Placeholder image

2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర తులారాశి రాశీ ఫలాలు

Sree Plava Nama Samvatsara Tula Rasi / Libra Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ ప్లవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఆదాయం 02, వ్యయం - 08, రాజ పూజ్యం - 01, అవమానం - 05

  • పూర్వ పద్దతి లో తులారాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి కళా రంగ విషయాల్లో , రాజకీయ రంగ విషయాల్లో విజయాన్ని సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Tula Rasi / Libra Sign's nature....

తులారాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. 19 నవంబర్ 2021 వరకూ శత్రు విజయాలను ఏర్పరచును. సొంత గృహ యోగం కలుగ చేయును. భూ సంబంధ క్రయ విక్రయాలకు అనుకూలమైన కాలం. మాత్రు వర్గీయుల వలన ఆర్థికం గా లాభములు పొందుదురు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించును.  20 నవంబర్ 2021 నుండి గురువు వలన తులారాశి వారికి అంత అనుకూల ఫలితాలు లభించవు. అనవసర తగాదాలు, ఆరోగ్య సమస్యలు, వృధా ధన వ్యయం, షేర్ మార్కెట్ లేదా  వ్యాపార పెట్టుబడుల్లో నష్టాలు ఏర్పడును. 

తులా రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడును. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించును. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారు శని వలన మిక్కిలి లాభములు పొందుదురు. మొత్తం మీద శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా శని తులారాశి వారికి చక్కటి అభివృద్ధి కర ఫలితాలు ఏర్పరచును.శ్రీ ప్లవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏలినాటి శని దశ లేదు. 

తులా రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువు ఇరువురూ వలన ఆర్థికం గా లాభములు ఏర్పడినా మిగిలిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు ఏర్పడవు. ముఖ్యంగా వ్యక్త్రి గత జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు , జీవిత భాగస్వామి సంబంధిత విచారత,  సంతాన ప్రయత్నాలు విఫలం మగును. ఎదిగిన సంతానం వ్యవహార శైలి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా రాహు - కేతువు లు యోగించరు. 

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.