Placeholder image

2020 - 2021 శ్రీ శార్వరి నామ సంవత్సర సింహరాశి రాశీ ఫలాలు

Sree Sarvari Nama Samvatsara Simha Rasi / Leo Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శార్వరి నామ సంవత్సరంలో సింహరాశి వారి ఆదాయం - 14 వ్యయం - 02 రాజపూజ్యం - 01 అవమానం - 07.
  • పూర్వ పద్దతిలో సింహ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది వ్యక్తిగత వ్యవహారాలలో విజయాన్ని సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Leo sign / Simha Rasi's Nature...

సింహరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో అనగా 25-మార్చి -2020 నుండి 12-ఏప్రిల్ -2021 వరకూ ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురు గ్రహం వలన అనేక కష్టములు ఏర్పడును. వ్యక్త్రిగత జాతకంలో రాశీ చక్రంలో గురు గ్రహం నీచ స్థానంలో ఉన్న కర్కాటక రాశి వారికి అన్ని విషయములలో ఇబ్బందులను, ఆర్ధిక నష్టములను, కుటుంబ సమస్యలను ఏర్పరచును. 20 నవంబర్ 2020 నుండి సమస్యలు అధికం అగును. శ్రీ శార్వరి నామ సంవత్సరం అంతా గురువు సింహరాశి వారికి యోగించడు.

సింహరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో శని గ్రహం మంచి ఫలితాలను ఇచ్చును. స్థిరాస్తి సంబంధ కోర్టు వివాదాలు అనుకూల తీర్పులు పొందును. వ్రుత్తి రీత్యా స్థాన చలన ప్రయత్నాలు చేయువారికి చక్కటి ఉద్యోగ అవకాశములు లభించును. నల్లని లోహ సంబంధ వ్యాపారములు చేయువారికి అతి చక్కటి లాభములను కలుగచేయును. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో తగాదలలో సదా విజయం లభించును. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఏలినాటి శని లేదు.

సింహరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన న్యాయవంతమైన , విశేష ధనార్జన ఏర్పడును. ఆర్ధికంగా ఆశించిన ఫలితాలను , నూతన భూ లేదా గృహ సౌఖ్యమును కలుగచేయును. వ్యక్తిగత జాతకంలో రాహు గ్రహం బలమైన స్థానంలో ఉన్న జాతకులకు నూతన ఆదాయ మార్గములను , పెట్టుబడుల వలన ఆశించిన ఫలితం కన్నా అధిక లాభములను కలుగ చేయును.

సింహరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడును. మాత్రు వర్గీయుల వలన లాభములను, విద్యార్ధులకు ఆశించిన విజయాలను, నూతన వాహన సౌఖ్యమును ఏర్పరచును. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో కేతు గ్రహం అన్ని విధములా మంచి ఫలితాలను ఏర్పరచును.

మార్చి 2020 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కుటుంబ సుఖ సంతోషాలతో ఆహ్లాదకరంగా కాలం గడిపెదరు. బంధు మిత్రుల సమాగమము ఏర్పడును. కుటుంబ సభ్యుల మారిన వ్యక్తిత్వాలు సంతృప్తిని కలుగచేయును. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి ఏర్పడును. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 2020 మార్చి నెల గంటల పంచాంగం...

ఏప్రిల్ 2020 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం బాగుండును. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ముందుకు సాగును. నూతన వాహన సౌఖ్యం ఏర్పడును. సంతాన ప్రయత్నాలు ఈ మాసంలో విజయవంతం అగును. ఉద్యోగ జీవులకు సాధారణ ఫలితాలు. సమయానుకూలత చూసుకొని ఉన్నత అధికారులతో సంప్రదింపులు చేయవచ్చు. మిత్ర వర్గం సలహాల వలన మేలు జరుగుతుంది. శ్రమ తగ్గుతుంది. ఆర్ధిక వ్యయం అదుపులోకి తెచ్చుకొంటారు. 17, 18, 19, 20 తేదీలలో ఒక అశుభ వార్త వినడానికి సూచనలు కలవు. 23 వ తేదీ తదుపరి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలకు అనువైన కాలం. మహిళలకు ఆరోగ్యం సహకరిస్తుంది. 2020 ఏప్రిల్ నెల గంటల పంచాంగం...

మే 2020 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు , నూతన ఉద్యోగ జీవన ప్రయత్నాలు విజయవంతం అగును. గృహంలో హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించదేరు. కుటుంబానికి పూర్వ వైభవం తెస్తారు. కుటుంబానికి ధనధాన్య లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత జాతకంలో శని గ్రహం బలంగా ఉన్నవారికి రాజకీయ రంగ ప్రవేశానికి ఈ మాసం అనువైన కాలం. అధికారుల ఒత్తిడి తగ్గును. 8 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు ఒక ఆపద నుండి బయటపడతారు. శత్రుత్వాలు తొలగి కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. నిత్య జీవన విధానంలో ఆశించిన మార్పులు చేసుకోగలరు. నూతన ఆరోగ్య పద్దతులు అలవాటు చేసుకొంటారు. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం ఆశించినంతగా ఉండును. 2020 మే నెల గంటల పంచాంగం...

జూన్ 2020 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా అనుకూల ఫలితాలు కొనసాగును. బంధు వర్గం సహకారం వలన చక్కటి వివాహ సంబంధాలు లభించును. వ్యక్త్రిగత వైవాహిక జీవనంలో కూడా అపార్ధాలు తొలగును. సౌఖ్యం ఏర్పడును. విందు వినోదాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు లభిస్తాయి. నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకొందురు. ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు పొందుతారు. నూతన కాంట్రాక్టులు , విదేశే జీవన అవకాశాలు లభిస్తాయి. నూతన పరిచయాలు నిరుత్సాహ పరుచును. సేవా రంగంలోని వారు లక్ష్యాలను చేరుకొందురు. మొహమాటం వలన నష్టపోదురు. ఈ మాసంలో ప్రయాణాలు కలసిరావు. అవాంతరాలను ఏర్పరచును. 2020 జూన్ నెల గంటల పంచాంగం...

జూలై 2020 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గును. చేపట్టిన పనులు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగక ఇబ్బందులను ఎదుర్కొనును. తోటి ఉద్యోగుల నుండి రావలసిన సహకారం సకాలంలో లభించదు. ఆశించిన గుర్తుంపు లభించదు. నూతన అవకాశములు చేజారిపోవును. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. కుటుంబ పెద్దల ప్రవర్తన వలన సమస్యలు. అనుకోని కలహాలకు అవకాశముంటుంది. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలలో ఓర్పు అవసరం. ఈ మాసంలో 2, 6, 7, 18, 25, 29, 30 తేదీలు అనుకూలమైనవి కావు. ఆర్ధికంగా వృధా ఖర్చులు ఏర్పడును. 2020 జూలై నెల గంటల పంచాంగం...

ఆగష్టు 2020 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఉద్యోగ జీవనంలో ఇబ్బందులు తొలగును. లక్ష్యాలను సకాలంలో పూర్తీ చేయగలుగుతారు. మీ సామర్ధ్యం పై నమ్మకముంచండి. 8, 9, 10 మరియు 11 తేదీలలో నూతన అవకాశములు, అధికారుల ప్రోత్సాహం లభించును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభించును. క్రమంగా అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు బాగా లాభపడతారు. వృత్తి పరమైన వ్యాపారాలు కూడా బాగుంటాయి. మఖా నక్షత్ర జాతకులకు జూదం వలన పెద్దమొత్తంలో నష్టములు ఏర్పడును. కుటుంబ జీవనంలో ఆశించిన ఫలితాలు ఏర్పడును. సంతానానికి భవిష్యత్ నిధిని ఏర్పాటు చేయగలుగుతారు. 2020 ఆగష్టు నెల గంటల పంచాంగం...

సెప్టెంబర్ 2020 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో వ్యక్తిగత జీవితంలో ఇతరుల ప్రమేయం వలన ఒక నష్టం ఏర్పడును. జీవిత భాగస్వామి ఫై అపోహలకు తావివ్వకండి. మాత్రు వర్గం వారికి కొద్దిపాటి అనారోగ్య సమస్య. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. ధనార్జన ఆశించిన విధంగానే ఉండును. సంతానం యొక్క పురోగతి ఆనందాన్ని కలుగచేస్తుంది. ద్వితీయ తృతీయ వారాలాలో ఉద్యోగులకు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. చిన్న అవకాశాలు కూడా భవిష్యత్లో మంచి చేస్తాయి. అవకాశములను వదులుకోకండి. అతి తెలివితేటలు ప్రదర్శించుట , తర్కంగా ఆలోచించుట మంచిది కాదు. చివరి వారంలో రాజకీయ రంగంలోని వారికి పదవీయోగం ఉన్నది. ప్రయత్నాలు చేయండి. 2020 సెప్టెంబర్ నెల గంటల పంచాంగం...

అక్టోబర్ 2020 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో నూతన ఆలోచనలు ఆచరణలోకి తీసుకురావడం వలన శుభ ఫలితాలు ఏర్పడును. శ్రమ అధికం అయినా పట్టుదలతో పని చేస్తారు. స్థాన చలన , ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవనంలో సమస్యలు తొలగుతాయి. జీవిత భాగస్వామితో సంతోష జీవనం. ధనాదాయం బాగుండును. జీవన మార్గంలో ఆశించిన మార్పులు ఏర్పడతాయి. 2020 అక్టోబర్ నెల గంటల పంచాంగం...

నవంబర్ 2020 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో స్వల్ప ఆటంకాలున్నాయి. ముఖ్యంగా స్త్రీలకు గౌరవ హాని సంఘటనలు కలవు. మాట విలువ తగ్గుతుంది. ఇతరులను విమర్శించుట వలన సమస్యలను కోరి తెచ్చుకుంటారు. మాటలయందు జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారములు సామాన్యంగా కొనసాగును. ధనాదాయంలో నిలకడ లోపిస్తుంది. ఆర్ధిక విషయాలలో ప్రణాళిక అవసరం. కోర్టు లావాదేవిల వలన ధన వ్యయం అధికమగును. వివాహ ప్రయత్నాలు బెడిసికోట్టును. చివరి వారంలో ఒక ప్రమాదం లేదా పెద్ద నష్టం. నిదానంగా నిర్ణయాలు తీసుకొనవలసి వచ్చును. 2020 నవంబర్ నెల గంటల పంచాంగం...

డిసెంబర్ 2020 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం తగ్గును. ఆశించిన ధనం చేతికి వచ్చుట కష్టం. స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందులు కలుగచేయును. పట్టుదలలు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో జాగ్రత్తగా ఉండవలెను. నిరుద్యోగులకు నిరాశాపూరితమైన కాలం. ప్రారంభించిన పనులు ముందుకు సాగవు. మిత్ర బలం కూడా తగ్గుతుంది. సున్నితమైన విషయాలలో మానసిక ఆందోళన ఏర్పడుతుంది. ముఖ్యంగా స్వ ఆరోగ్య విషయంలో భయానికి లోనగు అవకాశం అధికం. ఈ మాసంలో 8, 12, 14, 21, 22 తేదీలు ఎదో ఒక అంశంలో నష్టాన్ని ఏర్పరచు సూచన. 2020 డిసెంబర్ నెల గంటల పంచాంగం...

జనవరి 2021 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా సమస్యలు కొనసాగును. ఆదాయం గత మాసం కన్నా కొంచం పెరుగును. ఆర్ధిక విషయాలలో సహాయం లభిస్తుంది. ప్రధమ వారంలో ఒక ముఖ్య వార్త వింటారు. గృహ మార్పిడి లేదా నిర్మాణ పనులలో మిక్కిలి అవాంతరాలు లేదా అతి వ్యయం. ఆందోళన పెరుగుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు బాధించును. ఉద్యోగ కార్యములు పూర్తీ చేయుటకు శక్తికి మించి కష్టపడతారు. సోదర వర్గంతో మాట పట్టింపు విడిచిపెట్టుట మంచిది. నూతన వ్యాపార వ్యవహారాలు ఇబ్బందులు ఎదుర్కొనును. ప్రత్యర్ధుల నుండి వ్యతిరేకత అధికం అవుతుంది. వ్యాపార పరంగా నష్టములు పొందు సూచనలు అధికం. 2021 జనవరి నెల గంటల పంచాంగం...

ఫిబ్రవరి 2021 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో విరివిగా ప్రయాణాలు ఏర్పడును. ప్రయత్నపుర్వక కార్య లాభాలు ఏర్పడును. గాడి తప్పిన ఆర్ధిక విషయాలు క్రమంగా దారిలోకి వస్తాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ప్రోత్సాహక కాలం ప్రారంభం అవుతుంది. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ఇబ్బందుల నుండి బయటపడతారు. శత్రు విజయం ఏర్పడుతుంది. గృహంలో శుభ పరిణామాలు ఉన్నాయి. గొప్ప స్థాయి వ్యక్తుల ద్వారా లాభపడతారు. మాసాంతంలో సంతానం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ మాసంలో 4, 5, 6 తేదీలు నూతన ప్రయత్నాలు చేయుటకు అనుకూలమైనవి. 2021 ఫెబ్రవరి నెల గంటల పంచాంగం...

మార్చి 2021 సింహరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. ధనాదాయం పర్వాలేదు. భాగస్వామ్య వ్యాపారములలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టములు ప్రాప్తించును. ద్వితియ వారంలో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక అశుభ వార్త. గృహ వాతావరణం అశాంతిని కలిగి ఉండును. మాస మధ్యంలో ఖర్చులు అధికంగా ఉండును. పుబ్బా నక్షత్ర జాతకులకు వివాహ సంతాన విషయాలలో వ్యతిరేక ఫలితాలు. చివరి వారంలో దైవదర్శన భాగ్యం, ఒంటరగా ప్రయాణం చేయాలనే కోరిక నెరవేరును. విద్యార్దులు శ్రమించవలెను. ఈనెలలో 2,6,7,15,29 తేదీలు మంచివి కావు. 2021 మార్చి నెల గంటల పంచాంగం...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.