Placeholder image

జ్యోతిష్య శాస్త్ర రీత్యా కుజ / అంగారక గ్రహ లక్షణాలు - జాతక ఫలితాలు

Planet Mar's Astrological Nature - Jataka Results

planet mar's astrological nature and results given to the world acccording to hindu vedic astrology

కుజ గ్రహ రహస్యాలు - జాతకంలో కుజ గ్రహం వలన కలుగు ఫలితాలు (Video)

Dr. Aravind Sidhanthi గారి వివరణ

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, తీక్షణమైన గ్రహం ఏది అంటే మనలో చాలా మందికి గుర్తుకు వచ్చే పేరు 'అంగారకుడు' లేదా 'కుజుడు'. నవగ్రహాలలో సేనాధిపతిగా పిలువబడే కుజుడు, మనలో ఉండే ధైర్యానికి, పరాక్రమానికి మరియు పట్టుదలకు కారకుడు. నవగ్రహాలలో కుజుడు 'మంగళ కారకుడు' మరియు 'శక్తికి అధిపతి'. జ్యోతిష్య శాస్త్రంలో కొంత మంది  కుజుడిని క్రూర గ్రహం అని పిలిచినప్పటికీ, ఒక వ్యక్తి  ధైర్యసాహసాలు కలిగి ఉంటాడా లేదా , భూమి లేదా గృహాలు వంటి స్థిరాస్తులు జీవితంలో సంపాదించుకోగాలాడ లేదా వారసత్వం గా సంక్రమించిన ఆస్తులను పాడు చేయకుండా నిలబెట్టుకోగలడా లేదా అనేది వ్యక్తిగత జాతకంలో కుజ గ్రహ స్థితి పైనే ఆధారపడి ఉంటుంది. అలానే ఇబ్బందులు లేని వైవాహిక జీవితం గడుపుతాడా ఇలాంటి విషయాలకు ఈ కుజ గ్రహమే ప్రధాన కారకుడు.

In Vedic astrology, Mars, known as 'Angarakudu' or 'Kujudu', is widely recognized as the most powerful and intense planet, serving as the commander-in-chief among the nine celestial bodies and the primary significator of courage, valor, and perseverance within an individual. While some astrologers categorize Mars as a malefic planet, he is fundamentally the 'bestower of auspiciousness' (Mangala Karaka) and the lord of energy; hence, a person's ability to possess bravery, acquire immovable assets like land and houses, or preserve ancestral property depends entirely on the placement of Mars in their birth chart. Furthermore, Mars plays a pivotal role in determining whether one will enjoy a harmonious and trouble-free married life, making his influence essential for both material stability and domestic happiness.

ఖగోళ శాస్త్రం ప్రకారం ఎర్రని రంగులో మెరిసిపోయే ఈ 'రెడ్ ప్లానెట్', జ్యోతిష్య శాస్త్ర రీత్యా మన జీవిత గమనాన్ని ఎలా మారుస్తుంది? మీ జాతకంలో కుజుడు బలంగా ఉంటే మీరు అపారమైన ఆస్తులను, అధికార పదవులను ఎలా పొందుతారు? ఒకవేళ కుజుడు బలహీనపడితే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు మరియు వివాహ జీవితంలో వచ్చే ఇబ్బందులు ఏమిటి? అసలు ఈ కుజ దోషం అంటే ఏమిటి? దానికి గల సులభమైన పరిహారాలు ఏవి? వీటన్నింటి గురించి ఈ రోజు ఆధునిక సైన్సు మరియు జ్యోతిష్య శాస్త్ర పరంగా  మీకు తెలియచేస్తాను. కుజుడి జన్మ వృత్తాంతం నుండి ఆయన అనుగ్రహం పొందే మార్గాల వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చిద్దాం.

How does this 'Red Planet', which shines brilliantly in the sky according to astronomy, transform the course of our lives through the lens of astrology? If Mars is strong in your birth chart, how can you attain immense wealth and authoritative positions? Conversely, what are the health issues, debt burdens, and marital struggles one might face if Mars is weakened? What exactly is 'Kuja Dosha', and what are its simple remedies? Today, I will explain all these aspects by bridging modern science and Vedic astrology, discussing everything from the mythological birth of Mars to the specific paths for attaining his divine grace.

కుజుడు కొంత మంది జ్యోతిష్యులు వర్ణించినట్టు కేవలం కోపానికి కారకుడు మాత్రమే కాదు, అంగారకుడు ఒక 'సృజనాత్మక శక్తి' (Creative Energy) కి ప్రతిరూపం. కోపం అనేది ఒక శక్తి. దాన్ని విధ్వంసానికి వాడితే అది దోషం అవుతుంది, అదే కోపాన్ని జీవితానికి ఉపయోగపడే పని కోసం అంటే ఒక భవనాన్ని నిర్మించడానికో (Civil Engineering) లేదా ఒక నూతన యంత్రాన్ని తయారు చేయడానికో (Mechanical) వాడితే అది సృజన అవుతుంది. అందుకే కుజుడు సృజనాత్మక శక్తికి అధిపతి.

Contrary to the common astrological portrayal of Mars as merely the significator of anger, he actually represents a profound 'Creative Energy.' Anger itself is a form of power; when misdirected toward destruction, it manifests as a flaw, but when harnessed for constructive purposes—such as in Civil Engineering to build a structure or in Mechanical fields to invent a new machine—it transforms into creativity. It is for this reason that Mars is recognized as the ultimate lord of creative and constructive energy.

అదుపు లేని కోపం, అదుపులో ఉన్న కోపం ఈ రెండిటికి మధ్య చాలా తేడా ఉంది. వ్యక్తిగత జాతకంలో కుజుడు అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తి తన శక్తిని ఒక పద్ధతి ప్రకారం జీవిత లక్ష్యం వైపు మళ్ళిస్తాడు. జీవితంలో ప్రయోజకుడు అవుతాడు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు భయపడి సమస్యకు దూరంగా పారిపోవడం లేదా ఎదో ఒక దారిని వెతికి  ఆ సమస్యను పరిష్కరించే ఆలోచనా విధానాన్ని కుజుడే ఇస్తాడు. ఒక వ్యక్తి వైద్యుడిగా సర్జికల్ స్కాల్పాల్ పట్టుకుని ఆపరేషన్ చేయగలగాలి అంటే ఆ వైద్యుడి జాతకంలో కుజు గ్రహ అనుకూలత ఉండాలి. అక్కడ రక్తం చిందించడం అనేది హింస కాదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టే సృజనాత్మక ప్రక్రియ.

There is a vast difference between uncontrolled anger and controlled energy; when Mars is favorably placed in one's birth chart, the individual systematically channels their inner power toward their life goals, leading to great success and accomplishment. It is Mars who grants the mindset to face challenges head-on—rather than fleeing in fear—by seeking practical solutions to any problem that arises. For instance, a surgeon's ability to hold a surgical scalpel and perform an operation requires a favorable Martian influence, as in that context, the shedding of blood is not an act of violence but a creative, life-saving process.

అంగారకుని జననం గురించి చాలా పురాణ గాధలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో నమ్మదగిన అధిక శాతం జ్యోతిషులు ఒప్పుకున్న రెండు గాధలను మీకు తెలియచేస్తాను. There are many mythological legends surrounding the birth of Mars, and I will share with you the two most credible accounts that are widely accepted by a majority of astrologers.

మొదటి పురాణ గాధ వరాహ పురాణము నకు చెందినది. దీని ప్రకారం కుజుడు భూమి పుత్రుడు. అందుకే ఆయనను 'భూపుత్ర' లేదా 'భౌమ' అని పిలుస్తారు. హిరణ్యాక్షుడు భూమిని అపహరించి సముద్ర గర్భంలో దాచినప్పుడు, శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ధరించి భూమిని రక్షిస్తాడు. ఆ సమయంలో వరాహస్వామికి, భూదేవికి కలిగిన స్పర్శ వల్ల ఒక తేజోమయమైన శిశువు జన్మించాడు. ఆ శిశువే 'కుజుడు' (కు = భూమి, జ = పుట్టినవాడు).

The first mythological legend originates from the Varaha Purana, which identifies Mars as the son of the Earth, hence the names 'Bhuputra' or 'Bhauma.' According to this account, when the demon Hiranyaksha abducted the Earth and hid her in the depths of the ocean, Lord Vishnu assumed the Varaha (boar) avatar to rescue her; the divine contact between Lord Varaha and Bhoodevi (the Earth Goddess) during this restoration resulted in the birth of a radiant child named 'Kujudu,' a name derived from 'Ku' meaning Earth and 'Ja' meaning born.

రెండవ పురాణ గాధ శివ పురాణానికి చెందినది. దీని ప్రకారం దక్ష యజ్ఞం తర్వాత సతీదేవి ఆత్మహుతి చేసుకున్నప్పుడు, విరహంతో ఉన్న పరమశివుడు కైలాసంలో తీవ్రమైన తపస్సులో ఉంటాడు. ఆ తపస్సు యొక్క వేడికి శివుని నుదుటి నుండి ఒక చెమట బిందువు భూమిపై పడుతుంది.ఆ బిందువు నుండి ఎర్రని వర్ణంతో, నాలుగు చేతులతో ఒక బాలుడు ఉద్భవిస్తాడు. భూదేవి ఆ బాలుడిని పెంచి పెద్ద చేస్తుంది. శివుని అనుగ్రహంతో ఆ బాలుడు ఆకాశంలో 'గ్రహ' పదవిని పొంది మంగళ గ్రహంగా అంటే మనం మాట్లాడుకుంటున్న కుజుడిగా మారతాడు.

The second mythological legend originates from the Shiva Purana, which states that following Sati Devi's self-immolation after the Daksha Yajna, Lord Shiva was immersed in intense penance on Mount Kailash while enduring the pain of separation. The extreme heat generated by this penance caused a drop of sweat to fall from Shiva's forehead onto the Earth, from which a red-complexioned boy with four arms emerged. This child was raised by Bhoodevi (Mother Earth), and through the grace of Lord Shiva, he eventually attained the celestial status of a 'Graha,' becoming the auspicious planet Mars that we speak of today.

కుజుడికి ఉన్న ఇతర పేర్లు - అర్థాలు:

Mars is known by several other names, each carrying a profound meaning: Angarakudu, which signifies one who is as red as a burning ember; Mangaludu, the bringer of auspiciousness who grants the determination and physical strength required to successfully complete sacred tasks; Lohitanga, referring to his distinct red-hued body; and Krura Drukku, describing one with a piercing, intense gaze and the primary significator of war and conflict.

కుజుడు రాజ గ్రహం. శివుని అంశ నుండి పుట్టినవాడు కాబట్టి సుక్షత్రియుడు.పురాణాల ప్రకారం కుజుడు ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని మాలలు వేసుకుని, చేతిలో గద లేదా శక్తి ఆయుధాన్ని ధరించి ఉంటాడు. ఆయన వాహనం గొర్రె లేదా మేషం. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో మేష రాశి ని కుజుడి స్వక్షేత్రం గా పరిగనిస్తాము. కుజుడు మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాలకు అధిపతి. ఏ జాతకులు అయితే ఈ నక్షత్రాలలో జన్మిస్తారో వారి జీవితం కుజ మహా దశతో ప్రారంభం అవుతుంది. కుజుని జన్మ నక్షత్రం పూర్వాషాడ. కుజుని అధిదేవత అగ్ని దేవుడు. కుజుని గోత్రం భరద్వాజ గోత్రం. మీలో ఎవరైనా భరద్వాజ గోత్రీకులు ఉంటె వారు కుజ గ్రహ అంశ తో జన్మించిన వారు అవుతారు.

Mars is a royal planet and, having been born from an essence of Lord Shiva, is considered a noble Kshatriya; according to the Puranas, he is depicted wearing red garments and red garlands, wielding a mace or a powerful weapon (Shakti) in his hand. His vahana (vehicle) is the ram (Mesha), which is why Aries is considered his primary own house (Swakshetra) in astrology. Mars is the ruler of the constellations Mrigashira, Chitra, and Dhanishta, meaning individuals born under these stars begin their lives with the Mars Maha Dasha; additionally, while his birth star is Purvashada and his presiding deity is Agni Deva, he belongs to the Bharadwaja Gotra, implying that those born into this lineage carry the distinct elemental essence of the planet Mars.

కుజ గ్రహ లక్షణాలు: 

The characteristics of Mars are as follows: it is fundamentally an Agni Tattva (Fire element) planet, ruling over the zodiac signs of Aries and Scorpio as its own houses. In terms of planetary strength, Mars reaches its state of Exaltation (Ucha) in Capricorn, representing its peak power, while it falls into Debilitation (Neecha) in Cancer, indicating its weakest state. Furthermore, Mars is the lord of the South direction, associated with the color red, and its designated gemstone is Red Coral (Pagadam), while its primary offering grain is Red Gram (Kandulu).

జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని 'శక్తి కారకుడు' గా పరిగానిస్తాము. ఒక వ్యక్తిలోని ఆత్మశక్తి ఏ మార్గంలో వినియోగించబడుతుందో కుజుడు నిర్ణయిస్తాడు. నృసింహావతారం పూర్తిగా కుజ గ్రహమునకు సంబందించినది. ఒక వ్యక్తి యొక్క శారీరక శక్తి , మానసిక  ధైర్యం, పరాక్రమ తత్త్వం, కోప స్వభావం మరియు మాట  పట్టుదల వంటి లక్షణాలను కుజుడు నిర్ణయిస్తాడు. భూమి సంబంధ Real Estate వ్యాపారం, వ్యవసాయం, రక్షణ రంగం లో అనగా Police లేదా Military ఉద్యోగాలు, వైద్య శాస్త్రంలో  శస్త్రచికిత్స నిపుణత, గృహ నిర్మాణాత్మక సంబంధ ఇంజనీరింగ్ విద్య , అగ్ని సంబంధిత వృత్తి పనులు వంటి పనుల ద్వార ధనార్జనకు వ్యక్తిగత జాతకంలో కుజ గ్రహ బలం ఉండాలి. కుటుంబ సంబంధాలు ముఖ్యంగా తోబుట్టువులు, జీవిత భాగస్వామి ముఖ్యంగా  స్త్రీ జాతకంలో భర్తకు కారకుడు కుజుడు అవుతాడు. వ్యక్తిగత జాతకంలో కుజుడు బలంగా అనుకూలంగా ఉంటే కుటుంబ బంధాలు బాగుంటాయి.

In Vedic astrology, Mars is considered the Shakti Karaka (significator of energy), as he determines the specific path through which an individual's inner soul-force is channeled. Deeply associated with the Narasimha Avatar of Lord Vishnu, Mars governs essential traits such as physical strength, mental fortitude, valor, temperament, and the power of one's conviction. To achieve financial success through land-related ventures like Real Estate, agriculture, the defense sector (including Police or Military services), surgical expertise in medicine, civil engineering, or fire-related professions, a strong placement of Mars in one's birth chart is essential. Furthermore, Mars is the primary significator for siblings and represents the husband in a woman’s horoscope; therefore, a strong and favorable Mars ensures harmonious family bonds and stable domestic relationships.

రాశి చక్రంలో ప్రతీ గ్రహం తాను ఉన్న స్థానం నుండి 7 వ స్థానాన్ని చూస్తుంది. మిగిలిన గ్రహాలకు 7వ దృష్టి మాత్రమే ఉండగా, కుజుడికి ప్రత్యేక దృష్టిలు ఉన్నాయి. కుజుడు తాను ఉన్న స్థానం నుండి 4వ స్థానం, 7వ స్థానం మరియు 8వ స్థానాలను కుజుడు వీక్షిస్తాడు.

In the zodiac, while every planet typically casts its gaze or aspect (Drishti) on the 7th house from its current position, Mars is unique in having additional special aspects; specifically, it possesses the power to influence and aspect the 4th, 7th, and 8th houses from wherever it is situated in a birth chart.

మన అందరికి కుజుడు అనగానే  "రెడ్ ప్లానెట్" అనే పేరు గుర్తు వస్తుంది. అలా పిలవడానికి కారణం కుజుడు  ఉపరితలంపై ఉండే ఐరన్ ఆక్సైడ్ (Iron Oxide). అంటే భూమిపై ఇనుము తుప్పు పడితే ఏ రంగులో ఉంటుందో, కుజుడి నేల కూడా అదే రంగులో ఉండటం వల్ల మనకు ఎర్రగా కనిపిస్తుంది. కుజుని సగటు ఉష్ణోగ్రత - 62 డిగ్రీలు. అంటే చాలా చల్లగా ఉంటుంది. 

When we think of Mars, the name "Red Planet" immediately comes to mind, a characteristic attributed to the abundance of iron oxide on its surface; much like how iron turns reddish-brown when it rusts on Earth, the Martian soil shares this same hue, giving the planet its iconic fiery appearance. Despite its warm color, Mars is remarkably cold, with an average surface temperature of approximately -62°C.

కుజ గ్రహం సౌర మండలంలో సూర్యుని నుండి 4వ గ్రహం మరియు రెండవ అతి చిన్న గ్రహం. కుజ గ్రహం భూమి పరిమాణంలో దాదాపు సగం పరిమాణం ఉంటుంది. మన ఇస్రో శాస్త్ర వేత్తల గణాంకాల ప్రకారం కుజ గ్రహం సూర్యుని నుండి సుమారు 23 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కుజుని వయస్సు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాలు. కుజుడిపై ఒక రోజు కాలపరిమితి భూమి కంటే కొంచెం ఎక్కువ (24 గంటల 37 నిమిషాలు). కుజుడు సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 687 భూమి రోజులు పడుతుంది. అంటే భూమి మీద రెండు ఏళ్లు గడిస్తే, కుజుడిపై ఒక ఏడాది పూర్తవుతుంది.

Mars is the fourth planet from the Sun in our solar system and the second smallest, measuring approximately half the size of Earth. According to data from ISRO scientists, Mars is situated about 230 million kilometers away from the Sun and is estimated to be 4.6 billion years old. A single day on Mars, known as a 'sol,' is slightly longer than an Earth day at 24 hours and 37 minutes, while its orbital period takes 687 Earth days to complete—meaning that for every two years that pass on Earth, only one year is completed on Mars.

కుజుడిపై వాతావరణం చాలా పల్చగా ఉంటుంది. ఇందులో 95% కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది. మిగిలినది నైట్రోజన్ మరియు ఆర్గాన్ వాయువులు. అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండటం వల్ల మానవులు నేరుగా గాలి పీల్చలేరు. భూమి గురుత్వ ఆకర్షణతో పోలిస్తే కుజునిపై 38 శాతం ఉంటుంది. 

The atmosphere on Mars is extremely thin, consisting of 95% carbon dioxide, with the remainder being nitrogen and argon gases. Due to the severe lack of oxygen, humans cannot breathe the air directly; furthermore, the planet's gravity is significantly lower than Earth's, measuring only about 38 percent of our home planet's gravitational pull.

మన భూమికి సహజ ఉపగ్రహంలా చంద్రుడు ఎలా ఉన్నాడో కుజునికి రెండు సహజ ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో మొదటి దాని పేరు ఫోబోస్. రెండవ ఉపగ్రహం పేరు దైమోస్. సౌర కుటుంబంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం అయిన ఒలింపస్ మాన్స్ (Olympus Mons) కుజ గ్రహం మీదనే ఉంది. ఇది మన ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 3 రెట్లు ఎత్తైనది. భూమి తర్వాత జీవరాశి మనుగడ సాగించడానికి అత్యంత అనుకూలమైన గ్రహంగా శాస్త్రవేత్తలు కుజుడిని భావిస్తున్నారు. అందుకే ఇస్రో (Mangalyaan), నాసా వంటి సంస్థలు కుజుడిపై అనేక పరిశోధనలు చేస్తున్నాయి.

Just as Earth has the Moon as its natural satellite, Mars is orbited by two natural satellites named Phobos and Deimos; furthermore, Mars is home to Olympus Mons, the largest volcano in the solar system, which stands nearly three times the height of Mount Everest. Scientists consider Mars to be the most habitable planet after Earth for the potential sustenance of life, which is why premier space agencies like ISRO, through its Mangalyaan mission, and NASA continue to conduct extensive research and exploration on the Red Planet.

కుజ మహాదశ కాలం 7 సంవత్సరాలు. ఈ కాలంలో మీ వ్యక్తిగత జాతకంలో కుజుడు అనుకూలంగా ఉంటే జీవితంలో అద్భుతమైన అభివృద్ధి, పదవీ యోగం పడతాయి. జాతకుడికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి. పదిమందిని ప్రభావితం చేయగల శక్తి వీరికి ఉంటుంది. ఎటువంటి సమస్యను అయినా ధైర్యంగా ఎదుర్కోవడం, మానసిక స్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది.క్రీడల్లో రాణించడం తద్వారా భూ లాభం లేదా ప్రభుత్వ ఉద్యోగ లాభం పొందడం జరుగుతుంది. ఎంతటి పిరికి తనం కలిగిన వారికీ అయినా పోరాట పటిమ అలవడుతుంది.  మందుగుండు సమానులు తయారు చేయడం, ఆయుధాలు తయారు చేయడం వంటి వృత్తుల వలన లాభపడతారు. కుజుడు భూమికి అధిపతి కాబట్టి, బలమైన కుజుడు ఉన్నవారికి సొంత ఇల్లు, పొలాలు, తోటలు మరియు రియల్ ఎస్టేట్ ద్వారా భారీ లాభాలు కలుగుతాయి. వ్యవసాయ సంబంధ పనుల వలన లాభపడతారు.

The Mars (Kuja) Mahadasha lasts for a period of 7 years, and if Mars is favorably placed in your birth chart during this time, you can expect extraordinary growth and the attainment of high-ranking positions. This period bestows the native with strong leadership qualities and the charismatic power to influence others, along with immense mental fortitude to face any challenge with courage. Furthermore, one may excel in sports, leading to gains in land or prestigious government employment, while even the most timid individuals develop a fighting spirit. As Mars rules over the earth and fire, a strong placement brings significant profits through real estate, agriculture, owning houses or orchards, and success in professions related to the manufacturing of explosives or weaponry.

కుజుడు సోదర కారకుడు. కుజ బలం వల్ల తమ్ముళ్ల నుండి లేదా అన్నల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. వారితో సత్సంబంధాలు ఉంటాయి. సోదర వర్గం నుండి మంచి ప్రేమాభిమానాలు పొందగలుగుతారు. ముఖ్యంగా తమ్ముళ్ల  లేదా చెల్లెళ్ళ నుండి చక్కటి గౌరవ అభిమానాలు అనుభవిస్తారు. పోలీస్ లేదా  మిలిటరీ సంబంధ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ముఖ్యంగా ఫైర్ సర్వీసెస్ ఉద్యోగాలకు ప్రయత్నాలు చేయడం మంచిది.  వైద్య రంగంలోని వారికి ముఖ్యంగా సర్జికల్ రంగంలోని వారికి కుజ మహా దశ బాగా యోగిస్తుంది. గృహ నిర్మాణ సంబంధ ఇంజనీరింగ్ వారికి భారీ ప్రాజెక్టులు లభిస్తాయి. మెకానికల్ రంగాల్లో త్వరగా సక్సెస్ అవుతారు. వీరు ఎప్పుడూ ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. బద్ధకం వీరి దరిచేరదు. శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది మరియు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. జాతకంలో కుజుడు బలంగా ఉంటే  మీపై కుట్రలు చేసేవారు లేదా మీ శత్రువులు మీ ముందు నిలబడలేరు. కోర్టు కేసులు లేదా ఇతర వివాదాల్లో విజయం మీదే అవుతుంది.

As the significator of siblings, a strong Mars ensures full cooperation and harmonious relationships with both elder and younger brothers, fostering deep affection and mutual respect within the family. During the Mars Mahadasha, career efforts in the police, military, or fire services are highly successful, while those in the medical field—particularly surgeons—and engineers in civil or mechanical sectors often secure major projects and rapid professional growth. Individuals with a favorable Mars remain consistently energetic and active, as the planet bestows them with excellent blood circulation and robust immunity, effectively eliminating laziness. Furthermore, a powerful Mars acts as a shield against conspiracies, ensuring that enemies cannot stand against you and granting victory in court cases or any other legal disputes.

జాతకంలో కుజ గ్రహ బలం క్షీణించినా లేదా కుజుడు నీచ స్థితిలో (కర్కాటక రాశి), శత్రు క్షేత్రాల్లో ఉన్నా ఆ వ్యక్తి జీవితంలో కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అటువంటి వారికి  విపరీతమైన కోపం, మూర్ఖత్వం తో కూడిన మొండితనం, చిన్న విషయాలకే గొడవ పడటం, తొందరపాటు కోపం వల్ల లీగల్ సమస్యల్లో చిక్కుకుంటారు. మర్మంగాలకు సంబందించిన వ్యాధులు బాధిస్తాయి.  కండరాలకు సంబందించిన వ్యాధులు ఇబ్బంది పెడతాయి. మందు గుండు సామాను పేలుడు వలన తీవ్రంగా గాయ పడడం లేదా మరణించడం జరుగుతుంది. ఎంత సంపాదించినా నిలవకపోవడం, అప్పుల ఊబిలో కూరుకుపోవడం.  రుణ బాధలు బాధిస్తాయి. రక్త సంబంధిత అనారోగ్యం లేదా ఆకస్మిక  ప్రమాదాలకు గురి కావడం వంటి ఇబ్బందులు ఎదురగును. రక్త ప్రసరణ మరియు ఎముక మజ్జ కు సంబందించిన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. రక్తహీనత (Anemia), రక్తపోటు (BP) లేదా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న గాయాలు, ఆపరేషన్లు లేదా వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తాయి.

When the strength of Mars is diminished in a horoscope, or if it is in its debilitated state (Cancer) or an enemy's sign, the individual may experience several adverse effects in life. Such persons often suffer from extreme anger, stubbornness combined with foolishness, and a tendency to pick fights over trivial matters, which frequently leads to legal entanglements due to impulsive outbursts. Physically, they may be plagued by diseases related to the private organs and muscles, or face grave dangers—including severe injury or death—from explosions involving firecrackers or weaponry. Financially, they struggle to retain wealth and often sink into a deep pit of debt and recurring financial burdens. Furthermore, a weak Mars increases the risk of blood-related illnesses, sudden accidents, and health issues involving blood circulation or the bone marrow, such as anemia, high blood pressure (BP), or various skin diseases, often resulting in frequent minor injuries, surgeries, or vehicular mishaps.

ధైర్య సాహసాలు తగ్గుతాయి. చిన్న చిన్న విషయాలకే భయపడటం మరియు ఆందోళన చెందడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆత్మవిశ్వాసం లోపించడం వలన నష్టములు ఎదుర్కొంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి వెనకాడుతుంటారు. ఉద్యోగ జీవనంలో నిర్ణయాధికారం కోల్పోతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు. ఇతరులపై ఎక్కువగా ఆధారపడతారు. భూ సంబంధిత వివాదాలు, సొంత ఇల్లు కట్టుకోవడంలో అడ్డంకులు, ఆస్తి తగాదాలు లేదా భూమి కొనుగోలు వ్యవహారాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. పోలీస్, ఇంజనీరింగ్ లేదా వైద్య రంగాల్లో ఉండేవారికి గుర్తింపు రాకపోవడం లేదా ప్రమోషన్లు ఆలస్యం కావడం జరగవచ్చు. కుజుడు బలహీనంగా ఉంటే అనవసరమైన ఖర్చులు పెరిగి, అప్పుల పాలు అయ్యే ప్రమాదం ఉంది. శరీరంలో శక్తి తక్కువగా అనిపించడం, ఎప్పుడూ అలసటగా ఉండటం వంటివి జరుగుతాయి. ప్రతీ పని విషయంలో బద్ధకం ప్రదర్శిస్తారు. సోదర వర్గంతో గొడవల వలన వారసత్వ సంబంధ ఆస్తులు ఎవ్వరికి దక్కకుండా నిలచిపోతాయి. తమ్ముళ్లు లేదా అన్నలతో సంబంధాలు దెబ్బతింటాయి. వారి నుండి ఆశించిన సహకారం లభించదు. వ్యక్తిగత జాతకంలో కుజ దోషం బలంగా ఉండి, కుజుడు బలహీనపడితే వివాహ జీవితంలో సమస్యలు తీవ్రంగా ఉంటాయి. దాంపత్య సుఖం తగ్గడం లేదా భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు. మీ కళ్ళముందే శత్రువులు మీ పైచేయి సాధిస్తున్నట్లు అనిపించడం, కోర్టు కేసులు లేదా లీగల్ సమస్యల్లో ఓటమి ఎదురవడం వంటివి జరగవచ్చు.

When Mars is weak, an individual's courage and valor diminish, leading to fear and anxiety over trivial matters, and significant losses due to a lack of self-confidence and hesitation in starting new ventures. In their professional life, they lose their decision-making power, struggle to take the right action at the right time, and become overly dependent on others. Weakness in Mars also invites land-related disputes, obstacles in building a home, property litigations, or the risk of being cheated in real estate transactions, while those in police, engineering, or medical fields may face a lack of recognition or delayed promotions. Furthermore, a debilitated Mars leads to unnecessary expenditures and the danger of falling into debt, accompanied by a constant sense of physical fatigue and persistent laziness in every task. Relationships with siblings often deteriorate, leading to a lack of cooperation and legal battles that leave ancestral properties tied up in disputes where no one benefits. If Kuja Dosha is strong and Mars is weakened in a personal horoscope, it can cause severe marital issues, including a lack of domestic happiness and frequent misunderstandings with the spouse. Finally, one may feel powerless as enemies gain the upper hand, often resulting in defeat in court cases or other legal complications.

జాతక చక్రంలో కుజుడు బలవంతుడైతే, ఆ వ్యక్తికి సహజంగానే అపారమైన శక్తి, ధైర్యం మరియు పట్టుదల ఉంటాయి. ఇవే లక్షణాలు వారిని కొన్ని ప్రత్యేకమైన వృత్తుల్లో అగ్రస్థానంలో నిలబెడతాయి. వ్యక్తిగత జాతకంలో కుజ బలం ఉన్నవారికి కలిసివచ్చే కెరీర్ ఆప్షన్లు ఈ విధంగా ఉంటాయి. కుజుడు 'సేనాధిపతి' కాబట్టి, రక్షణ రంగ సంబంధ యూనిఫామ్ ధరించే వృత్తులు వీరికి అత్యంత అనుకూలం. ఆర్మీ లేదా దేశ రక్షణ రంగంలో ఉన్నత పదవులు.పోలీస్ శాఖ, ఐపిఎస్ (IPS) స్థాయి నుండి కానిస్టేబుల్ వరకు శాంతిభద్రతల విభాగం భాద్యత నిర్వహించేవారు, అగ్నిమాపక దళంలో సాహసోపేతమైన పనులు చేయగలిగేవారు వారి వ్యక్తిగత జాతకంలో తప్పనిసరిగా అనుకూలమైన కుజ గ్రహ బలం కలిగి ఉంటారు. కుజుడు రక్తం మరియు శాస్త్ర చికిత్స పరికరాలకు, ఆయుధాలకు అధిపతి. శస్త్రచికిత్స నిపుణులుగా వీరు ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతారు. గుండె లేదా ఎముకల సర్జన్లుగా రాణిస్తారు. దంత వైద్యంలో కూడా కుజుడి ప్రభావం ఉంటుంది. ఫార్మసీ రంగం అంటే మందుల తయారీ మరియు కెమికల్స్ రంగాలలో లాభపడతారు. యంత్రాలు, లోహాలు మరియు అగ్నితో కూడిన పనులకు కుజుడు అధిపతి. మెకానికల్ & సివిల్ ఇంజనీరింగ్ యంత్రాల తయారీ లేదా భవన నిర్మాణ రూపకల్పన ఉద్యోగాల్లో రాణిస్తారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే విద్యుత్ శక్తికి సంబంధించిన ఉద్యోగాల్లో రాణింపు కలిగి ఉంటారు.

When Mars is strong in a birth chart, an individual naturally possesses immense energy, courage, and perseverance, qualities that propel them to the top of specific professional fields. Since Mars is the 'Commander-in-Chief,' careers involving uniforms and defense are highly suitable, ranging from high-ranking positions in the Army to various levels in the Police force—from IPS officers to constables—and courageous roles in the Fire Services. Because Mars rules over blood, surgical instruments, and weaponry, such individuals often achieve global fame as surgical specialists, particularly as cardiac or orthopedic surgeons, and even in the field of dentistry. Furthermore, Mars governs tasks involving machinery, metals, and fire, leading to great success in Pharmacy and chemical industries, Mechanical and Civil Engineering for machine manufacturing or structural design, and Electrical Engineering involving power and energy.

కుజుడిని 'భూపుత్రుడు' అంటారు, కాబట్టి భూమికి సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసివస్తాయి. రియల్ ఎస్టేట్: ప్లాట్లు అమ్మడం, కొనడం లేదా డెవలప్ చేయడం. వ్యవసాయం: ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం లేదా తోటల పెంపకం. నిర్మాణ రంగం (Construction): అపార్ట్‌మెంట్లు లేదా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. మైనింగ్: భూమి లోపలి నుండి ఖనిజాలను వెలికితీసే పనులు వంటి కాంట్రాక్టుల వలన మిక్కిలి లాభపడతారు. శారీరక శ్రమ మరియు పోటీ తత్వం ఉన్న చోట కుజ బలం ఉన్నవారు విజేతలుగా నిలుస్తారు. ప్రొఫెషనల్ అథ్లెట్స్ గా , రన్నింగ్, బాక్సింగ్, కుస్తీ లేదా ఫుట్‌బాల్ వంటి క్రీడలు. జిమ్ ట్రైనర్లుగా  ఫిజికల్ ఫిట్‌నెస్ సెంటర్లు నిర్వహించి లాభ పడాలి అంటే వ్యక్తిగత జాతకంలో కుజ గ్రహ అనుకూలత ఉండాలి.రాజకీయలలో ప్రత్యర్థులను ఎదుర్కొనే ధైర్యం ఉండటం వల్ల రాజకీయాల్లో మంచి నాయకులుగా ఎదగగలరు. వ్యాపార పరంగా ఆసక్తి ఉన్న వారు ముఖ్యంగా ఇనుము (Iron & Steel), అగ్నితో సంబంధం ఉన్న పరికరాలు, మరియు సెక్యూరిటీ ఏజెన్సీలు వంటి వ్యాపార రంగాల్లో రాణిస్తారు. వాదనలు బలంగా వినిపించే న్యాయవాద వృత్తి లో క్రిమినల్ లాయర్లుగా రాణిస్తారు.

As Mars is known as 'Bhuputra' (Son of the Earth), land-related businesses are highly favorable for these individuals, including real estate ventures like buying, selling, or developing plots, as well as modern agriculture and orchard farming. They often reap significant profits in the construction sector through the building of apartments or commercial complexes, and in mining contracts involving the extraction of minerals from deep within the earth. In any field requiring physical exertion and a competitive spirit, those with a strong Mars emerge as winners, excelling as professional athletes in sports like running, boxing, wrestling, or football, or succeeding as gym trainers and fitness center owners. Their innate courage to face opponents makes them formidable leaders in politics, while in business, they thrive in industries related to iron and steel, fire-related equipment, and security agencies. Furthermore, their powerful presence and assertive communication allow them to distinguish themselves as successful criminal lawyers in the legal profession.

వ్యక్తిగత జాతకంలో కుజుడు (Mars) అశుభ స్థానాల్లో ఉన్నా లేదా పాప గ్రహాల ప్రభావంతో కలిసినా కొన్ని ప్రతికూల యోగాలు ఏర్పడతాయి. వీటిని జ్యోతిష్య శాస్త్రంలో 'అశుభ యోగాలు' అని అంటారు. In Vedic astrology, if Mars (Kuja) is positioned in inauspicious houses or is influenced by malefic planets in a personal birth chart, certain adverse combinations are formed; these are known as 'Ashubha Yogas' (inauspicious yogas), which can bring challenging results in various aspects of life.

1. కుజ దోషం / Mangalik Dosham:

ఇది చాలా మందికి తెలిసిన దోషం. లగ్నం నుండి  2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉండటం వల్ల ఇది ఏర్పడుతుంది. ఈ దోష ప్రభావం వలన వివాహం జరగడంలో తీవ్రమైన ఆలస్యం, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు మరియు కొన్ని సందర్భాల్లో విడిపోయే పరిస్థితులు కల్పిస్తుంది.

This is a widely known affliction called 'Kuja Dosha' (Mars Defect). It is formed when Mars is positioned in the 2nd, 4th, 7th, 8th, or 12th houses from the Ascendant (Lagnam). The impact of this dosha can cause significant delays in marriage, lead to misunderstandings and frequent conflicts between husband and wife, and, in some cases, even create circumstances that lead to separation.

2. అంగారక యోగం / Angaraka Dosham:

జాతక చక్రంలో కుజుడు మరియు రాహువు కలిసినా లేదా ఒకరినొకరు వీక్షించినా ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్నవారు విపరీతమైన కోపం, మొండితనం కలిగి ఉంటారు. వీరి నిర్ణయాలు తొందరపాటుగా ఉండి నష్టాలకు దారితీస్తాయి. అగ్ని ప్రమాదాలలో గాయ పడడం లేదా ఆకస్మిక గాయాలకు అవకాశం ఉంటుంది.

This yoga, known as Angaraka Yoga, is formed in a birth chart when Mars and Rahu are either in conjunction or aspect each other. Individuals with this combination often possess extreme anger and stubbornness, leading to impulsive decisions that result in significant losses. Furthermore, it increases the risk of injuries from fire-related accidents or sudden physical harm.

3. కుజ-శని సంయోగం / Conjugation of Mars and Saturn:

కుజుడు అగ్ని తత్త్వం కలిగిన గ్రహం. శని వాయు తత్త్వం కలిగిన గ్రహం. వీరిద్దరి కలయిక ఒక రకమైన 'విస్ఫోటనం' వంటిది. ఇటువంటి సంయోగం జాతకంలో కలిగిన వారు జీవితంలో స్థిరపడడానికి  తీవ్రమైన పోరాటం చేయాల్సి వస్తుంది. చేసే ప్రతీ పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. 

Mars is a planet of Agni Tattva (Fire element), while Saturn is a planet of Vayu Tattva (Air element); their conjunction is often likened to an 'Explosion' or a volatile combustion. Those with this alignment in their birth chart frequently face an intense struggle to establish themselves in life, as the aggressive energy of Mars is constantly restricted by the cold, disciplining nature of Saturn. Consequently, they often encounter persistent obstacles and delays in every task they undertake, requiring immense patience and resilience to overcome.

4. కుజ-కేతు సంయోగం / Conjugation off Mars and Ketu:

కుజుడు మరియు కేతువు కలిస్తే దాన్ని 'పిశాచ యోగం' అని కూడా కొన్ని గ్రంథాలలో పేర్కొన్నారు. ఇటువంటి సంయోగం వలన జాతకులకు మానసిక అశాంతి, చర్మ వ్యాధులు మరియు తరచుగా  శస్త్రచికిత్సలు జరుగుతాయి. కారణం తెలియని భయం వీరిని సదా వెంటాడుతుంటుంది.

The conjunction of Mars and Ketu is referred to in some classical texts as 'Pisacha Yoga'. This alignment often results in profound mental unrest, skin-related ailments, and a tendency toward frequent surgeries for the native. Furthermore, individuals with this combination in their birth chart are frequently haunted by an underlying sense of unexplained fear or persistent anxiety.

కేవలం ఒక గ్రహ స్థితిని బట్టి ఫలితాలు ఉండవు, గురు దృష్టి లేదా ఇతర శుభ గ్రహాల కలయిక ఉంటే ఈ దోషాల తీవ్రత తగ్గుతుంది 

t is very true that planetary positions should never be viewed in isolation; the presence of Guru Drishti (the aspect of Jupiter) or the conjunction of other benefic planets like Venus or Mercury can significantly neutralize the intensity of these doshas. In Vedic astrology, Jupiter’s aspect is considered a powerful "divine grace" that acts as a protective shield, often transforming a potentially volatile Mars into a force for disciplined leadership and righteous action. Therefore, while a malefic combination might indicate a challenge, the overall strength of the horoscope and the balancing influence of subha grahas determine whether those challenges manifest as minor hurdles or are completely overcome through wisdom and divine intervention.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని లేదా హనుమంతుని పూజించడం అత్యంత శ్రేష్టం. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం లేదా షణ్ముఖ స్తోత్రం పఠించడం. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవడం వల్ల ధైర్యం పెరుగుతుంది.

Adoring Lord Subrahmanya Swamy or Lord Hanuman is considered the most supreme remedy for harmonizing the energy of Mars. Reciting the Subrahmanya Ashtakam or the Shanmukha Stotram every Tuesday strengthens one's inner resolve and provides divine protection. Similarly, the daily chanting of the Hanuman Chalisa is a powerful practice that exponentially increases one's courage, dispels deep-seated fears, and grants the mental fortitude needed to overcome any adversity in life.

 "ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ కుమారం శక్తి హస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం" అనే స్తోత్రాన్ని ప్రతీ రోజు పఠించడం మంచిది.

The shloka "Dharani-garbha Sambhutam Vidyut-kanti Samaprabham Kumaram Shakti Hastam Tam Mangalam Pranamamyaham" is a powerful salutation to the Red Planet, Lord Mars (Mangala).

మంగళవారం నాడు కందులు, పగడాలు, ఎర్రని వస్త్రాలను పేదలకు దానం చేయడం మంచిది. ప్రతీ మంగళవారం ఉపవాసం ఆచరించడం మంచిది. 

Donating red gram, red corals, and red clothes to the needy on Tuesdays is a powerful traditional remedy to appease Mars, as these items resonate with the planet's energy to help alleviate financial debts, improve physical vitality, and enhance one's social standing. Furthermore, observing a fast every Tuesday is highly beneficial for gaining emotional self-control, reducing impulsive anger, and building the mental perseverance necessary for success in competitive fields like surgery, engineering, or real estate.

కుజుడు అంటే కేవలం ఆగ్రహం కాదు, అది మనలో నిగూఢంగా ఉన్న అగ్ని తత్వం. ఆ అగ్నితో మనం జీవిత లక్ష్యాలను సాధించుకోవచ్చు. లేదా చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోవచ్చ.మీ వ్యక్తిగత జాతకంలో కుజుడిని సరైన దిశలో మళ్ళిస్తే, అది మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే అద్భుతమైన సృజనాత్మక శక్తిగా మారుతుంది. మీ జాతకంలో కుజుడు ఏ స్థితిలో ఉన్నా సరే.. నిరంతర సాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు తోబుట్టువులతో సత్సంబంధాలు కలిగి ఉండటం ద్వారా ఆ గ్రహ అనుగ్రహాన్ని పొంది, మీ జీవితంలో స్థిరాస్తులను, సుఖసంతోషాలను సాధించవచ్చు.

Mars does not merely represent anger; it is the latent element of fire within us that can either be harnessed to achieve life's goals or used to self-destruct. If you redirect the energy of Mars in your personal horoscope toward the right path, it transforms into a magnificent creative force that can propel your life to great heights. Regardless of Mars's position in your birth chart, you can attain the planet's grace—along with real estate assets and lasting happiness—through consistent discipline, the worship of Lord Subramanya, and by maintaining harmonious relationships with your siblings.

సర్వేజనా సుఖినోభవంతు!"

పైన పేర్కొన్న శాంతి పరిష్కారాలు మీ సమస్యలను తీర్చకపోయినా, వ్యక్తిగత జాతకంలో తీవ్రమైన కుజ గ్రహ ప్రతికూలత లేదా జాతక దోషాలు ఏర్పదినచో క్రింద పేర్కొన్న శాంతి పరిష్కారాలు ఉపయోగపడతాయి. ఈ క్రింద పేర్కొన్న శాంతులు జ్యోతిష్య సిద్దాంతులు లేదా ఋత్విక్కుల ఆధ్వర్యంలోనే జరగాలి.

  • శ్రీ కుజ గ్రహ పూర్ణ కుంభ కలశ సహిత జాతక దోష నివారణ శాంతి జపం.

    Sri Kuja Graha Poorna Kumbha Kalasha Sahita Jataka Dosha Nivarana Shanti Japam . This is a comprehensive Vedic ritual performed to neutralize severe doshas (afflictions) caused by the Mars in one's birth chart.

  • కుజ గ్రహం ప్రధానంగా నవగ్రహ మండపారాధన హోమం మరియు కుజ గ్రహ రాగి యంత్ర జల నిమజ్జనం.

    Special Vedic Rituals for the Mars: Navagraha Mandaparadhana Homam

 

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.