Sree Parabhava Nama Samvatsara Vrushabha Rasi / Taurus Sign Free Telugu Rasi Phalalu
-Predictions by Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)
పూర్వ పద్దతిలో వృషభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "2". ఇది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సౌకర్యవంతమైన జీవితం ఏర్పడుట సూచిస్తున్నది.
According to the traditional method, the remainder number for Vrishaba Rashi (Taurus) is '2'. This indicates that in the Sri Parabhava year, those born under Taurus will experience a comfortable and convenient life.
రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
వృషభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనగా 19 మార్చ్ 2026 నుండి 6 ఏప్రిల్ 2027 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అధిక భాగం అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. విద్యా శాఖ లేదా ఉపాద్యాయ వృత్తులకు సంబందించిన వారికి ఈ సంవత్సరం బాగా కలసి వస్తుంది. 31 మే 2026 వరకు ఆశించిన విధంగా ధన సంపదను నిలువ చేసుకోగలరు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా పక్షవాతం, రక్త నాళాల సమస్యలతో బాధ పడుతున్న వారు ఈ సంవత్సరం ఉపశమనం పొందుతారు. సామాజికంగా మీ కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. 01 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు ఉన్నకాలంలో మీ జీవన అభివృద్దికి మీ సోదర వర్గం సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రభావంతమైన స్థానాల్లో ఉన్న మీ సోదర సోదరి వర్గం వలన ఆర్ధికంగా లాభ పడతారు. వ్యక్తిగత జాతకం లో గురు గ్రహ బలం లోపించిన లేదా వ్యతిరేకంగా కలిగి ఉన్న వారికి మాత్రం సోదర సోదరి వర్గం వలన సమస్యలు ఎదురగును. 31 అక్టోబర్ 2026 నుండి 23 జనవరి 2027 వరకు గురు గ్రహం వలన అంతగా గొప్ప అనుకూల ఫలితాలు ఉండవు. ముఖ్యంగా విద్యార్ధులకు ఈ కాలం పరీక్షా కాలంగా ఉండును. అధికంగా శ్రమించాల్సి వస్తుంది. రోహిణి నక్షత్ర జాతకులకు ఈ కాలం లో నూతన వాహన యోగం ఏర్పడు సూచనలు ఉన్నవి. ఈ కాలంలో భూ సంబంధ క్రయవిక్రయాలు చేయకుండా ఉండుట మంచిది. ఈ కాలం లో స్థిరాస్తి సంబంధ విషయాలలో కుటుంబ సభ్యులు మాట నిలబెట్టుకోరు. 24 జనవరి 2027 నుండి 06 ఏప్రిల్ 2027 వరకు గురు గ్రహం వలన తిరిగి చక్కటి అనుకూల ఫలితాలు ఎదురగును. వ్యక్తిగత జీవితంలో సుఖ ప్రదమైన కాలం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం వృషభ రాశి లో జన్మించిన శిశువులు భవిష్యత్ కాలంలో సర్వ శాస్త్ర విదారులు అగుటకు అధిక సూచనలు ఉన్నవి.
For those born under Vrushabha Raasi, the Sree Parabhava Naama Samvatsaram (March 19, 2026 – April 6, 2027) promises a largely favorable period driven by Jupiter's positive transit, especially for those in the education sector and those seeking relief from chronic vascular or paralytic health issues. While the period until May 31, 2026, is excellent for wealth accumulation and social prestige, and the months between June and October offer significant support from influential siblings, caution is advised from October 31, 2026, to January 23, 2027, as students may face academic pressures and real estate dealings could encounter family disputes. However, Rohini Nakshatra natives may still acquire new vehicles during this lull, and as the year concludes with a return to personal prosperity starting January 24, 2027, the stars further suggest that children born in this Rashi this year are destined to become versatile scholars of the sciences.
వృషభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శనైచ్చరుల వలన సంవత్సరం అంతా అతి చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. శని యొక్క అనుకూల ప్రభావం వలన వృషభ రాశి వారు తొందరపాటు పడకుండా మిక్కిలి సంయమనం ప్రదర్శిస్తారు. వైరాగ్య భావాల పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య రంగానికి చెందిన వ్యాపారములు చేయు వారికి ఈ సంవత్సరం అధిక ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో శని బలమైన స్థానంలో కలిగి వున్నవారు ఈ సంవత్సరం తలపెట్టిన ప్రతీ పనిలో లాభములను ఆర్జించగలుగుతారు. మొత్తం మీద వృషభ రాశి వారికి శని యొక్క అనుకూల ప్రభావం వలన సులువైన లేదా అన్యాయార్జిత ధనం అధికంగా లభిస్తుంది. రాజకీయ వాదులకు రాజ్యాంగ పదవులందు జయం లభిస్తుంది. ప్రభుత్వములో మీ పలుకుబడి పెరుగుతుంది. ప్రభుత్వ పెద్దల గౌరవం సంపాదించగలుగుతారు. వృషభ రాశికి చెందిన 12 సంవత్సరముల లోపు చిన్నారులకు మాత్రం ఈ సంవత్సరం తరచుగా ఆరోగ్య చికాకులు ఎదురగును. ప్రాణ ప్రమాదం ఉండదు. వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
Throughout the Sree Parabhava Naama Samvatsaram, Saturn’s favorable transit will bring exceptional results for Vrushabha Raasi natives, fostering a sense of profound patience, self-restraint, and an inclination toward spiritual detachment. This period is especially encouraging for those in the healthcare and medical businesses, while individuals with a strong Saturn in their personal birth charts will see significant profits in all their endeavors, including a notable increase in easy or unexpected financial gains. Politically active individuals can expect success in attaining constitutional posts and gaining significant influence within government circles; however, while there is no threat of Elinaati Shani (Sade Sati), parents should note that children under the age of 12 may face frequent minor health irritations, though these will not be life-threatening.
వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఎదురగును.ఒక విధంగా చెప్పాలి అంటే వృషభ రాశి జాతకులు రాహువు వలన శ్రీ పరాభవ నామ సంవత్సరంలో గంగా స్నాన పుణ్య ఫలం పొందుతారు. భారీ ఎత్తున శుభకార్యములు మీ చేతిపై నిర్వహించబడతాయి. వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగి ఉన్న 12 సంవత్సరములలోపు చిన్నారులు మాత్రం తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది లేదా వారి వారి పితృ సంబంధీకులకు ఆరోగ్య సమస్యలు బాధించును.
Under the influence of Rahu in the Sree Parabhava Naama Samvatsaram, Vrushabha Raasi natives will experience exceptionally positive results, so profound that they are likened to the spiritual merit of bathing in the holy Ganges. This year, you will take the lead in organizing and performing grand auspicious events and ceremonies; however, a note of caution is advised for children under the age of 12 who have Kala Sarpa Dosha in their personal horoscopes, as they or their paternal relatives may face frequent health challenges during this time.
వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఎదురగును. 04 డిసెంబర్ 2026 వరకు కేతువు స్వల్పంగా అనుకూల ఫలితాలు ప్రసాదించును. 05 డిసెంబర్ 2026 నుండి పరాభవ నామ సంవత్సరం చివరి వరకు అతి చక్కటి అనుకూల ఫలితాలు ప్రసాదించును. ముఖ్యంగా భూమి, ధన సంపదలు మరియు వాహన సంబంధ విషయాలలో మనోవాంచా ఫలసిద్ధిని ప్రసాదించును. భాత్రు వర్గం వారితో సత్సంబంధాలు నెలకొల్పును. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురు, శని, రాహు మరియు కేతు గ్రహ అనుకూలత సంపూర్ణంగా ఉన్నది.
For those born under Vrushabha Raasi, the planet Ketu will provide mixed results during the Sree Parabhava Naama Samvatsaram, beginning with mildly favorable outcomes until December 4, 2026. From December 5, 2026, through the remainder of the year, Ketu’s influence shifts significantly to deliver highly auspicious results, specifically fulfilling your heart's desires regarding land, wealth, and vehicles, while also fostering harmonious relations with your siblings. Overall, with the combined favorable transits of Jupiter, Saturn, Rahu, and Ketu, this year stands as a period of complete planetary support and comprehensive success for Vrushabha Raasi natives.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
మార్చ్ 2026 వృషభరాశి రాశిఫలాలు / March 2026 Taurus Predictions:
ఈ మాసంలో ఆశించిన పనులు కార్యరూపం దాల్చును. ఉద్యోగ వ్యాపార వృత్తి జీవనాలలో మంచి ప్రోత్సాహం ఉంటుంది. నూతన ఉన్నత వర్గీయుల పరిచయాలు ఏర్పడుతాయి. సంతాన లేమి దంపతుల సంతాన ప్రయత్నాలు విజయం పొందును. వ్యక్తిగత జీవితంలో కొద్దిపాటి అననుకుల ఫలితాలు ఎదురగును. జీవిత భాగస్వామితో చికాకులు. ధనాదాయం బాగుండును. పెద్దవయస్సు వారికి కుడి నేత్ర సంబంధ సమస్యలు బాధించును.
March 2026 will see the successful realization of your anticipated tasks and goals. There will be excellent encouragement and growth in your professional life, including jobs and business ventures. You will establish new connections with influential people in high-ranking positions. For couples aspiring for children, this month brings success in progeny efforts. However, some minor unfavorable results may arise in your personal life, specifically leading to irritations or friction with your spouse. While financial income remains strong, elderly individuals may suffer from issues related to the right eye.
ఏప్రిల్ 2026 వృషభరాశి రాశీఫలితాలు / April 2026 Taurus Predictions:
ఈ మాసంలో ధన సంబంధమైన వ్యవహారాలు కొద్దిపాటి చికాకులు కలుగచేయు సూచన. వ్యాపార వ్యవహరాదులలో నూతన పెట్టుబడులు పెట్టకుండా ఉండుట మంచిది. స్పెక్యులేషన్ వలన భారీ నష్టం ఏర్పడు అవకాశములు అధికంగా ఉన్నవి. ఈ మాసంలో గృహోపకరణాలు కొనకపోవడం మంచిది. ఉద్యోగ జీవనంలో శ్రమ అధికం అగును. మీ వ్యక్తిగత ప్రతిభను మెరుగుపరచవలసిన అవసరం ఉన్నది. 18 వ తేదీ తదుపరి కొంత అనుకూలమైన పరిస్థితులు ప్రారంభమగును. నీతి నియమాలకు లోబడి ప్రవర్తించడం అలవాటు చేసుకుంటారు. రాజకీయ వాదులకు జయం. ఆశిస్తున్న శుభవార్తలు పొందుతారు. వ్యాపారాలు క్రమంగా ఆశించిన మార్గంలోకి వచ్చును. ఇతరుల పట్ల మీరు చూపించే హీణ భావన తగ్గించుకోవడం మంచిది. ఈ మాసంలో 2, 6, 8, 13,17 తేదీలు అనుకూలమైనవి కావు.
April 2026 for Vrushabha Rasi indicates that financial matters may cause some slight irritations or minor complications. It is advisable to refrain from making new investments in business ventures, as there is a high probability of significant losses due to speculation. During this month, it is also better to avoid purchasing household appliances. In your professional life, the workload and physical strain will increase, necessitating an improvement in your personal skills and talents. More favorable conditions will begin to emerge after the 18th of the month. You will develop a tendency to act in accordance with moral and ethical principles. Politicians will see success, and you will receive long-awaited good news. Business activities will gradually align with your expectations. It is recommended to reduce any negative or condescending attitudes toward others. Please note that the 2nd, 6th, 8th, 13th, and 17th of this month are not favorable dates.
మే 2026 వృషభరాశి రాశీఫలితాలు / May 2026 Taurus Predictions:
ఈ మాసంలో వైవాహిక జీవనంలో ఆశించిన సుఖ సంతోషాలు పొందుతారు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు విజయవంతమగును ముఖ్యంగా మృగశిర నక్షత్ర జాతకుల వివాహ ప్రయత్నాలు మంచి వివాహ సంబంధంతో ముగుస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు ఈ మాసంలో తొలగిపోవును. స్థిరాస్థి అమ్మకానికి సంబందించిన వ్యవహారాలు లాభాలను కలుగచేస్తాయి. ఈ మాసంలో ప్రారంభించిన భాగస్వామ్య వ్యాపారాలు మంచి అభివృద్ధికి బాటలు వేస్తాయి. తృతీయ వారంలో చేయు ప్రయాణాలు కలసివచ్చును. ఈ మాసం నిరుద్యోగులకు మాత్రం ఆశాభంగములు కలుగచేయును. చివరి వారంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య పరమైన సమస్యలు ఆందోళన కలుగచేయును. ముఖ్యంగా హృదయ సంబంధ సమస్యల వలన బాధ పడుతున్న వారు జాగ్రత్తగా ఉండవలెను. ఇతరుల పనుల కోసం మీ సమయాన్ని మరియు మీ కష్టార్జితాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఈ మాసంలో 22 వ తేదీ నుండి 28వ తేదీ మధ్య కాలంలో రక్షణ శాఖ నందు సేవలు అందిస్తున్న వారికి విధి నిర్వాహణలో ప్రమాదాలు ఏర్పడు సూచన.
03 మే 2026 నుండి 29 మే 2026 వరకు వాస్తు కర్తరీ ఏర్పడుతుంది. ఈ కాలంలో గృహ నిర్మాణ పనులు ఆరంభించకూడదు. నిర్మాణ దశలో ఉన్న పనులను కూడా కర్తరీ కాలం పూర్తి అగువరకు ఆపడం మంచిది. ఈ కాలం లో గృహ ప్రవేశాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఈ కాలంలో శంఖుస్థాపన ముహుర్తాలు, గృహ నిర్మాణ ఆరంభ ముహుర్తాలు మరియు గృహ ప్రవేశ ముహుర్తాలు ఉండవు.
May 2026 for Vrushabha Rasi brings the expected happiness and harmony in marital life. Efforts for marriage for the unmarried will be successful, particularly for those born under the Mrigasira Nakshatra, whose efforts will culminate in a good matrimonial alliance. Any misunderstandings with your spouse will be resolved this month. Transactions related to the sale of real estate will yield profits. Partnership businesses initiated this month will pave the way for significant growth. Travels undertaken in the third week will be fruitful. However, this month may cause disappointment for the unemployed. In the final week, the health issues of family members may cause concern; specifically, those suffering from heart-related ailments should be cautious. you may have to spend your time and hard-earned money on others' tasks. Between the 22nd and 28th of this month, those serving in the defense sector may face the risk of accidents during the discharge of their duties.
The Vastu Kartari period will occur from May 3, 2026, to May 29, 2026. During this time, it is advised not to commence any new house construction works. It is also recommended to pause ongoing construction activities until the Kartari period concludes, and housewarming ceremonies (Gruhapravesam) should be postponed. Please note that during this interval, there are no auspicious Muhurthams available for foundation stone laying (Shankusthapana), commencement of house construction, or housewarming ceremonies.
జూన్ 2026 వృషభరాశి రాశీఫలితాలు / June 2026 Taurus Predictions:
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. ఆశించిన ధన భాగ్యములు పొందుతారు. మిత్రు లేదా బంధు వర్గానికి ఇచ్చిన పాత మొండి బకాయిలను వసూలు చేసుకోగలరు. ఉద్యోగ జీవులకు ఈ మాసంలో ప్రధమ , ద్వితియ వారాలు మంచి ప్రోత్సాహవంతమైన కాలం. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తి అగుట సంతృప్తిని కలుగచేయును. ఈ మాసంలో పుణ్యక్షేత్ర సందర్శన లేదా ఆధ్యాత్మిక గురువులతో పరిచయాలు ఏర్పడును. మహిళలకు ముఖ్యంగా కృత్తికా నక్షత్రం వారు కుటుంబ జీవనంలో అపవాదులు ఎదుర్కొందురు మరియు కుటుంబ బాధ్యతల భారం పెరుగును. ఈ మాసంలో 10, 14, 20, 25 తేదీలు అనుకూలమైనవి కావు. ముఖ్యంగా ఉద్యోగ భంగము ఎదుర్కోను సూచన కలదు. ఈ తేదీలలో ముఖ్య దస్తావేజులపై సంతకాలు కుడా చేయుట మంచిది కాదు.
01 జూన్ 2026 రాత్రి 2.09 నిమిషాలకు గురువు కర్కాటక రాశి లోనికి ప్రవేశించడంతో 02 జూన్ 2026 నుండి 13 జూన్ 2026 వరకు యమునా నదికి పవిత్ర పుష్కరములు నిర్వహించబడతాయి.
June 2026 for Vrushabha Rasi will be characterized by strong financial inflows and the attainment of expected wealth. You will be successful in recovering long-standing or "stubborn" debts from friends or relatives. For salaried employees, the first and second weeks of this month are particularly encouraging and productive. Completing tasks with the full cooperation of family members will bring significant mental satisfaction. This month also indicates visits to sacred shrines or the opportunity to develop acquaintances with spiritual gurus. Women, especially those born under the Krittika Nakshatra, may face unfounded allegations or blame within their domestic life, alongside an increased burden of family responsibilities. Please be aware that the 10th, 14th, 20th, and 25th of this month are not favorable; there are specific signs of potential job-related setbacks or interruptions during these times. It is strongly advised not to sign any important documents or deeds on these specific dates.
With the entry of Jupiter (Guru) into Karkataka Rasi (Cancer) on June 2, 2026, at 2:09 AM, the sacred Yamuna River Pushkarams will be observed from June 2, 2026, to June 13, 2026
జూలై 2026 వృషభరాశి రాశీఫలితాలు / July 2026 Taurus Predictions:
ఈ మాసంలో గతకాలపు తగాదాలు తొలగును. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ఒక నమ్మిన వ్యక్తి చేసిన మోసం వలన మానసిక ప్రశాంతత లోపించు సూచన కలదు. రోజు వారి జీవనంలో సౌఖ్యం లోపించును. గృహ అవసరాల కోసం ఆధునిక వస్తువులు కొనుగోలు చేయుదురు. విదేశీయాన ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైన కాలం. ద్వితీయ వారంలో సంతాన సంబంధ శుభవార్త వింటారు. ఉద్యోగ జీవనంలో మాత్రం అననుకూల మార్పులు కొనసాగును. ప్రతికూల పరిస్థితులు ఉన్నా పట్టుదలతో లక్ష్యాలను పూర్తీ చేయగలరు. మీ తప్పులను సరిదిద్దుకోవలసిన సమయం ఇది. స్థిమితంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటారు. విద్యార్ధులకు శ్రమానుకూల ఫలితాలు లభిస్తాయి. వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి ఈ మాసంలో నూతన అవకాశాలు లభిస్తాయి. చివరి వారంలో సువర్ణ లేదా వాహన సౌఖ్యం అనుభవిస్తారు. ఆత్మవిశ్వాసం అధికం అవుతుంది.
15 జూలై 2026 నుండి 13 ఆగష్టు 2026 వరకు గురు మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ గురు మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను గురు మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.
July 2026 for Vrushabha Rasi indicates that past disputes and conflicts will finally be resolved. Financial income is expected to remain moderate during this period. However, there is a sign of loss of mental peace in your personal life due to a betrayal by a trusted person. You may also experience a lack of comfort in your daily routine. On a positive note, you will purchase modern appliances for household needs, and this month is highly favorable for those making efforts toward foreign travel. In the second week, you are likely to hear good news regarding your children. While unfavorable changes may continue in your professional life, you will be able to complete your goals through sheer persistence despite the adverse conditions. This is a time to correct your past mistakes, and you will develop the habit of thinking calmly and steadily. Students will achieve results commensurate with their hard work, and those pursuing medical education will find new opportunities this month. In the final week, you will enjoy the luxury of new jewelry or vehicles, leading to a significant boost in your self-confidence.
The Guru Moodhami (Jupiter Combustion) period will occur from July 15, 2026, to August 13, 2026. During this Guru Moodhami interval, no auspicious ceremonies or functions should be performed. All significant events and celebrations must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this inauspicious time.
ఆగష్టు 2026 వృషభరాశి రాశీఫలితాలు / August 2026 Taurus Predictions:
ఈ మాసంలో వ్యాపారాదులు బాగానే ఉండును. అన్ని వర్గముల వారికి ఈ మాసంలో ధనాదాయం ఆశించినంత లభించును. సోదర వర్గం వారికి మీ సహాయ సహకారములు అవసరమగును. నూతన స్నేహాలు , పరిచయాలు ఏర్పడును. ఆఖస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గృహంలో మీ అభిరుచికి తగిన విధంగా మార్పులు చేసుకొందురు. బ్యాంకు ఋణాలు తీర్చివేస్తారు. కోర్తుకేసులందు మీకు అనుకూలమైన తీర్పులను పొందుతారు. ఉద్యోగ జీవనంలో ఉన్నతాధికారులతో సమావేశాలు కలసివచ్చును. గత మాసాలలో ఉద్యోగాలు కోల్పోయిన వారు ఈ మాసంలో అంది వచ్చే ఎంతటి చిన్న అవకాశాన్ని అయినా అందిపుచ్చుకోవడం మంచిది. మొండి పట్టుదలను విడిచి పెట్టుట మంచిది. మీ కుటుంబంలో పోగొట్టుకున్న గౌరవ మర్యాదలు తిరిగి లభించును. కొన్ని స్వ విషయాలు ఇతరులకు తెలియకుండా రహస్యంగా ఉంచుట మంచిది. ఈ మాసంలో 7 వ తేదీ నుండి 16 వ తేదీ మధ్య చేయు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును.
August 2026 for Vrushabha Rasi indicates that business activities will perform well, and people from all walks of life will receive their expected financial income. Your siblings may require your help and cooperation during this period. New friendships and acquaintances will be established, though you may find yourself undertaking sudden or unexpected travels. You will likely make changes to your home that align with your personal tastes and interests. This is an excellent time for financial relief, as you will be able to clear pending bank loans and receive favorable judgments in ongoing court cases. In your professional life, meetings with high-ranking officials will prove beneficial. For those who lost their jobs in previous months, it is highly recommended to grab even the smallest opportunity that comes your way now. It is advisable to let go of stubbornness during this time. You will regain the respect and honor within your family that may have been lost previously. However, it is better to keep certain personal matters private and confidential. Job search efforts made between the 7th and 16th of this month are likely to be successful.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
సెప్టెంబర్ 2026 వృషభరాశి రాశీఫలితాలు / September 2026 Taurus Predictions:
ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. తలపెట్టిన నూతన కార్యములు ఆశించిన ఆర్ధిక లాభాలను కలుగచేయును. జయప్రదమగును. ప్రభుత్వ ఉద్యోగులకు పై అధికారుల మన్ననలు లభించును. అవివాహితులకు చక్కటి సంబంధాలు లభించును. తృతీయ వారంలో గృహంలో విందు వినోదాలు ఏర్పాటు చేయుదురు. నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు ఈ మాసంలో తృతీయ వారం మంచి సమయం. చివరి వారంలో బ్యాంకు లావాదేవీలు, నూతన ఒప్పందాలు విజయవంతం అగును. వృషభ రాశి కి చెందిన స్త్రీలు వృత్తి సంబంధ సమస్యలను అధిగమిస్తారు. సొంత ధనార్జన ప్రారంభించ గలుగుతారు. మాసాంతానికి వ్యక్తిగత జీవితంలో ఆశించిన సౌఖ్యం. బంధు మిత్రుల యోగక్షేమాలు సదా విచారించవలసి వస్తుంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యత పెంపొందిచుకుంటారు.
September 2026 for Vrushabha Rasi continues to see strong financial income. Any new tasks or projects initiated during this period will yield the expected financial profits and culminate in success. Government employees will earn the appreciation and favor of their superiors. This is an excellent time for the unmarried, as they are likely to find very suitable matrimonial alliances. In the third week, you will organize feasts or entertainment events at home; this is also an ideal time for the purchase of new vehicles. Bank transactions and new agreements or contracts will be successfully concluded during the final week. Women born under Vrushabha Rasi will overcome professional challenges and may successfully begin earning their own income. By the end of the month, you will enjoy the desired comforts in your personal life. You will find yourself regularly looking after the welfare of your relatives and friends, and you will also succeed in building better rapport and harmony with your neighbors.
అక్టోబర్ 2026 వృషభరాశి రాశీఫలితాలు / October 2026 Taurus Predictions:
ఈ మాసంలో కుటుంబ సభ్యులలో ఒకరికి తీవ్ర ఆరోగ్య భంగం ఏర్పడు సూచన. ముఖ్యంగా తండ్రి వర్గం వారికి ఈ మాసం మంచిది కాదు. కార్యదీక్షతో వ్యవహరించి ఉద్యోగ లక్ష్యాలను పూర్తీ చేయుదురు. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఆర్ధిక విషయాలలో కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లోపించును. అనవసర పట్టుదల వలన సొంత వారితో విభేదాలు ఎదుర్కొందురు. గృహ వాతావరణం బాగుంటేనే మానసిక ప్రశాంతత లభిస్తుంది అనే విషయం అవగతం అవుతుంది. కుటుంబ వాతావరణం పై మీ ఆరోగ్యం కూడా ఆధార పది ఉంటుంది. మిత్రుల సహకారంతో కొంత వరకూ ఆర్ధిక లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. ఈ మాసంలో వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. ఈ మాసంలో 11, 13, 18, 27 తేదీలలో ప్రయాణములందు జాగ్రత్త అవసరం. చివరి వారంలో ధనవ్యయం పెరుగును.
17 అక్టోబర్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు శుక్ర మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ శుక్ర మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను శుక్ర మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.
October 2026 for Vrushabha Rasi indicates a risk of significant health setbacks for a family member, with the period being particularly unfavorable for paternal relatives. You will demonstrate great dedication and fulfill your professional targets through hard work. Financial income is expected to remain moderate. However, there may be a lack of consensus among family members regarding financial matters, and stubbornness could lead to disputes with your own kin. You will come to realize that mental peace is deeply tied to a harmonious home environment, and your physical health may also depend on the atmosphere within the family. With the support of friends, you will be able to meet some of your financial goals. Business activities will continue at a standard pace. Please exercise caution during travels on the 11th, 13th, 18th, and 27th of this month. In the final week, you can expect an increase in expenditures.
The Shukra Moodhami (Venus Combustion) period will occur from October 17, 2026, to October 30, 2026. This is considered an inauspicious time. During this Shukra Moodhami interval, no auspicious ceremonies or sacred rituals should be performed. All significant celebratory events must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this time.
నవంబర్ 2026 వృషభరాశి రాశీఫలితాలు / November 2026 Taurus Predictions:
ఈ మాసంలో పని చేయు కార్యాలయంలో పై అధికారుల వలన శ్రమ , ఒత్తిడి అధికమగును. విరామం దొరుకుట కష్టంగా ఉంటుంది. పని భాద్యతలను మిత్రులతో పంచుకొనుట మంచిది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. గత మాసంలో అదుపు తప్పిన ధన వ్యయమును తగ్గించుకొందురు. కోర్టు వ్యవహారాలను వాయిదా వేసుకొనుట మంచిది. ఈ మాసంలో వడ్డీ వ్యాపారం చేయువారికి ధన ఆదాయం పెరుగును. 15 వ తేదీ తదుపరి విద్యార్ధులకు , ఉద్యోగ రంగంలోని వారికి నూతన అవకాశాలు లభించుట వలన ఉత్సాహపూరితంగా ఉంటుంది. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, సమస్యలు ఎదురగును. అనుమతి పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ మాసంలో నృత్య రంగంలోని వారికి చక్కటి గుర్తింపు లభించును. నాట్య కళ ద్వారా ధనార్జన ఆరంభించడానికి ఇది మంచి కాలం. అవివాహితులకు చురుకైన బుద్ది కలిగిన జీవిత భాగస్వామి లభించును.
November 2026 for Vrushabha Rasi indicates that work pressure and stress from superiors will increase at your workplace. It will be difficult to find time for rest, so it is advisable to share your responsibilities with trusted colleagues or friends. Financial income will remain moderate this month, but you will successfully manage to reduce the excessive expenditures that occurred in the previous month. It is better to postpone matters related to court cases or legal disputes. Those in the money-lending or interest-based business will see an increase in their earnings. After the 15th, students and professionals will feel enthusiastic as new opportunities manifest. However, business owners may face minor irritations and problems, and it is essential to be very careful regarding permits and documentation. This month brings excellent recognition for those in the field of dance, and it is an auspicious time to start earning through performing arts. For the unmarried, this period promises a life partner with a sharp and active intellect.
డిసెంబర్ 2026 వృషభరాశి రాశీఫలితాలు / December 2026 Taurus Predictions:
ఈ మాసంలో మీ వ్యక్తిగత అభిరుచులకు తగిన విధంగా జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుంది. కుటుంబంలో సంపూర్ణంగా ఆనందకర పరిస్థితులు నెలకొంటాయి. కెరీర్ పరంగా ఉద్యోగ జీవులకు మాత్రం కార్యభారం , ఒత్తిడి కొనసాగును. ఈ మాసంలో ధనాదాయం కొద్దిగా పెరుగును. ఒక సందర్భంలో బంధు మిత్రుల ఆదరణ సంతృప్తిని కలుగచేస్తుంది. జీవన మార్గంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేసించుకొంటారు. మాస మధ్యమంలో నూతన ఆదాయ మార్గాల కోసం ఆలోచనలు చేయుట లాభించును. చివరి రెండు వారాలు సామాన్య ఫలితాలను ఏర్పరచును. శరీర దారుడ్యత తక్కువగా ఉండును. వ్యక్తిగత జాతకంలో కళత్ర స్థానంలో రాహు గ్రహాన్ని కలిగి ఉన్న వారికి వైవాహిక జీవితంలో భార్య భర్తలు ఇరువురికి విశేషముగా నలత చేయును. ఈ మాసంలో 13, 14, 15 తేదీలలో ముఖ్య నిర్ణయాలు తీసుకోకుండా ఉండుట మంచిది.
December 2026 for Vrushabha Rasi indicates that you will receive excellent cooperation from your spouse, aligned perfectly with your personal tastes and interests. The family atmosphere will be filled with complete joy and happiness. In terms of career, however, salaried employees will continue to face a heavy workload and high pressure. Financial income is expected to increase slightly this month. At one point, the affection and support from friends and relatives will bring you great satisfaction. You will find yourself setting higher, more ambitious goals for your life path. Around the middle of the month, brainstorming and exploring new sources of income will prove to be profitable. The final two weeks will yield only average results, and you may experience low physical stamina or fitness. For those who have Rahu in the Kalatra Sthana (7th house) of their personal birth chart, both husband and wife may suffer from significant health issues or lack of energy. It is advisable to avoid taking any major decisions on the 13th, 14th, and 15th of this month.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
జనవరి 2027 వృషభరాశి రాశీఫలితాలు / January 2027 Taurus Predictions:
ఈ మాసంలో సంతాన సంబంధ విషయాలు అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. పుత్ర సంతాన కాంక్ష తీరును. కుటుంబ సంబంధాలు మెరుగ్గా ఉండును. ఈ మాసంలో శ్రీ దుర్గా దేవి ఆరాధన వలన అన్ని విధములా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగ రంగంలో ప్రోత్సాహకరంగా ఉండును. కార్య నిర్వహణలో ముఖ్యమైన పనులను వాయిదా వేయకపోవడం మంచిది. విదేశీ ప్రయత్నాలకు మార్గం సుగమమం అగును. కుటుంబ సభ్యుల ఆర్ధిక అవసరాలు తీర్చగలుగుతారు. చివరి వారంలో గత కాలంలో ఏర్పడిన శత్రు సంబంధ మరియు రోగ సంబంధ సమస్యల తీవ్రత తగ్గును.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పుష్యమాస శుక్ల షష్ఠి గురువారం రాత్రి గం. 9.07 ని. లకు అనగా 14 జనవరి 2027న ఉత్తరాభాద్ర నక్షత్రంలో శ్రీ సూర్య భగవానుడు మకర రాశి లోకి ప్రవేశించును. సూర్యాస్తమయం తదుపరి మకర సంక్రమణ సంభవిస్తుంది కాబట్టి మరునాడు అనగా 15 జనవరి 2027 న సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. పితృ వర్గ సంస్కరణలు 15 జనవరి 2027 సూర్యోదయం ఉదయం 6.38 నిముషాల తరువాత నిర్వహించుకోవాలి.
భోగి పండుగ: 14 జనవరి 2027 (గురువారం).
సంక్రాంతి పండుగ: 15 జనవరి 2027 (శుక్రవారం)
కనుమ పండుగ : 16 జనవరి 2027 (శనివారం)
ముక్కనుమ పండుగ: 17 జనవరి 2027 (ఆదివారం)
January 2027 for Vrushabha Rasi brings favorable outcomes regarding matters related to children. Those aspiring for a male child will see their wishes fulfilled, and overall family relationships will improve significantly. Devotion and prayers to Goddess Durga this month will ensure the best possible results in all aspects of life. The professional environment remains encouraging; however, it is advisable not to postpone any important tasks in your official duties. The path for foreign travel efforts will become clear and smooth. You will be in a strong position to fulfill the financial needs of your family members. In the final week, there will be a noticeable reduction in the intensity of problems related to past enmities or long-standing health issues.
In the Sri Parabhava year, on Pushya Masa Shukla Shashti, Thursday night at 9:07 PM (specifically on January 14, 2027), Lord Surya will enter Makara Rasi (Capricorn) while in the Uttarabhadra Nakshatra. Since the Makara Sankramanam occurs after sunset, the Sankranti festival should be celebrated the following day, January 15, 2027. Regarding ancestral rites (Pitru Karma/Tarpanam), they should be performed on January 15, 2027, after sunrise at 6:38 AM.
Bhogi Festival: January 14, 2027 (Thursday)
Sankranti Festival: January 15, 2027 (Friday)
Kanuma Festival: January 16, 2027 (Saturday)
Mukkanuma Festival: January 17, 2027 (Sunday)
ఫిబ్రవరి 2027 వృషభరాశి రాశీఫలితాలు / February 2027 Taurus Predictions:
ఈ మాసంలో విహార యాత్రలు లేదా దూర ప్రాంత ప్రయాణాల వలన ఆరోగ్యం మందగించు సూచనలు కలవు. కోర్టు కేసులు మీ పక్షాన అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆర్ధికంగా ఆశించిన లాభాలు లభించడం తో గృహంలో సంతోషకర వాతావరణం అనుభవిస్తారు. ఈ మాసంలో అన్ని రకముల వ్యాపారాదులు బాగుండును. ఈ మాసంలో 25, 26, 27 తేదీలలో కార్యభారం అధికంగా ఉన్నా పనులను పూర్తిచేస్తారు. మధ్యవర్తుల మాటలు గుడ్డిగా నమ్ముట మంచిది కాదు. స్వతంత్ర విద్య ఆధారిత ధనార్జన ఆరంభించడానికి ఈ మాసంలో బుధ గ్రహ బలం సంపూర్ణంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మాసం మిక్కిలి అనుకూలమైన కాలం. వాహన ముద్రిదికార యోగం అనుభవిస్తారు.
February 2027 for Vrushabha Rasi indicates that your health may slightly decline due to pleasure trips or long-distance travels. Ongoing court cases are likely to be resolved in your favor. With the arrival of expected financial gains, you will experience a joyful atmosphere at home. All types of business ventures will perform well during this month. Although the workload will be particularly heavy on the 25th, 26th, and 27th, you will successfully complete your tasks. It is advisable not to blindly trust the words of mediators or middle-men. Due to the full strength of the planet Budha (Mercury) this month, it is an excellent time to start earning through independent, knowledge-based professions. This month is exceptionally favorable for government employees, who may enjoy the benefits of official vehicles or administrative authority (Vaahana Mudradhikara Yogam)..
మార్చి 2027 వృషభరాశి రాశీఫలితాలు / March 2027 Taurus Predictions:
ఈ మాసంలో ఇతరుల విమర్శలకు బాధపడకుండా మీ కర్తవ్యాన్ని పుర్తిచేయవలసిన పరిస్థితులు ఏర్పడును. ధనాదాయం సామాన్యంగా ఉండును. సొంత గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూలమైన కాలం. గృహ నిర్మాణ అవసర ధనం సమకూరుతుంది. వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేయుటకు ఇది మంచి కాలం. రాజకీయ ఆశావాదులకు ఉన్నత పదవులు పొందటానికి ఇది యోగావంతమైన కాలం. ఉద్యోగ జీవనంలో పెరిగిన పారితోషకాలు అందుకోను సూచనలున్నాయి. చివరి వారంలో చేతికి సంబందించిన ఆరోగ్య సమస్య లేదా శస్త్ర చికిత్స జరుగు అవకాశం కలదు.
March 2027 for Vrushabha Rasi presents situations where you must fulfill your duties without being affected by the criticism of others. Financial income is expected to remain moderate. This month is a highly favorable time to begin efforts toward constructing your own house, and the necessary funds for construction will be secured. It is also an opportune period for implementing new experiments or strategies in business. For those with political aspirations, this is a very promising time to attain high-ranking positions. In your professional life, there are clear signs of receiving increased remuneration or bonuses. However, in the final week, there is a possibility of health issues related to the hand or the requirement of a minor surgical procedure.
రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.