Placeholder image

2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మీనరాశి రాశీ ఫలాలు

Sree Plava Nama Samvatsara Meena Rasi / Pisces Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం 11, వ్యయం - 05, రాజ పూజ్యం - 02, అవమానం - 04

  • పూర్వ పద్దతి లో మీన రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి వ్రుత్తి పరమైన జీవనంలో చక్కటి విజయం సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Meena Rasi / Pisces Sign's Nature....

మీనరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన ఈ  సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు ప్రతీ వ్యవహారం చికాకులతో పూర్తి అగును. అదృష్టం అంతగా కలసి రాదు. అయితే చక్కటి మిత్ర వర్గం మాత్రం లభించును. నూతన ఉన్నత వ్యక్తిత్వం కలిగిన  వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 20 నవంబర్ 2021 నుండి మీ చేతిపై ధర్మ కార్య సంబంధ వ్యయం తరచుగా ఏర్పడును. దీర్ఘ కాలికంగా ఎదురుచూస్తున్న విహార యాత్రలను అనుభవించ కలుగుతారు.  

మీన రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన  సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభించును. ఆర్ధికంగా విశేష యోగం అనుభవిస్తారు. శని వలన ఈ సంవత్సరం తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఏమి లేవు. మీనరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. 

మీన రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు కేతువుల వలన సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుర్భాగ్యములు , సంతోషములు ఏర్పడును. రాహు కేతువుల వలన అన్ని వర్గముల వారికి సుఖమయ జీవనం ఏర్పరచును. (వ్యక్తిగత జాతకంలో రాహు - కేతువులు నీచ క్షేత్రంలో ఉన్నవారు మాత్రం వ్యతిరేక ఫలితాలు పొందుతారు.)

మీ సంపూర్ణ వ్యక్తిగత జాతక ఫలితాలు...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.