Dr. Aravind Sidhanthi గారి వివరణ
సూర్యాస్తమయం అయ్యాక వినీల ఆకాశంలో మన కంటికి కనిపించే మరియు ఇప్పటి వరకు మానవడు తన మేధస్సుతో స్వయంగా అడుగు పెట్టగలిగిన ఒకే ఒక నవగ్రహం చంద్రుడు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు గ్రహాలన్నింటికీ రాణి. మన సౌర వ్యవస్థ ఒక కుటుంబం అయితే రవి తండ్రి, చంద్రుడు తల్లి. చంద్రుడు కూడా రాజ గ్రహమే. జ్యోతిష్యంలో సూర్యుడు "ఆత్మ" అయితే, చంద్రుడు "శరీరం మరియు మనస్సు". ఆత్మకు రూపం ఇచ్చేది మనస్సే కాబట్టి, మన జీవిత గమనాన్ని చంద్రుడే ఎక్కువగా నిర్ణయిస్తాడు.
After sunset, the Moon is the only celestial body visible in the deep blue sky that humankind has successfully set foot upon using its collective intelligence. In the realm of astrology, the Moon is considered the Queen of all planets.
If we view our solar system as a family, the Sun represents the Father, while the Moon represents the Mother. Like the Sun, the Moon is also a royal planet. In astrological terms:
The Sun represents the "Soul" (Atma).
The Moon represents the "Body and Mind" (Sharira and Manas).
Since it is the mind that gives form and expression to the soul, the Moon plays a primary role in determining the course and destiny of our lives.
చంద్రుడు కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, జ్యోతిష్య పరిభాషలో ఆయనే "మనః కారకుడు". మరియు మాతృ కారకుడు. చంద్ర గ్రహాన్ని ఈ భూమిపై ప్రతీ జీవి మానసిక ప్రశాంతతకు కారకుడిగా, మనోధైర్యానికి మూలస్తంభంగా, తల్లి వలన సౌఖ్యం అనుభవించడానికి ముఖ్య కారకుడిగా పరిగనిస్తాము. ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రుడు మన భూమికి కేవలం ఒక ఉపగ్రహం అయినప్పటికీ, భారతీయ జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం నవగ్రహాలలో చంద్రుడికి మనస్సును నియంత్రించేవాడుగా అత్యంత కీలకమైన స్థానం ఉంది. చంద్రుడు మాతృ కారకుడు మరియు మనస్సుపై ప్రభావం చూపే గ్రహం. అందుకే 'చంద్రమా మనసో జాతః' అని మన వేదాలు మనకు తెలియచేస్తున్నాయి.
The Moon is not merely a celestial body; in astrological terminology, he is the "Manas Karaka" (Significator of the Mind) and "Matru Karaka" (Significator of the Mother). On this Earth, the Moon is considered the primary source of mental peace for every living being, the pillar of psychological strength, and the key factor in experiencing the comfort and love provided by a mother.
While Astronomy defines the Moon as a natural satellite of our Earth, Vedic Astrology accords it a vital position among the Navagrahas as the controller of the human mind. Because the Moon governs both the mother and the psyche, our Vedas proclaim:
"Chandrama Manaso Jatah" which means The Moon was born from the Mind of the Cosmic Purusha)
చంద్రుని ప్రకాశాన్ని, అందాన్ని మరియు లోకానికి ఇచ్చే చల్లదనాన్ని వర్ణించడానికి మన శ్రీ పరాశర మహర్షుల వారు 16 పదాలను ఉపయోగించారు. వాటినే చంద్రుడి 16 కళలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే చంద్రుడిని "షోడశ కళానిధి" అంటారు. చంద్రుని 16 కళలకు ఒక్కో పేరు ఉంది. అవి:
అమృత 2. మానద 3. పూష 4. తుష్టి 5. పుష్టి 6. రతి 7. ధృతి 8. శశిని 9. చంద్రిక 10. కాంతి 11. జ్యోత్స్న 12. శ్రీ 13. ప్రీతి 14. అంగద 15. పూర్ణ 16. పూర్ణామృత. ఈ కళలు
To describe the radiance, beauty, and the soothing coolness that the Moon bestows upon the world, Maharishi Parasara used 16 distinct terms. In Vedic Astrology, these are known as the 16 Kalas (Phases) of the Moon. This is precisely why the Moon is revered as "Shodasha Kalanidhi" (The Treasure House of 16 Arts/Phases).
Each of these 16 phases has a unique name and significance:
Amruta (Nectarine)
Manada (Bestower of Pride/Honor)
Pusha (Nourishing)
Tushti (Contentment)
Pushti (Vitality/Growth)
Rati (Delight/Passion)
Dhriti (Patience/Fortitude)
Shashini (Radiant like a Hare)
Chandrika (Moonlight)
Kanti (Splendor/Luster)
Jyotsna (Illumination)
Shree (Prosperity/Grace)
Preeti (Affection/Love)
Angada (Body-strengthening)
Poorna (Fullness/Completion)
Poornamruta (The Fullness of Nectar)
చంద్రుని స్థితిని బట్టి జాతకంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మారుతుంటాయి. ఒక వ్యక్తి జన్మించినప్పుడు చంద్రుడు ఆకాసంలో ఏ నక్షత్రంపై సంచరిస్తుంటే, అది ఆ వ్యక్తి జన్మ నక్షత్రం అవుతుంది. ఏ రాశిలో ఉంటాడో అదే ఆ వ్యక్తి యొక్క జన్మ రాశి అవుతుంది. ఉదాహరణకు చంద్రుడు మేష రాశిలో సంచరిస్తూ ఉండగా ఒక వ్యక్తి జన్మిస్తే ఆ వ్యక్తి రాశి మేషం అవుతుంది.
In Vedic Astrology, the position of the Moon at the time of birth is the foundation for several crucial life aspects.
Janma Nakshatra (Birth Star): The specific constellation (Nakshatra) through which the Moon is transiting at the exact moment of a person's birth becomes their Janma Nakshatra.
Janma Rashi (Moon Sign): Similarly, the zodiac sign in which the Moon is placed at the time of birth is designated as the person's Janma Rashi.
Example: If the Moon is transiting through the sign of Aries (Mesha Rashi) at the time of a child's birth, then that individual's Rashi is considered to be Aries.
మనిషి జీవితం ఏ గ్రహ మహా దశతో ప్రారంభం అవ్వాలో నిర్ణయించేది కూడా చంద్రుడే. జ్యోతిష్య శాస్త్రం లోని 27 నక్షత్రాలలో రోహిణి, హస్త మరియు శ్రవణ అనే మూడు ముఖ్యమైన నక్షత్రాలకు చంద్రుడే అధిపతి: ఈ రోహిణి లేదా హస్త లేదా శ్రవణ నక్షత్రాలలో జన్మించిన వారికి జీవిత ఆరంభ మహాదశ చంద్ర మహాదశ అవుతుంది
The Moon is the pivotal force that determines which Graha Maha Dasha (Major Planetary Period) will mark the beginning of a person’s life. Among the 27 Nakshatras (Constellations) in Vedic Astrology, the Moon serves as the primary ruler (Lord) for three specific stars:
Rohini
Hasta
Shravana
For individuals born when the Moon is transiting through any of these three constellations, their life’s journey commences with the Chandra Maha Dasha (The Major Period of the Moon).
చంద్రుడికి మిత్ర గ్రహాలు: సూర్యుడు, బుధుడు. శత్రు గ్రహాలు: చంద్రుడికి ప్రత్యక్ష శత్రువులు ఎవరూ లేరు ఎందుకంటే చంద్రుడు అందరినీ సమానంగా చూస్తాడు కానీ శని, రాహు, కేతువులు చంద్రుడిని పీడిస్తారు. డానికి కారణం ఏమిటి అనేది మనం శని, రాహు మరియు కేతు గ్రహాల కోసం చర్చించుకుంటున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం. చంద్రునితో సమగ్రహాలు: కుజుడు, గురువు, శుక్రుడు.
In Vedic Astrology, the Moon’s relationships with other celestial bodies define its influence on our lives. Here is how the Moon relates to the other planets:
Friendly Planets (Mitra Grahas): The Sun and Mercury are considered natural friends to the Moon.
Enemy Planets (Shatru Grahas): Interestingly, the Moon has no direct enemies, as its nature is to view everyone with equanimity and balance. However, Saturn (Shani), Rahu, and Ketu are known to afflict the Moon (causing distress). We will explore the specific reasons behind this celestial conflict in detail when we discuss Saturn, Rahu, and Ketu.
Neutral Planets (Sama Grahas): Mars (Kuja), Jupiter (Guru), and Venus (Shukra) maintain a neutral relationship with the Moon.
చంద్రుడు స్వభావరీత్యా శుభగ్రహమే అయినప్పటికీ, తిథులను బట్టి ఫలితం మారుతుంది. ఒక వ్యక్తికీ జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఆ జాతకుడి చంద్ర గ్రహ బలాన్ని కేవలం రాశిని బట్టే కాకుండా, చంద్రుడు ఉన్న తిథిని బట్టి కూడా అంచనా వేయాలి. చంద్రుడికి అత్యంత బలమైన కాలం శుక్ల పక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు. ఈ కాలంలో చంద్రుని బలం పెరుగుతూ ఉంటుంది. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణ చంద్రుడుగా అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు. అమావాస్య నాడు చంద్రుడు నిర్వీర్యుడై ఉంటాడు. దీనికి కారణం ఏమిటి అనేది పురాణాల ప్రకారం ఒక ఆశక్తికర కధ ప్రచారంలో ఉంది. చంద్రుడు కేవలం ప్రకాశించే గోళం మాత్రమే కాదు, ముక్కోటి దేవతల ఆహారమైన అమృతానికి నిలయం. చంద్రుని కిరణాలలో 'సోమరసం' లేదా అమృతం ఉంటుందని, దేవతలు మరియు పితృదేవతలు చంద్రుని ద్వారానే శక్తిని పొందుతారని నమ్ముతారు. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్తిగా అమృతంతో నిండి ఉంటాడని, అమావాస్య నాటికి దేవతలు ఆ అమృతాన్ని తాగేయడం వల్ల చంద్రుడు క్షీణిస్తాడని పురాణ వర్ణన ఉంది.
While the Moon is naturally a benefic planet, its results vary significantly based on the Tithi (Lunar Day). When analyzing a horoscope, one must assess the Moon's strength not just by its zodiac sign (Rashi) but also by the specific Tithi of birth.
Shukla Paksha (Waxing Phase): From Pratipada (the first day after the New Moon) to Purnima (Full Moon), the Moon’s strength steadily increases.
Purnima (Full Moon): On this day, the Moon becomes the "Poorna Chandra" (Full Moon), bestowing the most auspicious and benefic results.
Amavasya (New Moon): Conversely, on the New Moon, the Moon is considered weak or "Nirveerya" (devoid of strength).
There is a fascinating story in our Puranas explaining this phenomenon. The Moon is not merely a glowing celestial sphere; it is the abode of Amrita (Divine Nectar), which serves as the sustenance for the thirty-three crore Devas.
It is believed that the Moon’s rays contain 'Soma Rasa' or Nectar, and both the Devas (Gods) and Pitru Devatas (Ancestors) derive their energy through the Moon. According to Puranic descriptions:
By Purnima, the Moon is overflowing with this divine nectar.
As the month progresses toward Amavasya, the Devas consume this nectar, causing the Moon to gradually wane and diminish in strength.
పురాణాల్లో చంద్రుని రూపం చాలా సౌమ్యంగా వర్ణించబడింది. చంద్రుని అందాన్ని ఆధారంగా చేసుకొని దేవతలు చంద్రుడికి అనేక పేర్లను ప్రసాదించారు. వాటిలో ముఖ్యమైనవి ఆయన గుణాలను తెలియజేస్తాయి:
సోమ: అమృతం కలిగినవాడు.
హిమాంశు: చల్లని కిరణాలు కలవాడు.
నిశాకరుడు: రాత్రిని కలిగించేవాడు.
ద్విజరాజు: బ్రాహ్మణులకు మరియు పక్షులకు రాజు.
కుముదనాథుడు: కలువ పూలను వికసింపజేసేవాడు అని అర్ధం. సూర్యుడు తామరలను వికసింపజేస్తే, చంద్రుడు కలువలను వికసింపజేస్తాడు.
In the Puranas, the Moon is depicted with an exceptionally gentle (Saumya) and serene appearance. Enchanted by his beauty and divine attributes, the Devas bestowed several significant names upon him, each reflecting a specific quality:
Soma: The one who possesses the divine nectar (Amrita).
Himanshu: The one who radiates cool and soothing rays.
Nishakara: The one who creates the night (The Lord of the Night).
Dwijaraja: The King of the Brahmanas and the King of birds.
Kumudanatha: The Lord of the Water Lilies. (Just as the Sun causes the lotus to bloom, the Moon causes the water lilies (Kumuda) to blossom).
చంద్రునికి ఇష్టమైన రత్నం: ముత్యం (Pearl). ఇష్టమైన రోజు : సోమవారం. చంద్రుడు ఆధిపత్యం వహించే దిక్కు : వాయువ్యం. చంద్రుని వాహనం: తెల్లని జింక. ఆయుధం: గద లేదా పద్మం. చంద్రుని నివాసం చంద్రలోకం లోనే దేవతలకు అమృతాన్ని ఇచ్చే సోమరసం లభిస్తుందని నమ్ముతారు.
To conclude our understanding of the Moon, here are the sacred elements and symbols associated with this celestial deity:
Gemstone: Pearl (Mutyam).
Auspicious Day: Monday (Somavaram).
Direction of Influence: North-West (Vayuvya).
Divine Vehicle (Vahana): A White Antelope (Deer).
Celestial Weapons: The Mace (Gada) or the Lotus (Padma).
Abode: Chandraloka. It is believed that Soma Rasa, the divine nectar that sustains the Devas, is found within this celestial realm.
చంద్రుడిని "ఔషధీశుడు" అని కూడా అంటారు. అంటే భూమిపై ఉన్న మొక్కలకు, ఔషధ గుణాలకు చంద్రుని కిరణాలే శక్తినిస్తాయి. చంద్రుని కిరణాలు భూమిపై ఉన్న మొక్కలకు ప్రాణాన్ని మరియు ఔషధ గుణాలను ఇస్తాయి. అందుకే ప్రాచీన వైద్యులు పౌర్ణమి రాత్రులలో సేకరించిన మూలికలకు శక్తి ఎక్కువగా ఉంటుందని ఇప్పటికి నమ్ముతారు. భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముల వారు "పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః" అని తానే స్వయంగా పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి అంటే "నేనే చంద్రుడినై ఓషధు మొక్కలను సృష్టిస్తున్నాను.
The Moon is also revered as "Oushadheeshudu" (The Lord of Medicinal Herbs). It is believed that the Moon’s rays provide vital energy, life force, and medicinal properties to all vegetation on Earth.
Ancient physicians and practitioners of traditional medicine firmly believed that herbs gathered on Purnima (Full Moon) nights possessed superior healing potency, as they were fully saturated with lunar energy.
This cosmic truth is validated by Lord Sri Krishna himself in the Bhagavad Gita (Chapter 15, Verse 13), where he declares:
"Pushnami Chaushadhih Sarvah Somo Bhutva Rasatmakah"
“Becoming the nectarine Moon, I nourish all herbs and plants.”
In this context, the Lord explains that He manifests as the Moon to infuse life-sustaining essence and nutritional value into the entire plant kingdom.
పంచాంగం ప్రకారం ఏదైనా మంచి పని చేయడానికి ముహూర్తం పెట్టాలంటే చంద్రుని స్థితి చాలా ముఖ్యం. తార బలం: మీరు పుట్టిన నక్షత్రం నుండి ఆ రోజు చంద్రుడు ఉన్న నక్షత్రం వరకు లెక్కించి 'తార బలం' లెక్క కడతాము. ఇది బాగుంటేనే తలపెట్టిన కార్యం సఫలం అవుతుంది. తిథి: చంద్రుడు సూర్యుడి నుండి ఎంత దూరంలో ఉన్నాడో చెప్పేదే తిథి. ముఖ్యమైన శుభ కార్యాలకు శుక్ల పక్షం లో విదియ, తదియ, పంచమి, దశమి వంటి తిథులు చాలా శ్రేష్టమైనవి.
According to the Panchangam, the position and strength of the Moon are the most critical factors when selecting an auspicious time (Muhurtha) for any significant endeavor.
The "Tara Balam" is calculated by counting from your Janma Nakshatra (Birth Star) to the Nakshatra where the Moon is positioned on a specific day.
A favorable Tara Balam is essential for the success and fruition of the tasks you undertake.
It acts as a primary filter to ensure the cosmic energy of the day aligns with your personal birth star.
A Tithi is technically the measurement of the angular distance between the Sun and the Moon.
For important and auspicious events (Shubha Karyas), specific Tithis during the Shukla Paksha (Waxing Phase) are considered highly meritorious.
Particularly, Vidiya (2nd), Tadiya (3rd), Panchami (5th), and Dashami (10th) are regarded as the most "Shrestha" (excellent) for beginning new ventures.
పురాణాల ప్రకారం చంద్రుని జననం గురించి రెండు ప్రధాన కథలు ఉన్నాయి. బ్రహ్మదేవుని మానస పుత్రుడైన అత్రి మహర్షి మరియు అనసూయ దేవిలకు చంద్రుడు జన్మించాడు. తండ్రి పేరు మీదనే మనం చంద్రుడిని "ఆత్రేయ" అని కూడా పిలుస్తాము. అదేవిధంగా క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు చంద్రుడు కూడా పాల కడలి నుండి ఉద్భవించాడు. ఈ విధంగా చూస్తె శ్రీ లక్ష్మీదేవికి చంద్రుడు సోదరుడు అవుతాడు. శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ దుర్వాస మాహర్షి చంద్రునికి సోదరులు అవుతారు.చంద్రుడు వైశ్య గ్రహం. కృష్ణావతారం మొత్తం చంద్రుడికి సంబందించినది. చంద్రునిది సత్వ గుణం. శరీర తత్త్వం జల తత్త్వం. చంద్రుడి గోత్రం తండ్రి గారి పేరుపై ఏర్పడిన అత్రేయశ మహర్షి గోత్రం. మీలో కూడా ఎవరైనా ఆత్రేయ మహర్షి గోత్రీకులు ఉంటే వారందరూ చంద్రుని అంశతో జన్మించిన వారే. చంద్రుని జన్మ నక్షత్రం కృత్తిక. అధిదేవత శ్రీ లక్ష్మీ దేవి.
According to our Puranas, there are two primary accounts regarding the birth of the Moon (Chandra).
Chandra was born to Maharishi Atri (the mind-born son of Lord Brahma) and Anasuya Devi. Because of his lineage, he is also known as "Atreya" (the son of Atri). In this divine family, the great sages Sri Dattatreya and Sri Durvasa Maharishi are the brothers of Chandra.
Another significant account states that during the churning of the Ocean of Milk (Kshira Sagara Mathanam), Chandra emerged alongside Goddess Lakshmi. Therefore, in a spiritual sense, Chandra is considered the brother of Goddess Lakshmi.
Caste/Varna: Chandra is classified as a Vaishya Graha.
Avatara Connection: The Krishna Avatara is entirely associated with the lunar lineage (Chandra Vamsha) and the Moon's influence.
Guna & Tattva: He possesses Sattva Guna (purity/goodness) and represents the Jala Tattva (Water element).
Gotra: His lineage is the Atreya Maharishi Gotra, named after his father. It is believed that those born into the Atreya Gotra carry the divine essence of the Moon.
Birth Star & Deity: * Birth Star (Janma Nakshatra): Krittika.
Presiding Deity (Adhi Devata): Goddess Sri Lakshmi Devi.
చంద్రుడి జీవిత భాగస్వాముల విషయానికి వస్తే అత్యంత ప్రసిద్ధ గాథ ఒకటి ఉంది. చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను (వీరే 27 నక్షత్రాలు - అశ్విని నుండి రేవతి వరకు) వివాహం చేసుకున్నాడు. తన భార్యలందరిలో రోహిణిని చంద్రుడు ఎక్కువగా ప్రేమించేవాడు, అందుకే రోహిణి నక్షత్రంలో జన్మించిన వారిపై చంద్రుని అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని జ్యోతిష్యుడిని అయిన నేను కూడా నమ్ముతాను. ఒక్క రోహిణి మినహా తమని నిర్లక్ష్యం చేయడంతో మిగిలిన కూతుళ్లు తమ తండ్రి అయిన దక్ష ప్రజాపతికి ఫిర్యాదు చేయగా, ఆగ్రహించిన దక్షుడు చంద్రుడిని "క్షయ రోగంతో క్షీణించిపొమ్మని" శపించాడు.
When it comes to the personal life of the Moon (Chandra), there is a very famous and significant Puranic legend involving his 27 consorts. Chandra married the 27 daughters of Daksha Prajapati, who represent the 27 Nakshatras (from Ashwini to Revati) in our zodiac. Among all his wives, Chandra had a profound and special affection for Rohini.
Astrological Insight: As an astrologer, I firmly believe that because of this divine preference, those born under the Rohini Nakshatra experience a more potent and favorable influence from the Moon.
The other daughters, feeling neglected due to Chandra's exclusive devotion to Rohini, complained to their father, Daksha Prajapati. Infuriated by this partiality, Daksha cursed Chandra to suffer from Kshaya Roga (a disease of consumption or wasting away), causing him to gradually lose his brilliance and vanish.
దక్షుని శాపం నుండి విముక్తి పొందడానికి చంద్రుడు ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని ఒక నదీ తీరంలో శివుడిని ప్రతిష్టించి తపస్సు చేశాడు. చంద్రుడి తపస్సుకు మెచ్చిన ఆ భోళాశంకరుడు చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తుడిని చేస్తాడు. చంద్రుడిని తన శిరస్సుపై ధరించి రక్షించాడు. దక్షుడు శపించిన విధంగా పూర్తిగా నశించకుండా ఒక మాసంలో 15 రోజులు క్షీణించి 15 రోజులు వృద్ధి చెందేలా వరాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా క్షీణించే 15 రోజులానే క్రిష్ణ పక్షం అని, వృద్ధి చెందే 15 రోజులను శుక్ల పక్షం అని పిలుస్తున్నాం. చంద్రుడికి శాప విమోచనం ప్రసాదించిన రోజు నుండే శివునికి "చంద్రశేఖరుడు" అనే పేరు వచ్చింది. ఆ ప్రదేశమే ప్రసిద్ధ సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. 'సోమ' అంటే చంద్రుడు, 'నాథ' అంటే శివుడు అని అర్ధం.
To seek liberation from the curse of Daksha, Chandra performed rigorous penance (Tapasya) dedicated to Lord Shiva on the banks of a sacred river in present-day Gujarat. Pleased by Chandra's devotion, Lord Shiva—the Compassionate One—granted him relief from the curse and offered him protection by wearing the Moon upon His own head.
While the curse of Daksha could not be entirely revoked, Lord Shiva modified its intensity. He granted a boon ensuring that Chandra would not perish completely:
Krishna Paksha (Waning Phase): For 15 days of the month, the Moon would gradually diminish.
Shukla Paksha (Waxing Phase): For the following 15 days, the Moon would regain its strength and brilliance.
From the day He granted redemption to the Moon, Lord Shiva came to be known as "Chandrashekhara" (The one who wears the Moon on His head). The sacred spot where this divine event occurred is the world-famous Somnath Jyotirlinga. The name "Somnath" itself carries a deep meaning:
'Soma' refers to the Moon.
'Natha' refers to the Lord or Master. Thus, Somnath is the "Lord of the Moon."
ఇంక చంద్రుని సంతాన విషయానికి వస్తే దక్ష ప్రజాపతి శాపం వలన తన 27 మంది భార్యలలో ఎవ్వరితోను చంద్రునికి సంతానం కలుగలేదు. చంద్రునికి మరియు బృహస్పతి భార్య అగు తారకు జన్మించిన కుమారుడు బుధుడు. జ్యోతిష్య శాస్త్రంలో తండ్రి చంద్రుడు మనస్సుకు కారకుడైతే, కుమారుడు బుధుడు బుద్ధికి కారకుడు. చంద్రునితో ప్రారంభమైన వంశాన్నే 'చంద్ర వంశం' అంటారు. పురాణాల ప్రకారం ఈ వంశ క్రమం ఇలా ఉంటుంది. చంద్రుడు → బుధుడు → పురూరవుడు -> నహుషుడు -> యయాతి వంటి గొప్ప చక్రవర్తులు జన్మించారు. మన హిందూ ధర్మం లో ప్రసిద్ధ కావ్యం 'మహాభారతం'లోని పాండవులు మరియు కౌరవులు కూడా ఈ చంద్ర వంశానికి చెందినవారే.
Regarding the progeny of the Moon, an intriguing turn of events occurred due to the curse of Daksha Prajapati. Consequently, Chandra did not have any children with any of his 27 wives (the Nakshatras).
The most significant lineage of the Moon began through Budha (Mercury). In Vedic Astrology, there is a profound connection between the father and the son:
Chandra (The Father): The significator of the Mind (Manas).
Budha (The Son): The significator of the Intellect (Buddhi).
The royal lineage that originated from Chandra is famously known as the "Chandra Vamsha" (The Lunar Dynasty). According to the Puranas, the genealogical sequence flowed as follows: Chandra → Budha → Pururava → Nahusha → Yayati
This lineage produced some of the greatest emperors in history. Most notably, the Pandavas and Kauravas from our sacred epic, the Mahabharata, belonged to this illustrious Lunar Dynasty.
ఖగోళ శాస్త్ర పరంగా చంద్రుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చర్చించుకుందాం. ఖగోళ శాస్త్రం (Astronomy) ప్రకారం, నవగ్రహాలలో ఒకరైన చంద్రుడు నిజానికి ఒక గ్రహం కాదు, అది భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం. చంద్రుడు సౌర కుటుంబంలోని ఐదవ అతిపెద్ద ఉపగ్రహం. భూమి పరిమాణంతో పోలిస్తే ఇది సుమారుగా నాలుగో వంతు ఉంటుంది. భూమి నుండి చంద్రునికి గల సగటు దూరం సుమారు 3,84,000 కిలోమీటర్లు. భూమి గురుత్వాకర్షణ శక్తిలో చంద్రునిపై కేవలం 1/6 వంతు మాత్రమే ఉంటుంది.
Size and Scale: The Moon is the fifth-largest natural satellite in our entire solar system. To give you a perspective, its size is approximately one-fourth (1/4th) of the Earth's diameter.
Proximity to Earth: The average distance between the Earth and the Moon is roughly 3,84,000 kilometers.
Gravity: One of the most unique aspects of the Moon is its gravitational pull. It possesses only 1/6th of the Earth's gravity. For instance, if you weigh 60 kg on Earth, you would weigh only 10 kg on the Moon!
చంద్రుని కదలికలలో ఒక ప్రత్యేకత ఉంది, దీనిని "సింక్రోనస్ రొటేషన్" (Synchronous Rotation) అంటారు. నవగ్రహాలన్నింటిలోకి చంద్రుడు అత్యంత వేగంగా ప్రయాణించే గ్రహం. ఒక రాశిలో చంద్రుడు కేవలం రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు. చంద్రుడు మనః కారకుడు కాబట్టి అందుకే మన మనస్థితులు కూడా చాలా వేగంగా మారుతుంటాయి. చంద్రుడు తన చుట్టూ తాను ఒక పర్యాయం తిరగడానికి పట్టే సమయం 28 రోజులు. అదే విధంగా చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం సుమారు 28 రోజులు. దీన్నే మా జ్యోతిష్య శాస్త్రం లో నక్షత్ర మాసం (Sidereal Month) గా పరిగనిస్తము. దీనివల్ల మనకు భూమి నుండి ఎప్పుడూ చంద్రుని యొక్క ఒక వైపు మాత్రమే కనిపిస్తుంది. రెండవ వైపు ఎప్పటికీ కనిపించదు. హిందూ ధర్మం నమ్మకం ప్రకారం, మరణించిన పితృదేవతలు పితృలోకంలో ఉంటారు. ఈ లోకం చంద్రుని వెనుక భాగంలో ఉంటుందని పురాణ విశ్వాసం. అందుకే పితృ దేవతల మరణ సంబంధ సంస్కారాలకు మనం తిధినే ప్రమాణంగా తీసుకుంటాము.
Among the Navagrahas, the Moon is the swiftest. It resides in a single Zodiac sign (Rashi) for only about 2.25 to 2.5 days.
Astrological Insight: As the Manah Karaka (Significator of the Mind), the Moon's rapid movement is the reason why human moods and thoughts fluctuate so quickly.
The Moon takes approximately 27.3 to 28 days to complete one rotation on its own axis. Interestingly, it takes the exact same amount of time to complete one revolution around the Earth. In Vedic Astrology, we refer to this period as a "Sidereal Month" (Nakshatra Masam).
Because these two motions are synchronized, we always see only one side of the Moon from Earth. The "far side" or the "dark side" remains forever hidden from our direct view.
According to Hindu Dharma and Puranic belief, the departed souls of our ancestors (Pitru Devatas) reside in Pitru Loka. It is anciently believed that this realm is situated on the far side of the Moon (the side invisible to Earth).
This is the profound reason why, in our culture, we strictly follow the Lunar Tithi (and not the solar calendar) to perform death anniversaries and sacred rituals for our ancestors.
చంద్రునిపై గాలి, నీరు మరియు రక్షణ కవచం వంటి వాతావరణం లేదు. చంద్రుని పై ఉన్న వాతావరణం సూర్యుని నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి రక్షణ ఇవ్వలేదు. పగటిపూట చంద్రుడిపై ఉష్ణోగ్రత 130°C వరకు ఉంటుంది. అదే భూమి పై అత్యంత వేడిగా ఉండే ఎడారి ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రత సుమారు 50 డిగ్రీలు ఉంటుంది. చంద్రుని పై రాత్రి వేళల్లో -170°C కి ఉష్ణోగ్రత పడిపోతుంది.అదే భూమి పై రాత్రి వేళల్లో ఇప్పటి వరకు నమోదు అయిన అత్యల్ప ఉష్ణోగ్రత - 90 డిగ్రీలు. సాధారణ టెలిస్కోప్ ద్వారా చూసినా మనకి చంద్రునిపై పెద్ద పెద్ద గుంతలు (Craters), పర్వతాలు మరియు ఎండిపోయిన లావా మైదానాలు కనిపిస్తాయి. వాతావరణం లేకపోవడం వల్ల అంతరిక్షం నుండి వచ్చే ఉల్కలు నేరుగా చంద్రుడిని ఢీకొట్టడం వల్ల ఈ గుంతలు ఏర్పడ్డాయి. దీనివల్ల చంద్రుడు భూమిని ఎంతగా ఉల్కలు నుండి రక్షిస్తున్నాడో మనం సులువుగా అర్ధం చేసుకోవచ్చు.
Due to the absence of an atmosphere to trap heat or provide insulation, the Moon experiences drastic temperature shifts:
Daytime: Temperatures can soar up to 130°C. In comparison, the hottest deserts on Earth usually reach only about 50°C.
Nighttime: The temperature plummets to a freezing -170°C. On Earth, the lowest recorded temperature ever is approximately -90°C.
Even through a basic telescope, the Moon's surface reveals a rugged terrain of:
Craters: Massive impact sites caused by space debris.
Mountains: High-altitude lunar peaks.
Maria: Vast, dried-out lava plains.
Because the Moon lacks an atmosphere, meteors from space strike its surface directly, creating the craters we see today. This visual evidence highlights the Moon's role as a vital protector; it acts as a celestial shield, absorbing many impacts that might otherwise head toward Earth.
చంద్రునిపై మనకు కనిపించే నల్లటి మచ్చల గురించి పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి:
అహల్య శాపం: ఇంద్రుడు అహల్యను మోసగించడానికి వెళ్ళినప్పుడు చంద్రుడు అతనికి సహాయం చేశాడని, అందుకే గౌతమ మహర్షి చంద్రుడిని శపించగా ఆ మచ్చ ఏర్పడిందని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.
దక్షుని శాపం: దక్షుని శాపం వల్ల చంద్రుని శరీరం క్షీణించి, ఆ గుర్తులు మచ్చలుగా మిగిలిపోయాయని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.
కుందేలు గుర్తు: చంద్రుడిని "శశాంకుడు" అని కూడా పిలుస్తారు. 'శశ' అంటే కుందేలు. చంద్రునిలో కుందేలు రూపం కనిపిస్తుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఒక జాతక కథ ప్రకారం, ఒక కుందేలు త్యాగానికి మెచ్చి చంద్రుడు దానిని తన ఒడిలో శాశ్వతంగా ఉంచుకున్నాడని చెబుతారు.
భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు, సూర్యరశ్మి చంద్రునిపై పడే కోణాన్ని బట్టి మనకు వివిధ దశలు కనిపిస్తాయి. సూర్యునికి మరియు భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు మనకు అమావాస్య ఏర్పడుతుంది. అదేవిధంగా సూర్యునికి మరియు చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. అదే పౌర్ణమి రోజు భూమి నీడ చంద్రునిపై పడితే చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
One of the most poetic descriptions comes from the name "Shashanka."
The Legend: It is said that a rabbit (Shasha) once showed extraordinary selflessness and devotion. To honor this creature and symbolize its pure nature, the Moon (Chandra) took the rabbit into his lap.
The Result: The dark spots we see today are believed to be the silhouette of that rabbit. This is why Chandra is also called "Shashanka" (The one who bears the mark of a rabbit).
As we discussed earlier regarding Daksha Prajapati's curse:
The Legend: Some Puranas suggest that when Daksha cursed Chandra to "waste away" due to his partiality toward Rohini, the physical beauty of the Moon was permanently marred.
The Result: The dark spots represent the "scars" or the remnants of that divine curse, serving as a celestial reminder of the consequences of unfairness.
Another famous story involves Lord Indra and Sage Gautama:
The Legend: In an attempt to deceive Ahalya (the sage's wife), Lord Indra took the help of the Moon to disguise the time of day. When Sage Gautama discovered the deception, he cursed both Indra and Chandra.
The Result: It is believed that the sage threw his deerskin (Krishnajina) or a wet cloth at the Moon in anger. The dark spots are said to be the permanent stains left by that impact.
చంద్రుని యొక్క శక్తి భూమిపై ఉన్న జీవరాశి పై ఎలా ప్రభావితం చేస్తుంది తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చర్చించుకుందాం. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఉన్న సముద్రాల మీద ప్రభావం చూపుతుంది. దీనివల్లనే సముద్రాలలో ఆటు - పోటు ఏర్పడతాయి. అలాగే భూమి తన అక్షం మీద స్థిరంగా తిరగడానికి చంద్రుని ఉనికి చాలా ముఖ్యం.
Scientific observation reveals that the Moon's gravitational pull exerts a profound influence on all life forms and natural phenomena on Earth, a prime example being the rhythmic rise and fall of our oceans known as tides (High Tide and Low Tide). Beyond the seas, the Moon’s presence is ecologically vital as it acts as a cosmic stabilizer; its gravitational grip prevents the Earth from wobbling excessively on its axis, thereby ensuring a stable climate and predictable seasons that allow life to flourish.
చంద్రుడు ఒక రాశిలో సుమారు రెండుంపావు రోజులు ఉంటారు. అంటే ఒక పక్షం రోజులలో లేదా 15 రోజులు సుమారు 6 నుండి 7 రాశులలో సంచరిస్తారు. మొత్తం 27 నక్షత్రాలలో రోజుకు ఒక నక్షత్రం చొప్పున ప్రయాణిస్తారు.శాస్త్రీయంగా చంద్రుడు ఒక నిర్జీవమైన గోళం అయినప్పటికీ, భూమిపై జీవరాశి మనుగడకు మరియు కాలగణన కు చంద్రుడు ఎంతో కీలకం. అందుకే మనం ఆచరించే కాల గణనను చంద్రమాన కాలం అని పిలుచుకుంటాము. భారత ఖగోళ శాస్త్రవేత్తల మేదస్సు, మన భారత దేశ అంతరిక్ష పరిశోధనా సామర్ధ్యం ప్రపంచానికి తెలియచేసిన చంద్రయాన్ మిషన్ గురించి మన అందరికి తెలిసినదే.
The Moon transits through a single zodiac sign for approximately two and a quarter days, meaning it traverses six to seven signs within a fortnight (15 days), while moving through each of the 27 Nakshatras at a rate of one constellation per day. Although scientifically categorized as an inanimate celestial sphere, the Moon remains the cornerstone of timekeeping and the very survival of life on Earth, leading to our traditional adoption of the Lunar Calendar (Chandramana) for tracking time. Our collective pride in this celestial body has only grown with the success of the Chandrayaan missions, which showcased the profound intellectual brilliance of Indian astronomers and the formidable space exploration capabilities of our nation to the entire world.
వ్యక్తిగత జాతకంలో చంద్ర గ్రహ బలం అనుకూలంగా ఉంటే జాతక ఫలితాలు:
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని స్త్రీ గ్రహంగా, ఒక సౌమ్య గ్రహంగా పరిగనిస్తాము. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. వృషభ రాశి లో ఉన్నప్పుడు చంద్రుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడు. వృశ్చిక రాశి లో చంద్రుడు అత్యంత బలహీనంగా ఉంటాడు. మనిషి ఆలోచనలు, భావోద్వేగాలు మరియు మానసిక స్థితికి చంద్రుడే కారకుడు. జాతక చక్రంలో మాతృమూర్తి గురించి తెలుసుకోవడానికి చంద్రుని స్థితిని చూస్తాము. చంద్రుడు ఎంత బలంగా ఉంటె ఆ జాతకుడికి తన తల్లి పట్ల ప్రేమాభిమానాలు అంతా ఎక్కువగా ఉంటాయి. జ్యోతిష్య రీత్యా, ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడు శుభప్రదంగా ఉంటే, ఆ వ్యక్తికి కలిగే సంతానం మంచి మనసు, సున్నితత్వం మరియు సృజనాత్మకత కలిగి ఉంటారు..
In the realm of Vedic Astrology, the Moon is revered as a feminine and gentle (Saumya) planet, serving as the celestial lord of Cancer (Karkataka Rashi). Its potency reaches its zenith when positioned in Taurus (Vrushaba), where it is exalted, while it becomes most debilitated and weak in Scorpio (Vrushika). As the primary significator of one's thoughts, emotions, and overall mental state, the Moon’s placement in a horoscope is essential for understanding an individual's relationship with their mother; a strong Moon typically manifests as deep affection and a profound bond with the maternal figure. Furthermore, when the Moon is auspiciously placed, it is believed to bless the individual with children who possess a kind heart, emotional sensitivity, and remarkable creative intelligence.
చంద్రుడు మృదు స్వభావం కలిగిన వాడు. కానీ వ్యక్తిగత జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే మనోబలం అధికంగా ఉంటుంది. అటువంటి వారు సర్వదా ప్రశాంతంగా ఉంటారు. ఎంత పని చేసినా చురుకుదనం తగ్గదు. మంచి ఊహాశక్తి కలిగి ఉంటారు. సహృదయం కలిగి ఉంటారు. క్షీర పాణం అంటే ఇష్టం కలిగి ఉంటారు. కీర్తి ని ఆర్జించడాన్ని ఇష్టపడతారు. ఇటువంటి వారు రాగి లోహంతో చేసిన వస్తువలను తమ ఇంట్లో అలంకరణ వస్తువులుగా ఉంచుకుంటారు.
The Moon is inherently gentle by nature, and when it is strongly positioned in a personal horoscope, it bestows immense psychological strength and a persistently calm demeanor. Individuals with a powerful Moon remain energetic and alert regardless of their workload, possessing a vivid imagination, a kind heart, and a natural fondness for dairy products (Ksheera Paanam). Driven by a desire for honor and fame, these individuals often have an aesthetic preference for decorating their homes with elegant copper artifacts, reflecting their refined and harmonious inner state.
జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే వారు దేవతారాధకులు అవుతారు. యజమానులకు మంచి సేవకులు అవుతారు. మానసిక చంచాల్యతను నిగ్రహించే శక్తి కలిగిన గ్రహం చంద్రుడు. ఒక ప్రదేశంలో నీటి వసతి అంటే చెరువులు, ప్రవహించే నదులు వంటి జల శక్తికి చంద్రుడే కారకుడు అవుతాడు. ఒక వ్యక్తి కి దాన గుణం అధికంగా ఉంది అంటే అది కూడా చంద్ర గ్రహ బలం వలనే. వ్యక్తిగత జాతకంలో ఉచ్చ స్థితిలో చంద్రుడిని కలిగిన వారు ప్రభుత్వ పౌర సరఫరా శాఖ నందు ఉత్తమ అధికారులు అవుతున్నారు. సదా శుభ్రమైన వస్త్రములు ధరిస్తారు. చంద్ర బలం కలిగిన జాతకులకు జల సంబంధ వ్యాపారాలు లాభిస్తాయి. ధాన్యం కొనుగోలు అమ్మకం వంటి వ్యపారములందు మధ్యవర్తులుగా రాణిస్తారు. పాల వ్యాపారం లో మిక్కిలి లాభపడతారు. చంద్రుడు వృద్ధి చెందుతుంటే అంటే శుక్ల పక్ష తిధులలో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత మరియు ఎటువంటి పరిస్తితులలలో అయినా మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటాయి.
When the Moon is strong in a horoscope, it inclines individuals toward a deep devotion to the divine and makes them exceptionally loyal and dedicated in their professional service. As the celestial regulator of mental stability, a potent Moon grants the power to control psychological fluctuations and bestows a naturally charitable disposition. Such individuals are often drawn to water-rich environments like lakes and rivers, and when the Moon is exalted, they frequently excel as high-ranking officials in government civil supplies departments. These natives take pride in wearing clean, elegant attire and find immense success in water-related industries, dairy businesses, or as prosperous intermediaries in the grain trade. Furthermore, those born during the waxing phase (Shukla Paksha) when the Moon's strength is increasing are blessed with high self-confidence, remarkable creativity, and an unwavering sense of mental peace regardless of life's circumstances.
వ్యక్తిగత జాతకంలో చంద్ర గ్రహ బలం లోపిస్తే జాతక ఫలితాలు:
వ్యక్తిగత జాతకంలో చంద్ర గ్రహ బలం లోపించిన వారికి మాట నిలకడ ఉండదు. అధిక మానసిక చపలత్వం ప్రదర్శిస్తారు. సదా ఎదో ఒక కారణం వలన మానసికంగా దిగులు కలిగి ఉంటారు. అష్టమ దోషం కూడా కలిగి ఉంటే మానసిక ఉన్మాద తత్త్వం ప్రదర్శిస్తారు. జాతకంలో చంద్రుడు క్షీణిస్తుంటే అంటే క్రిష్ణ పక్షంలో జన్మిస్తే ఆ వ్యక్తికి నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పడుతుంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా మానసిక ఆందోళన అనుభవిస్తారు. ఎవర్రితోను తమ ఆందోళన కారణాలను పంచుకోలేరు. వ్యక్తిగత జాతకంలో చంద్ర గ్రహ బలం పూర్తిగా లోపించి అపమృత్యు దోషం కూడా తోడైతే అటువంటి వారు ఆత్మహత్య ల పట్ల ఆకర్షితులు అవుతారు.
When the strength of the Moon is lacking in a personal horoscope, individuals often struggle with inconsistent speech and exhibit high levels of mental instability or restlessness. Such persons frequently suffer from persistent psychological distress due to various underlying reasons, and if this is coupled with the Ashtama Dosha (affliction in the 8th house), it can lead to severe mental imbalances or erratic behavior. Those born during the waning phase (Krishna Paksha) when the Moon’s power is diminishing tend to experience significant hesitation in decision-making and endure intense anxiety over trivial matters, often finding themselves unable to share their worries with others. In extreme cases where lunar strength is entirely depleted and accompanied by Apamrityu Dosha (threat of untimely death), individuals may unfortunately find themselves vulnerable to self-harming or suicidal tendencies.
వ్యక్తిగత జాతకంలో చంద్రుడి వలన రాణించు కారక వృత్తులు:
జాతకంలో చంద్రుడు బలంగా ఉన్న వారు నౌకాదళం (Navy) లేదా ఓడరేవులకు సంబంధించిన ఉద్యోగాలలో రాణిస్తారు. పాలకు సంబందించిన వ్యాపారములు, ముత్యాలకు సంబందించిన వ్యాపారములు, వెండికి సంబందించిన వ్యాపారములు బాగా కలసి వస్తాయి. నర్సింగ్ గానీ, మనస్తత్వ శాస్త్రం గానీ, హోటల్ మేనేజ్మెంట్ విద్య గానీ చదివి జీవితంలో రానించాలి అని అనుకుంటే వారి వ్యక్తిగత జాతకంలో చంద్రుడు కచ్చితంగా బలంగా ఉండాలి. ముఖ్యంగా ఒక జాతకుడు రచయితగా లేదా కళాకారుడుగా ఉన్నత స్థాయికి ఎదిగి గుర్తింపు తెచ్చుకోవాలి అంటే వారికి కూడా చంద్ర గ్రహ బలం జాతకంలో ఉంది తీరాలి. ఎందుకంటే చంద్రుడు మానసిక ఊహాశక్తికి అధిపతి.
Individuals with a strong Moon in their horoscope frequently excel in careers related to the Navy or maritime ports, finding great success in businesses involving dairy products, pearls, or silver. A potent lunar influence is also a vital prerequisite for those aspiring to thrive in fields such as nursing, psychology, or hotel management, as these professions demand the emotional intelligence and nurturing qualities the Moon provides. Most importantly, for an individual to achieve high-level recognition as an accomplished writer or artist, the strength of the Moon is indispensable, as it serves as the celestial lord governing the profound creative imagination and mental visualization required for such mastery.
వ్యక్తిగత జాతకంలో చంద్ర బలం కలిగిన వారు ఆర్ధిక శాఖ సంబంధ మరియు వడ్డీ వ్యాపారములందు లాభపడతారు. వీరికి మత్తు పానీయాలకు సంబందించిన వ్యాపారములు రాణిస్తాయి. వినోద కార్యక్రమాల నిర్వాహకులగా రాణిస్తారు. సంచార వృత్తులు లో పైకి వస్తారు. పప్పు ధాన్యముల వ్యాపారములు బాగా చేయగలుగుతారు. విశ్రాంతి గృహాలు అంటే లాడ్జిలు నిర్వహించడం వలన లాభ పడతారు. భోజనశాలలు లేదా హోటల్స్ వంటి పరిశ్రమలందు అధిక ధనాన్ని ఆర్జించగలుగుతారు. రక్తం, పాలు, నీరు మరియు సముద్ర ఉత్పత్తులపై చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ రంగాలలో కూడా చంద్ర బలం కలిగిన వారు ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు.
Those with strong lunar positioning in their personal horoscopes often find significant success in financial sectors, money lending, or interest-based businesses, as well as in the trade of beverages and intoxicants. Their natural flair for hospitality and entertainment makes them excellent event organizers, lodge or rest-house managers, and successful entrepreneurs in the restaurant and hotel industries. Furthermore, the Moon's profound influence over liquids—such as blood, milk, and water—as well as pulses and marine products, ensures that individuals with this planetary strength reach high positions in related fields, including maritime trade and dairy production.
వ్యక్తిగత జాతకంలో చంద్రుడి వలన ఏర్పడు మంచి జాతక యోగాలు:
జాతక చక్రంలో చంద్రుడు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు లేదా ప్రత్యేక స్థానాల్లో ఉన్నప్పుడు కొన్ని శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి:
గజకేసరి యోగం: చంద్రుడి నుండి గురువు బృహస్పతి కేంద్ర స్థానాలలో ఉంటే ఆ జాతకానికి గజకేసరి యోగం పడుతుంది. ఇది ఉన్న వ్యక్తికి సమాజంలో గౌరవం, సంపద, ఉన్నత పదవి అత్యంత సులుభంగా లభిస్తాయి.
చంద్ర-మంగళ యోగం: చంద్రుడు మరియు కుజుడు కలిసి ఉంటే ఆర్థికంగా కలిసి వస్తుంది. దీనిని లక్ష్మీ ప్రదమైన యోగంగా పరిగనిస్తాము
అధి యోగం: చంద్రుడి నుండి 6, 7, 8 స్థానాల్లో శుభ గ్రహాలు ఉంటే వ్యక్తి తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడు.
When the Moon aligns with other planets or occupies specific positions in a birth chart, it forms several powerful astrological combinations known as Yogas. The most prominent among these is the Gajakesari Yoga, which occurs when Jupiter (Guru) is in a cardinal house (Kendra) from the Moon, bestowing the individual with immense social respect, wealth, and high authority with remarkable ease.
Another significant alignment is the Chandra-Mangala Yoga, formed by the conjunction of the Moon and Mars (Kuja), which is considered a highly auspicious Lakshmi Yoga that ensures great financial prosperity.
Additionally, the Adhi Yoga arises when benefic planets are placed in the 6th, 7th, and 8th houses from the Moon, empowering the individual to rise as an unbeatable and influential leader in their field.
వ్యక్తిగత జాతకంలో చంద్రుడి వలన ఏర్పడు చెడు జాతక యోగాలు:
చంద్రుడు బలహీనపడితే మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది:
కెంద్రుమ దోషం: చంద్రుడికి ముందు రాశిలో కానీ, వెనుక రాశిలో కానీ, లేదా చంద్రుడితో కలిసి కానీ ఏ గ్రహం లేకపోతే ఈ దోషం ఏర్పడుతుంది. దీనివల్ల వ్యక్తి ఒంటరితనాన్ని అధికంగా కోరుకుంటాడు, తీవ్రమైన మానసిక ఆందోళనను అనుభవిస్తాడు.
గ్రహణ దోషం: చంద్రుడు రాహువు లేదా కేతువుతో కలిసి ఉన్నప్పుడు చంద్ర గ్రహణ దోషం ఏర్పడుతుంది. ఇది తల్లి ఆరోగ్యానికి లేదా జాతకుని మనశ్శాంతికి భంగం కలిగిస్తుంది.
విష యోగం: చంద్రుడు మరియు శని కలిసి ఒకే రాశిలో ఉంటే దీనిని విష యోగం అంటారు. ఇది నిరాశ, నిస్పృహలను కలిగిస్తుంది.
చంద్రాష్టమ దోషం: జన్మ రాశి నుండి చంద్రుడు 8వ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆ కాలాన్ని చంద్రాష్టమ కాలం అంటారు. ఇది రెండున్నర రోజులు ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు పూర్తి ప్రతికూలంగా ఉంటాడో వారికి ఈ రెండున్నర రోజులు మనస్సు అదుపులో ఉండదు. తాము ఏ పని చేస్తున్నామో వారికే స్పృహ తెలియదు. కోపం లేదా చిరాకు ఎక్కువగా వస్తుంది.
A weak or afflicted Moon in a birth chart can significantly impact one's mental well-being through several challenging astrological combinations. The Kemadruma Dosha occurs when no planets occupy the signs immediately preceding or following the Moon, or are conjunct with it, often leading to deep feelings of loneliness and intense psychological anxiety. Grahana Dosha arises when the Moon is conjunct with Rahu or Ketu, which can adversely affect the health of one's mother and disturb the native's inner peace. When the Moon and Saturn (Shani) reside in the same sign, it forms Visha Yoga, a combination known for inducing pessimism, depression, and a sense of hopelessness. Finally, Chandrashtama occurs for approximately two and a half days each month when the Moon transits the eighth house from one's birth sign; for those with a negatively placed Moon, this period can trigger a total loss of mental control, leading to extreme irritability, unexplained anger, and a clouded sense of awareness during daily tasks.
వ్యక్తిగత జాతకంలో చంద్ర గ్రహ దోషం వలన ఏర్పడే వ్యాధులు:
వ్యక్తిగత జాతకంలో చంద్ర గ్రహ బలం లోపిస్తే పురుషులు ఎడమ కన్నుకు సంబందించిన సమస్యలు బాధిస్తాయి. స్త్రీలు కుడి కన్నుకు సంబందించిన సమస్యలు, రొమ్ము భాగం, ఊపిరితిత్తులు, బహిష్టు సంబందమైన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. రుతుక్రమం క్రమం తప్పుతుంది. గర్భాశయ సంబంధ వ్యాధులు బాధిస్తాయి. శరీరంలోని రక్త ప్రసరణ మరియు జీర్ణరసాలకు సంబందించిన సమస్యలు జీవితాంతం వెంటాడుతాయి. మానసిక రుగ్మతలు బాధిస్తాయి. మానసికంగా పిరికితనం వెంటాడుతుంది.సదా దేనికి భయపడుతున్నామో కూడా తెలియని స్థితిలో ఉంటారు. వైద్య జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు శరీరంలోని "కఫ" తత్వాన్ని సూచిస్తాడు. చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు జాతకులు నిద్రలేమి, తరచుగా జలుబు, దగ్గు మరియు ఊపిరితిత్తుల సమస్యలు, రక్తహీనత, స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.
According to medical astrology, a deficiency in the Moon's strength within a personal horoscope manifests as distinct physical and psychological ailments, typically affecting the left eye in men and the right eye in women, while also leading to respiratory issues, anemia, and chronic digestive or circulatory disorders throughout one's life. Women, in particular, may suffer from irregular menstrual cycles, hormonal imbalances, and various uterine or breast-related health concerns due to an afflicted lunar position. Representing the "Kapha" constitution, a weak Moon often results in insomnia, frequent respiratory infections like colds and coughs, and a pervasive sense of mental fragility or cowardice, where the individual remains in a constant state of unexplained fear and anxiety.
చంద్ర గ్రహ బలం లోపించిన వారు నిత్యం శ్రీ వేద వ్యాసుల వారు మనకి ప్రసాదించిన మంత్రం పటించడం మంచిది “ దద్ది శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం”
ప్రతీ దినం నిద్రకు ముందు ఈ మంత్రమును పటించడం కూడా మంచిది "ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రమసే నమః"
శ్రీ గౌరీ దేవి అమ్మవారిని , చంద్ర శేఖర స్వామి వారని కలిపి ఆరాధించడం కూడా మంచిది.
తరచుగా సోమవారం రోజున పాలు, పెరుగు, బియ్యం లేదా తెల్లని వస్త్రాలు సమాజంలోని అభ్యాగతులకు దానం ఇవ్వడం మంచిది.
For those seeking to mitigate a deficient lunar influence, it is highly beneficial to recite the sacred mantra provided by Sage Veda Vyasa, which honors the Moon as the one who emerged from the Ocean of Milk and adorns the crown of Lord Shiva: "Dadhi Shankha Tusharabham Kshirodarnava Sambhavam, Namami Shashinam Somam Shambhor Makuta Bhushanam." Additionally, chanting the Beeja Mantra, "Om Shram Shreem Shroum Sah Chandramase Namah," every night before sleep, and offering combined worship to Goddess Gauri and Lord Chandrashekhara can significantly enhance mental peace and emotional stability. Complementing these spiritual practices with charitable acts on Mondays—such as donating milk, curd, rice, or white clothing to the needy—serves as a powerful Vedic remedy to strengthen the Moon's positive vibrations in one's life.
చంద్ర దోషాలు పోవాలన్నా లేదా మానసిక బలం పెరగాలన్నా కొన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి:
కార్తీక పౌర్ణమి: ఈ రోజు చంద్రుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడు. ఈ రోజు ఉపవాశం ఆచరించి శివుడిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
సంకష్టహర చతుర్థి: ప్రతీ మాసంలో వచ్చే శుక్ల లేదా క్రిష్ణ పక్ష చంద్రుడిని చూసి వినాయకుడిని పూజించడం వల్ల జాతకంలోని చంద్ర దోషాల తీవ్రత తగ్గుతుంది.
శరత్ పూర్ణిమ: ఆశ్వయుజ మాస పౌర్ణమి నాడు రాత్రిపూట చంద్రుని కిరణాల కింద ఆవు పాలను ఉంచి, మరుసటి రోజు ఉదయం ప్రసాదంగా స్వీకరించడం వలన చంద్ర గ్రహ దోష సంబంధ ఆరోగ్య సమస్యల తీవ్రత తగ్గుతుంది.
The spiritual significance of the Moon is highlighted through three sacred occasions: Kartika Purnima, when the Moon is at its maximum potency and fasting while worshipping Lord Shiva yields extraordinary divine results; Sankashtahara Chaturthi, where observing the Moon each month and worshipping Lord Ganesha significantly mitigates the severity of lunar defects (Chandra Doshas) in one's horoscope; and Sharad Purnima, the full moon of the Ashwayuja month, during which placing cow's milk under the nocturnal moonlight to be consumed as Prasadam the following morning is believed to alleviate health issues related to lunar afflictions.
చంద్రుడు కేవలం ఆకాశంలో మెరిసే ఒక ఉపగ్రహం మాత్రమే కాదు; మన ఆలోచనలను, భావోద్వేగాలను మరియు అంతరాత్మను శాసించే శక్తి. జ్యోతిష్య శాస్త్ర రీత్యా చంద్రుడు బలపడితే మనోధైర్యం, ప్రశాంతత సిద్ధరిస్తాయి. ఖగోళ పరంగా భూమికి రక్షణ కవచంలా ఉంటూ, ఆధ్యాత్మికంగా మన మనస్సుకు దిశానిర్దేశం చేసే ఈ 'నిశాకరుని' అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుందాం. మీ జాతకంలో చంద్రుని స్థితిని బట్టి సరైన పరిహారాలు పాటిస్తూ, మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందండి. లోకా సమస్తా సుఖినోభవంతు!"
The Moon is far more than a mere glowing satellite in the sky; it is a celestial powerhouse that governs our thoughts, emotions, and inner consciousness. From an astrological perspective, a fortified Moon bestows mental fortitude and profound tranquility, while astronomically, it serves as a protective shield for the Earth. May the grace of this "Nishakara" (the Maker of Night), who guides our minds spiritually and stabilizes our world physically, be upon everyone. By understanding the Moon's position in your personal horoscope and following the appropriate Vedic remedies, you can achieve mental exuberance and a truly healthy life. Loka Samasta Sukhino Bhavantu! (May everyone in the whole world be happy!)
శ్రీ చంద్ర గ్రహ పూర్ణ కుంభ కలశ సహిత జాతక దోష నివారణ శాంతి జపం.
Sri Chandra Graha Poorna Kumbha Kalasha Sahita Jataka Dosha Nivarana Shanti Japam . This is a comprehensive Vedic ritual performed to neutralize severe doshas (afflictions) caused by the Moon in one's birth chart.
చంద్ర గ్రహం ప్రధానంగా నవగ్రహ మండపారాధన హోమం మరియు చంద్ర గ్రహ రాగి యంత్ర జల నిమజ్జనం.
Special Vedic Rituals for the Moon: Navagraha Mandaparadhana Homam
రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.