Placeholder image

2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కుంభరాశి రాశీ ఫలాలు

Sree Plava Nama Samvatsara Kumbha Rasi / Aquarius Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం - 14, రాజ పూజ్యం - 06, అవమానం - 01

  • పూర్వ పద్దతి లో కుంభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "3". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎదురగు శారీరక మరియు మానసిక సమస్యలను సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Kumbha Rasi / Aquarius Sign's Nature...

కుంభరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది.  శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి గురు గ్రహం వలన ఈ  సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు సంతానం వలన లేదా సంతాన విషయ ములక సమస్యలు, భాత్రు వర్గం వలన ఇబ్బందులు, మానసిక చికాకులు, వృధాగా ధన వ్యయం వంటి వ్యతిరేక  ఫలితాలు ఏర్పడును. 20 నవంబర్ 2021 నుండి గురువు లగ్న స్థానములో ఉండుట వలన అతి చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. జీవన విధానంలో ఆశించిన ఉన్నతి పొందుతారు. ఉద్యోగ జీవనం లోని వారికి కోరుకున్న విధంగా అనుకూల మార్పులు లభిస్తాయి. శరీర బరువు అదుపులో పెట్టుకోవలెను. నరముల లేదా మెదడు సంబంధిత అనారోగ్యలతో బాధ పడుతున్నవారికి ఆరోగ్యం మెరుగు పడుతుంది. 

కుంభ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది. శనైచ్చరుడు వ్యయ స్థానంలో ఉండుట వలన సంవత్సరం అంతా యోగించడు. కుంభ రాశి వారు శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా వాహనాల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతా సుదూర ప్రయాణాలు చేయకుండా ఉండుట మంచిది. వ్యాపార రంగం లోని వారు నూతన భారీ పెట్టుబడులు పెట్టుట మంచిది కాదు. బంగారు ఆభరణాలపై ఋణాలు తీసుకొనుట కూడా మంచిది కాదు. వ్యయ స్థాన గతుడైన శని వలన వడ్డీల వలన భాదపడు సూచనలు అధికంగా ఉన్నవి. తరచుగా శనికి తైలభిషేకలు జరుపుట మంచిది. 

కుంభ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇరువురి వలన కుంభ రాశి వారందరూ చక్కటి అనుకూల ఫలితాలు లభించును. ముఖ్యంగా రాజకీయ రంగం లోని వారికి మిక్కిలి ప్రతిష్టాత్మక పదవులు లభింప చేయును. విద్యార్ధులకు కూడా ఆశించిన విధంగా ఉన్నత విద్యావకాశాలు లభింప చేయును. పర దేశ విద్యాలయలందు ప్రవేశం కోసం చేయు ప్రయత్నాలు లాభించును. 

 

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.