Placeholder image

2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనుర్రాశి రాశీ ఫలాలు

Sree Plava Nama Samvatsara Dhanur Rasi / Sagittarius Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం 11, వ్యయం - 05, రాజ పూజ్యం - 07, అవమానం - 05

  • పూర్వ పద్దతి లో ధనుర్ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి  వారికి యంత్ర సంబంధ వ్యాపార వ్యవహారములో విజయం పొందుట సూచించుచున్నది. 

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Dhanur Rasi / Sagittarius's Sign Nature...

ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది.  

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి గురు గ్రహం వలన అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. శారీరక శ్రమ పెరుగును. కుటుంబ జీవనంలో సుఖ లేమి ఎదుర్కొందురు. వృధా ప్రయాణాలు చేయవలసి వచ్చును లేదా చోరుల వలన ప్రయాణాలలో విలువైన వస్తువులు పోగొట్టు కొనుట లేదా ఆరోగ్య సమస్యలు పొందుట జరుగును. సొదరీ వర్గం వలన ప్రయోజనం పొందుతారు. వారి వలన కొన్ని కష్టాల నుండి బయట పడతారు.

ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ వలన పూర్వపు శార్వరి నామ సంవత్సరం వలెనే శనైచరుని వలన ఇబ్బందులు కొనసాగుతాయి. కష్టం మీద తలచిన విధంగా ధనాన్ని కూడబెట్టగలుగుతారు. మొదటి వివాహం నష్టపోయి , పునర్ వివాహ ప్రయత్నాలు చేయు వారికి ఈ ప్లవ నామ సంవత్సరం పునర్ వివాహ పరంగా అనుకూల ఫలితాలు ఏర్పరచును ధనుర్ రాశి వారు ఈ ప్లవ నామ సంవత్సరం అంతా ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించవలెను. తరచుగా ఏలినాటి శని ప్రతికూల ప్రభావ నిర్మూలన కోసం శని కి శాంతి జపములు చేయించుకొనుట మంచిది. 

ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇరువురూ సంవత్సరమంతా అనుకూల ఫలితాలనే ఏర్పరచును. వ్యక్తిగత జాతకంలో రాహు - కేతువులు ఉచ్చ లేదా స్వక్షేత్ర ములలో ఉన్న వారు సమాజంలో విశేష ఖ్యాతిని ఆర్జించెదరు. కోర్టు కేసులలో తీర్పులు  అనుకూలంగా లభించును. దేవాలయములు లేదా ధార్మిక కేంద్రాలను  నిర్మించుటలో పాత్ర వహిస్తారు.  

 

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.