Sree Plava Nama Samvatsara Midhuna Rasi / Gemini Sign Free Telugu Rasi Phalalu
2021- 2022 శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మిధున వారికి ఆదాయం - 05 వ్యయం - 05 రాజ పూజ్యం - 03 అవమానం - 06
పూర్వ పద్దతిలో మిధున రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి చేపట్టిన వ్రుత్తి సంబంధ కార్యములలో విజయాన్ని సూచించుచున్నది.
మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 19-నవంబర్-2021 వరకు అనేక ఆటంకాలు, ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టాలు, సంతాన సంబంధ అనారోగ్యత , దాయాదుల వలన న్యాయస్థాన సమస్యలు , రక్త లేదా మెదడు నరాలకు సంబందించిన ఆరోగ్య ప్రమాదాలు ఏర్పరచును. 20-నవంబర్-2021 నుంచి గురు గ్రహం మిధున రాశి వారికి పూర్తిగా అనుకూలించును. వారసత్వ సంబంధ సమస్యలు తొలగి స్థిరాస్తి లాభములు అనుభవింపచేయును. మిధున రాశి కి చెందిన సంతానం కలిగిన తల్లిదండ్రులు కూడా 20-నవంబర్-2021 తదుపరి మంచి ఫలితాలు ఎదుర్కొందురు. అన్ని విధములా గురు గ్రహం 20-నవంబర్-2021 నుండి అనుకూల ఫలితాలు ఏర్పరచును.
మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన అనుకూల ఫలితాలు ఏర్పడవు. ఆరోగ్య సమస్యలు కొనసాగును. వృద్ధులైన తల్లిదండ్రుల కు ఈ సంవత్సరం అంతా ప్రమాద కరమైన కాలం. వారి ఆరోగ్య విషయాల పట్ల సదా జాగ్రత్తగా ఉండవలెను. శనైశ్చరునికి ఒక పర్యాయం శాంతి జపం జరిపించుకోనుట మంచిది. మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువు వలన వ్యాపార సంబంధ, వివాహ సంబంధ న్యాయస్థాన తగాదాలలో విజయం లభింపచేయును. అయితే సంవత్సరం అంతా తరచుగా వృధా వ్యయం ఎదుర్కొందురు. ఆర్జించిన ధనం చేతిపై నిలువదు. అనుకున్న విధంగా నిలువ ధనం ఏర్పరచుకోలేరు. స్నేహితుల వలన ఆర్ధిక సంబంధ ఇబ్బందులు, నమ్మక ద్రోహం ఏర్పడును. భాగస్వామ్య వ్యాపారం చేసే వారు ఆర్ధిక అంశాలలో జాగ్రత్తగా ఉండవలెను.
రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.