Placeholder image

2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృచ్చికరాశి రాశీ ఫలాలు

Sree Plava Nama Samvatsara Vrucchika Rasi / Scorpio Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయం 08, వ్యయం - 14, రాజ పూజ్యం - 04, అవమానం - 05

  • పూర్వ పద్దతి లో వృచ్చిక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "5". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో  వృచ్చిక  రాశి వారికి సమాజం లో అపవాదులు, అపఖ్యాతి పొందుట సూచించుచున్నది. 

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Vrucchika Rasi / Scorpion Sign's Nature.....

వృచ్చికరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన ప్రధమ అర్ధ భాగం అనగా 19 నవంబర్ 2021 వరకు తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. చేపట్టిన కార్యములలో అనేక ఆటంకాలు, ఊహించని నష్టములు ఎదుర్కొందురు. ఉద్యోగ జీవనంలో నిలకడ లోపించును. ఆర్ధిక అంశాలలో ఇతరులకు రుణాలు ఇచ్చుట, ఇతరుల రుణాలకు హామీలు ఉండుట చేయకూడదు. 20 నవంబర్ 2021 నుండి గురు గ్రహం అనుకూల ఫలితాలు ప్రసాదించును. విద్యార్ధులకు విదేశీ విద్యలో ఆశించిన ఫలితాలు లభించును. కుటుంబానికి భూ లేదా గృహ వసతిని ఏర్పరచుకోగలుగుతారు.

వృచ్చిక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం వలన పూర్వపు శార్వరి నామ సంవత్సరం వలెనే సామాన్య యోగ వంతమైన ఫలితాలు ఏర్పడును. వృచ్చిక రాశి వారికి శనైశ్చరుడు లాభ వ్యయాలను సమానంగా ఏర్పరచును. శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా తీవ్ర వ్యతిరేక ఫలితాలు కాని, తీవ్ర అనుకూల ఫలితాలు కాని ఏర్పడవు. వృచ్చిక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. 

వృచ్చిక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన చక్కటి ఆర్ధిక లాభములు, వ్యాపార సంబంధ విజయాలు , ఆర్ధిక లావాదేవీలలో కోర్టు కేసులు అనుకూలంగా తీర్పులు లభించుట వంటి అనుకూల ఫలితాలు ఏర్పడును.  

వృచ్చిక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కష్టములు ఎదురగును. ముఖ్యంగా వైవాహిక జీవనంలో ఇబ్బందులు , నిత్య తగాదాలు ఎదురగును. అవివాహితుల వివాహ సంబంధ ప్రయత్నాలు కూడా కష్టం మీద ఫలించును. వైవాహిక జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృచ్చిక రాశి వారు తరచుగా కేతు గ్రహ శాంతులు జరిపించుకోనుట మంచిది. 

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.