- Predictions by Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)
For Mesha Rasi in the Sri Parabhava Year (2026 - 2027):
Adayam (Income): 11
Vyayam (Expenditure): 05
Raja Poojyam (Honor/Respect): 02
Avamanam (Dishonor/Insult): 04
రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనగా 19 మార్చ్ 2026 నుండి 6 ఏప్రిల్ 2027 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడును. ముఖ్యంగా 31 మే 2026 తదుపరి మంచి యోగవంతమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహం బలంగా ఉన్న నిరుద్యోగులకు చక్కటి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. ఈ సంవత్సరంలో అక్టోబర్ , నవంబర్, డిసెంబర్ నెలలలో సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. మేషరాశికి చెందిన విద్యార్దులకు ఈ పరాభవ నామ సంవత్సరం అత్యంత అనుకూల కాలం. వివిధ ప్రవేశ పరీక్షలలో మంచి ఫలితాలు పొందగలుగుతారు. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి బృహస్పతి వలన లాభములు ఏర్పడును. వ్యక్తిగత జాతకంలో బలమైన గురు గ్రహాన్ని కలిగి ఉన్నవారు ఒక విధంగా రాజ యోగమును అనుభవిస్తారు. వీరికి మత విశ్వాసం కూడా ఈ సంవత్సరం అధికం అవుతుంది. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సంవత్సరం నూతన అంశాల పట్ల జ్ఞానం పెంపొందించుకుంటారు.
For those born under Mesha Rashi, the Sree Parabhava Naama Samvatsara (March 19, 2026 – April 6, 2027) promises highly auspicious results throughout the year due to the favorable transit of Guru Graha (Jupiter), with particularly significant beneficial) outcomes manifesting after May 31, 2026. Employees can expect promotions, while unemployed individuals with a strong Jupiter in their personal birth chart are likely to secure prestigious government employment. The period of October, November, and December is particularly conducive for progeny efforts, and students will find this year exceptionally favorable for achieving top results in various entrance examinations. Overall, Guru Graha bestows substantial gains, where those with a well-placed Jupiter in their personal horoscopes will experience a form of Raja Yogam, characterized by increased religious faith, enhanced self-control, elevated social status, and the successful acquisition of knowledge in new domains.
మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శనైచ్చరుని వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడును. ఏలినాటి శని దశ ప్రధమ పాద ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శని వ్యతిరేక స్థానాల్లో వున్నవారు మరియు శని మహా దశ జరుగుతూ ఉన్నవారు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొను సూచనలు అధికంగా ఉన్నవి. ఉద్యోగ జీవనంలో ఆఖస్మిక నష్టములు, ఆదాయంలో తగ్గుదల. అపరమితమైన వ్యయం వంటి అననుకూల ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం శని వలన అధిక ఇబ్బందులు ఎదురుఅగుచున్నచో తరచుగా శనికి తైలాభిషేకములు, శని గ్రహ శాంతి ప్రీత్యర్ధం శని గ్రహ మండపారాధన శాంతి హోమం జరిపించుకోనుట మంచిది. నిత్యం ఈ క్రింది మంత్రమును పటించుట మంచిది. మేషరాశి వారికి ఏలినాటి శని దశ ప్రభావం సెప్టెంబర్ 2032 వరకు ఉంటుంది.
“నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైచ్చరం”
For those born under Mesha Rashi, the Sree Parabhava Naama Samvatsara brings unfavorable results throughout the year due to the influence of Shani. The impact of the first phase (Pradhama Pada) of Elinati Shani (Sade Sati) will be intense. Individuals whose personal birth charts show Shani in adverse positions, or those currently undergoing Shani Maha Dasha, face a high probability of encountering legal difficulties. The professional sphere may witness sudden losses, a decrease in income, and excessive expenditures. If the difficulties caused by Shani become overwhelming this year, it is advisable to frequently perform Tailabhishekam and participate in Shani Graha Mandaparadhana Shanti Homam for planetary appeasement. Additionally, chanting the prescribed mantra daily is highly recommended for protection and peace. For Aries, Elinati Shani phase will be completed in September 2032.
" Neelanjana Samabhasam Raviputram Yamagrajam Chaya Martanda Sambhootam Tam Namami Shaniccharam"
మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహువు వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడును. అనేక పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా కాలంగా వేచి చూస్తున్న తీర్ధయాత్రలు పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా 2026 డిసెంబర్ నుండి 2027 మార్చ్ వరకు రాహు గ్రహం వలన లాభపూరిత కాలమును పొందుతారు. వారసత్వ సంబంధ సమస్యల నుండి బయట పడతారు.
For those born under Mesha Rashi, the Sree Parabhava Naama Samvatsara brings favorable results due to the influence of Rahu. You will have the opportunity to participate in numerous sacred activities and finally complete pilgrimage trips that have been delayed for a long time. The period from December 2026 to March 2027 will be particularly profitable due to the transit of Rahu Graha. Additionally, you will successfully resolve and emerge from long-standing issues related to ancestral property or inheritance.
మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతువు వలన ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్న సంతానం వలన విచారత ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యవసాయ సంబంధ భూ క్రయ విక్రయాలలో విఘ్నాలు / సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. మాతృ వర్గానికి చెందిన వారి ఆరోగ్య విషయాలు ఆందోళన కలిగిస్తాయి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి గురువు మరియు రాహువు వలన అనుకూల ఫలితాలు లభిస్తాయి. శని మరియు కేతు గ్రహముల వలన ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి.
For those born under Mesha Rashi, the Sree Parabhava Naama Samvatsara brings unfavorable results due to the influence of Ketu. You may experience distress specifically concerning children who are of marriageable or young adult age. Additionally, obstacles and complications are likely to arise in matters related to the purchase or sale of agricultural land. The health of maternal relatives may also become a cause for concern during this period. Overall, for Mesha Rashi during the Sree Parabhava Naama Samvatsara, Guru Graha and Rahu provide favorable outcomes, while the influences of Shani and Ketu result in adverse conditions.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
మార్చ్ 2026 మేషరాశి రాశిఫలాలు / March 2026 Aries Predictions:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ప్రధమ అర్ధ భాగంలో మంచి అనుకూల వాతావరణం ఏర్పడును. కుటుంబంలో చికాకులు తొలగును. పనులు వాయిదా పడకుండా ఆశించిన విధంగా పూర్తీ అగును. భాత్రు వర్గంతో ఘర్షణలు తొలగును. ఆశించిన ధనప్రాప్తిని పొందుతారు. ప్రయాణాలు సౌకర్యవంతంగా పూర్తీ అగును. గృహంలో బంధు లేదా స్నేహ వర్గ కూడికలు ఏర్పడును. విదేశీ నివాస ప్రయత్నములు చేయువారికి శుభం. ద్వితీయ అర్ధ భాగంలో ధన అవసరములు పెరిగి మానసిక ఆందోళన ఏర్పడును. కుటుంబంలోని పెద్దవయ్యస్సు వారికి అనారోగ్య సమస్యలు కొనసాగును.
March 2026 promises mixed results. The first half will be highly favorable, with a positive atmosphere prevailing. Domestic irritations will subside, and tasks will be completed as expected without any delays. Conflicts with siblings (Bhathru varga) will be resolved, and you will achieve your anticipated financial gains. Travels will be comfortable, and you may enjoy gatherings with relatives or friends at home. Those aspiring for foreign residency will find this period auspicious. However, during the second half of the month, increased financial demands may lead to mental anxiety. Additionally, health issues for the elderly members of the family may persist.
ఏప్రిల్ 2026 మేషరాశి రాశిఫలాలు / April 2026 Aries Predictions:
ఈ మాసంలో ఆశించిన ధన లాభములు పొందగలుగుతారు. వ్యాపార వ్యవహరాదులు ఆశించిన విధంగా కొనసాగును. కుటుంబ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది. బంధు వర్గం వారితో ద్వితియ వారంలో కుటుంబ వ్యవహార పరమైన సమస్యలు ఎదురగు సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల నూతన నిర్ణయాలను మీరు స్వాగతించవలసి ఉంటుంది. వైవాహిక జీవనంలో కూడా కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి. బాగా ఎదిగిన సంతానం తిరుగుబాటు ధోరణి ప్రదర్శించడం ఇబ్బంది పెడుతుంది. రాజకీయ నాయకులకు నూతన పదవులు లభిస్తాయి. ఈ మాసం 21, 22, మరియు 23 తేదీలలో వాహన చోదన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించవలెను. ప్రమాదం జరుగుటకు ఆస్కారం ఉన్నది. మాసాంతంలో పాత బాకీలు వసూలు చేసుకోగలరు. ఈ మాసంలో నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. ఈ మాసంలో మేషరాశి వారికి నాయకత్వ లక్షణాల పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. మహిళలు స్వతంత్ర ఆలోచనలు చేయగలుగుతారు. వారికి నూతన విషయాసక్తి ఏర్పడుతుంది.
In April 2026, you will be able to achieve your anticipated financial gains. Business affairs and transactions will proceed as expected, and the funds required for family needs will be successfully arranged. However, during the second week, there are indications of family-related issues arising with relatives. You may find yourself in a position where you must welcome new decisions made by family members. In your marital life, slight misunderstandings may occur. Additionally, the rebellious attitude of grown-up children might cause some distress. For those in the political field, the attainment of new positions or portfolios is indicated. You must exercise extreme caution while driving on the 21st, 22nd, and 23rd of this month, as there is a possibility of accidents. By the end of the month, you will be successful in recovering long-standing dues. For the unemployed, efforts toward securing a job will bear fruit. During this period, individuals born under Mesha Rashi will develop a strong inclination toward leadership roles. Women will exhibit independent thinking and develop a keen interest in learning new subjects.
మే 2026 మేషరాశి రాశిఫలాలు / May 2026 Aries Predictions:
ఈ మాసంలో వ్యాపార వర్గం లోని వారు ఒక వివాదం ఏర్పడుట వలన మానసిక వ్యాకులతను అనుభవించవలసి వస్తుంది. సర్వ కార్యములు మీరు కోరుకున్న విధంగానే పూర్తి అవ్వాలనే ధోరణి విడిచి పెట్టాలి. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. నూతన గృహ నిర్మాణ సంబంధ ఋణ ప్రయత్నములు ఫలించును. కష్ట సాధ్యమైన పనులకు కూడా ఆరోగ్యం సహకరించును. మీ పని ప్రదేశంలో ఇతరులను మీ మాటలతో ప్రభావితం చేయగలుగుతారు. ఈ మాసంలో తృతీయ వారం లాభదాయకంగా ఉంటుంది. ఈ మాసంలో తలపెట్టిన వ్యాపార వ్యవహరాదులలో విజయం లభిస్తుంది. ఆశావాదులకు నూతన ఆదాయ మార్గములు లభించును. ఉద్యోగ జీవనంలో స్థాన చలనం ఆశిస్తున్న వారికి కోరుకొన్న ప్రదేశానికి స్థానచలనం లభిస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవం మరియు సన్మానములను పొందగలుగుతారు. విద్యార్దులకు ఈ మాసంలో తమ కర్తవ్య దీక్ష పై ఏకాగ్రత అవసరం. మీ మనోభావములను అదుపులో ఉంచుకొనుట నేర్చుకోనవలను. అతి నమ్మకంతో ప్రవర్తించరాదు.
During May 2026, those in the business sector may experience mental distress due to the emergence of a specific dispute. It is advisable to move away from the rigid expectation that all tasks must be completed exactly according to your personal desires. While financial income will remain moderate, efforts to secure loans for the construction of a new house will be successful. Your health will be supportive, even when dealing with physically or mentally demanding tasks. In your professional environment, you will be able to influence others effectively through your words. The third week of this month proves to be particularly profitable. Success is indicated in all business transactions and ventures initiated during this period. For those with an optimistic outlook, new avenues of income will manifest. Employees seeking a transfer will successfully secure a posting to their desired location. Furthermore, you will receive significant respect and honors within society. Students, however, must maintain strict concentration and dedication toward their duties this month. It is essential to learn to keep your emotions in check and avoid impulsive or excessive behavior.
03 మే 2026 నుండి 29 మే 2026 వరకు వాస్తు కర్తరీ ఏర్పడుతుంది. ఈ కాలంలో గృహ నిర్మాణ పనులు ఆరంభించకూడదు. నిర్మాణ దశలో ఉన్న పనులను కూడా కర్తరీ కాలం పూర్తి అగువరకు ఆపడం మంచిది. ఈ కాలం లో గృహ ప్రవేశాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఈ కాలంలో శంఖుస్థాపన ముహుర్తాలు, గృహ నిర్మాణ ఆరంభ ముహుర్తాలు మరియు గృహ ప్రవేశ ముహుర్తాలు ఉండవు.
The Vastu Kartari period will occur from May 3, 2026, to May 29, 2026. During this time, it is advised not to commence any new house construction works. It is also recommended to pause ongoing construction activities until the Kartari period concludes, and housewarming ceremonies (Gruhapravesam) should be postponed. Please note that during this interval, there are no auspicious Muhurthams available for foundation stone laying (Shankusthapana), commencement of house construction, or housewarming ceremonies.
జూన్ 2026 మేషరాశి రాశిఫలాలు / June 2026 Aries Predictions:
ఈ మాసంలో జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్య లేదా ఒక చిన్న శస్త్ర చికిత్స వలన ధన వ్యయం అధికం అవుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల పట్ల మీరు శ్రద్ధ వహించాలి. ఉద్యోగ జీవనంలో ప్రోత్సాహకర వాతావరణం లభిస్తుంది. వ్యాపారాదులు లాభదాయకంగా ఉండును. ముఖ్యంగా వస్త్ర సంబంధమైన మరియు సుగంధ ద్రవ్య సంబంధమైన క్రయవిక్రయాలు చేయు వారికి అధిక లాభములు ఏర్పడును. భవిష్యత్ జీవిత ప్రణాళికకు సంభందించిన నిరాయలు తీసుకొనుటకు ఈ మాసం అనుకూలమైనది. సంతాన ప్రయత్నాలకు కూడా ఈ మాసం అనుకూలమైన కాలం. ఈ మాసంలో మేషరాశి వారు నూతనంగా పరిచయమైన వ్యక్తుల వలన ఉపకారమును పొందుదురు. చివరి వారంలో అనగా 22 వ తేదీ తదుపరి వైవాహిక సమస్యల కోసం కోర్టును ఆశ్రయించిన దంపతులకు పరిష్కారం లభించును. ఈ మాసంలో కూడా అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించును. ఈ మాసంలో 5, 6, 8, 19, 29 తేదీలు అనుకూలమైనవి కావు. ముఖ్యంగా భరణి నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండవలెను. ఆసక్తి కలిగిన అశ్విని నక్షత్ర జాతకులు గాన లేదా సంగీత వాయిద్య శాస్త్రములందు విద్యాభ్యాసం ప్రారంభించుటకు ఈ మాసం చాలా అనుకూలమైనది.
01 జూన్ 2026 రాత్రి 2.09 నిమిషాలకు గురువు కర్కాటక రాశి లోనికి ప్రవేశించడంతో 02 జూన్ 2026 నుండి 13 జూన్ 2026 వరకు యమునా నదికి పవిత్ర పుష్కరములు నిర్వహించబడతాయి.
During June 2026, your spouse may face health issues or a minor surgical procedure, leading to significant financial expenditure. It is essential that you pay close attention to your spouse's well-being. In your professional life, a supportive and encouraging atmosphere will prevail. Business ventures will be profitable, with particularly high gains indicated for those involved in the trade of textiles and perfumes (fragrances). This month is highly favorable for making decisions regarding your future life plans. It is also an auspicious period for those making efforts toward progeny. Individuals born under Mesha Rashi will receive timely assistance or benefits from newly formed acquaintances. In the final week—specifically after the 22nd—couples who have approached the court regarding marital disputes can expect a resolution. Efforts toward marriage for the unmarried will also bear fruit this month. Please note that the 5th, 6th, 8th, 19th, and 29th are unfavorable dates. Those born under the Bharani Nakshatra must exercise particular caution. For those born under Ashwini Nakshatra who possess an interest in the arts, this month is exceptionally favorable for beginning formal training in vocal music or musical instruments.
With the entry of Jupiter (Guru) into Karkataka Rasi (Cancer) on June 2, 2026, at 2:09 AM, the sacred Yamuna River Pushkarams will be observed from June 2, 2026, to June 13, 2026
జూలై 2026 మేషరాశి రాశిఫలాలు / July 2026 Aries Predictions:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉండును. మేషరాశికి చెందిన స్త్రీలకు గర్భ సంబంధమైన సమస్యల వలన చికాకులు ఎదురగు సూచన ఉన్నది. ఈ మాసంలో ఉద్యోగ వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. ఇతరులపై భారం వేసి నూతన పనులను ప్రారంభించుట మంచిది కాదు. సక్రమ మార్గంలో పనులు పూర్తి చేయుటకు ప్రయత్నించండి. ఈ మాసంలో మానసికంగా అధిక ఉత్సాహంతో ఉంటారు. నూతన బంధు వర్గం లభిస్తుంది. మీ చిరకాల ఆశయాన్ని సాధించగలుగుతారు. 11 నుండి 16 వ తేదీల మధ్య నూతన ఆదాయ మార్గములు లభించుటకు అవకాశములు ఉన్నవి. వ్యక్తిగత జీవితం లేదా గృహ వాతావరణం మరియు పనిచేయు కార్యాలయంలోనూ ఆనందకరమైన పరిస్థితులను కలిగి ఉందురు. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ బేధాలు తొలగును. అవరోధాలకు భయపడకుండా పట్టుదలతో మీ లక్ష్యాలను పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండుట మంచిది. ఎందుకంటే ఈ మాసంలో మీ ప్రవర్తనపై ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శనైచ్చరుని ప్రతికూల ప్రభావం వలన అదృష్గం అంతగా కలసి రాదు. భాద్యతాయుత సహనం కలిగిన ఉద్యోగిగా పేరు తెచ్చుకోనడమే మంచిది. ఈ మాసంలో విదేశీ జీవన సంబంధ ప్రయత్నాలు పలు అవరోధాలను ఎదుర్కొందును.
15 జూలై 2026 నుండి 13 ఆగష్టు 2026 వరకు గురు మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ గురు మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను గురు మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.
During July 2026, financial income will remain moderate. Women born under Mesha Rashi are cautioned that gynecological or pregnancy-related issues may cause some distress. Professional and business activities will proceed at a standard pace. It is not advisable to initiate new projects by delegating the primary responsibility to others; instead, ensure you complete your tasks through proper and direct channels. Mentally, you will feel highly enthusiastic and energetic. You will forge new relationships with relatives and successfully achieve a long-held ambition. Between the 11th and 16th, opportunities for new sources of income are likely to manifest. You will experience a joyful atmosphere in both your personal life/home and your workplace, as differences of opinion among family members subside. You will pursue your goals with determination, undeterred by obstacles. However, it is wise to avoid taking any impulsive or adventurous risks regarding your career. During this period, the influence of Elinati Shani (Sade Sati) will be intense, affecting your conduct and decision-making. Due to this unfavorable transit of Saturn, luck may not be on your side; therefore, it is best to focus on earning a reputation as a responsible and patient professional. Efforts regarding foreign residency or overseas employment will encounter several hurdles this month.
The Guru Moodhami (Jupiter Combustion) period will occur from July 15, 2026, to August 13, 2026. During this Guru Moodhami interval, no auspicious ceremonies or functions should be performed. All significant events and celebrations must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this inauspicious time.
ఆగష్టు 2026 మేషరాశి రాశిఫలాలు / August 2026 Aries Predictions:
ఈ మాసంలో గృహ అవసరాలకు, వివిధ శుభ కార్యములకు సంబంధించిన శారీరక శ్రమ అధికం అవుతుంది. మీపై బాధ్యతలు పెరుగును. గృహంలో నూతన సౌకర్యాలు ఏర్పాటు చేయుదురు. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఈ మాసంలో మేషరాశి కి చెందిన విద్యార్ధులు విదేశే జీవన సంబందిత విషయాలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అన్ని రకముల వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. ఈ మాసంలో తృతీయ వారం భాత్రు వర్గం వారికి అంత మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగ రంగములోని వారికి ఒక శుభవార్త లభిస్తుంది. ఈ మాసం చివరి వారంలో నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ముగియును. ఆరోగ్య విషయాలు తృప్తికరంగా ఉండును. ఈ మాసంలో 7, 10, 14, 25 తేదీలలో తేలికగా మనోవ్యాకులత పొందే సంఘటనలు ఎదుర్కొందురు. ఉద్యోగ జీవనంలో ఆందోళనకర పరిస్తితులు ఎదురగు సూచనలు ఉన్నవి. ఈ రోజులలో ఆలోచనా బలం తగ్గుతుంది.
During August 2026, physical exertion related to domestic needs and various auspicious ceremonies (Shubha Karyas) will increase. Your responsibilities will grow, and you will likely arrange for new amenities or comforts within the home. Financial income will remain moderate. Students born under Mesha Rashi will see favorable results regarding their aspirations for education or life abroad. All types of business activities will continue at a standard pace. However, the third week of this month may not be very favorable for siblings (Bhathru varga). Those employed in the government sector can expect to receive some good news. In the final week of the month, the job search for the unemployed is likely to reach a successful conclusion. While general health matters will be satisfactory, you may encounter situations that lead to mental distress or anxiety on the 7th, 10th, 14th, and 25th. There are indications of unsettling conditions arising in your professional life during these specific dates, and your clarity of thought may diminish.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
సెప్టెంబర్ 2026 మేషరాశి రాశిఫలాలు / September 2026 Aries Predictions:
మేషరాశి వారికి ఈ మాసంలో అకాల భోజనం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచన ఉన్నది. భోజన ప్రియులు ఈ మాసంలో జాగ్రత్తగా ఉండవలెను. ఈ మాసంలో తలపెట్టిన పనులన్నీ మిశ్రమ ఫలితాలు ఎదుర్కొనును. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఒడిదుడుకులు ఎదుర్కొనును. గత మాసంలో ఉద్యోగ పరంగా ఏర్పడిన ఆందోళనాపూరిత పరిస్టితులు కొనసాగును. ఈ మాసంలో ధనాదాయం ఆశించినంతగా ఉండదు. తగ్గబోయే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్ధిక ప్రణాళిక వేసుకోవడం మంచిది. కృత్తికా నక్షత్ర జాతకులకు ఈ మాసంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కలసి రావు. మిత్రులను ఆర్ధిక సహకారం కోరవలసి రావచ్చును. దూర ప్రాంత ప్రయాణాలు అంతగా ఫలించవు. మీ మనోభావములు ఇతరులకు అర్ధం అగు విధంగా ప్రవర్తించడం మంచిది. త్వరగా ఉద్రేకం పొందే స్వభావం వలన మంచి వ్యక్తులను మీ జీవితం నుండి దూరం చేసుకొందురు. పరుల కార్యములు పూర్తి చేయుటలో మీ విలువైన సమయాన్ని వృధా చేసుకొందురు. ఈ మాసంలో పితృ వర్గం వారిని శ్వాశ సంబంధ ఆరోగ్య సమస్యలు భాదించును.
In September 2026, for those born under Mesha Rashi, there are indications of health issues arising this month due to irregular meal timings (Akala Bhojanam). Those who are particularly fond of food must exercise caution during this period. All tasks initiated this month will yield mixed results. Notably, the efforts of the unemployed will face significant fluctuations and hurdles. The unsettling professional conditions experienced in the previous month are likely to persist. Financial income this month will not meet your expectations. It is advisable to plan your finances carefully, keeping the potential decrease in income in mind. For those born under Krithika Nakshatra, investments in the stock market will not be favorable during this period. You may find it necessary to seek financial assistance from friends. Long-distance travels will not yield the desired results. It is better to conduct yourself in a manner that allows others to understand your feelings clearly. Due to a tendency to become easily provoked or agitated, you may distance good people from your life. Furthermore, you might waste your valuable time tending to the affairs of others. This month, paternal elders (Pitru Varga) may suffer from respiratory health issues.
అక్టోబర్ 2026 మేషరాశి రాశిఫలాలు / October 2026 Aries Predictions:
ఈ మాసంలో గత రెండు మాసముల నుండి ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రత తగ్గుతుంది. కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యం సంపూర్ణంగా సహకరిస్తుంది. శారీరక ఉత్సాహం కన్నా మానసిక ఉత్సాహం అధికంగా ఉంటుంది. మొదటి రెండు వారములు కెరీర్ పరంగా కొద్దిపాటి ప్రతికూల పరిస్టితులు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందోత్సవాలతో కాలాన్ని గడపగలుగుతారు. విలువైన వస్తువులు లేదా దస్తావేజులు సమకూర్చుకోగలరు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. మిత్రుల పట్ల ఉన్న అనుమానాలు తొలగిపోవును. నూతన బంధాలు బలపడతాయి. కుటుంబం పట్ల ప్రీతి పెరుగుతుంది. ప్రపంచ పరిణామముల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. సంతాన లేమి దంపతులకు సంతాన సిద్ధి వలన అమిత ఆనందం లభిస్తుంది. మేషరాశికి చెందిన స్త్రీలు ఆదర్శవంతమైన మాతృమూర్తులు అవుతారు. ఈ మాసంలో 25 నుండి 29 వ తేదీ మధ్య కాలంలో ఉద్యోగ జీవనంలో నూతన అవకాశములు పొందుతారు.
17 అక్టోబర్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు శుక్ర మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ శుక్ర మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను శుక్ర మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.
In October 2026, the intensity of the problems you have been facing for the past two months will decrease. You will likely undertake long-distance travels with family members and friends. Your health will be fully supportive, and your mental enthusiasm will surpass even your physical energy. Although the first two weeks may present some minor professional setbacks, you will be able to spend joyful and celebratory time in the company of your family. This is a favorable period to acquire valuable items or important legal documents/deeds. While financial income will remain moderate, any lingering suspicions regarding friends will be cleared. New relationships will strengthen, and your affection for your family will grow. You will also develop a keen interest in world affairs and global developments. For couples facing difficulties with conception, the blessing of progeny (Santana Siddhi) will bring immense joy. Women born under Mesha Rashi will prove to be exemplary and ideal mothers. Between the 25th and 29th of this month, you will encounter new opportunities in your professional life.
The Shukra Moodhami (Venus Combustion) period will occur from October 17, 2026, to October 30, 2026. This is considered an inauspicious time. During this Shukra Moodhami interval, no auspicious ceremonies or sacred rituals should be performed. All significant celebratory events must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this time.
నవంబర్ 2026 మేషరాశి రాశిఫలాలు / November 2026 Aries Predictions:
ఈ మాసం విదేశీ ఉద్యోగ లేదా విదేశీ స్థిర నివాస ప్రయత్నాలు చేయువారికి కలసివచ్చును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ పరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి. సమాజంలోని పెద్దలతో లేదా ఉన్నత అధికారులతో పరిచయాలు ఏర్పడును. ఉద్యోగ జీవితంలో సమయానికి పనులు పూర్తి చేయుట వలన చక్కటి గుర్తింపు సంపాదించగలుగుతారు. ద్వితీయ వారంలో చిన్న పిల్లలకు ఆరోగ్య పరమైన చికాకులు ఎదురగును. మాత్రు సౌఖ్యం తక్కువగా ఉంటుంది. వ్యాపార రంగంలోని వారికి ప్రారంభ వారములలో ఆశించినంత ఆదాయం ఉండదు. మాసాంతానికి ఆదాయం వృద్ధి చెందును. ఇతరులను మీరు విశ్వసించిన విధంగా ఇతరులు మిమ్మల్ని విశ్వసించరు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ మాసంలో 8, 13, 15, 22 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ తేదీలలో ముఖ్య విషయాలను వాయిదా వేయుట మంచిది.
November 2026 will be favorable for those making efforts toward overseas employment or permanent foreign residency. While financial income will remain moderate, family-related expenses will begin to decrease. You will establish new acquaintances with influential societal leaders or high-ranking officials. In your professional life, completing tasks on time will help you earn significant recognition. During the second week, children in the family may face minor health irritations. Additionally, comfort or happiness related to the mother (Matru Soukhyam) may be somewhat diminished. For those in the business sector, income will not meet expectations during the initial weeks; however, earnings will improve toward the end of the month. You must not forget that others may not trust you with the same sincerity that you place in them. Please note that the 8th, 13th, 15th, and 22nd are not favorable dates. It is advisable to postpone important matters or decisions during these specific days.
డిసెంబర్ 2026 మేషరాశి రాశిఫలాలు / December 2026 Aries Predictions:
ఈ మాసంలో అతి చక్కటి ధనాదాయం ప్రాప్తించును. ఉద్యోగ జీవనంలో ప్రమోషన్లు ఆశించవచ్చును. నూతన గృహం లేదా స్థలాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలించును. వ్యాపారస్థులకు గతకాలపు క్రయవిక్రయ సంబంధ వివాదాలు పరిష్కారం అగును. న్యాయస్థానములలో అనుకూల తీర్పులు పొందుతారు. ప్రయాణాలు ఫలవంతం అగును. మొదటి రెండు వారాలలో సంతాన ప్రయత్నాలు మాత్రం అసంతృప్తిని కలుగచేస్తాయి. ముగిసిపోయిన స్నేహబంధాలు ఈ మాసంలో తిరిగి ప్రారంభం అవుతాయి. వివాహ సంబంధ ప్రతిపాదనలు చేయుటకు మరియు వారసత్వ సంబంధ విషయాల కొరకు కుటుంబ పెద్దలను కలువుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. అన్ని వర్గముల వారికి ఆశించిన విధంగా ధన ప్రాప్తి లభిస్తుంది. శరీర దారుడ్యత పెరుగుతుంది. ముఖ్యంగా 17 డిసెంబర్ తదుపరి ధనయోగం ఉన్నది. గౌరవ మర్యాదలు పొందుతారు. విద్యార్దులకు అతి చక్కటి అనుకూల కాలం. పుత్ర సంతాన సంబంధ విషయాలలో అదృష్టం కలసి వస్తుంది. గల్ఫ్ దేశములందు ధనార్జన ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం అనుకూలమైన కాలం.
December 2026, you will be blessed with excellent financial gains. Promotions in professional life can be expected. Efforts to purchase a new house or open plots will be successful. For businesspeople, past disputes related to sales and transactions will be resolved, and you may receive favorable judgments in legal matters. Travels during this period will prove to be fruitful. While efforts toward progeny may cause some dissatisfaction during the first two weeks, previously severed friendships are likely to be renewed this month. This is an auspicious time to make marriage proposals or to meet family elders regarding inheritance matters. People from all walks of life will experience the financial gains they anticipated. Physical fitness and stamina will improve. Notably, a strong Dhana Yogam (financial prosperity) is indicated after December 17th. You will receive significant honor and respect. This is an exceptionally favorable time for students, and luck will favor matters related to male children. Furthermore, this month is a highly opportune time for those seeking to earn wealth in Gulf countries.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
జనవరి 2027 మేషరాశి రాశిఫలాలు / January 2027 Aries Predictions:
ఈ మాసంలో తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పని ఒత్తిడి అధికంగా ఉండుట వలన కొద్దిపాటి మానసిక అశాంతి ఎదుర్కొందురు. దూర ప్రాంత స్థాన చలన ప్రయత్నాలకు రాజకీయ పరపతి ని ఉపయోగించవలసి వస్తుంది. ఒత్తిడులు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. కోరుకొన్న వ్యక్తి నుండి ఆదరణ, ఆప్యాయత పొందుగలుగుతారు. ఈ మాసంలో ధనాదాయం కొంత పెరుగుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు మరియు స్థానం లభిస్తుంది. వైద్య వృత్తి జీవనంలో ధనార్జన చేయువారికి మాత్రం కొద్దిపాటి అసంతృప్తి ఎదురగును. మిత్రులకు సంబంధించిన ఒక సమస్య మీ వ్యాహర దక్షత వలన పరిష్కారం పొందును. విలస వంతమైన వస్తువల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ మాసం చివరి వారంలో అనగా 24, 25, 26, 27 తేదీలలో ఉద్యోగ జీవనంలో జాగ్రత్తగా ఉండుట మంచిది.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పుష్యమాస శుక్ల షష్ఠి గురువారం రాత్రి గం. 9.07 ని. లకు అనగా 14 జనవరి 2027న ఉత్తరాభాద్ర నక్షత్రంలో శ్రీ సూర్య భగవానుడు మకర రాశి లోకి ప్రవేశించును. సూర్యాస్తమయం తదుపరి మకర సంక్రమణ సంభవిస్తుంది కాబట్టి మరునాడు అనగా 15 జనవరి 2027 న సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. పితృ వర్గ సంస్కరణలు 15 జనవరి 2027 సూర్యోదయం ఉదయం 6.38 నిముషాల తరువాత నిర్వహించుకోవాలి.
భోగి పండుగ: 14 జనవరి 2027 (గురువారం).
సంక్రాంతి పండుగ: 15 జనవరి 2027 (శుక్రవారం)
కనుమ పండుగ : 16 జనవరి 2027 (శనివారం)
ముక్కనుమ పండుగ: 17 జనవరి 2027 (ఆదివారం)
During January 2027, you will find yourself undertaking frequent travels. Due to high work pressure, you may experience some mental restlessness or lack of peace. You might need to utilize political influence or high-level networking to succeed in your efforts regarding long-distance transfers or relocations. Despite these pressures, you will be able to complete your goals effectively. You will also receive affection and support from someone you admire. Financial income is expected to increase during this period. Your talents will receive the recognition and status they deserve. However, those in the medical profession may face slight dissatisfaction regarding their earnings. A problem concerning your friends will be resolved through your skillful management and diplomacy. You may find yourself spending money on luxury items or comforts. In the final week of the month—specifically on the 24th, 25th, 26th, and 27th—it is advisable to be extra cautious and diligent in your professional life to avoid complications.
In the Sri Parabhava year, on Pushya Masa Shukla Shashti, Thursday night at 9:07 PM (specifically on January 14, 2027), Lord Surya will enter Makara Rasi (Capricorn) while in the Uttarabhadra Nakshatra. Since the Makara Sankramanam occurs after sunset, the Sankranti festival should be celebrated the following day, January 15, 2027. Regarding ancestral rites (Pitru Karma/Tarpanam), they should be performed on January 15, 2027, after sunrise at 6:38 AM.
Bhogi Festival: January 14, 2027 (Thursday)
Sankranti Festival: January 15, 2027 (Friday)
Kanuma Festival: January 16, 2027 (Saturday)
Mukkanuma Festival: January 17, 2027 (Sunday)
ఫిబ్రవరి 2027 మేషరాశి రాశిఫలాలు / February 2027 Aries Predictions:
ఈ మాసం అవివాహితులకు చక్కటి వైవాహిక జీవనారంభాన్ని కలుగచేయును. ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి ఈ మాసంలో పేరు ప్రతిష్టలు కలిగిన ఉద్యోగం లభించును. కెరీర్ పరంగా మార్పుకోసం ఈ మాసంలో ప్రయత్నించవచ్చు. ఈ మాసంలో ధనాదాయం కూడా బాగుండును. ప్రారంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయగలరు. జీవన స్థాయి విధానం అభివృద్ధికి నూతన ఆలోచనలు చేయుటకు ఈ మాసం తగిన సమయం. నూతన వ్యాపారములలో పెట్టుబడులు లాభించును. ఈ మాసంలో భరణి నక్షత్ర జాతకులకు అప్రయత్న పూర్వకంగా ధనలాభాములు ఏర్పడును. స్పెక్యులేషన్ కూడా లాభించును. ఇతరుల మనోభావాలను గౌరవించుట వలన వ్యక్తిగత జీవితంలో లాభపడతారు. మొత్తం మీద మేషరాశి వారికి ఈ ఫెబ్రవరి మాసం అనుకూలంగా ఉంటుంది.
February 2027 will bring an excellent start to married life for the unmarried. For those seeking employment, this period will grant a job of high reputation and status. This is also an opportune month to make efforts toward a career change. Financial income will be strong, and you will be able to successfully complete all tasks you initiate. It is an ideal time to brainstorm and implement new ideas to improve your standard of living. Investments in new business ventures will prove profitable. Notably, those born under Bharani Nakshatra will experience unexpected financial gains (Aprayatna Dhana Labham) this month. Speculative ventures (such as the stock market) will also yield profits. By respecting the feelings and opinions of others, you will find personal life much more rewarding. Overall, this month of February will be highly favorable for individuals born under Mesha Rashi.
మార్చి 2027 మేషరాశి రాశిఫలాలు / March 2027 Aries Predictions:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆర్ధికంగా అనుకూల ఫలితాలను, ఆరోగ్య పరంగా ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. సంతాన సంబంధ విషయాలకు ఈ మాసం అంత అనుకూల కాలం కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన బాధ కలిగించు సూచన. మీ వ్యక్తిగత ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించుటకు అవకాశం కలదు. ఈ మాసంలో ధనాదాయం మాత్రం బాగుండును. ద్వితీయ వారంలో కుటుంబ పరిస్థితులు తీవ్రంగా గతి తప్పును. ఉద్యోగ జీవనంలో తోటి ఉద్యోగులతో జాగ్రత్త అవసరం. అనవసర వాగ్వివాదాలు ఏర్పడు సూచనలు ఉన్నవి. ఈ మాసంలో నూతన ఆభరణాలు లేదా వాహన కొనుగోలు చేయుటకు అనుకూలమైన పరిస్టితులు లభించును. తృతీయ వారం ఉద్యోగ మార్పులకు , ఇంటర్వులకు అనుకూలమైన కాలం.
During March 2027, you will experience mixed results. While financial aspects remain favorable, you may encounter challenges regarding your health. This is not a particularly auspicious period for matters related to children (Santana). There are indications that the behavior of family members may cause some distress, and your personal health might also become a source of concern. On a positive note, your financial income will be strong this month. However, be cautious during the second week, as domestic situations may deviate significantly from the norm. In your professional life, exercise care when interacting with colleagues, as there are signs of potential unnecessary arguments or disputes. Favorable conditions will manifest for those looking to purchase new jewelry or a vehicle. Additionally, the third week serves as an opportune time for job changes or attending interviews.
రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.