాయి. రేవతి నక్షత్ర జాతకులు ఈ మాసంలో మంచి యోగం అనుభవించి తాము అనుకున్న స్థాయిని సాధించగలరు. ఇళ్ళు మారుట కూడా జరగవచ్చును. మిత్రులతో ఉన్న అపార్ధములు తొలగిపోవును. ఈ మాసంలో 6, 8, 11, 21, 26 తేదీలు వ్యాపార సంబంధ ప్రయత్నాలకు కార్యానుకులత కలిగించును.
In April 2027, Meena Rasi (Pisces) natives will experience joyful and fulfilling results. This month is particularly favorable for individuals born under the Uttarabhadra nakshatra to plan recreational trips and vacations. Expected financial income will be realized, and you will achieve desired victories over opponents and rivals. The second and third weeks will bring success across all your undertakings. However, marital and family happiness may face some strain, leading to frequent communication friction or misunderstandings with your spouse. In business life, long-standing disputes and unresolved issues will find solutions during this month, thanks to the beneficial influence of Venus. Matters pertaining to government approvals and sanctions will proceed smoothly to successful completion. Natives born under the Revati nakshatra will enjoy excellent fortune and reach their intended milestones. Relocation or shifting of residence may also take place. Misunderstandings with friends will be cleared up. During this month, the 6th, 8th, 11th, 21st, and 26th dates will prove highly opportunistic and fruitful for business-related endeavors.
ఏప్రిల్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7 తేదీ శ్రీ ప్లవంగ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. 9వ తేదీ మత్స్య జయంతి మరియు సౌభాగ్య గౌరీ వ్రత దినం. 11వ తేదీ శ్రీ పంచమి. 15వ తేదీ శ్రీరామనవమి పర్వదినం. 16వ తేదీ ధర్మరాజ దశమి. 17వ తేదీ మతత్రయ ఏకాదశి మరియు వాడపల్లి తీర్థం. 19వ తేదీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి కల్యాణోత్సవం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం.
Key festivals and auspicious days in April 2027: The Sri Plavanga Nama Samvatsaram commences on the 7th (Ugadi). Matsya Jayanti and Saubhagya Gauri Vratam fall on the 9th. Sri Panchami is observed on the 11th. The grand festival of Sri Rama Navami is celebrated on the 15th, followed by Dharmaraja Dashami on the 16th. Matatraya Ekadashi and the Vadapalli Teertham take place on the 17th. The celestial wedding (Kalyanotsavam) of Sri Kodandarama Swamy at Ontimitta is performed on the 19th. Sankashtahara Chaturthi Vratam falls on the 24th.
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. తృతీయ వారం ప్రారంభం వరకు మీనరాశి వారికి ప్రతికూలతలు అధికంగా ఎదురగును. అందువలన మీనరాశి వారు ఈ మాసంలో మిక్కిలి ఓర్పుతో వ్యవహరించాలి. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. యువత సుఖ వ్యాధుల వలన బాధపడే సూచనలు అధికంగా ఉన్నాయి. ఆలోచనలు అధికం అగుట వలన మానసిక ప్రశాంతత లేక సతమతమవుతారు. చేసిన తప్పులను ఒప్పుకొని మీ ఇష్ట దైవాన్ని మనస్పూర్తిగా క్షమాపణ కోరుట వలన సంకల్పములు నెరవేరును. ఈ మాసంలో బంధు వర్గం వారితో జాగ్రత్త అవసరం. మొత్తం మీద ఈ మాసం మీనరాశి వారికి అంత ఉత్సాహపూరిత కాలం కాదు. ముఖ్యంగా యువత తాము చేస్తున్న పనుల విషయంలో మరియు తమ కుటుంబ భాద్యతల విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన परिस्थितियों ఎదురగును.
In May 2027, Meena Rasi (Pisces) natives will experience mixed results. Adverse situations will remain prominent until the beginning of the third week; hence, you must act with utmost patience throughout this period. Financial income will remain average during this month. Youth are particularly susceptible to health complications related to venereal or communicable diseases. Excessive overthinking will cause mental anxiety and disturb your peace of mind. Acknowledging past mistakes and seeking heartfelt forgiveness from your tutelary deity (Ishta Devata) will help fulfill your intentions and desires. Caution is required when dealing with relatives during this month. Overall, this month is not an overly enthusiastic period for Meena Rasi natives. Young individuals, in particular, will face situations that demand introspection regarding their ongoing activities and family responsibilities.
మే 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ వరూధిని ఏకాదశి. 4వ తేదీ మాస శివరాత్రి మరియు ఈ రోజు నుండి వాస్తు కర్తరి ప్రారంభం అవుతుంది. వాస్తు కర్తరి మే 30వ తేదీన ముగుస్తుంది. 7వ తేదీ వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. 9వ తేదీ అక్షయ తృతీయ మరియు పరశురామ జయంతి మరియు సింహాచల శ్రీ అప్పన్న స్వామి చందనోత్సవ దినం. 15వ తేదీ శ్రీ వాసవి అమ్మ వారి జయంతి. 16వ తేదీ సర్వ ఏకాదశి దినం మరియు అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణోత్సవ పర్వ దినం. 18వ తేదీ నృసింహ జయంతి. 20వ తేదీ శ్రీ అన్నమాచార్య జయంతి మరియు బుద్ధ పౌర్ణమి మరియు మహా వైశాకి పర్వదినం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 25వ తేదీ రోహిణి కార్తె ప్రారంభ దినం. 30వ తేదీ శ్రీ హనుమాన్ జయంతి.
Key festivals and auspicious days in May 2027: Varudhini Ekadashi falls on the 2nd. Masa Shivaratri and the commencement of Vastu Kartari take place on the 4th (with Vastu Kartari concluding on May 30th). The sacred Vaishakha Masa begins on the 7th. Akshaya Tritiya, Parashurama Jayanti, and the grand Chandanotsavam of Sri Appanna Swamy at Simhachalam take place on the 9th. Sri Vasavi Ammavari Jayanti is observed on the 15th. Sarva Ekadashi and the celestial wedding (Kalyanotsavam) of Sri Satyadeva Swamy at Annavaram fall on the 16th. Nrusimha Jayanti is celebrated on the 18th. Sri Annamacharya Jayanti, Buddha Purnima, and Maha Vaishaki fall on the 20th. Sankashtahara Chaturthi Vratam falls on the 24th. The Rohini Karte period begins on the 25th, and Sri Hanuman Jayanti is celebrated on the 30th.
ఈ మాసం కూడా మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఉద్యోగ జీవన పరమైన భయం వెంటాడును. మధ్య వయస్సు వారికి ఆఖస్మిక అనారోగ్య సమస్యలు ఎదురగుట బాధించును. మానసిక తొందరపాటుతనం వలన అనవసర విషయాలలో తలదూర్చి అపవాదులు ఎదుర్కొంటారు. పై అధికారుల వలన పని ఒత్తిడికి సంబందించిన ఇబ్బందులు చికాకు పరచును. తలపెట్టిన పనులలో అనేక అడ్డంకులు ఎదురగును. కానీ ప్రయత్నాలు కొనసాగించండి. మీ వ్యక్తిగత అవసరాలు వాయిదా వేసుకొనుట మంచిది. కుటుంబ ఖర్చులు అదుపు లోనే ఉండును. ఈ మాసం తృతీయ వారంలో ప్రయాణాల వల్ల నష్టము మరియు ప్రమాదములు సంభవించును. నాల్గవ వారంలో సంతాన సంబంధ ప్రయత్నాలు ఫలించును. ఆత్మీయులతో కలయికలు మానసిక నిరుత్సాహాన్ని దూరం చేయును.
In June 2027, Meena Rasi (Pisces) natives will continue to experience mixed results. Anxiety and fears regarding professional career and employment will linger. Middle-aged individuals may be distressed by sudden and unexpected health complications. Due to mental impatience, you may meddle in unnecessary matters and face unwarranted blame or accusations. Heavy work pressure imposed by superior officers will cause irritation. Numerous hurdles will arise in your planned endeavors, but you are advised to keep persevering. It is best to postpone addressing your personal needs for now. Household expenses will remain under control. Travels undertaken during the third week of this month may lead to losses or accident risks; hence, utmost caution is required. In the fourth week, efforts toward progeny or family planning will prove successful. Reunions and interactions with dear ones will help banish mental depression and low spirits.
జూన్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ మతత్రయ ఏకాదశి. 3వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. 6వ తేదీ బుద్ధ జయంతి. 13వ తేదీ దశ పాప హర దశమి. 14వ తేదీ నిర్జల ఏకాదశి మరియు స్మార్త ఏకాదశి. 18వ తేదీ ఏరువాక పూర్ణిమ మరియు వట సావిత్రి వ్రత దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీన పవిత్ర గోదావరి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. జూలై 7వ తేదీతో గోదావరి నది ఆది పుష్కరాలు పూర్తి అవుతాయి. 30వ తేదీ సర్వ ఏకాదశి దినం.
Key festivals and auspicious days in June 2027: Matatraya Ekadashi falls on the 1st, followed by Masa Shivaratri on the 3rd. The sacred Jyeshtha Masa begins on the 5th. Buddha Jayanti is observed on the 6th. Dasha Papa Hara Dashami falls on the 13th. Nirjala Ekadashi and Smarta Ekadashi are observed on the 14th. Eruvaka Purnima and Vata Savitri Vratam take place on the 18th. Sankashtahara Chaturthi Vratam falls on the 22nd. The holy Godavari Nadi Pushkarams commence on the 26th (with the Godavari Nadi Aadi Pushkarams concluding on July 7th). Sarva Ekadashi falls on the 30th.
ఈ మాసం మీనరాశి వారికి అనుకూలంగా ఉండును. ఆశించిన విధంగా చక్కటి ధనాదాయం లభిస్తుంది. తేలికగా ధనార్జన చేయగలుగుతారు. తలపెట్టిన కార్యములందు విజయాలు చేకురును. ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయము మరియు గురువుల దర్శన భాగ్యము పొందగలుగుతారు. పర స్త్రీ ప్రియత్వం వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. ప్రతీ పనియందు, ప్రతీ విషయములో పట్టుదల అధికం అవుతుంది. ఉద్యోగ జీవనంలో మీ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవ సత్కారములు పొందగలుగుతారు. వంశ పెద్దల ఆశీస్శులు లభిస్తాయి. కొద్దిపాటి విఘ్నములు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు నూతన పదవులు పొందగలుగుతారు. అయితే ఈ మాసంలో 22, 24 మరియు 25 తేదీలలో అశుభ వార్తలు వినుటకు అవకాశం కలదు. భవిష్యత్ గురించిన భయము, ఆందోళన ఏర్పడుటకు సూచనలు ఉన్నవి. కోర్టు వ్యవహారములలో అపజయములు ఎదురగు సూచన ఉన్నది.
In July 2027, Meena Rasi (Pisces) natives will experience favorable results. Financial income will remain strong and yield expected returns, enabling you to earn money with relative ease. Success will crown your efforts across all planned endeavors. On a spiritual level, you will gain acquaintances with distinguished personages and have the divine blessing of visiting revered gurus. However, attraction towards other women may lead to complications and troubles. Your determination and perseverance will increase in every task and matter. In your professional life, you will receive proper recognition, respect, and honors commensurate with your hard work. You will enjoy the blessings of family elders. Despite minor obstacles, government employees stand a good chance of securing new postings or promotions. However, during this month, the 22nd, 24th, and 25th dates carry the possibility of hearing disturbing or unfavorable news. Indications point to lingering anxieties and fear regarding the future. Additionally, legal matters or court proceedings may face setbacks or unfavorable outcomes.
జూలై 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి ఆషాడమాసం ప్రారంభమవుతుంది మరియు పూరి లోని శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఘనంగా జపరబడుతుంది. ఈ రోజు నుండి శుక్ర మూఢమి ప్రారంభమవుతుంది. శుక్ర మూఢమి 18 సెప్టెంబర్ 2027వ తేదీతో పూర్తి అవుతుంది. 14వ తేదీ తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి మరియు చాతుర్మాస వ్రత ఆరంభ దినం. 17వ తేదీ నుండి దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది.18వ తేదీ గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 29వ తేదీ సర్వ ఏకాదశి దినం. 31వ తేదీ మాస శివరాత్రి మరియు శని త్రయోదశి.
Key festivals and auspicious days in July 2027: Masa Shivaratri falls on the 2nd. The sacred Ashadha Masa begins on the 5th, marked by the grand celebration of the Sri Jagannatha Swamy Ratha Yatra in Puri. Shukra Mudhami also commences on this day and will continue until September 18, 2027. Toli Ekadashi (Sayana Ekadashi) and the initiation of the sacred Chaturmasya Vratam take place on the 14th. The period of Dakshinayanam begins on the 17th. Guru Purnima (Vyasa Purnima) is observed on the 18th. Sankashtahara Chaturthi Vratam falls on the 22nd. Sarva Ekadashi is observed on the 29th. Masa Shivaratri and Shani Trayodashi fall on the 31st.
ఈ మాసంలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొనుట మంచిది కాదు. మీ గౌరవ ప్రధమైన జీవితంలో ఒడిదుడుకులు ఎదురగును. ఈ మాసంలో మీనరాశి వారికి ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఈ మాసం ద్వితియ వారంలో పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు చేయు ప్రయాణములు ఫలించును. విదేశీ జీవన పరమైన పరీక్షలు లేదా ఇంటర్వ్యూ లు ఎదుర్కోను వారికి విజయం లభిస్తుంది. మీరు ఆశించిన పరదేశ జీవనం లేదా విదేశీ ఉద్యోగం పొందగలుగుతారు. మీనరాశి వారికి ఈ మాసం తృతీయ వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. ప్రేమ వ్యవహారములు ఇబ్బందులు ఎదుర్కొనును. మాసాంతంలో వ్యాపార వర్గం వారికి చక్కటి వ్యాపార లాభములు ప్రాప్తిస్తాయి. సర్వ జనులతో స్నేహంగా ఉండు స్వభావం వలన లాభ పడుదురు. ఈ మాసంలో 4,6,10,15,18,22, తేదీలు మీనరాశి వారికి అనుకూలమైనవి కావు. ఈ మాసంలో తమ వ్యక్తిగత జాతకంలో అనుకూలమైన శుక్ర గ్రహ బలం కలిగి ఉన్న మీనరాశి వారు సౌఖర్యవంతమైన జీవనాన్ని , పెద్దల మన్ననలను , సుందరమైన వస్త్ర మరియు ఆభరణ లాభములను పొందుతారు.
In August 2027, it is advisable not to interfere in the affairs of others. Your reputable status in life may face some fluctuations and ups and downs. Financial income for Meena Rasi (Pisces) natives will remain average throughout this month. During the second week, travels undertaken by individuals born under the Purvabhadra nakshatra will prove successful. Those taking examinations or interviews related to overseas employment or foreign residence will achieve victory, securing their desired foreign job or lifestyle. The third week will deliver average results for Meena Rasi natives, and romantic affairs may encounter difficulties or complications. By the end of the month, the business community will reap excellent profits. Your nature of maintaining friendly relations with all people will prove advantageous. During this month, the 4th, 6th, 10th, 15th, 18th, and 22nd dates are not favorable for Meena Rasi natives. Individuals who possess strong and favorable Venus (Shukra) placement in their natal charts will enjoy a comfortable lifestyle, receive accolades from elders, and acquire beautiful apparel and ornaments.
ఆగష్టు 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాన్ని పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు మరియు కర్కాటక రాశికి చెందినవారు చూడకూడదు. పుష్యమి నక్షత్ర జాతకులు మరియు కర్కాటక రాశికి చెందిన జాతకులు గ్రహ శాంతులు జరిపించుకోవాలి. ఈ పాక్షిక సూర్యగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు పూర్తి అవుతుంది. ఆగష్టు 3వ తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. 6వ తేదీ గరుడ పంచమి. 13వ తేదీ శ్రీ వరలక్ష్మీ దేవి వ్రత దినం. 14వ తేదీ శని త్రయోదశి. 15వ తేదీ నుండి గురు మూడమి కాలం ప్రారంభమవుతుంది. ఈ గురు మూడమి 16 సెప్టెంబర్ 2027 వ తేదీన ముగుస్తుంది. 17వ తేదీ శ్రావణ మాస పౌర్ణమి మరియు రాఖీ పండుగ. 20వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి. 28వ తేదీ మతత్రయ ఏకాదశి. 30వ తేదీ మాస శివరాత్రి. 31వ తేదీ పొలాల అమావాస్య పర్వదినం.
Key festivals and auspicious days in August 2027: A Partial Solar Eclipse (Pakshika Surya Grahanam) occurs on the 2nd. Individuals born under the Pushyami nakshatra and Karkataka Rasi (Cancer) should not view this eclipse and are advised to perform remedial eclipse Shanti rituals. This partial solar eclipse begins at 3:58 PM and concludes at 5:40 PM. The auspicious Shravana Masa begins on August 3rd. Garuda Panchami is observed on the 6th. The sacred Sri Varalakshmi Vratam falls on the 13th, followed by Shani Trayodashi on the 14th. Guru Mudhami commences on the 15th and continues until September 16, 2027. Shravana Purnima and the festival of Rakhi (Raksha Bandhan) take place on the 17th. Sankashtahara Chaturthi Vratam falls on the 20th. Sri Krishna Janmashtami is celebrated on the 24th. Matatraya Ekadashi is observed on the 28th. Masa Shivaratri falls on the 30th, followed by Polala Amavasya on the 31st.
ఈ మాసంలో మీ సొంత గృహ సంబంధ ప్రణాళికలు కార్యరూపం దాల్చును. ఆప్త మిత్రులతో చిన్నపాటి కలహం ఏర్పడుతుంది. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి న్యాయబద్ధమైన ధనార్జన ఏర్పరచు ఉద్యోగ జీవనం ఆరంభం అగును. ఆఖస్మికంగా ఉద్యోగ జీవన నష్టములు పొందిన వారికి ఈ మాసంలో తిరిగి ఉద్యోగ జీవనం ప్రారంభం అవుతుంది. వృత్తి వ్యాపారములు విజయవంతంగా కొనసాగును. ఈ మాసంలో అవివాహితుల వివాహ సంబంధ చర్చలు సఫలమగుటకు చాలా కష్ట పడవలసి వస్తుంది. ఈ మాసంలో 7,8,9,10 తేదీలలో భూ లేదా గృహ సంబంధ మార్పులు లేదా నూతన వ్యాపార సంబంధ పెట్టుబడులు పెట్టుట లాభించును. ఈ మాసంలో నేత్రములు లేదా మూత్రాశయ సంభందిత ఆరోగ్య సమస్యలు బాధించును. ఈ మాసంలో మీనరాశి వారు ఒక పర్యాయం సోమవారం నాడు 1250 గ్రాముల బియ్యం బ్రాహ్మణులకు దానం ఇచ్చుట మంచిది.
In September 2027, plans regarding your own house or residential property will materialize into action. A minor conflict or disagreement may arise with close friends. Financial income will remain good during this month. For job seekers, a new professional career that yields lawful and righteous earnings will begin. Individuals who faced sudden job losses will be able to restart their professional careers during this month. Vocational occupations and businesses will proceed successfully. However, unmarried individuals will have to toil hard to bring marriage negotiations to successful completion. During this month, making property or housing changes or investing in new business ventures on the 7th, 8th, 9th, and 10th dates will prove profitable. Health issues related to the eyes or urinary system may cause trouble during this month. As a remedial measure, Meena Rasi natives are advised to donate 1,250 grams (1.25 kg) of rice to a Brahmin on a Monday during this month.
సెప్టెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. 2వ తేదీ శ్రీ బలరామ జయంతి. 3వ తేదీ శ్రీ వరాహ జయంతి. 4వ తేదీ శ్రీ వినాయక చవితి. 5వ తేదీ ఋషి పంచమి దినం. 11వ తేదీ పరివర్తన ఏకాదశి పర్వదినం. 12వ తేదీ శ్రీ వామన జయంతి. 14వ తేదీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత దినం. 16వ తేదీ గురు మూడమీ పూర్తి అవుతుంది మరియు ఈ 16 వ తేదీ నుండి భాద్రపద మాస అమావాస్య వరకు అనగా 29వ తేదీ వరకు మహాలయ పక్షం జరుగుతుంది. 18వ తేదీన శుక్ర మూఢమి పూర్తి అవుతుంది. 19వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీ సర్వ ఏకాదశి దినం. 28వ తేదీ మాస శివరాత్రి. 29వ తేదీ మహాలయ అమావాస్య.
Key festivals and auspicious days in September 2027: The sacred Bhadrapada Masa begins on the 1st. Sri Balarama Jayanti is observed on the 2nd, followed by Sri Varaha Jayanti on the 3rd. The grand festival of Sri Vinayaka Chavithi (Ganesh Chaturthi) is celebrated on the 4th. Rishi Panchami falls on the 5th. Parivartana Ekadashi is observed on the 11th. Sri Vamana Jayanti falls on the 12th. Sri Ananta Padmanabha Swamy Vratam is performed on the 14th. Guru Mudhami concludes on the 16th, and the sacred Mahalaya Paksham period begins on this day, running through Bhadrapada Amavasya on the 29th. Shukra Mudhami concludes on the 18th. Sankashtahara Chaturthi Vratam falls on the 19th. Sarva Ekadashi is observed on the 26th. Masa Shivaratri falls on the 28th, followed by Mahalaya Amavasya on the 29th.
ఈ మాసం మీనరాశి వారికి అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. చక్కటి ధన లాభములు, సంతాన సౌఖ్యత, కామ సుఖము, మంచి ఆహార పానీయాల సేవనము చేయును. ఈ మాసం మీనరాశి వారికి చక్కటి మనఃశాంతి ని ప్రసాదిస్తుంది. వ్యక్తిగత జీవన సమస్యల నుండి బయట పడతారు. మాతృ వర్గం వారి వలన ఆశించిన ధన లాభములు పొందుతారు. మాసం మధ్యలో ఉష్ణ సంబంధమైన అనారోగ్యము చికాకు కలుగచేయును. ఈ మాసం అన్ని విధములా మీనరాశి వారికి యోగిస్తుంది. జీవిత అభివృద్ధికై మీరు చేసే ఆలోచనలు జయప్రదముగా కార్యరూపం దాల్చును. పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యం లభించును. వ్యక్తిగత జాతకం లో చంద్ర గ్రహ బలం లోపించిన వారికి మాత్రం ఈ మాసంలో పైన పేర్కొన్న ఫలితాలకు వ్యతిరేక ఫలితాలు ఏర్పడును.
In October 2027, Meena Rasi (Pisces) natives will enjoy highly favorable results. You will experience substantial financial gains, domestic happiness through children, conjugal bliss, and the enjoyment of fine food and comforts. This month bestows genuine peace of mind upon Meena Rasi natives, helping you break free from lingering personal issues. You will secure expected financial benefits through maternal relatives. Mid-month, minor heat-related health issues or ailments may cause brief annoyance. Overall, this month proves prosperous in every respect for Meena Rasi natives. Ideas and plans aimed at your career and personal growth will successfully materialize into action. You will also be blessed with opportunities to visit sacred pilgrimage sites (Punya Kshetrams). However, individuals whose personal natal horoscopes lack planetary strength for the Moon (Chandra) will experience results contrary to the positive outcomes mentioned above.
అక్టోబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది మరియు అమ్మవారి పవిత్ర శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. నవరాత్రుల ప్రారంభ దినమైన ఈ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిని పూజించాలి. 2వ తేదీ శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని పూజించాలి. 3వ తేదీ శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారిని పూజించాలి. 4వ తేదీ శ్రీ మహా చండీ దేవి అమ్మ వారిని పూజించాలి. 5వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించాలి. 6వ తేదీ శ్రీ సరస్వతీ దేవి అమ్మవారిని పూజించాలి. 7వ తేదీ ఈ రోజు రెండు తిధుల సంధి ఏర్పడడం వలన ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించాలి మరియు ఈ రోజును దుర్గాష్టమి పర్వ దినంగా పరిగణించి శ్రీ దుర్గా దేవిని పూజించాలి. 8వ తేదీ మహానవమి పర్వదినం. ఈ రోజున శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారిని పూజించాలి. 9వ తేదీ విజయదశమి. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించాలి. ఈ రోజున మధ్యాహ్నం 1.40 నుండి మధ్యాహ్నం 2.38 గంటల మధ్య శమీ పూజను నిర్వహించాలి. 11వ తేదీ మతత్రయ ఏకాదశి. 18వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 28వ తేదీ నరక చతుర్దశి. 29వ తేదీ దీపావళి పర్వదినం. ఈ రోజునే ధనలక్ష్మి పూజ నిర్వహించాలి మరియు కేదార గౌరీ వ్రతం ఆచరించాలి. 30వ తేదీ బలి పాడ్యమి మరియు ఈ రోజు నుండే పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in October 2027: The sacred Ashwayuja Masa and the holy Sharad Navaratri festivities begin on the 1st.
The day-by-day worship of Goddess Durga during Navaratri is as follows:
Matatraya Ekadashi falls on the 11th. Sankashtahara Chaturthi Vratam is observed on the 18th. Naraka Chaturdashi falls on the 28th. The grand festival of Deepavali is celebrated on the 29th, along with Dhanalakshmi Puja and Kedara Gauri Vratam. Bali Padyami takes place on the 30th, marking the commencement of the holy Karthika Masa.
ఈ మాసం కూడా మీనరాశి వారికి చక్కటి ఫలితాలను కలిగించును. నిత్య జీవితంలో ఎదురవుతున్న అవాంతరములు , ఇబ్బందులు తొలగిపోవును. ఉద్యోగ జీవనంలోని వారికి ఆశించిన విధంగా పదోన్నతి లేదా ఆదాయంలో పెరుగుదల లభిస్తుంది. మీరు రచించుకుంటున్న ఆర్ధిక ప్రణాళికలు చక్కగా ముందుకు సాగుతాయి. ఈ మాసంలో జీవిత భాగస్వామితో కుటుంబ నిర్వహణ పరమైన విషయాలలో విభేదాలు ఎదురగుట వలన కొద్దిపాటి మానసిక అశాంతి ఎదురగు సూచన్ ఉన్నది. సొంత మనుష్యుల వలననే మీకు మీ జీవిత భాగస్వామి కి మధ్య దూరం పెరిగే అవకాశం ఉన్నది. కావునా జాగ్రత్త వహించాలి. విద్యార్ధులకు తమ భవిష్యత్ గురించిన అనవసర భయాందోళనలు తొలగిపోవును. ఈ మాసంలో 5,11, 12, 19, 25 మరియు 29 తేదీలు అనుకూలమైనవి.
In November 2027, Meena Rasi (Pisces) natives will continue to enjoy very good results. Obstacles and difficulties encountered in daily life will clear away. In professional life, employed individuals will secure expected promotions or salary hikes. Your financial plans and strategies will progress smoothly. However, minor mental anxiety may arise due to differences of opinion with your spouse regarding household management. There is a possibility of distances growing between you and your spouse due to the interference of close relatives or family members; hence, exercise caution and tact. For students, unwarranted fears and anxieties regarding their future will dissipate. During this month, the 5th, 11th, 12th, 19th, 25th, and 29th dates will prove favorable and opportunistic.
నవంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ నాగుల చవితి. 11వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి మరియు ఈ రోజున చాతుర్మాస వ్రతం పూర్తి అవుతుంది. 13వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినం ఈ రోజునే జ్వాలాతోరణం నిర్వహించాలి. 17వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ మతత్రయ ఏకాదశి దినం. 26వ తేదీ మాస శివరాత్రి మరియు ధన్వంతరి జయంతి. 29వ తేదీ నుండి మార్గశీర్ష మాసము ప్రారంభం అవుతుంది.
Key festivals and auspicious days in November 2027: Nagula Chavithi is observed on the 2nd. Kshirabdi Dwadashi falls on the 11th, marking the conclusion of the sacred Chaturmasya Vratam. The grand festival of Karthika Purnima takes place on the 13th, during which Jwala Toranam is performed in the evening. Sankashtahara Chaturthi Vratam falls on the 17th. Matatraya Ekadashi is observed on the 24th. Masa Shivaratri and Dhanvantari Jayanti fall on the 26th. The sacred Margashirsha Masa begins on the 29th.
ఈ మాసంలో మీనరాశి వారు 6 వ తేదీ తదుపరి అతి చక్కటి లాభకరమైన ఫలితాలు పొందుతారు. గత కాలంలో నిలిచిన వ్యాపార వృత్తులు తిరిగి ప్రారంభమగును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లేదా ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలించును. వివాహ సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడును. ఈ మాసంలో ప్రారంభించిన నూతన వృత్తి వ్యాపారములు బాగా లాభించును. పితృ వర్గం నుండి మీరు ఆశించిన వారసత్వ సంబంధమైన ఆర్ధిక సహకారం లభించును. గృహంలో నూతన వస్తువుల అమరిక లేదా నూతన వాహన సౌఖ్యం ప్రాప్తిస్తుంది. కుటుంబ సభ్యుల విషయంలో శుభ కార్య సంబంధ వ్యయం చేసి చక్కటి పేరు గడిస్తారు. మాసాంతానికి కుటుంబం లో సంపూర్ణ గృహ సంతోషాలు ఏర్పడతాయి.
From the 6th onwards during this month, Meena Rasi (Pisces) natives will experience highly lucrative and advantageous results. Businesses or vocational activities that were stalled in the past will resume operations. Efforts made toward securing new employment or career changes will yield success. Favorable developments will occur regarding marriage proposals and marital affairs. New business ventures or occupations initiated during this month will prove immensely profitable. You will receive expected ancestral financial support from your paternal lineage. You will acquire new household items or enjoy the comfort of purchasing a new vehicle. By spending on auspicious family events and ceremonies, you will earn a good reputation. Towards the end of the month, complete domestic happiness and harmony will prevail within the family.
డిసెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 4వ తేదీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి. 9వ తేదీ సర్వ ఏకాదశి మరియు గీతా జయంతి. 11వ తేదీ శని త్రయోదశి. 13వ తేదీ శ్రీ దత్తాత్రేయ జయంతి. 16వ తేదీ సంకష్టహర చతుర్ధి వ్రత దినం. 20వ తేదీ శ్రీ కాలభైరవ అష్టమి. 23వ తేదీ సర్వ ఏకాదశి. 25వ తేదీ శని త్రయోదశి. 26వ తేదీ మాస శివరాత్రి. 28వ తేదీ నుండి పుష్య మాసం ప్రారంభం అవుతుంది.
Key festivals and auspicious days in December 2027: Sri Subramanyeshwara Swamy Shashti is celebrated on the 4th. Sarva Ekadashi and Gita Jayanti fall on the 9th. Shani Trayodashi is observed on the 11th. Sri Dattatreya Jayanti is celebrated on the 13th. Sankashtahara Chaturthi Vratam falls on the 16th. Sri Kala Bhairava Ashtami is observed on the 20th. Sarva Ekadashi falls on the 23rd, followed by Shani Trayodashi on the 25th. Masa Shivaratri falls on the 26th. The sacred Pushya Masa begins on the 28th.
ఈ మాసం కూడా మీనరాశి వారికి అనుకూల వాతావరణం ఏర్పరచును. అన్ని వర్గాల వారు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. మహిళలు తమ చక్కటి వ్యవహార దక్షతతో ఒక పెద్ద సమస్య నుండి బయట పడతారు. భాత్రు వర్గంతో మీ బంధం బలపడుతుంది. చక్కటి అవగాహన ఏర్పడుతుంది. ఈ మాసంలో ధనానికి ఇబ్బంది ఉండదు. పెద్ద వయస్సు వారు ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు. చివరి నిమిషంలో ప్రాణ గండముల నుండి బయట పడతారు. విద్యార్దులుకు ముఖ్యంగా విదేశీ ప్రయత్నములు చేయువారికి, స్థాన చలనము నకు ప్రయత్నించు వారికి ఈ మాసం శుభకరంగా ఉంటుంది. మనోవంచా ఫలసిద్ధి ఏర్పడుతుంది. మీ కుటుంబంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ప్రతీ పనిలో అనుకూలత , స్నేహ వర్గం వలన లాభం , శుభకార్యములలో పాల్గొనుట వలన మీనరాశి వారు ఈ మాసంలో మానసికంగా చక్కటి ఆహ్లాదకర వాతావరణాన్ని అనుభవిస్తారు.
In January 2028, Meena Rasi (Pisces) natives will continue to enjoy a favorable and conducive environment. People across all walks of life will receive rewards commensurate with their hard work. Women will successfully navigate out of a major problem through their keen diplomacy and management skills. Your bond with siblings will strengthen, leading to excellent mutual understanding. There will be no scarcity of money or financial strain during this month. Elderly individuals will recover from health ailments and narrowly escape life-threatening crises at the last moment. For students—especially those applying for foreign education or seeking a change of place—this month will prove highly auspicious, fulfilling their heart's desires. Your stature and reputation within the family will grow. With favorable outcomes in every task, profits through friends, and active participation in auspicious ceremonies, Meena Rasi natives will experience a thoroughly pleasant and cheerful mental atmosphere throughout this month.
జనవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 8వ తేదీ శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినం మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినం. 14వ తేదీ శుక్రవారం భోగి పండుగ. 15వ తేదీ శనివారం మకర సంక్రాంతి రోజున ఉదయం 9 గంటల 21 నిమిషాలకు గ్రహ రాజు శ్రీ సూర్య భగవానుల వారు మకర రాశిలోనికి ప్రవేశిస్తారు. ఈ క్షణం నుండి పవిత్ర ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. 16వ తేదీ ఆదివారం కనుమ పండుగ. 17వ తేదీ సోమవారం ముక్కనుమ పండుగ. 22వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 26వ తేదీ చొల్లంగి అమావాస్య. 27వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in January 2028: The holy festival of Sri Vaikuntha Ekadashi (Mukkoti Ekadashi) is observed on the 8th. Bhogi is celebrated on Friday, the 14th. On Saturday, the 15th, on the day of Makara Sankranti, the king of planets, Lord Surya Bhagavan, enters Makara Rasi (Capricorn) at 9:21 AM. The sacred period of Uttarayanam commences from this precise moment. Kanuma is celebrated on Sunday, the 16th, followed by Mukkanuma on Monday, the 17th. Sarva Ekadashi is observed on the 22nd. Masa Shivaratri falls on the 24th. Chollangi Amavasya takes place on the 26th. The sacred Magha Masa begins on the 27th.
ఈ మాసం కూడా మీనరాశి వారికి కలసి వచ్చును. ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఈ మాసంలో లాభపడతారు. వివాహ ప్రయత్నములు చేయువారికి, ధనం సర్దుబాటు కొరకు ప్రయత్నించు వారికి ఈ మాసం చక్కటి అనుకూల కాలం. ప్రభుత్వ ఉద్యోగ జీవనంలోని వారికి వాహనముద్రిదికార యోగం ప్రాప్తిస్తుంది. సమాజంలో అధికారం కలిగిన నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఈ మాసం మొత్తం మీనరాశి వారికి ధనాదాయం బాగుండును. గృహంలో నూతన వస్తువులను అమర్చుకుంటారు. ప్రేమవవహరాలు లేదా సహజీవన విధానాల వలన నష్టములు ఎదుర్కుంటారు. మానసికంగా ఆవేదన అనుభవిస్తారు. ఈ మాసంలో మీరు ప్రారంభించే పొదుపు పధకాలు లాభాలను కలుగచేస్తాయి. ఈ మాసంలో 5, 7, 13, 19 మరియు 22 తేదీలు అనుకూలమైనవి కావు.
In February 2028, Meena Rasi (Pisces) natives will continue to enjoy a favorable period. Individuals born under the Uttarabhadra nakshatra will particularly benefit during this month. It is a highly opportunistic time for those making marriage proposals or seeking financial arrangements and funds. Individuals working in government service will be blessed with official vehicle privileges and elevated authority. You will form new acquaintances with influential personages in society. Financial income will remain strong throughout the entire month for Meena Rasi natives. You will purchase and furnish your home with new utility items. However, romantic relationships or cohabitation arrangements may lead to losses, causing significant mental anguish and emotional distress. Savings schemes and investment plans initiated during this month will yield good returns. During this month, the 5th, 7th, 13th, 19th, and 22nd dates are not favorable.
ఫెబ్రవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 3వ తేదీ రథసప్తమి పర్వదినం మరియు భీష్మాష్టమి పర్వదినం. 7వ తేదీ భీష్మ ఏకాదశి పర్వదినం మరియు అంతర్వేది తీర్థం. 13వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 21వ తేదీ మతత్రయ ఏకాదశి. 23వ తేదీ పవిత్ర మహా శివరాత్రి పర్వదినం. 26వ తేదీ నుండి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in February 2028: Ratha Saptami and Bhishma Ashtami fall on the 3rd. Bhishma Ekadashi and the famous Antarvedi Teertham are observed on the 7th. Sankashtahara Chaturthi Vratam is observed on the 13th. Matatraya Ekadashi falls on the 21st. The holy festival of Maha Shivaratri is celebrated on the 23rd. The sacred Phalguna Masa commences on the 26th.
ఈ మాసంలో ప్రధమ వారం సామాన్య ఫలితాలను ఏర్పరచును. ద్వితియ వారంలో ఊహించని విధంగా అపవాదులు ఎదుర్కొనవలసి వస్తుంది. అకారణంగా మాటపడుట మిమ్మల్ని తీవ్రంగా భాదిస్తుంది. ఈ మాసంలో ఆదాయ వ్యయములు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహార చిక్కుల వలన కొన్ని కార్యములను మధ్యలోనే విడిచిపెట్టుట చేస్తారు. మాసాంతంలో చక్కటి కుటుంబ సంతోషాలు అనుభవిస్తారు. ఈ మాసంలో 11,12,13 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ తేదీలలో ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది.
In March 2028, the first week will bring average results for Meena Rasi (Pisces) natives. During the second week, you may unexpectedly face unwarranted blame or accusations. Being criticized without cause will cause significant distress. Financial income and expenditure will remain satisfactory throughout the month. Due to procedural or administrative complications, you may have to abandon certain tasks mid-way. By the end of the month, you will enjoy fine domestic happiness and joyous moments with your family. During this month, the 11th, 12th, and 13th dates are not favorable. It is advisable to postpone taking any major or critical decisions on these specific days.
మార్చి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7వ తేదీ సర్వ ఏకాదశి. 9వ తేదీ కామ దహన దినం. 10 వ తేదీ హోలీ పండుగ. 21వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 27వ తేదీ ఉగాది. ఈ రోజు నుండి నుండి శ్రీ కీలక నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in March 2028: Sarva Ekadashi falls on the 7th. Kama Dahana is observed on the 9th, followed by the festival of Holi on the 10th. Sarva Ekadashi falls again on the 21st. Masa Shivaratri is observed on the 24th. The grand festival of Ugadi is celebrated on the 27th, marking the divine commencement of the new Sri Keelaka Nama Samvatsaram.
రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.
Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
Oursubhakaryam.com's Official YouTube Channel - WhatsApp Channel - Instagram - Facebook - Telegram - Contact Us
Connect on WhatsAppWe offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.