Sree Parabhava Nama Samvatsara Simha Rasi / Leo Sign Free Telugu Rasi Phalalu
- Predictions by Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)
2026 - 2027 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఆదాయం - 05, వ్యయం - 05, రాజ పూజ్యం - 07, అవమానం - 07.
In the Sri Parabhava year (2026 - 2027), for those born under Simha Rashi (Leo), the financial and social status figures are: Income - 05, Expenditure - 05, Honor/Social Status - 07, and Dishonor/Insult - 07.
పూర్వ పద్దతిలో సింహరాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారు ఎదుర్కొనవలసి ఆరోగ్య మరియు వ్యక్తిగత జీవితంలోని చికాకులను సూచించుచున్నది.
According to the traditional method, the remainder number for Simha Rashi (Leo) is '1'. This indicates that in the Sri Parabhava year, those born under Leo may have to face irritations or disturbances in their health and personal life.
రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనగా 19 మార్చ్ 2026 నుండి 6 ఏప్రిల్ 2027 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఎదురగును. బృహస్పతి 31 మే 2026 వరకు న్యాయవంతమైన ధన సంపాదన ఆర్జించునట్లు చేయును. ఉన్నత స్నేహ స్వభావం కలిగిన విశ్వాసపాత్రులు అయిన నూతన స్నేహ వర్గం లభిస్తుంది. వారి వలన ఆధ్యాత్మిక భావాలు అలవడును. మిత్ర వర్గం వలన అదృష్టం కలసి వస్తుంది. పుత్ర సంతానం కొరకు ఎదురుచూస్తున్న వారి అభీష్టం నెరవేరుతుంది. తలపెట్టిన కార్యములు పూర్తి చేయడంలో పట్టుదల కొంచెం తగ్గుతుంది. సింహరాశి మహిళలు తమ భర్తల వృత్తి వ్యాపారములందు అడుగుపెట్టడానికి ఇది మంచి కాలం. ఏక కాలంలో బహు కార్యములు ప్రారంభిస్తారు. వాటిని పూర్తి చేయడంలో పట్టుదల లోపిస్తుంది. మానవతా విలువలు పెరుగుతాయి. 01 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు బృహస్పతి వలన ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఎదురగును. నవరత్న సంబంధ వ్యాపారములు ఈ కాలంలో బాగా కలసి వచ్చును. అవివాహిత పురుషులకు ఐశ్వర్యవంతురాలైన జీవిత భాగస్వామి లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయును. విదేశే జీవన ప్రయత్నాలు ఈ సంవత్సరం విజయవంతం అవుతాయి. ఈ కాలంలో మీ ప్రవర్తన కొంచెం అదుపు తప్పుతుంది. అతిగా ప్రవర్తించడం, అతిగా వ్యయం చేయడం ఎదురగును. 31 అక్టోబర్ 2026 నుండి 23 జనవరి 2027 వరకు కెరీర్ పరంగా అత్యున్నత స్థాయి పొందు అవకాశములు లభిస్తాయి. రాజకీయ నాయకులకు అధికార దాహం పెరుగుతుంది. ప్రతీ విషయంలో ఉత్తమ ఫలితాలు ఎదురగును. 24 జనవరి 2027 నుండి సంవత్సరం చివరి వరకు దైవానుగ్రహం వలన సుఖప్రదమైన జీవనం పొందుతారు. సొంత గృహ లేదా భూ సంబంధ స్థిరాస్తులు ఏర్పాటు చేసుకొనుటకు ఇది అనుకూలమైన సంవత్సరం.
For those born under the Leo zodiac sign, the Telugu year Sri Parabhava (from March 19, 2026, to April 6, 2027) promises largely favorable results due to the influence of Jupiter. Until May 31, 2026, Jupiter will facilitate the acquisition of wealth through righteous means and help you cultivate a new circle of loyal, high-minded friends who will foster spiritual growth and bring good fortune. Those aspiring for children will likely see their wishes fulfilled, though there may be a slight dip in the determination required to complete tasks. This is an auspicious time for Leo women to enter their husbands' professional or business ventures, though care should be taken as starting multiple projects simultaneously may lead to a lack of follow-through. While humanitarian values will rise, the period between June 1, 2026, and October 30, 2026, may see expenses exceeding income, even as those in the gemstone trade find success. Unmarried men may find a wealthy life partner during this time, and long-distance or foreign travel plans are likely to succeed, despite a tendency toward behavioral excess and overspending. From October 31, 2026, to January 23, 2027, career prospects will reach new heights—though politicians should guard against an increased thirst for power—and general success will follow every endeavor. Finally, from January 24, 2027, until the end of the year, divine grace will ensure a comfortable life, making this an ideal year to acquire fixed assets like a home or land.
సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శనైచ్చరుని వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ముఖ్యంగా ఆరోగ్య సంబంధ, వైవాహిక జీవన సంబంధ మరియు శత్రు సంబంధ సమస్యలు ఎదుర్కొందురు. జీవన మార్గంలో తరచుగా దురదృష్టత ఎదురగుతూ ఉంటుంది. ఇతరుల వలన అవమానాలు పొందవలసి వస్తుంది. ముఖ్యంగా పుబ్బ నక్షత్ర జాతకులు తరచుగా ఆరోగ్య ప్రతిబంధకాలు ఎదుర్కొనవలసి వస్తుంది. సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా శనివారములు పగటి పూట ఉపవాస దీక్ష ఆచరించుట మంచిది. నిత్యం ఈ క్రింది మంత్రమును పటించుట మంచిది.
“ నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైచ్చరం”.
ఆరోగ్య సమస్యలు అధికం అయినచో శనివారముల నాడు నల్ల నువ్వులు బ్రాహ్మణులకు దానం ఇచ్చుట మరియు శని గ్రహ శాంతి జపములు జరిపించుకోనుట మంచిది. సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
For those born under the Leo zodiac sign, the year Sri Parabhava will bring challenging results throughout the year due to the influence of Saturn, particularly regarding health, marital life, and conflicts with adversaries. You may frequently encounter misfortune in your career or daily life and might face situations leading to humiliation from others; specifically, those born under the Pubba Nakshatra should be extra cautious as they may face frequent health setbacks. To mitigate these effects, it is recommended that Leos observe a fast during the daytime on Saturdays and regularly chant the Shani Mantra:
"Neelanjana samabhasam, raviputram yamagrajam, chaya martanda sambhutam, tam namami shanaishcharam."
If health issues intensify, donating black sesame seeds to Brahmins on Saturdays or performing Shani Graha Shanti Japa is advised—though it is a point of relief that Leo natives are not under the influence of Sade Sati (Elinati Shani) during this year.
సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ఒక్క వారసత్వ సంబంధ విషయాలలో మాత్రం మనోభీష్టం నెరవేరుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి సంబంధ విషయలలో మీ తప్పిదం వలన భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. వ్యక్తిగత జాతకంలో రాహు గ్రహ ఆధారిత కళత్ర దోషం లేదా తీవ్ర కాల సర్ప దోషం కలిగిన వారు కళత్ర నష్టం ఎదుర్కొనడానికి సూచనలు ఉన్నవి. స్వ ఆరోగ్య విషయాలలో కూడా తీవ్ర అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది. సింహరాశి వారు నిత్యం ఈ క్రింది మంత్రమును పటించుట మంచిది.
“ అర్ధకాయం మహా వీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం రాహుం తమ్ ప్రణమామ్యహం”
For those born under the Leo zodiac sign, the influence of Rahu during the Sri Parabhava year will largely bring unfavorable results, with the sole exception being matters related to ancestral property or inheritance where your desires may be fulfilled. However, you may have to pay a heavy price due to personal mistakes regarding your spouse or marital life. Specifically, those whose individual horoscopes contain Rahu-based Kalatra Dosha or severe Kala Sarpa Dosha face indications of potential loss or severe strain in their marital relationship. Significant health issues may also arise during this period. To alleviate these negative effects, it is highly recommended to daily chant the Rahu Mantra:
"Ardhakaayam mahaaveeryam chandraaditya vimardanam, simhika garbha sambhootam raahum tam pranamaamyaham."
సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతు గ్రహ ప్రభావం వలన 04 డిసెంబర్ 2026 వరకు తీవ్ర ప్రతికూల ఫలితాలు ఎదురగును. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్య విషయాలు ఆందోళన కలుగచేస్తాయి. యువకులకు స్త్రీ సంబంధ విషయమై నిత్యం మానశిక ఆందోళన అనుభవించునట్లు చేయును. 05 డిసెంబర్ 2026 నుండి ప్రతికూలత తగ్గుతుంది. ఆందోళనా పూరిత పరిస్థితులు తగ్గుతాయి. మఖా నక్షత్ర జాతకుల ఆధ్వర్యంలో విశేషమైన సత్కార్యములు నిర్వహించబడతాయి. సింహరాశికి చెందిన పెద్ద వయస్సు వారికి చక్కటి తీర్ధయాత్రా పుణ్య ఫలితం లభిస్తుంది.
For those born under the Leo zodiac sign, the influence of Ketu during the Sri Parabhava year will result in severe unfavorable outcomes until December 4, 2026. During this period, the health of young children may become a source of significant concern, and young men may experience persistent mental anxiety regarding relationships with women. However, from December 5, 2026, onwards, these negative effects will begin to subside, leading to a decrease in stressful situations. Specifically, those born under the Makha Nakshatra will have the opportunity to lead or organize significant virtuous deeds and auspicious events. Additionally, elderly Leo natives can look forward to successful pilgrimages and the spiritual rewards associated with visiting holy sites.
మొత్తం మీద సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఒక్క గురు గ్రహం వలన మాత్రమే అనుకూల ఫలితాలు లభిస్తాయి. శని, రాహు మరియు కేతు గ్రహముల వలన ఇబ్బందులు ఎదురగును. సమస్యల తీవ్రతను అనుసరించి శని, రాహు మరియు కేతు గ్రహ శాంతులు , జపములు జరిపించుకోనవలెను.
Overall, for those born under the Leo zodiac sign, the year Sri Parabhava offers favorable results solely due to the influence of Jupiter, while Saturn, Rahu, and Ketu present various challenges and obstacles. Depending on the severity of the problems encountered, it is highly recommended to perform specific remedial measures (Shanti) and Vedic chants (Japa) for Saturn, Rahu, and Ketu to mitigate their negative effects and seek relief.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
మార్చ్ 2026 సింహరాశి రాశిఫలాలు / March 2026 Leo Predictions:
ఈ మాసంలో విద్యార్ధులకు అఖండ విజయం లభిస్తుంది. నూతన వ్యాపారముల ద్వారా చక్కటి ధన ప్రాప్తి పొందుతారు. వృత్తి నిపుణులకు సులువైన ధన సంపాదన ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన ఫలితం వుండదు. తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు. ద్వితియ మరియు తృతీయ వారములు సామాన్య ఫలితాలు. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం అటంకములను పొందును. ఈ మాసంలో 19, 20, 25, 26, 27 తేదీలు అంత అనుకూలమైనవి కావు.
This month, students can look forward to resounding success in their endeavors. Those venturing into new businesses will see excellent financial gains, while professionals will find opportunities for easy income generation. However, those in service or employment will experience mixed results, potentially facing friction with superiors and finding that their hard work doesn't yield the expected rewards. Additionally, challenges may arise due to colleagues. While the second and third weeks will bring mediocre results, a significant matter may encounter obstacles toward the end of the month. It is advised to be cautious on the 19th, 20th, 25th, 26th, and 27th, as these dates are not particularly favorable.
ఏప్రిల్ 2026 సింహరాశి రాశీఫలితాలు / April 2026 Leo Predictions:
ఈ మాసంలో చక్కటి ధన లాభాములు పొందుతారు. భూ లేదా గృహ సంబంధ సంపద ఏర్పాటు చేసుకోవడానికి ఈ మాసం అనువైన కాలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. శైవ పుణ్య క్షేత్ర సందర్శన కోర్కెలు తీరును. పురాణ శ్రవణ పుణ్య ఫలితాలను పొందుతారు. వ్యవసాయ మూలక ధన దాన్యభివ్రుద్ది లభిస్తుంది. ఉత్తరా నక్షత్ర జాతకులకు విదేశీ ఆదాయం కొరకు చేయు ప్రయత్నాలు సిద్ధించును. ప్రతిభకు తగిన అవకాశములు పొందుతారు. ప్రభుత్వ మూలకముగా లాభం పొందుతారు. కుటుంభంలో గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు. వైవాహిక జీవనంలో మాత్రం సంతోషం లోపిస్తుంది. యువత తమ జీవన ప్రయాణంలో సరైన మార్గంలో ఆలోచనలు చేయగలుగుతారు. స్త్రీలకు తమ మాత్రు వర్గం వారితో సంబంధాలు బలపడతాయి. వ్యక్తిగత జాతకంలో శుభ స్థానగతుడైన గురువును కలిగి ఉన్నవారు చక్కటి వంశాభివ్రుద్దిని పొందుతారు. మాసం చివరి వారంలో విలువైన ఆభరణాల / వస్తువులు కొనుగోలు చేయు సూచనలు ఉన్నవి. ఈ మాసంలో 10, 11, 12 తేదీలు అనుకూలమైనవి కావు.
This month, you will enjoy significant financial gains, and it is an ideal time for acquiring real estate or housing assets. Efforts toward securing a new job will be successful. Your desires to visit sacred Shiva temples will be fulfilled, and you will gain the spiritual merit of listening to Puranic discourses. There will be an increase in wealth and grain from agricultural sources. Specifically, those born under the Uttara Nakshatra will find success in their efforts toward earning foreign income. You will receive opportunities that match your talent, and there is potential for profit through government sources. While you will earn great respect and honor within the family, happiness in marital life may be somewhat lacking. The youth will be able to make wise decisions regarding their life's journey, and women will see their bonds with their maternal side strengthen. Those who have a favorably placed Jupiter in their personal horoscope will witness auspicious family growth. The final week of the month indicates the purchase of valuable jewelry or items. However, please note that the 10th, 11th, and 12th of this month are not favorable.
మే 2026 సింహరాశి రాశీఫలితాలు / May 2026 Leo Predictions:
ఈ మాసంలో ధనవ్యయం కొద్దిగా అధికం అవుతుంది. ఆర్ధిక విషయాలలో ఆఖస్మిక నష్టములు ఎదుర్కొనవలసి వస్తుంది. అత్యవసర సందర్భాలలో సొంత మనుష్యుల నుండి ఆశించిన మాట లేదా ఆర్ధిక సహకారం లభించదు. ఈ మసంలో ఏర్పడిన కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో జాగ్రత్త అవసరం. వారి వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది. తగవులలో పైచేయి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందు అవకాశములు ఉన్నవి. మీ నూతన ఆలోచన విధానం లాభాలను అందించును. ఈ మాసంలో మూడవ వారం ప్రారంభం నుండి అవసరానికి తగిన విధంగా ధనం సర్దుబాటు అవుతుంది. కాని శారీరక శ్రమ అధికం అగును. సౌఖ్యం లేని భోజనం లభిస్తుంది. ఈ మాసంలో 24, 25, 28 మరియు 29 తేదీలు వివాహ ప్రయత్నాలు చేయుటకు అనుకూలమైనవి. ఈ మాసంలో చోరులవల్లను, అగ్ని వల్లను , దేహపీద వల్లను ఇబ్బందులు ఎదురగు సూచన ఉన్నది. జాగ్రత్త అవసరం.
03 మే 2026 నుండి 29 మే 2026 వరకు వాస్తు కర్తరీ ఏర్పడుతుంది. ఈ కాలంలో గృహ నిర్మాణ పనులు ఆరంభించకూడదు. నిర్మాణ దశలో ఉన్న పనులను కూడా కర్తరీ కాలం పూర్తి అగువరకు ఆపడం మంచిది. ఈ కాలం లో గృహ ప్రవేశాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఈ కాలంలో శంఖుస్థాపన ముహుర్తాలు, గృహ నిర్మాణ ఆరంభ ముహుర్తాలు మరియు గృహ ప్రవేశ ముహుర్తాలు ఉండవు.
This month, expenses will be slightly high, and you may face sudden financial losses. In times of emergency, the expected support or financial help from your own people may not materialize. Caution is advised regarding new acquaintances made this month, as they may not provide the anticipated benefits. On a positive note, you will achieve success in legal matters and gain the upper hand in disputes. Employees have good prospects for promotions, and your innovative thinking will yield profits. From the start of the third week, funds will become available as needed; however, physical exertion will increase, and you may find yourself lacking comfortable or timely meals. For those seeking marriage, the 24th, 25th, 28th, and 29th are favorable dates for making efforts. Please remain vigilant, as there are indications of potential trouble from theft, fire, or physical ailments.
The Vastu Kartari period will occur from May 3, 2026, to May 29, 2026. During this time, it is advised not to commence any new house construction works. It is also recommended to pause ongoing construction activities until the Kartari period concludes, and housewarming ceremonies (Gruhapravesam) should be postponed. Please note that during this interval, there are no auspicious Muhurthams available for foundation stone laying (Shankusthapana), commencement of house construction, or housewarming ceremonies.
జూన్ 2026 సింహరాశి రాశీఫలితాలు / June 2026 Leo Predictions:
ఈ మాసంలో నూతన గృహ సంభంధమైన ప్రయత్నములు విజయవంతము అగును. ఉద్యోగ, వ్యాపార వ్యవహారములు ఆశాజనకంగా ఉండును. అన్ని వర్గముల వారికి ఈ మాసంలో ధనాదాయం బాగుండును. సోదరీ వర్గం వారి నుండి ఆశించిన తోడ్పాటు లభించును. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కరించబడును. ఈ మాసంలో వారసత్వ పరమైన విషయాల కొరకు కుటుంభ పెద్దలను సంప్రదించవచ్చు. కుటుంబ మద్దతు లభిస్తుంది. మాస మధ్యమంలో తృప్తికర సంఘటనలు. చేపట్టిన పనులను సులువుగా పూర్తీ చేయగలరు. ఈ మాసంలో నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు. అన్ని విధముల క్రయవిక్రయాలు లాభిస్తాయి. ప్రభుత్వ సంబంధ కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ స్థిరత్వం ప్రాప్తిస్తుంది. విద్యార్ధులకు కెరీర్ పరంగా పోటీ పెరుగుతుంది. భాద్యతలు కూడా పెరుగుతాయి. యుక్త వయస్సులోని ఒక బంధువుకు సంబందించిన తీవ్ర అనారోగ్య వార్తను వింటారు. ఈ మాసంలో 3,4,5 తేదీలలో వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.
01 జూన్ 2026 రాత్రి 2.09 నిమిషాలకు గురువు కర్కాటక రాశి లోనికి ప్రవేశించడంతో 02 జూన్ 2026 నుండి 13 జూన్ 2026 వరకు యమునా నదికి పవిత్ర పుష్కరములు నిర్వహించబడతాయి.
This month, efforts related to acquiring a new home will be successful, and prospects in both employment and business remain encouraging. Individuals from all walks of life can expect a healthy financial inflow, supplemented by the anticipated support from sisters or female relatives. You will receive invitations from prominent individuals, and property disputes are likely to be resolved in your favor. This is an ideal time to consult family elders regarding inheritance matters, as family support is strongly indicated. The mid-month period will bring satisfying events, allowing you to complete your tasks with ease. It is an auspicious time to launch new business ventures, and all types of buying and selling transactions will prove profitable. Contract employees in the government sector may achieve job stability. While students will face increased competition and responsibilities in their careers, the month may also bring distressing news regarding the serious ill-health of a young relative. Please exercise extra caution regarding vehicles on the 3rd, 4th, and 5th.
With the entry of Jupiter (Guru) into Karkataka Rasi (Cancer) on June 2, 2026, at 2:09 AM, the sacred Yamuna River Pushkarams will be observed from June 2, 2026, to June 13, 2026
జూలై 2026 సింహరాశి రాశీఫలితాలు / July 2026 Leo Predictions:
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. దీర్ఘకాలిక సంతాన సంబంధ ఋణాలు తీర్చివేస్తారు. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించును. ద్వితీయ వారంలో కుటుంబ సభ్యుల వలన తలవంపులు. కుటుంబ విషయాలలో పరాయి వ్యక్తుల జ్యోక్యం వలన తగవులు ఎదురగును. స్నేహితులతో మీ అంతర్గత కుటుంబ వ్యవహారాలు చర్చించకుండా ఉండుట మంచిది. ప్రేమవ్యవహరాల వలన మానసిక అశాంతి. 19వ తేదీ తదుపరి కొంత అనుకూలత ప్రారంభం అగును. నిరుద్యోగుల ధనార్జనకు సొంత వ్యాపార మార్గాలు లభించును. తెలివిగా మాట్లాడుట వలన సమస్యల నుండి తప్పించుకొందురు. 20వ తేదీ నుండి 25వ తేదీ మధ్య నూతన ఆర్ధిక ఒప్పందాలు, క్రయవిక్రయాలు నిర్వర్తించుట , ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు చేయుట మంచిది కాదు.
15 జూలై 2026 నుండి 13 ఆగష్టు 2026 వరకు గురు మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ గురు మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను గురు మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.
This month, financial income will be favorable, and you will be able to clear long-standing debts related to your children. Newlyweds seeking to start a family will find their efforts successful. However, the second week may bring some loss of reputation or embarrassment due to family members, and interference from outsiders in family matters could lead to disputes. It is highly advisable to avoid discussing your private family affairs with friends. Romantic involvements may cause mental unrest during this period. A positive shift will begin after the 19th, and those currently unemployed may discover independent business opportunities for earning. While your tactful speech will help you navigate and escape problems, the period between the 20th and 25th is not an auspicious time for entering into new financial agreements, conducting sales and purchases, or attempting to change jobs.
The Guru Moodhami (Jupiter Combustion) period will occur from July 15, 2026, to August 13, 2026. During this Guru Moodhami interval, no auspicious ceremonies or functions should be performed. All significant events and celebrations must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this inauspicious time.
ఆగష్టు 2026 సింహరాశి రాశీఫలితాలు / August 2026 Leo Predictions:
ఈ మాసంలో వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోనుటకు అవసరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవనంలో మార్పు కొరకు చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి చిరకాల వాంఛ తీరును. గృహంలో శుభకార్య సంబంధ కోలాహలం నెలకొంటుంది. వ్యవసాయదారులకు పశుదాన్య వృద్ధి, వ్యవసాయ ఆధారిత ధన సంపదలు. పుబ్బా నక్షత్ర జాతకులకు ద్వితీయ తృతీయ వారాలలో శారీరక అనారోగ్యం, ఫలితం లేని శ్రమ, కార్యములందు ఆటంకములు, ఒత్తిడితో కూడిన జీవనం ఎదురగును. ముఖ్యంగా స్త్రీలకు కుటుంబ విలువలు నిలపెట్టుకోవడానికి ఒంటరి పోరాటం చేయవలసిన పరిస్టితులు ఉన్నవి. మీ ఉన్నతమైన విలువలే మీ అభివృద్ధికి అడ్డురావచ్చును. చివరి వారంలో నిర్దేశించుకున్న మొత్తం కన్నా అధిక ఖర్చులు ఎదురగుట మానసిక చికాకును కలిగించును. వైవాహిక సంబంధ విషయాలు నిరాశ కలిగించును. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగును.
This month, an environment conducive to resolving disputes amicably will emerge. Efforts to change your professional life will be favorable, and those aspiring for jobs abroad will finally see their long-cherished dreams fulfilled. Your home will be filled with the bustle of auspicious celebrations. Farmers can look forward to an increase in livestock, grain, and overall agricultural wealth. However, those born under the Pubba Nakshatra may face physical illness, unproductive labor, obstacles in their tasks, and a high-stress lifestyle during the second and third weeks. Women, in particular, may find themselves in situations where they must fight a lonely battle to uphold family values, and ironically, your high moral standards might pose a challenge to your personal progress. In the final week, expenses exceeding your budget may lead to mental irritation, and marital matters could prove disappointing. Business activities will continue at a mediocre pace.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
సెప్టెంబర్ 2026 సింహరాశి రాశీఫలితాలు / September 2026 Leo Predictions:
ఈ మాసంలో ఆఖస్మికంగా బాగా తెలిసిన వ్యక్తులు లేదా ఇరుగుపొరుగు వారితో వివాదాలు లేదా వారి వలన నష్టములు ఎదురగును. పెద్ద వయస్సు వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నవి. అనారోగ్య మూలక ధన వ్యయం ఎదురగును. కోర్టు వ్యవహారాలు నిరాశాజనకం గా కొనసాగును. గృహంలో మార్పులకు ఇది మంచి కాలం కాదు. వ్యాపార వర్గం వార్కి ప్రతికూల ఫలితాలు ఎదురగును. మధ్యవర్తులపై అతి నమ్మకంతో ఆధారపడకుండా స్వయంగా క్రయవిక్రయాల విషయంలో న్యాయ సంబంధ సలహా తీసుకొనుట మంచిది. ముఖ్య పనులు చేపట్టుటలో వాయిదా వేయుదురు. మాస ద్వితియార్ధంలో తీవ్ర ఒత్తిడి లేదా ఉద్యోగ నష్టం ఎదురగు సూచన. తలచిన ప్రయత్నాలు ముందుకు సాగవు. ఈ మాసంలో 2, 3, 4, 13, 20, 29 తేదీలు అనుకూలమైనవి కావు.
This month, you may face sudden disputes with well-known individuals or neighbors, or experience losses because of them. Elderly individuals should be cautious as health issues are likely, leading to medical expenses. Legal matters will proceed on a disappointing note, and this is not a favorable time for making changes to your home. Those in the business sector will encounter negative results; it is advisable not to rely too heavily on mediators and instead seek professional legal advice for your transactions. You might find yourself postponing important tasks, and the second half of the month indicates signs of intense pressure or even potential job loss. Efforts to move your plans forward may stall. Please note that the 2nd, 3rd, 4th, 13th, 20th, and 29th of this month are not favorable dates.
అక్టోబర్ 2026 సింహరాశి రాశీఫలితాలు / October 2026 Leo Predictions:
ఈ మాసంలో కూడా అంతగా మంచి ఫలితాలు ఏర్పడవు. వ్యాపార వ్యవహారాలు ఆశించిన విధంగా సాగవు. నూతన పెట్టుబడులు నష్టములను ఏర్పరచును. ఈ మాసంలో ధనాదాయం తక్కువగా ఉంటుంది లేదా ధనం చేతిలో నిలువదు. ఉద్యోగ అన్వేషణలో నిరాశ ఎదురగును. మిత్రులు మాట తప్పెదరు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా ఆందోళన కలిగించవచ్చు. తలపెట్టిన పనులపై ఏకాగ్రత లోపించును. యుక్త వయస్సు స్త్రీలు ఆత్మనూన్యత వలన బాధపడును. 23 వ తేదీ తదుపరి పరిస్తితులు కొంత మెరుగవును. ఆర్ధికంగా నిలదోక్కుకోనుటకు నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన పనులకు సాంకేతికంగా సహాయత లభించును. ఈ మాసంలో ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. విద్యార్ధులకు చివరివారం అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలలో ఆర్ధిక ఇబ్బందులు ఎదురగును. రాజకీయవాదులకు కోర్టు తగాదాలు లేదా పదవీగండం . ఈ మాసంలో ముఖ్యంగా బంధు వర్గ ద్వేషాల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను.
17 అక్టోబర్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు శుక్ర మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ శుక్ర మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను శుక్ర మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.
This month continues to show less than favorable results. Business activities will not progress as expected, and new investments may lead to losses. Financial income will be low, or you may find it difficult to save money. Those searching for jobs may face disappointment, and friends might fail to keep their promises. The behavior of family members could also become a cause for concern, and you may struggle to maintain focus on your intended tasks. Young women might suffer from feelings of low self-esteem. However, conditions will begin to improve after the 23rd, providing new opportunities to stabilize financially and offering technical assistance for your projects. It is advisable to postpone travels this month. For students, the final week looks favorable, but those pursuing foreign opportunities may face financial hurdles. Politicians might encounter legal disputes or threats to their positions. Above all, extreme caution is required regarding animosity within the relative circle.
The Shukra Moodhami (Venus Combustion) period will occur from October 17, 2026, to October 30, 2026. This is considered an inauspicious time. During this Shukra Moodhami interval, no auspicious ceremonies or sacred rituals should be performed. All significant celebratory events must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this time.
నవంబర్ 2026 సింహరాశి రాశీఫలితాలు / November 2026 Leo Predictions:
ఈ మాసంలో ధనాదాయం వృద్ది చెందును. గత రెండు మాసములుగా ఎదుర్కొంటున్న ప్రతికూల ప్రభావం తగ్గుముఖం పట్టును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు సిద్హించును. పెద్దల జోక్యంతో జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు పరిష్కారం అగును. పనులను సకాలంలో పుర్తి చేయగలిగి అందరిని ఆకర్షించగలరు. పనిచేయు కార్యాలయంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. దీర్గకాళిక కుటుంబ అభివృద్దికి బాటలు వేయుదురు. తృతీయ వారం నుండి చక్కటి మనోఉల్లాసం లభిస్తుంది. వైవాహిక జీవనమందు చక్కటి సంతోషాలు పొందుతారు. సమాజంలో మీ హోదా మరియు పరపతి పెరుగును. మీ చేతిపై భారీ శుభకార్యములు విజయవంతంగా పుర్తి అగును.
This month, your financial income will see a significant increase as the negative influences of the past two months begin to subside. For those who are unmarried, efforts toward marriage will finally be successful. Through the timely intervention of elders, ongoing disputes with your life partner will be resolved, restoring harmony. You will be able to complete your tasks on schedule, earning the admiration of others and increasing your importance at your workplace. This period also marks the beginning of long-term growth for your family. From the third week onward, you will experience great mental cheer and joy in your marital life. Your status and reputation in society will rise, and you will successfully manage and complete major auspicious events or ceremonies under your direct leadership.
డిసెంబర్ 2026 సింహరాశి రాశీఫలితాలు / December 2026 Leo Predictions:
ఈ మాసంలో కూడా చక్కటి ధనాదాయం కొనసాగును. వ్యాపార వ్యవహరాదులు తలచినవిధంగా అనుకూలంగా కొనసాగును. మొండి బఖాయిలు వసూలు చేసుకోగలరు. గృహంలో సంతానంతో కలయిక వలన ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కొత్త ఆలోచనల కార్యరూపంలో పెట్టుటకు ఇది మంచి మాసం. అవసరానికి అందవలసిన డబ్బు అందుతుంది. గౌరవ ప్రదమైన ఉద్యోగ జీవనం కొనసాగుతుంది. మీ కృషికి తగిన గుర్తుంపు వుంటుంది.
This month, the steady flow of financial income will continue, and business affairs will progress favorably as planned. You will be successful in recovering long-standing dues or bad debts. A joyful atmosphere will prevail at home, especially through quality time spent with your children. This is an excellent month to put your new ideas into action, and funds will become available exactly when needed. Your professional life will remain honorable, and your hard work will receive the recognition it deserves.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
జనవరి 2027 సింహరాశి రాశీఫలితాలు / January 2027 Leo Predictions:
ఈ మాసంలో కుటుంబ పరమైన వ్యయం అధికంగా ఎదురగును. క్రిమి కిటకాదుల వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కొత్త రంగాలలో ప్రవేసించడానికి చేయు ప్రయత్నాలు ఆటంకములను ఎదుర్కొనును. ఆత్మీయులతో కలయిక వలన ప్రశాంతత లభిస్తుంది. శ్రమతో కూడిన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. లక్ష్యసాధనలో ఏకాగ్రత లోపించు సూచన. వినోద కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. జూదం వలన ఆర్ధిక నష్టములు ఎదుర్కొంటారు. తీరిక లేకుండా సమయాన్ని గడిపెదురు. 16 వ తేదీ తదుపరి ముఖ్యమైన పనులను పూర్తీ చేయగలుగుదురు. భవిష్యత్ గురించిన ప్రణాళికలు రచించుకోవడానికి ఈ కాలం అనుకూలమైనది.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పుష్యమాస శుక్ల షష్ఠి గురువారం రాత్రి గం. 9.07 ని. లకు అనగా 14 జనవరి 2027న ఉత్తరాభాద్ర నక్షత్రంలో శ్రీ సూర్య భగవానుడు మకర రాశి లోకి ప్రవేశించును. సూర్యాస్తమయం తదుపరి మకర సంక్రమణ సంభవిస్తుంది కాబట్టి మరునాడు అనగా 15 జనవరి 2027 న సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. పితృ వర్గ సంస్కరణలు 15 జనవరి 2027 సూర్యోదయం ఉదయం 6.38 నిముషాల తరువాత నిర్వహించుకోవాలి.
భోగి పండుగ: 14 జనవరి 2027 (గురువారం).
సంక్రాంతి పండుగ: 15 జనవరి 2027 (శుక్రవారం)
కనుమ పండుగ : 16 జనవరి 2027 (శనివారం)
ముక్కనుమ పండుగ: 17 జనవరి 2027 (ఆదివారం)
This month, you will encounter high family-related expenses and potential health issues caused by insects or minor infections. Efforts to enter new professional fields may face obstacles. However, spending time with loved ones will bring much-needed peace of mind. You may have to undertake physically demanding travels, and there are signs of a lack of focus in achieving your goals. Your interest in entertainment will increase, but be cautious, as gambling or speculative activities could lead to financial losses. While you will find yourself extremely busy with little free time, you will be able to complete important tasks after the 16th. This period is highly favorable for drafting future plans and strategies.
In the Sri Parabhava year, on Pushya Masa Shukla Shashti, Thursday night at 9:07 PM (specifically on January 14, 2027), Lord Surya will enter Makara Rasi (Capricorn) while in the Uttarabhadra Nakshatra. Since the Makara Sankramanam occurs after sunset, the Sankranti festival should be celebrated the following day, January 15, 2027. Regarding ancestral rites (Pitru Karma/Tarpanam), they should be performed on January 15, 2027, after sunrise at 6:38 AM.
Bhogi Festival: January 14, 2027 (Thursday)
Sankranti Festival: January 15, 2027 (Friday)
Kanuma Festival: January 16, 2027 (Saturday)
Mukkanuma Festival: January 17, 2027 (Sunday)
ఫిబ్రవరి 2027 సింహరాశి రాశీఫలితాలు / February 2027 Leo Predictions:
ఈ మాసంలో వ్రుత్తి ఉద్యోగాలలో ఆశించిన మంచి మార్పులు సంభవించును. చక్కటి ఆత్మవిశ్వాసంతో విజయ మార్గాలను ఏర్పరచుకొందురు. ధనార్జన పెరుగుటకు మంచి అవకాశములను పొందుతారు. దైవ సంబంధ కార్యక్రమాలలో మీ వంతు సహకారం అందిస్తారు. ఈ మాసంలో ధనాదాయం బాగుంటుంది. దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగును. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొందురు. ఈ మాసం పితృ వర్గం వారికి అంత అనుకూలమైన కాలం కాదు. ఈ మాసంలో 8,9,17.18.20 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ తేదీలలో ముఖ్య విషయాలు వాయిదా వేయడం మంచిది.
This month, you will see the desired positive changes in your profession and career. With strong self-confidence, you will pave your own path toward success and encounter excellent opportunities to increase your earnings. You will also contribute your part to divine or spiritual activities. Financial income remains strong, and your daily routine will proceed smoothly. However, efforts related to marriage and starting a family will yield mixed results during this period. Additionally, this month is not very favorable for paternal relatives. Please note that the 8th, 9th, 17th, 18th, and 20th are not auspicious; it is better to postpone important matters on these specific dates.
మార్చి 2027 సింహరాశి రాశీఫలితాలు / మార్చ్ 2027 Leo Predictions:
ఈ మాసంలో పితృ సంబంధమైన వారసత్వ భాగ్యం లభిస్తుంది. ఎంతో కాలంగా వ్యక్తిగత జీవితంలో ఎదురుచూస్తున్న ఒక విశేషమైన మార్పు లభిస్తుంది. కెరీర్ పరంగా అనుకూలమైన స్థితి కొనసాగుతుంది. స్త్రీలకు కెరీర్ రీత్యా అత్యంత అనుకూల కాలం ఏర్పడును. వ్రుత్తి వ్యాపార వర్గాల వారు సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. కుటుంబం ఆర్ధికంగా మెరుగైన స్థితిని పొందును. 12 వ తేదీ నుండి 17 వ తేదీ మధ్య కాలంలో తలపెట్టిన ప్రతీపని శుభఫలితాలను కలుగచేయును. గౌరవ సన్మానాలు పొందుతారు. ఈ మాసం అంతా సమర్ధవంతంగా పనిచేయగలుగుతారు. చివరి వారంలో తాగునీటి వలన ఆరోగ్యం పాడగును. భాత్రు వర్గం వారికి మీ సలహాలు మంచి చేయును. ఈ మాసంలో రక్త సంబంధాలు బలపడతాయి.
This month, you will receive ancestral inheritance through your father's side, and a significant, long-awaited change in your personal life will finally manifest. Your career will continue to be in a favorable position, and this is an especially excellent period for women to achieve professional growth. Those in various trades and businesses will see satisfying results, and the family's overall financial status will improve. Between the 12th and 17th, every task you undertake is likely to yield auspicious results. You will receive honors and recognition, and your ability to work efficiently will remain high throughout the month. In the final week, however, be cautious of health issues related to drinking water. Your advice will prove beneficial to your siblings, and your bonds with blood relatives will grow stronger.
రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.