Placeholder image

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ధనుర్రాశి రాశీఫలాలు

Sree Parabhava Nama Samvatsara Dhanur Rasi / Sagittarius Sign Free Telugu Rasi Phalalu

- Predictions By Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)

2026 2027 sri parabhava naama dhanur rasi phalitalu sagittarius sign astrology predictions

 

  • శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం- 14, వ్యయం - 11, రాజ పూజ్యం - 01, అవమానం - 02

    For the Sri Parabhava Nama Samvatsaram, individuals belonging to Dhanu Rashi (Sagittarius) will have an Income (Adayam) of 14 against an Expenditure (Vyayam) of 11, while their Social Honor (Rajapujyam) stands at 01 with Dishonor (Avamanam) at 02

  • పూర్వ పద్దతి లో ధనుర్ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "8". ఇది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఏర్పడబోతున్న ఆరోగ్య మరియు కుటుంబ పరమైన హాని సూచిస్తుంది.

    According to the traditional calculations (Poorva Paddhati), the remainder (Sesha) for Dhanu Rashi is '8'. This indicates potential challenges regarding health and family matters for Dhanu Rashi individuals during the Sri Parabhava Nama Samvatsaram.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Dhanur Rasi / Sagittarius's Sign Nature...
  • రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

ధనుర్ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనగా 19 మార్చ్ 2026 నుండి 6 ఏప్రిల్ 2027 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఎదురగును. 31 మే 2026 వరకు బృహస్పతి వలన చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్ధులకు బాగా కలసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయు యువకులకు సౌందర్యవతి, గుణవతి, పతివ్రత అగు భార్య లభిస్తుంది. జీవిత భాగస్వామి తరపున స్థిరాస్థి సంక్రమిస్తుంది. వివాహం తదుపరి అన్నింటా కలసి వస్తుంది. చక్కటి మిత్ర వర్గం లభిస్తుంది. వ్యాపార వర్గం వారికి చక్కటి అభివృద్ధి లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. 01 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 నుండి గురువు వలన ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. ఎదో ఒక అనారోగ్యం వలన బాధింపపడతారు. యువకులు చెడు పనులు చేయుటకు ఏమాత్రం వెనుకాడరు. దగ్గరి బంధువుల గురించిన దుర్వార్త వినాల్సి వస్తుంది. ప్రతీ పనియందు శ్రమ అధికం అవుతంది. తరచుగా చెడు స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ జీవనంలో ఎదుగుదల ఉండదు. ఈ కాలంలో నిత్యం క్రింది మంత్రమును పటించుట మంచిది.

“ దేవానాంచ రుషినాంచ గురుకాంచన సన్నిభం బుద్దిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతిం”

For Dhanu Rashi individuals, the Sri Parabhava Nama Samvatsaram (from March 19, 2026, to April 6, 2027) will yield mixed results due to the influence of Jupiter throughout the year.

Remedy: During this period, it is highly recommended to chant the following mantra daily for relief:

“Devanamcha Rushinamcha Gurukanchanasannibham | Buddhimantam Trilokesham Tam Namami Brihaspatim ||”

31 అక్టోబర్ 2026 నుండి 23 జనవరి 2027 వరకు గురువు వలన ధనుర్రాశి వారికి తిరిగి చక్కటి అనుకూల ఫలితాలు లభించును. యువకులు జీవిత పరమార్ధం తెలుసుకోగలరు. కుటుంబ గౌరవం నిలబెట్టు పనులు చేస్తారు. గత కాలపు సమస్యల నుండి బయట పడతారు. పుత్ర సంతాన ప్రయత్నాలు చేయువారి ఆకాంక్ష తీరుతుంది. పితృ వర్గం వారు ఆరోగ్య గండాల నుండి బయట పడతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సత్యవంతమైన జీవితం అనుభవిస్తారు. 24 జనవరి 2027 నుండి శ్రీ పరాభవ నామ సంవత్సర ముగింపు వరకు గురువు వలన తిరిగి ప్రతికూల ఫలితాలు ప్రాప్తించును. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ జీవనంలో ఆఖస్మిక నష్టములు, శ్రమకు ప్రతిఫలం లేకుండుట వంటి ఫలితాలు ఎదుర్కొందురు. వ్యక్తిగత జాతకంలో ప్రతికూల గురు గ్రహ బలం కలిగిన వారికి మరింత తీవ్ర సమస్యలు ఎదురగును. నిత్యం పైన పేర్కొన్న గురు గ్రహ మంత్రం పటించుట వలన కొంత ప్రతికూల తీవ్రత తగ్గుతుంది. ఒక పర్యాయం గురు గ్రహ పూర్ణ కుంభ శాంతి జపం జరిపించుకోనట మంచిది.

For the period from October 31, 2026, to January 23, 2027, Dhanu Rashi individuals will once again experience highly favorable results due to the positive influence of Jupiter (Guru), leading to a deeper understanding of life's purpose among the youth, the successful upholding of family reputation, and liberation from past problems. During this time, those aspiring for children will see their wishes fulfilled, paternal relatives will recover from health crises, and legal matters will turn in your favor as you lead a life rooted in truth. However, from January 24, 2027, until the end of the Sri Parabhava Nama Samvatsaram, Jupiter will return to providing adverse effects, potentially resulting in personal health issues, sudden professional setbacks, and a lack of rewards for your hard work. These challenges may be more intense for those with a weak Jupiter in their personal birth charts; therefore, it is highly recommended to daily chant the Guru Mantra and perform a one-time Guru Graha Poorna Kumbha Shanti Japam to mitigate these negative influences. 

ధనుర్ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటాయి. మాతృ వర్గీయుల ఆరోగ్య సమస్యలు కలవరపెడతాయి. వారసత్వంగా లభించిన ఆస్థిలో కొంత భాగం వ్యయం అగు సూచన ఉన్నది. కుటుంబ పరంగా ఎంత భాద్యతాయుతంగా ఉన్నా కుటుంబ సభ్యుల సంతృప్తి పొందలేరు. సదా అందరకి దూరంగా ఏకాంత జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. ధనుర్రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చట్ట రీత్యా సమస్యలు ఎదుర్కోను సూచనలు అధికంగా ఉన్నవి. కావునా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ధనుర్రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం అర్ధ అష్టమ శని దశ జరుగుతున్న్నది. దీని వలన ధనుర్రాశి వారు తరచుగా కుటుంబ పరమైన మానసిక చికాకులను ఎదుర్కొనవలసి వస్తుంది. ధనుర్రాశి వారు నిత్యం ఈ క్రింది మంత్రమును పటించుట మంచిది. తీవ్రతను అనుసరించి శని గ్రహ శాంతి జపము జరిపించుకోనవలెను.

“ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం చాయమార్తండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం”

During the Sri Parabhava Nama Samvatsaram, individuals belonging to Dhanu Rashi will experience adverse results due to the influence of Saturn (Shani) throughout the year. Family circumstances may frequently lead to difficulties, and the health issues of maternal relatives could cause significant concern. There are indications that a portion of ancestral or inherited property may be spent or diminished during this period. Despite acting with the utmost responsibility, you may find it difficult to gain the satisfaction or appreciation of your family members, often leading you to seek solitude and a life of isolation. Notably, there is a high risk of facing legal complications this year; therefore, it is crucial to stay away from any unlawful activities. It is important to clarify that Dhanu Rashi natives are not under the influence of Sade Sati (Elinati Shani) during this year.

To mitigate these negative effects, it is highly recommended to daily chant the below mentioned Shani Mantra and, depending on the severity of the problems, perform a Shani Graha Shanti Japam.

"Neelanjana Samabhasam Raviputram Yamagrajam Chhaya Martanda Sambhootam Tam Namami Shanaishcharam ||"

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

ధనుర్ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. 04 డిసెంబర్ 2026 వరకు రాహువు వలన కొంతవరకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. జాతకులు లౌకికపరమైన బుద్ధికుశలత కలిగి ఉండి భాత్రు వర్గం వలన లాభ పడతారు. బాగా ఎదిగిన పుత్ర సంతానం వలన ఆర్ధికంగా లాభ పడతారు. వంశాభివృద్ధి పొందుతారు. 05 డిసెంబర్ 2026 నుండి శ్రీ పరాభవ నామ సంవత్సర ముగింపు వరకు రాహువు వలన ప్రతికూల ఫలితాలు ఎదురగును. ధనాదాయం బాగున్నా ధనం చేతిపై నిలువదు. అధికార వాంఛ అధికం అగుట వలన సమస్యలు ఎదుర్కొంటారు. శరీర ఆరోగ్యం సహకరించదు. 

In the Sri Parabhava Nama Samvatsaram, Dhanu Rashi natives will experience mixed results due to the influence of Rahu. Until December 4, 2026, Rahu will provide favorable outcomes, during which individuals will display great worldly intelligence and gain benefits through their siblings. Financial gains are predicted through well-settled children, and there will be overall progress in the family lineage. However, from December 5, 2026, until the end of the year, Rahu will bring adverse effects; although the income remains good, wealth will not stay in hand. An excessive desire for power or authority may lead to new problems, and physical health may not be very cooperative during this period.

ధనుర్ రాశి వార్కి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. 04 డిసెంబర్ 2026 వరకు నిశ్చింత తో కూడిన జీవనం అనుభవిస్తారు. దైవ శక్తి పట్ల క్రమక్రమంగా ఆకర్షితులు అవుతారు. పుత్ర వర్గానికి మంచి చేస్తారు. నేత్ర సంబంధ సమస్యలు తగ్గుతాయి. 05 డిసెంబర్ 2026 నుండి శ్రీ పరాభవ నామ సంవత్సరం ముగింపు వరకు కేతువు వలన ప్రతికూల ఫలితాలు ఎదురగును. బంధు వర్గ సంబంధ దుర్వార్తలు వినాల్సి వస్తుంది. స్వజనులకు మీరు మంచి చేసినా విరోధాలు ఎదురగును. బుద్ధికుశలత లోపిస్తుంది. స్త్రీలకు హాని చేయు వారగుదురు.

For individuals belonging to Dhanu Rashi, the influence of Ketu in the Sri Parabhava Nama Samvatsaram will result in mixed outcomes throughout the year. Until December 4, 2026, you will enjoy a peaceful and worry-free life, gradually becoming more inclined toward spirituality and divine power. During this period, you will be supportive and beneficial to your children, and any eye-related health issues are likely to subside. However, from December 5, 2026, until the end of the year, Ketu will bring adverse results. You may have to hear distressing news regarding relatives, and even when you act in the best interest of your kin, you may face their opposition or enmity. There might be a lack of mental clarity and sharpness, and one should be cautious as there are indications of causing harm or trouble to women.

మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి ఒక్క గురువు మాత్రమె కొంచెం అనుకూల ఫలితాలు ప్రసాదించును. శని, రాహు మరియు కేతు గ్రహాల వలన అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. 

In summary, during the Sri Parabhava Nama Samvatsaram, only Jupiter (Guru) will bestow some favorable results for those born under Dhanu Rashi. Conversely, the influences of Saturn (Shani), Rahu, and Ketu are not particularly favorable, suggesting a year where cautious navigation and spiritual remedies are essential to overcome challenges.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

మార్చ్ 2026 ధనుర్రాశి రాశిఫలాలు / March 2026 Sagittarius Predictions:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. ధనాదాయం పర్వాలేదు. భాగస్వామ్య వ్యాపారములలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టములు ప్రాప్తించును. ద్వితియ వారంలో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక అశుభ వార్త. గృహ వాతావరణం అశాంతిని కలిగి ఉండును. మాస మధ్యంలో ఖర్చులు అధికంగా ఉండును. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు వివాహ సంతాన విషయాలలో వ్యతిరేక ఫలితాలు. చివరి వారంలో దైవదర్శన భాగ్యం, ఒంటరగా ప్రయాణం చేయాలనే కోరిక నెరవేరును. విద్యార్దులు శ్రమించవలెను. ఈ నెలలో 2,6,7,15,29 తేదీలు మంచివి కావు.

This month will yield mixed results. While financial income remains satisfactory, those who have invested in partnership businesses may face losses. During the second week, you may receive distressing news regarding a family member, and the domestic atmosphere might remain restless or tense. Expenses are likely to increase in the middle of the month. Individuals born under the Poorvashada Nakshatra may face unfavorable outcomes regarding marriage or children-related matters. In the final week, you will be blessed with divine visits (Darshan), and your desire for solo travel will be fulfilled. Students must put in extra effort to achieve their goals. Cautionary Dates: In this month, the 2nd, 6th, 7th, 15th, and 29th are not favorable.

ఏప్రిల్ 2026 ధనుర్రాశి రాశీఫలితాలు / April 2026 Sagittarius Predictions:

ఈ మాసంలో అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించును. సొంత వాహన కోరిక నెరవేరును. గృహంలోనికి స్వర్ణం లేదా నూతన అలంకరణ సంబంధ వస్తువు కొనుగోలు చేయుదురు. అనేక విషయాల గురించి ఏకదాటిగా మాట్లాడగల విజ్ఞానం లభిస్తుంది. నూతన శత్రువులు తయారవుదురు. విద్యార్ధులు ప్రతీ విషయమును త్వరగా గ్రహించగలుగుతారు. పెద్ద వయస్సు వారికి అనారోగ్య సమస్యలు తగ్గును. వ్యాపారాదులు ఆశించిన విధంగా సాగును. ఈ మాసంలో ఉద్యోగస్తులకు కెరీర్ కొంచెం ఆందోలనాపూరితంగా ఉంటుంది. కపట ప్రవర్తన వలన పేరు ప్రతిష్టలు పోగొట్టుకోనుదురు. తోటి ఉద్యోగస్తుల సహకారాన్ని పొందలేరు. సంభాషణలలో శ్రుతి మించిన హాస్యం నష్టములను కలుగచేయును. ఆధ్యాత్మిక మార్గం అవసరమగును. ఈ మాసంలో 23 వ తేదీ తదుపరి కెరీర్ పరంగా జాగ్రత్తగా ఉండవలెను. ఈ మాసం నూతన వ్యాపారాలను ప్రారంభించుటకు అనుకూల కాలం కాదు.

During this month, marriage efforts for the unmarried will yield fruitful results, and your desire to own a vehicle will be fulfilled. You are likely to purchase gold or new decorative items for your home. You will gain the wisdom and eloquence to speak continuously on various subjects. However, new enemies may arise during this period. Students will be able to grasp subjects quickly and perform well. For the elderly, health issues will gradually decrease, and business activities will proceed as expected. For employees, the career outlook will be somewhat anxious this month. Deceptive behavior could lead to a loss of reputation, and you may find it difficult to gain cooperation from your colleagues. In your conversations, excessive or inappropriate humor may cause losses or misunderstandings. Turning toward a spiritual path will be necessary for mental peace. You must be particularly careful regarding your career after the 23rd of this month. Furthermore, this is not an auspicious time to launch new business ventures.

మే 2026 ధనుర్రాశి రాశీఫలితాలు / May 2026 Sagittarius Predictions:

ఈ మాసం లో నూతన ప్రయత్నాలు లాభించును. గత కాలంలో ఆర్ధిక ఇబ్బందుల వలన వదిలివేసిన పనులు తిరిగి ప్రారంభించుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. అనుకున్న పనులను సమర్ధవంతంగా పూర్తిచేయగలరు. వ్యవసాయదారులకు ఈ మాసం లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాదులు జయం పొందును. బోధనా రంగంలో ఉన్న వారు పదోన్నతి ఆశించవచ్చు. సంతాన ప్రయత్నాలు విఫలమగును. ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులకు సంతాన పరంగా గ్రహ శాంతులు అవసరం అగును. దగ్గరి కుటుంబ సభ్యులను కోల్పోవు సూచన ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి , ఉద్యోగంలో స్థానచలనం కొరకు ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం అనుకూలమైన కాలం. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం వలన అవకాశములను అందిపుచ్చుకోగలుగుతారు. ఈ మాసంలో 4, 5, 6 తేదీలు అనుకూలమైనవి కావు.

03 మే 2026 నుండి 29 మే 2026 వరకు వాస్తు కర్తరీ ఏర్పడుతుంది. ఈ కాలంలో గృహ నిర్మాణ పనులు ఆరంభించకూడదు. నిర్మాణ దశలో ఉన్న పనులను కూడా కర్తరీ కాలం పూర్తి అగువరకు ఆపడం మంచిది. ఈ కాలం లో గృహ ప్రవేశాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఈ కాలంలో శంఖుస్థాపన ముహుర్తాలు, గృహ నిర్మాణ ఆరంభ ముహుర్తాలు  మరియు గృహ ప్రవేశ ముహుర్తాలు ఉండవు. 

New endeavors will prove to be profitable this month. This is an auspicious time to restart projects that were previously abandoned due to financial difficulties. You will be able to complete your planned tasks efficiently. This month will be highly beneficial for those in the agricultural sector, and professionals as well as business people will see success. Those in the teaching profession can look forward to potential promotions. However, efforts related to children (conception/progeny) may face hurdles; specifically, individuals born under the Moola Nakshatra may require planetary remedies (Graha Shanti) regarding children. There are indications of the loss of a close family member. For those seeking government jobs or those trying for a job transfer, this month is very favorable. You will enter into new agreements or contracts. By adapting to the prevailing circumstances, you will be able to seize good opportunities. Cautionary Dates: In this month, the 4th, 5th, and 6th are not favorable.

The Vastu Kartari period will occur from May 3, 2026, to May 29, 2026. During this time, it is advised not to commence any new house construction works. It is also recommended to pause ongoing construction activities until the Kartari period concludes, and housewarming ceremonies (Gruhapravesam) should be postponed. Please note that during this interval, there are no auspicious Muhurthams available for foundation stone laying (Shankusthapana), commencement of house construction, or housewarming ceremonies. 

జూన్ 2026 ధనుర్రాశి రాశీఫలితాలు / June 2026 Sagittarius Predictions:

ఈ మాసంలో తలపెట్టిన ప్రయత్నాలు అంత సులువుగా ముందుకు సాగవు. పనులు వాయిదాలు పడుతుండును. ఈ మాసంలో నూతన ప్రారంభాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. కుటుంబంలో తీవ్ర అసంతృప్తికర సంఘటనలు ఎదురగును. ఆస్తుల కోసం కలహ పరిస్థితులు ఎదుర్కొందురు. 16 వ తేదీ తదుపరి నేత్ర సంబంధమైన సమస్య లేదా వాహన ప్రమాదం వలన గాయాలపాలగు సంఘటనలు చోటుచేసుకుంటాయి. 20 వ తేదీ తదుపరి కుటుంబ సంబంధాలు బలపడతాయి. నూతన రంగంలో నిపుణత సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి ప్రాముఖ్యత అర్ధం అవుతుంది. స్త్రీలు ధర్మబుద్ధి కలిగివుంటారు. గొప్ప వారితో స్నేహ సంబంధాలు ఏర్పడును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఈ మాసంలో సాత్వికాహారం పై ఇష్టం ఏర్పడుతుంది. మీ అనుకున్న వారి కోసం అధికంగా ఖర్చు చేస్తారు. యువకులు ఈ మాసంలో శని ప్రభావం వలన వ్యసనాల పట్ల ఆకర్షితులు అవుతారు. ఇంద్రియ నిగ్రహం అవసరం.

01 జూన్ 2026 రాత్రి 2.09 నిమిషాలకు గురువు కర్కాటకరాశి లోనికి ప్రవేశించడంతో 02 జూన్ 2026 నుండి 13 జూన్ 2026 వరకు యమునా నదికి పవిత్ర పుష్కరములు నిర్వహించబడతాయి. 

In this month, your planned efforts will not progress easily, and tasks may face frequent delays. It is best to postpone any new beginnings during this period. You may encounter deeply dissatisfying events within the family and face conflicts regarding ancestral properties. After the 16th, there is a risk of eye-related health issues or injuries resulting from vehicle accidents; caution is advised. However, after the 20th, family relationships will strengthen, and you will be able to gain expertise in a new field. You will come to realize the true importance of your life partner during this time. Women will exhibit a righteous and virtuous nature. You will establish friendly relations with influential people. Financial income will remain average this month. You will develop a preference for a 'Sattvic' (pure and simple) diet and may spend excessively on those you care about. Due to the influence of Saturn, the youth might be drawn toward bad habits or addictions; practicing self-control is essential.

With the entry of Jupiter (Guru) into Karkataka Rasi (Cancer) on June 2, 2026, at 2:09 AM, the sacred Yamuna River Pushkarams will be observed from June 2, 2026, to June 13, 2026

జూలై 2026 ధనుర్రాశి రాశీఫలితాలు / July 2026 Sagittarius Predictions:

ఈ మాసంలో సామాన్య ఫలితాలు పొందుతారు. పూర్వాషాడ మరియు ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు ఉద్యోగ వాతావరణంలో అశాంతి మరియు నష్టం ఎదుర్కొంటారు. ఈ మాసంలో ధనాదాయం కొద్దిగా తగ్గుతుంది. అతిగా నమ్మినవారి వ్యక్తి వలన నష్టం ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి తరపు కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండవలెను. ఈ మాసంలో నూతన కార్యములను ప్రారంభించుట , స్థానచలన ప్రయత్నాలను చేయుట మరియు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలను గావించుట 17 వ తేదీ నుండి 23 వ తేదీ మధ్య నిర్వహించుట మంచిది. కెరీర్ పరంగా స్థిరపడడానికి రాజకీయ సహకారం ఉపయోగపడుతుంది. స్థిరాస్తుల నుండి రాబడి పొందాలి అనే మీ ఆలోచన ఈ మాసంలో కూడా కార్యరూపం దాల్చదు. మాసాంతానికి ఖర్చులు పెరిగిననూ ఎదో ఒక విధంగా ధనం సర్దుబాటు అవుతుంది.

15 జూలై 2026 నుండి 13 ఆగష్టు 2026 వరకు గురు మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ గురు మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను గురు మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు. 

You will experience moderate results this month. Individuals born under the Poorvashada and Uttarashada Nakshatras may face unrest and potential setbacks in their professional environment. Financial income will slightly decrease during this period. You may encounter losses due to a person you trusted blindly. It is advised to be cautious regarding matters involving your spouse's family members. If you are planning to start new tasks, seek a job transfer, or pursue employment opportunities abroad, the period between the 17th and 23rd is most favorable. Political support will be instrumental in helping you stabilize your career. Your long-standing plans to generate income from immovable properties will not materialize this month. Although expenses will rise toward the end of the month, funds will somehow be managed or adjusted.

The Guru Moodhami (Jupiter Combustion) period will occur from July 15, 2026, to August 13, 2026. During this Guru Moodhami interval, no auspicious ceremonies or functions should be performed. All significant events and celebrations must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this inauspicious time.

ఆగష్టు 2026 ధనుర్రాశి రాశీఫలితాలు / August 2026 Sagittarius Predictions:

ఈ మాసంలో పెద్ద వయస్సు వారికీ రక్త సంబంధ ఆరోగ్య సమస్యలు అధికం అగును. వైవాహిక జీవన సౌఖ్యం ఉండదు. అన్యస్త్రీ సంభోగముల వలన ఆరోగ్య మరియు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోను సూచనలున్నాయి. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు గృహంలో అలంకరణ సంబంధ మార్పులు చేయగలుగుతారు. మహిళల మనోధ్యైర్యం పెరుగును. తమ ఇష్టా ఆయిష్టాలను నిర్భయంగా తెలియచేయగలుగుతారు. యువకులకు పోగొట్టుకున్న పేరు ప్రతిష్టలు తిరిగి పొందుటకు అవకాశములు లభించును. మాట చాతుర్యంతో పనులను పూర్తీ చేసుకోగలరు. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ముగియును. వ్యాపార వర్గం వారికి మాత్రం ఈ మాసం చివరి రెండు వారములు లాభదాయకంగా ఉంటుంది మరియు అనుకోని విధంగా అదృష్టం కలిగి భారీ వ్యాపార అవకాశములు పొందగలుగుతారు. ఈ మాసంలో 8, 12, 15, 20, 28 వ తేదీలలో నిర్వహించు ఆర్ధిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండవలెను.

This month, elderly individuals may face increased health issues related to blood or circulation. Marital bliss might be lacking during this period. There are indications of health and financial difficulties arising from illicit relationships; caution is highly advised. Financial income will remain average. Individuals born under the Uttarashada Nakshatra will be able to make decorative changes or renovations to their homes. Women will experience an increase in mental strength and will be able to express their likes and dislikes fearlessly. For the youth, opportunities will arise to regain lost reputation and prestige. You will be able to complete tasks effectively using your communication skills and diplomacy. Legal matters and court cases are likely to conclude in your favor. For the business community, the last two weeks of the month will be highly profitable, and unexpected luck may lead to securing major business deals. Cautionary Dates: Be extra careful with financial transactions on the 8th, 12th, 15th, 20th, and 28th of this month.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

సెప్టెంబర్ 2026 ధనుర్రాశి రాశీఫలితాలు / September 2026 Sagittarius Predictions:

ఈ మాసంలో శత్రు క్షయం ఏర్పడుతుంది. గురువర్గం నందు భక్తి ప్రపత్తులు కలిగి ఉంటారు. కుటుంబ పెద్దల దూర ప్రయాణాలకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. మీ క్రింది స్థాయి సేవకుల కోసం మీ సమయాన్ని, ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది. వ్యాపార వ్యవహరాదులు ఈ మాసం అంత అనుకూలంగా నడుచును. ఈ మాసంలో ధనవ్యయం కొంచెం అధికం అగును. మూలా నక్షత్ర యువతులు కుటుంబ పెద్దల కోపానికి గురవుతారు. ప్రతీ విషయములో సందేహాలు ఏర్పడును. వివాహ సంబంధాలు బెడిసికోట్టును. చేస్తూ ఉన్న ఉద్యోగం అఖస్మికంగా మానివేయవలసిన పరిస్టితులు కొని తెచ్చుకుంటారు. కుటుంబ వ్యవహారాల విషయమై రాజకీయ నాయకుల సిఫారసుల కొరకు తీవ్రంగా తిరగవలసి వస్తుంది. ఈ మాసంలో స్వ ఆరోగ్య విషయాలలో కూడా జాగ్రత్త అవసరం అవుతుంది. సజ్జన సాంగత్యం మరియు భగవద్భక్తి నిత్య జీవితంలో అవసరం అనే విషయం అవగతం అవుతుంది.

During this month, you will see a decline in the influence or strength of your enemies. You will develop deep devotion and respect toward your teachers and elders (Guru-vargam). You will be involved in making travel arrangements for the elderly members of your family. However, you may need to spend a significant amount of time and money on your subordinates or domestic help. Business activities will proceed smoothly and favorably throughout the month. Financial expenditure will be somewhat high during this period. Young women born under the Moola Nakshatra might face the anger or displeasure of family elders. Doubts and uncertainties may arise in every matter, and marriage negotiations might face setbacks or fall through. In your professional life, you might create situations that lead to an abrupt resignation from your job. Regarding family disputes, you may find yourself running around for political recommendations or mediation. Personal health also requires careful attention this month. You will come to realize the profound importance of good company (Sajjana Sangatyam) and divine devotion in daily life.

అక్టోబర్ 2026 ధనుర్రాశి రాశీఫలితాలు / October 2026 Sagittarius Predictions:

ఈ మాసంలో ఏదో ఒక మానసిక అశాంతి నిత్యం వెంటాడుచుండును. అందరితో కలసి మెలసి ఉండలేని పరిస్టితులు ఏర్పడును. ప్రయాణాలలో భయాందోళనలు ఎదురగును. మీ రహస్య కార్యాచరణ అలవాటు వలన సమస్యలు ఎదుర్కొందురు. మీ రహస్యములు తెలిసన వారే మిమ్మల్ని ఇబ్బందులలో పడేస్తారు. ఉద్యోగ జీవనంలో అనిచ్చితి ఈ మాసంలో కూడా కొనసాగును. నమ్మకం పెట్టుకున్న వ్యక్తుల నుండి సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్ధిక విషయాలలో కుటుంబ సభ్యుల లోభత్వ ఆలోచన మొండి పట్టుదల మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేయును. వివాహ సంభందిత ప్రయత్నాలలో మీ కన్నా తక్కువ హోదా కలిగిన సంబంధాలు ఎదురగును. ఈ మాసంలో వాత సంబంధ శరీర సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. ఈ మాసంలో శనికి తిలభిషేకములు చేయుట మరియు బ్రాహ్మణులకు నల్ల నువ్వుల దానం ఇచ్చుట మంచిది.

17 అక్టోబర్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు శుక్ర మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ శుక్ర మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను శుక్ర మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.  

This month, you may be haunted by a persistent sense of mental unrest. Situations will arise that make it difficult for you to mingle or socialize with others. You might experience anxiety or fear during travels. Your habit of operating in secrecy or handling matters confidentially could lead to unexpected problems, especially as those who are privy to your secrets might put you in difficult spots. Uncertainty in your professional life will continue through this month as well. Assistance from the people you rely on will be delayed. In financial matters, the miserly attitude and stubbornness of family members may cause you deep disappointment. Regarding marriage proposals, you may encounter matches that are of a lower social or professional status than yours. Health-wise, you may suffer from 'Vata' (gastric or joint-related) ailments. Remedies: During this month, it is highly recommended to perform Tilabhishekam to Lord Shani and donate black sesame seeds to Brahmins to mitigate negative effects.

The Shukra Moodhami (Venus Combustion) period will occur from October 17, 2026, to October 30, 2026. This is considered an inauspicious time. During this Shukra Moodhami interval, no auspicious ceremonies or sacred rituals should be performed. All significant celebratory events must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this time.

నవంబర్ 2026 ధనుర్రాశి రాశీఫలితాలు / November 2026 Sagittarius Predictions:

ఈ మాసంలో పరిస్థుతులలో కొంత అనుకూలమైన మార్పులు ఎదుర్కొందురు. ధన విషయమై ఇబ్బందులు తగ్గును. ప్రతీ చర్యలోనూ ఆచితూచి వ్యవహరించుట మంచిది. ఇతరులను గౌరవించి మాటలాడుట అలవాటు చేసుకుంటారు. ఉద్యోగ రీత్యా చేయు ప్రయత్నాలు 6 వ తేదీ తదుపరి అనుకూలిస్తాయి. అందివచ్చిన ప్రతీ అవకాశమును ఉపయోగించుకోవాలి. పెద్ద ఫలితాలను ఆశించుట, అతిగా ఆలోచించుటకు ఇది మంచి సమయం కాదు. వివాహ ప్రయత్న విషయాలలో కూడా ఇదే సూత్రం వర్తించును. శారీరాక ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టును. తృతీయ వారంలో ముఖ్య వస్తువులను మరచిపోవుట వలన వృధా ప్రయాణాలు చేయుదురు. చివరి వారం నుండి వ్యాపార వ్యవహరాదులు అనుకూలంగా సాగును. ఆశించిన లాభములు పొందేతారు. దీర్గకాలంగా ఎదురుచూస్తున్న కోర్టు వ్యవహారాల విచారణ ప్రారంభం అవుతుంది.

This month will bring some favorable changes in your circumstances. Financial difficulties will begin to subside. It is advisable to be cautious and deliberate in every action you take. You will develop a habit of speaking to others with increased respect. Job-related efforts will become fruitful after the 6th of this month; ensure you make the most of every opportunity that comes your way. However, this is not a suitable time to expect massive results or to overthink matters. The same principle applies to marriage negotiations—maintain realistic expectations. Physical health issues will start to decrease. During the third week, you might misplace or forget important items, leading to unnecessary travel or wasted trips. From the final week onwards, business affairs will proceed favorably, and you will achieve the profits you expected. Additionally, the hearing for long-pending legal or court matters is likely to commence during this period.

డిసెంబర్ 2026 ధనుర్రాశి రాశీఫలితాలు / December 2026 Sagittarius Predictions:

ఈ మాసంలో ధనాదాయం బాగుండును. నూతన ఆదాయ మార్గముల కొరకు చేసే ప్రయత్నాలు ఫలించును. తెలివితేటలతో ధనార్జన చేయగలుగుతారు. సుఖ ప్రదమైన జీవనాన్ని అనుభవించగలుగుతారు. సోదరి వర్గం వారికి సంబందించిన ఒక భాద్యత మీపై పడుతుంది. ఈ మాసంలో తలపెట్టిన వివాహ ప్రయత్నాలు నెరవేరును. వైవాహిక జీవనంలో గతకాలపు తగాదాలు పరిష్కారమగును. తృతీయ వారం ప్రారంభం నుండి ఉల్లాసపూరిత వాతావరణం ఏర్పడును. స్త్రీలు నిర్మొహమాటంగా మాటలాడుట నేర్చుకోవాలి. ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు చిన్నపాటి పరిశ్రమలు స్థాపించడానికి ఈ మాసం అనుకూలమైనది. ఈ మాసంలో జన్మించిన నవజాత శిశువులు భవిష్యత్తులో సరిగా మాటలు పలకలేకపోవుట, చిన్న విషయానికి కూడా అతిగా ఉద్రేక పడుట వంటి ఇబ్బందులు ఎదుర్కొందురు. గ్రహ శాంతులు అవసరం అగును.

Financial income will be strong this month. Your efforts to establish new sources of revenue will be successful, and you will use your intelligence to enhance your earnings. You will enjoy a comfortable and pleasant lifestyle. A specific responsibility related to your sisters or their families may fall upon you. Marriage proposals initiated this month are likely to reach a successful conclusion. In marital life, long-standing disputes or misunderstandings will finally be resolved. From the beginning of the third week, a joyful and cheerful atmosphere will prevail. Women are advised to practice being more straightforward and assertive in their communication. For individuals born under the Uttarashada Nakshatra, this month is highly auspicious for establishing small-scale industries or new ventures. Regarding newborns this month, they may face future challenges such as speech delays or excessive emotional excitability over minor issues; performing appropriate Graha Shanti (planetary remedies) is recommended.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

జనవరి 2027 ధనుర్రాశి రాశీఫలితాలు / January 2027 Sagittarius Predictions:

ఈ మాసంలో గృహలాభం లేదా గృహ నిర్మాణ పనులలో సఫలత ఏర్పడును. శత్రు బాధల నుండి బయటపడతారు. ఆర్ధిక ఇబ్బందులు తగ్గును. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలరు. నిరుద్యోగులకు ఎదురుచూస్తున్న శుభవార్త లభిస్తుంది. ఆరోగ్యం బాగా సహకరించును. వ్యాపారులకు అనిచ్చిత వాతావరణం తొలగిపోవును. ధనాదాయం పెరుగును. అన్ని రంగముల వారు ఈ మాసంలో కృషికి తగిన ఫలితాలు పొందుదురు. విద్యార్దులకు కోరుకొన్నఉన్నత పరదేశ విద్య లభిస్తుంది. ఈ మాసంలో 15, 16, 17 తేదీలు అనుకూలమైనవి. ఈ తేదీలలో జీవిత ముఖ్య విషయాలలో నిర్ణయాలు తీసుకొనవచ్చు. పూర్వాషాడ నక్షత్ర జాతకుల సంతానం అతి చక్కటి స్థితిలో స్థిరపడతారు.

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పుష్యమాస శుక్ల షష్ఠి గురువారం రాత్రి గం. 9.07 ని. లకు అనగా 14 జనవరి 2027న ఉత్తరాభాద్ర నక్షత్రంలో శ్రీ సూర్య భగవానుడు మకరరాశి లోకి ప్రవేశించును. సూర్యాస్తమయం తదుపరి మకర సంక్రమణ సంభవిస్తుంది కాబట్టి మరునాడు అనగా 15 జనవరి 2027 న సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. పితృ వర్గ సంస్కరణలు 15 జనవరి 2027 సూర్యోదయం ఉదయం 6.38 నిముషాల తరువాత నిర్వహించుకోవాలి.  

భోగి పండుగ: 14 జనవరి 2027 (గురువారం). 

సంక్రాంతి పండుగ: 15 జనవరి 2027 (శుక్రవారం)

కనుమ పండుగ : 16 జనవరి 2027 (శనివారం)

ముక్కనుమ పండుగ: 17 జనవరి 2027 (ఆదివారం) 

This month brings success in home-related matters, such as acquiring a new property or making significant progress in house construction. You will find relief from the troubles caused by enemies, and financial difficulties will subside. You will be able to complete all your undertaken tasks on time. Unemployed individuals can expect long-awaited good news regarding job opportunities. Your health will be supportive throughout this period. For business people, the atmosphere of uncertainty will clear away, leading to an increase in financial income. Professionals across all fields will receive rewards commensurate with their hard work. Students will succeed in securing admissions for higher education abroad as desired. In this month, the 15th, 16th, and 17th are highly favorable; you may take important life decisions during these dates. Additionally, the children of those born under the Poorvashada Nakshatra will settle into excellent and stable positions in life.

In the Sri Parabhava year, on Pushya Masa Shukla Shashti, Thursday night at 9:07 PM (specifically on January 14, 2027), Lord Surya will enter Makara Rasi (Capricorn) while in the Uttarabhadra Nakshatra. Since the Makara Sankramanam occurs after sunset, the Sankranti festival should be celebrated the following day, January 15, 2027. Regarding ancestral rites (Pitru Karma/Tarpanam), they should be performed on January 15, 2027, after sunrise at 6:38 AM.

Sankranti Festival Dates:

ఫిబ్రవరి 2027 ధనుర్రాశి రాశీఫలితాలు / February 2027 Sagittarius Predictions:

ఈ మాసంలో ఆశించినంత ధనాదాయం పొందుతారు. ధనాన్ని సంపాదించడంలో మంచి నేర్పు, ఆలోచనా జ్ఞానం అలవడును. గృహంలో శుభకార్యములు నిర్వహించెదరు. తలపెట్టిన పనులందు వంశ పెద్దల ఆశీస్శులు లభించును. ఈ మాసంలో శారీరక విశ్రాంతి తగ్గుతుంది. ఇతరులు చేసే పనులు మీకు నచ్చవు. కుల వృత్తి ఆధారిత జీవనం చేయువారు అధునాతన పనిముట్లను సమకూర్చుకొందురు. ఒక్క రాజకీయ నాయకులకు మినహా మిగిలిన అన్ని రంగముల వారికి ఈ మాసం బాగా కలసి వచ్చును. ఈ మాసంలో తలపెట్టు దూర ప్రయాణాలు కూడా ఫలవంతం అగును.

In this month, you will receive financial income as expected. You will develop great skill and strategic wisdom in earning and managing wealth. Auspicious events or celebrations (Shubhakaryam) will be conducted at home. You will receive the blessings of your family elders for the tasks you undertake. However, your physical rest will decrease during this period as you remain busy. You might find yourself dissatisfied with the way others perform their tasks. Those who rely on traditional or ancestral occupations (Kula Vritti) will acquire modern tools or equipment to enhance their work. Except for politicians, this month will be highly favorable for individuals in all other fields. Long-distance travels undertaken during this month will also prove to be successful and fruitful.

మార్చి 2027 ధనుర్రాశి రాశీఫలితాలు / March 2027 Sagittarius Predictions:

ఈ మాసం కూడా చక్కగా కుటుంబ సుఖ సంతోషాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇష్టమైన వ్యక్తులతో కాలం గడిపెదరు. మానసిక భారం అంతా తొలగిపోతుంది. కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాలు మార్పు చెందుతాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న సమన్వయ లోపం తొలగిపోతుంది. మీ ప్రజ్ఞను ఇతరులు గుర్తిస్తారు. జీవిత భాగస్వామి సంబందిత విషయాలు సంతృప్తిని కలుగచేయును. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి పొందుతారు.

This month will continue to be pleasant, filled with family happiness and joy. You will spend quality time with the people you love, and all your mental burdens will vanish. You will notice a positive transformation in the personalities of your family members, and any previous lack of coordination or misunderstandings between you and your family will be resolved. Your intelligence and talents will be recognized by others. Matters related to your life partner will bring deep satisfaction. Furthermore, you will achieve the expected growth and progress in your profession, business, and job.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.