Placeholder image

2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృషభరాశి రాశీ ఫలాలు

Sree Plava Nama Samvatsara Vrushabha Rasi / Taurus Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృషభ రాశి వార్కి ఆదాయం - 02 వ్యయం - 08 రాజపూజ్యం - 07 అవమానం - 03.
  • పూర్వ పద్దతిలో వృషభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి తలపెట్టిన కార్యములలో విజయాన్ని సూచించుచున్నది. 

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know nature of Vrushbha Rasi / Taurus Sign...

వృషభరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరం అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 19-నవంబర్-2021 వరకు తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. ముఖ్యంగా శారీరక సమస్యలు తరచుగా బాధించును. జీవితంలో అనుభవిస్తున్న యోగం చెడిపోవును. చేజేతులారా తప్పులు చేసి నష్టాలు ఏర్పరచు కొందురు. ఏ ప్రయత్నం కూడా మానసికంగా సంతృప్తిని కలుగ చేయదు. నూతన భారీ పెట్టుబడులు 19-నవంబర్-2021 వరకు పెట్టకుండా ఉండటం మంచిది. 20-నవంబర్-2021 నుంచి వృషభ రాశి వారికి గురు గ్రహం యోగించును. ముఖ్యంగా వ్రుత్తి విద్యా కోర్సులు చదివిన వారికి అతి చక్కటి ఉద్యోగ అవకాశములు, స్వయం ఉపాధి చేయు వారికి విశేష ధనార్జన ఏర్పరచును. విద్యార్థులకు విశేష లాభ పూరిత సమయం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తీర్ధ యాత్రలు 20-నవంబర్-2021 తదుపరి పూర్తి చేయగలుగుతారు. ఆచార వంతమైన జీవితం ప్రారంభించడానికి ఈ కాలం అత్యంత అనుకూల కాలం. విడిచి పెట్టాలని అనుకున్న దురలవాట్లకు  దూరం కాగలుగుతారు. 

వృషభ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం గడిచిన శార్వరి నామ సంవత్సరం వలెనే  మంచి ఫలితాలను కలుగచేయును. నూతన వాహన కోరిక నెరవేరును. వారసత్వ సంపద లభించును. పనిచేస్తున్న రంగములలో మిక్కిలి పేరు ప్రతిష్టలు పొందగలరు. వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉన్న ఉద్యోగులకు పదవిలో  ఉన్నతి లభించును. ఆర్ధిక లక్ష్యాలను చేరుకొంటారు. వ్యక్తిగత జాతకంలో శని స్వక్షేత్రం లేదా ఉచ్చ స్థితి లేదా మూల త్రికోణము లో ఉన్న వారు సులువుగా విశేషమైన ధనార్జన చేయగలరు. ఇటువంటి జాతకులు తమ వంశానికి పేరు ప్రఖ్యాతలు వచ్చు సత్కార్యములు చేయుదురు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో  వృషభ రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.

వృషభ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువు ల వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఏర్పరచును. కోరుకున్న విధంగా స్థాన చలనం ఏర్పరచును. పితృ వర్గీయులతో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగును. అయితే శారీరక అనారోగ్యం, వైవాహిక జీవనంలో తీవ్ర గొడవలు, వివాహ ప్రయత్నాలు చేయువారికి ఆటంకాలు ఏర్పరచును.  

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust..

© All rights reserved with oursubhakaryam.com.