OurSubhakaryam Banner

కార్తీక మాసం విశిష్టత ఏమిటి? మీరు తప్పక తెలుసుకోవలసిన విషయాలు

Significance Of Karteeka Masam & Kartika Deeparadhana Rules

- Articles By Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)

🔍 Search Our Site / మా వెబ్‌సైట్‌లో సెర్చ్ చేయండి:

📺 కార్తీక మాస విశిష్టత - Dr. Aravind Sidhanthi గారి వీడియో ప్రవచనం:

నమస్కారం, హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు విశిష్టమైన మాసంగా పరిగణించే కార్తీక మాసం గురించిన ముఖ్య విషయాలను నేను మీకు ఈ వెబ్ పేజిలో తెలియచేస్తాను.

Namaskaram, I will share with you the important details about Kartika Masam, which is considered the most sacred and special month in Hindu tradition, on this web page.

చాంద్రమాన పంచాంగ గణిత సిద్ధాంత ప్రకారం పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం రావడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు ఇవ్వడం జరిగింది.

According to the calculations of the lunar calendar (Chandramana Panchanga), because the Krittika nakshatra occurs on the Pournami (full moon) day, this month was given the name Kartika Masam.

కార్తీక మాసం ఆ మహా శివుడికి, అదే విధంగా శ్రీ మహావిష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో సాయంత్రం వేళ ఆలయాల్లో లేదా మన ఇంట్లోని తులసి కోట వద్ద, నదులు లేదా చెరువుల దగ్గర దీపాలు వెలిగించడం వల్ల విశేష పుణ్యఫలం దక్కుతుంది ముఖ్యంగా అంధకారం అంటే మనిషిలోని జ్ఞానలేమి తొలగిపోతుందని మన హైందవుల నమ్మకం.

Kartika Masam is a month dear to both Lord Shiva and Lord Maha Vishnu. Lighting lamps in the evening during this month at temples, near the Tulasi plant at home, or by rivers and ponds brings immense spiritual merit. Especially, it is the belief of us Hindus that the darkness of ignorance within a person gets dispelled.

శైవ ఆచారాన్ని పాటించే వారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఉండి, ప్రదోష కాలంలో రుద్రాభిషేకం మరియు శివదర్శనం చేసుకుంటారు.శివునికి సోమవారం అత్యంత ఇష్టమైనది. అందువలన కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి విశేషమైన శక్తి ఉంటుందని భక్తుల నమ్మకం. అందువల్లనే కార్తీక సోమవారం రోజున భక్తులు ఉపవాసo పాటించి, ప్రదోష వేళల్లో శివునికి రుద్రాభిషేకం మరియు బిల్వార్చన నిర్వహిస్తారు.

Those who follow Shaivite traditions observe a fast on every Monday during Kartika Masam and perform Rudrabhishekam and Shiva darshan during the Pradosha time. Monday is extremely dear to Lord Shiva. Therefore, devotees believe that every Monday in Kartika Masam holds special spiritual power. For this very reason, devotees observe a fast on Kartika Mondays and perform Rudrabhishekam and Bilwarchana to Lord Shiva during the Pradosha hours.

మన హైందవ పురాణాల ప్రకారం కార్తీక మాసానికి, పరమశివునికి మధ్య అత్యంత విడదీయరాని, ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఈ మాసంలో శివుని ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉండటానికి ప్రధాన కారణం త్రిపురాసురులు అనే ముగ్గురు అసుర రాజులు. ఈ త్రిపురాసురులు ముల్లోకాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుండగా, పరమశివుడు కార్తీక పౌర్ణమి రోజున వారిని సంహరించి ముల్లోకాలకు రక్షణ కల్పించాడు. ఆనాటి నుండి ఆ పరమశివుడు కార్తీక మాసంలో అత్యంత శక్తి వంతంగా ఉంటారు అనే నమ్మకంతో తమ కోరికలు సిద్ధింప చేసుకోవడానికి , తమ జ్ఞాన సంపదను పెంచుకోవడానికి కార్తీక మాసంలో తమదైన రీతిలో మన పూర్వికులు శివారాధన చేయడం ప్రారంభించారు. కార్తీక మాసంలో చలికాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శివునికి ఎంతో ఇష్టమైన చల్లటి నీటితో అభిషేకాలు చేయడం వలన ఆయనను త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చు అని భక్తుల నమ్మకం.

According to our Hindu puranas, there is an inseparable and special relationship between Kartika Masam and Lord Shiva. The main reason for the high significance given to the worship of Lord Shiva during this month is the demon kings known as Tripurasuras. When these Tripurasuras were severely troubling the three worlds, Lord Shiva destroyed them on the day of Kartika Pournami and protected the three worlds. Ever since that day, believing that Lord Shiva is exceptionally powerful during Kartika Masam, our ancestors began worshipping Him in their own way during this month to fulfill their desires and increase their wealth of knowledge. The winter season begins during Kartika Masam. It is the belief of devotees that by performing abhishekams with cool water—which is very dear to Lord Shiva—during this time, He can be appeased quickly.

ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో జ్వాలా తోరణం నిర్వహించడం మన శైవ సంప్రదాయాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం. కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో నిర్వహించే ఈ జ్వాలా తోరణం వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. తారకాక్షుడు, విద్యున్మాలి మరియు కమలాక్షుడు అనే ముగ్గురు అసుర రాజుల కూటమిని త్రిపురాసురులు అని పిలిచేవారు. బ్రహ్మ యొక్క వరం వలన ఈ త్రిపురాసురులు సామాన్య మానవుల వలన మరణం లేని వరాన్ని పొందారు. ఆ వరం తరువాత దేవతలను, మునులను తీవ్రంగా హింసించడమే కాకుండా సమస్త లోకాలపై యుద్ధాన్ని ప్రకటించారు.

Especially on the day of Kartika Pournami, organizing 'Jvala Thoranam' in Shiva temples is an important tradition in our Shaivite customs. There is an interesting mythological story behind this Jvala Thoranam conducted in Shiva temples on Kartika Pournami. The coalition of three demon kings named Tarakaksha, Vidyunmali, and Kamalaksha was called the Tripurasuras. Due to a boon from Brahma, these Tripurasuras obtained the boon of not meeting death at the hands of ordinary mortals. Following that boon, they not only severely tortured the gods and sages but also declared war on all the worlds.

ఈ త్రిపురాసురుల అరాచకాలు మరింత విపరీత ధోరణిలోకి వెళ్ళడంతో దేవతలందరూ పరమశివుని శరణు కోరారు. అప్పుడు శివుడు మహామేరువును విల్లుగా, విష్ణు అంశను బాణంగా, అగ్నిదేవుని అంశను బాణాగ్రంగా ఉపయోగించుకొని, సూర్యడు ప్రసాదించిన రధంపై త్రిపురాసురులపై ఒక మహా యుద్ధాన్ని ప్రారంభించారు.

As the atrocities of these Tripurasuras reached extreme levels, all the gods sought refuge in Lord Shiva. Then Lord Shiva initiated a great war against the Tripurasuras, using Mount Meru as His bow, the aspect of Lord Vishnu as the arrow, the aspect of Agni (the fire god) at the tip of the arrow, and riding on a chariot provided by Surya (the sun god).

అనేక రోజులు సాగిన ఈ యుద్ధంలో కార్తీక మాస పౌర్ణమి రోజున పరమశివుడు అత్యంత ఉగ్రరూపుడై తన శక్తివంతమైన త్రినేత్రాన్నితెరవడంతో ఆ ముగ్గురు అసుర రాజులు ఆ లయకారుడి భీకరమైన క్రోధాగ్నిజ్వాలలో దహనం అయ్యారు. ఈ విజయోత్సవానికి ప్రతీకగానే శివాలయాల్లో జ్వాలా తోరణం లేదా అగ్నితోరణం ఏర్పాటు చేసి దుష్ట శక్తిని ఎల్లప్పుడూ ఆ దైవ శక్తి అణచి వేస్తుంది అని గుర్తు చేసుకుంటూ ఆ పరమ శివునికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము.

In this war that lasted for many days, on the full moon day of Kartika Masam, Lord Shiva assumed an intensely fierce form and opened His powerful third eye, causing those three demon kings to be consumed in the fierce flames of anger of the destroyer. As a symbol of this victory celebration, we set up a Jvala Thoranam or Agni Thoranam in Shiva temples, reminding ourselves that divine power always subdues evil forces, and we express our gratitude to Lord Shiva.

జ్వాలా తోరణం యొక్క అగ్నిని దర్శించడం, ఆ తోరణం కింద నడవడం ద్వారా త్రిపురాసురులను దహించిన ఆ పరమ శివుని అగ్నిరూపమైన తేజస్సు మనకూ లభిస్తుందని, ఈ జ్వాలా తోరణం కింద నుంచి భక్తి శ్రద్ధలతో నడవడం వల్ల తెలియక చేసిన పాపాల తీవ్రత తగ్గుతుంది అని మరియు మానసిక తేజస్సు వికసిస్తుంది అని మన పురాణ ఉవాచ.

According to our Puranas, witnessing the fire of the Jvala Thoranam and walking under that arch bestows upon us the fiery radiance of Lord Shiva who consumed the Tripurasuras. It is believed that walking under this Jvala Thoranam with devotion reduces the intensity of sins committed unknowingly and causes mental brilliance to blossom.

అగ్ని దేవుడు మనలోని సమస్త మాలిన్యాలను మరియు పాపత్వ ఆలోచనలను దహిస్తాడు. ఆలయ ముఖద్వారాన్ని తలపించేలా గడ్డితో లేదా తాటి మట్టలతో కట్టిన ఈ తోరణానికి నిప్పు పెట్టడం ద్వారా, ఆ ప్రాంతంలోని మరియు భక్తులలోని నెగెటివ్ ఎనర్జీ నశిస్తుందనేది మన విశ్వాసం. జ్వాలా తోరణ సమయంలో అగ్నిని చూస్తూ నమస్కరించేటప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని పటించాలి.:

"తాపత్రయ హర యోగ్యమ్, త్రిపురాంతక పూజితమ్ | జ్వాలా తోరణ రూపం త్విదం, దర్శనాత్ పాప నాశనమ్"

Agni Dev (the fire god) burns away all our impurities and sinful thoughts. By setting fire to this arch made of grass or palm leaves, which resembles a temple gateway, it is our belief that the negative energy in that area and among the devotees gets destroyed. While bowing down and looking at the fire during Jvala Thoranam, the following shloka should be recited:

'Tapatraya hara yogyam, Tripurantaka pujitam | Jvala thorana rupam tvidam, darshanat papa nashanam' (Meaning: O thou who art fit to remove the threefold miseries, who art worshipped by the destroyer of Tripura, this form of Jvala Thoranam—the mere sight of it destroys sins.)

కానీ జ్వాలా తోరణం పూర్తిగా అగ్నికి ఆహుతి అవ్వకుండానే ఆ తోరణాన్ని కట్టడానికి ఉపయోగించిన గడ్డిని లేదా తాటి మట్తలను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకుంటే మంచిది అనే ఒక భ్రమలో పవిత్రమైన జ్వాలా తోరణ ఘట్టాన్ని అర్ధరహితం చేస్తున్నాము.

However, by falling into the misconception that it is auspicious to take home the grass or palm leaves used to build the Jvala Thoranam before the arch is completely consumed by fire and keep them in our homes, we are rendering the sacred ritual of Jvala Thoranam meaningless.

ఇక కార్తీక మాసంలో దీపారాధన అంటే ఆకాశదీప వ్రతం చేయడానికి లేదా ఇంటి సింహ ద్వారం వద్ద లేదా ఇంటి తులసి అమ్మవారి వద్ద దీపారాధన చేయడానికి కారణం ఏమిటి అంటే ఆ పరమ శివుడు తేజోమయుడు మరియు జ్యోతి స్వరూపుడు. ఈ మాసంలో కార్తీక దీపాలు వెలిగించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుందని మరియు అజ్ఞానం తొలగిపోతుందని మన హైందవ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

Now, coming to the reason for performing deeparadhana in Kartika Masam—such as the Akashadeepa vratham, or lighting lamps at the main entrance of the house, or near mother Tulasi—it is because Lord Shiva is the embodiment of divine light (Tejomayudu) and radiance (Jyoti Swarupudu). Our Hindu shastras state that lighting Kartika lamps during this month brings the grace of Lord Shiva and dispels ignorance.

కార్తీక మాసంలో దీపారాధనకు ఏ నూనె వాడితే ఎలాంటి ఫలితం ఉంటుందో, అలాగే ఎన్ని వత్తులు వెలిగించాలనే దానిపై కూడా మన శాస్త్రాల్లో కొన్ని ప్రత్యేక నియమాలు చెప్పబడ్డాయి.

Our shastras have also laid down specific rules regarding which oil to use for deeparadhana in Kartika Masam and the corresponding results, as well as how many wicks should be lit.

సమస్త దీపారాధనల్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం అత్యంత శ్రేష్టమైనది. ఇది మన గృహంలో సాత్వికతను, ఐశ్వర్యాన్ని మరియు మనశ్శాంతిని ప్రసాదిస్తుంది.

Lighting a lamp with cow's ghee among all deeparadhanas is the most auspicious. It bestows sattvic qualities, prosperity, and peace of mind in our homes.

కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన జాతక సంబంధ, గోచార సంబంధ శని దోషాలు తగ్గుతాయి మరియు అపమృత్యు దోషం తొలగుతుంది. ఆ పరమశివుని యొక్క మరియు శనైచ్చరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది.

Lighting a lamp with sesame oil (nuvvula none) during Kartika Masam reduces horoscope-related and transit-related Shani doshas (malefic effects of Saturn) and removes apamrityu dosha (fear of untimely death). One receives the grace of both Lord Shiva and Lord Shanaishchara.

కార్తీక దీపాన్ని ఆముదంతో వెలిగించడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మరీ ముఖ్యంగా సంతాన సౌభాగ్యం కలుగుతుందని శాస్త్ర వచనం.

According to the shastras, lighting the Kartika lamp with castor oil (amudam) increases fame and reputation, and most importantly, bestows the fortune of progeny.

కార్తీక దీపంలో వేసే వత్తుల సంఖ్య వలన ఏ ఫలితాలు పొందుతారో మీకు ఇప్పుడు తెలియచేస్తాను. Now I will explain to you the results obtained based on the number of wicks placed in the Kartika deepam.

ఒక వత్తి ని సాధారణ నిత్య పూజలకు, మామూలు దీపారాధనకు ఉపయోగించాలి. A single wick is to be used for ordinary daily worship and routine deeparadhana.

రెండు వత్తులును ఉపయోగించడాన్ని యుగళ వత్తి అని పేర్కొంటాము. రెండు వత్తులు ఉపయోగించడం వలన భార్యాభర్తల మధ్యో అన్యోన్యత, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతాయి.

Using two wicks is referred to as a yugala vatti. Using two wicks increases harmony between husband and wife and unity among family members.

సంతాన ప్రాప్తి కోరుకునే వారు మరియు ఆరోగ్య సిద్ధి కోసం ప్రయత్నిస్తున్న వారు మూడు వత్తులతో కార్తీక దీపారాధన చేయాలి.

Those desiring progeny and seeking good health should perform Kartika deeparadhana with three wicks.

ఐదు వత్తులు ఉపయోగిస్తే దానిని పంచముఖ దీపం అని పిలుస్తాము. కార్తీక మాసంలో పంచముఖ దీపం వెలిగించడం చాలా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. ఇది అష్టైశ్వర్యాలను, సకల బాధల నుంచి కుటుంబానికి శుభాన్ని ప్రసాదిస్తుందని శాస్త్ర వచనం.

Using five wicks is called a panchamukha deepam. Lighting a panchamukha deepam during Kartika Masam bestows immense spiritual merit. According to the shastras, it grants the eight forms of wealth (ashtishwaryas) and prosperity to the family, protecting them from all afflictions.

కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపాన్ని వెలిగించడం సంవత్సరంలోని ప్రతీ రోజు దీపారాధన చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఈ దీపాన్నేమహా కార్తీక దీప ఆరాధన గా పేర్కొంటారు. ఈ మహా కార్తీక దీప ఆరాధనకు ఆవు నెయ్యి ఉపయోగించడం శ్రేష్టమైనది.

Lighting a lamp with 365 wicks on the day of Kartika Pournami gives the merit of performing deeparadhana every single day of the year. This lamp is referred to as 'Maha Kartika Deepa Aradhana'. Using cow's ghee for this Maha Kartika Deepa Aradhana is the most auspicious.

మీరు ఎన్ని వత్తులను ఉపయోగించినా, ఏ ద్రవ్యంతో కార్తీక దీపాన్ని వెలిగించినా కార్తీక దీపం వెలిగించినప్పుడు ఈ క్రింది మంత్రాన్ని పటించండి

"దీపo జ్యోతిః పరబ్రహ్మ దీపజ్యోతిర్జనಾರ್దనః | దీపో హరతు మే పాపం హర సంధ్యాదీపో నమోస్తు తే "

No matter how many wicks you use or which oil or ghee you use to light the Kartika lamp, chant this mantra while lighting it:

'Deepam jyotih parabrahma deepajyotirjanardanah | Deepo haratu me papam hara sandhyadeepo namostu te'

(Meaning: Salutations to the divine light of the lamp, which is Parabrahma and Janardana. May the evening lamp remove my sins; I bow to you, O lamp.)

ఈ శ్లోకాన్ని మనసారా పటించడం వలన ఇంట్లో సానుకూల శక్తి మరియు శాంతియుత వాతావరణం ఏర్పడతాయి. Chanting this shloka with all your heart brings positive energy and a peaceful atmosphere into the home.

కార్తీక మాసం పరమశివుడికే కాకుండా మహావిష్ణువుకి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. వైష్ణవ ఆచారాన్ని పటించే వారు ఈ కార్తీక మాసాన్ని 'దామోదర మాసంగా' పిలుస్తారు మరియు ఆ శ్రీహరిని పూజిస్తారు.

Kartika Masam is not only dear to Lord Shiva but also immensely pleasing to Lord Maha Vishnu. Those who follow Vaishnavite traditions call this Kartika Masam 'Damodara Masam' and worship Sri Hari.

విష్ణువుకు కార్తీక మాసానికి సంబంధ ఏమిటి? శ్రీ మహా విష్ణువు కూడా కార్తీక మాసాన్ని ఇంతగా ఇష్టపడటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు, కార్తీక మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి నాడు యోగనిద్ర నుండి మేల్కొంటారు. అందుకే ఈ మాసాన్ని విష్ణువు తన యోగ నిద్ర నుండి మేల్కొనే పవిత్ర కాలంగా, దేవోత్సవ సమయంగా భావిస్తారు. మరియు ఈ ద్వాదశి ని ఉత్తాన ద్వాదశి పర్వదినం గ పరిగనిస్తాము. ఈ ద్వాదశి తో చాతుర్మాస వ్రతం పూర్తి అవుతుంది.

What is the connection between Lord Vishnu and Kartika Masam? The main reason Lord Maha Vishnu loves Kartika Masam so much is that Lord Maha Vishnu, who enters yogic sleep on Shukla Paksha Ekashadi in the month of Ashadha, awakens from yogic sleep on Shukla Paksha Dwadashi in the month of Kartika. Therefore, this month is considered the sacred period when Lord Vishnu awakens from His yogic sleep, a time of divine celebration (Devotsava). And this Dwadashi is observed as the festival day of Utthana Dwadashi. With this Dwadashi, the Chaturmasa vrata concludes.

కార్తీక మాసాన్ని వైష్ణవులు 'దామోదర మాసం' అని పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించే భక్తులు ఈ కార్తీక మాసంలో లేదా వారు దామోదర మాసంగా పిలుచుకొనే ఈ మాసంలో ప్రతీ రోజు దామోదర అష్టకం పఠిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ మాసంలో దామోదర అష్టకాన్ని చదువుతూ చేసే పూజ లేదా దీపారాధన అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది అని పద్మ పురాణంలో పేర్కొనబడింది.

Vaishnavites call Kartika Masam 'Damodara Masam'. Devotees who follow Vaishnavites traditions worship Lord Vishnu throughout this month—which they refer to as Damodara Masam—by reciting the Damodara Ashtakam every day. It is stated in the Padma Purana that worship or deeparadhana performed while reading the Damodara Ashtakam during this month bestows infinite spiritual merit.

కార్తీక మాసంలో బంధు మిత్రులతో కలసి వన భోజనాలు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రకృతి వడిలో ఉసిరి చెట్టును పూజించి, ఆ ఉసిరి చెట్టు కింద వంట వండుకుని భోజనం చేయడం ద్వారా ఉసిరి చెట్టు అధిదేవత అయిన శ్రీ లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది అని పురాణ ఉవాచ.

According to the Puranas, the main purpose of having Vana Bhojanam (picnics in nature) with relatives and friends during Kartika Masam is to worship the Amla (Usiri) tree in the lap of nature, cook food under it, and partake of the meal, thereby receiving the grace of Goddess Sri Lakshmi, the presiding deity of the Amla tree.

అదే విధంగా కార్తీక మాసంలో తులసి మాతకు, శ్రీ మహావిష్ణువు మరో రూపం అయిన శాలిగ్రామానికి వైభవంగా వివాహం చేస్తారు. ఈ తులసి వివాహం శ్రీహరికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు.

Similarly, during Kartika Masam, the ceremonial wedding (Vivaham) of Mother Tulasi with Saligrama, who is another form of Lord Maha Vishnu, is conducted grandly. This Tulasi Vivaham is considered extremely dear to Sri Hari.

అదే విధంగా కార్తీక మాసంలో మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి క్షీరసాగరంలో నివసిస్తారని భావిస్తాము. అందుకే ఈ మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి పూజ చేయడం, వన భోజన సమయంలో బంధు మిత్రులతో కలసి ఉసిరి చెట్టు కింద శ్రీ మహా లక్ష్మిని పూజించి ఆ ప్రసాదాన్ని భుజించడం ద్వారా సాక్షాత్ లక్ష్మీసమేత విష్ణు అనుగ్రహం లభిస్తుంది.

Similarly, it is believed that during Kartika Masam, Lord Maha Vishnu resides in the Ksheerasagara (ocean of milk) along with Goddess Lakshmi. Therefore, performing Kshirabdhi Dwadashi puja during this month, and worshipping Goddess Maha Lakshmi under the Amla tree together with relatives and friends during Vana Bhojanam and partaking of that prasadam, bestows the grace of Lord Vishnu accompanied by Goddess Lakshmi.

కార్తీక మాసంలో కొన్ని ఆహార పదార్థాలను తినకూడదని మన సంప్రదాయంలో చెబుతారు. దీని వెనుక ఆధ్యాత్మిక కారణాలతో పాటు అద్భుతమైన ఆయుర్వేద కారణాలు కూడా దాగి ఉన్నాయి. కార్తీక మాసంలో ఏ పదార్థాలు తినకుండా ఉండడం మంచిది మరియు దాని వెనుక ఉన్న ఆరోగ్య కారణాలు ఏమిటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం.

Now let us examine the food items that are traditionally avoided during Kartika Masam and the wonderful Ayurvedic and health reasons behind those customs.

కార్తీక మాసంలో మాంసాహారాన్ని విడిచి పెట్టి శాకాహారాన్ని మాత్రమే స్వీకరించాలి.

కార్తీక మాసంలో శీతాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మన శరీరంలో జీర్ణశక్తి మందగిస్తుంది. మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది దీని వలన అజీర్ణ సంబంధమైన సమస్యలు బాధిస్తాయి. అందుకే శరీరాన్ని తేలికగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంసాహరానికి దూరంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతుంది.

Giving up non-vegetarian food and adopting a pure vegetarian diet during Kartika Masam is a well-established tradition. As winter sets in during this month, the atmospheric changes cause our digestive fire (agni) to slow down. Non-vegetarian food takes longer to digest, which can lead to indigestion and related discomforts. Therefore, Ayurveda recommends staying away from non-vegetarian food to keep the body light and healthy.

కార్తీక మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, పుట్టగొడుగులు వంటి ఆహార పదార్ధాలను తినకూడదు.

ఆయుర్వేదంలో ఉల్లి, వెల్లుల్లిని 'తామసిక' గుణాన్ని పెంచే ఆహారంగా పరిగానిస్తాము. ఇవి మనలో అనవసరమైన ఉద్రేకాన్ని కలుగచేస్తాయి. కావునా మన మనస్సును, శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి ఉల్లి, వెల్లుల్లిని తినకుండా ఉండడం మంచిది.

In Ayurveda, onion and garlic are classified as tamasic foods that increase lethargy and agitation, and affect mental clarity. Avoiding them during this spiritually significant month helps maintain a calm mind, emotional balance, and enhanced concentration for meditation and prayers.

కార్తీక మాసంలో వంకాయ తినకూడదనే నియమం చాలా ప్రాంతాలలో పాటిస్తారు.

దీనికి గల ప్రధాన కారణం చలి కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేదరీత్యా వంకాయ శరీరంలో కఫాన్ని పెంచే స్వభావం కలిగి ఉంటుంది. చలికాలంలో వంకాయ తింటే దగ్గు, ఆయాసం, జలుబు, అలెర్జీలు లేదా చర్మ సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే కఫాన్ని అణచిపెట్టేందుకు వంకాయను తినకుండా ఉండడం మంచిది.

In many regions, there is a tradition of avoiding brinjals (vankaya) during Kartika Masam. The main reason for this is that winter brings higher moisture and dampness in the air. According to Ayurveda, brinjals tend to increase kapha (phlegm/mucus) in the body. Consuming them during the cold season can increase the likelihood of cough, breathlessness, colds, allergies, or skin issues. Therefore, avoiding brinjals helps keep kapha in check and maintains respiratory health.

పులిసిన ఆహార పదార్థాలు అంటే పెరుగు వంటి ఆహార పదార్ధాలు కార్తీక మాసంలో తినకూడదు.

పులిసిన పదార్ధాలు శరీరంలో ఆరోగ్య సమతుల్యతను ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో పులిసిన పెరుగు పదార్ధాలు తింటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

Similarly, fermented foods such as curd (perugu) are avoided during Kartika Masam. Fermented items can disturb the body's health balance, and consuming curd—especially at night during the cooler season—can lead to health issues like colds and joint stiffness.

పవిత్ర కార్తీక మాస దీక్షలో ఉన్నవారు మత్తు పదార్థాలకు, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.

మద్యం కాలేయాన్ని మరియు నాడీ వ్యవస్థను బలహీనపరుస్తుంది. చలికాలంలో ఇది రక్త ప్రసరణపై ప్రభావం చూపి మనలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.

Those observing the sacred Kartika Masa deeksha must stay completely away from intoxicants and alcohol. Alcohol weakens the liver and nervous system, affects blood circulation during the cold winter months, and lowers our immunity.

మన పెద్దలు చెప్పిన ఈ ఆహార నియమాలన్నీ కేవలం దైవారాధన కోసమే కాకుండా, కాల చక్రం వర్షాకాలం నుండి చలి కాలానికి మారే ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేద శాస్త్రం ఆధారంగా రూపొందించబడినవే. కార్తీక మాసంలో ఉసిరి, తాజా ఆకుకూరలు, వేడి నీళ్లు, సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరం తన రోగ నిరోధక శక్తిని పెంచుకోగలుగుతుంది.

Well said! All these dietary rules laid down by our elders are a brilliant blend of spiritual discipline and deep Ayurvedic wisdom. As seasons shift and winter sets in, our digestive capacity naturally fluctuates. Embracing fresh green leafy vegetables, nutrient-rich amla (usiri), warm water, and wholesome sattvic food acts as a natural shield, boosting our immunity and keeping both body and mind energized throughout the month.

పవిత్ర కార్తీక మాసంలో మీరు శైవ ఆచారాన్ని పాటించే వారైన లేదా వైష్ణవ ఆచారాన్ని పటించే వారు అయినా సంపూర్ణ విశ్వాసంతో కూడిన భక్తిని కలిగి ఉండడం ముఖ్యం. కార్తీక మాసంలో నిత్యం మీరు పంచాక్షరి మంత్రం పటించినట్లయితే ఆ లయకారకుడైన శివుని అనుగ్రహం ద్వారా మనలోని అజ్ఞానాన్ని తొలగి జ్ఞానం పెంపొందుతుంది. మీరు అష్టాక్షరి మంత్రం పటించినట్లు అయితే పాలకడలిలో కొలువుండే ఆ మహావిష్ణువు శరణాగతి పొందుతారు. పంచాక్షరి మంత్రం అయిన ఓం నమః శివాయ అయినా , అష్టాక్షరి మంత్రం అయిన ఓం నమో నారాయణాయ అయినా మనలోని ఇంద్రియాలను నిగ్రహించి, దైవ మార్గంలో నడిపించే దిక్సూచిలా పనిచేస్తాయి.

Well said. Whether one follows Shaivite or Vaishnavite traditions, unwavering devotion and faith are the true essence of Kartika Masam. Chanting the Panchakshari mantra ('Om Namah Shivaya') invokes the grace of Lord Shiva to dispel ignorance and awaken supreme wisdom, while chanting the Ashtakshari mantra ('Om Namo Narayanaya') grants the ultimate surrender and refuge in Lord Maha Vishnu. Both mantras act as a divine compass, subduing our senses and guiding us firmly along the path of righteousness.

Useful Links & Personalised Services (ఇతర ముఖ్యమైన లింకులు):

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

Connect on WhatsApp

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.