Placeholder image

2026 - 2027 శ్రీ పరాభవ నామ సంవత్సర తులారాశి రాశీఫలాలు

Sree Parabhava Nama Samvatsara Tula Rasi / Libra Sign Free Telugu Rasi Phalalu

- Predictions by Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)

parabhava 2026 2027 tula rasi rasiphalalu libra astrology

 

  • శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం - 05, వ్యయం - 14, రాజ పూజ్యం - 06, అవమానం - 03

    In the Sri Parabhava year, for those born under Thula Rashi (Libra), the financial and social status figures are: Income - 05, Expenditure - 14, Honor/Social Status - 06, and Dishonor/Insult - 03.

  • పూర్వ పద్దతి లో తులారాశి వారికి వచ్చిన శేష సంఖ్య "2". ఇది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏర్పడు సౌకర్యవంతమైన జీవనాన్ని సూచించుచున్నది.

    According to the traditional method, the remainder number for Thula Rashi (Libra) is '2'. This indicates that in the Sri Parabhava year, those born under Libra will lead a comfortable and convenient life

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Tula Rasi / Libra Sign's nature....
  • రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనగా 19 మార్చ్ 2026 నుండి 6 ఏప్రిల్ 2027 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం పొందని తగాదాల నుండి విముఖ్తి లభిస్తుంది. వారసత్వ సంబంధ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని ఆర్ధికంగా లాభ పడతారు. దైవ భక్తీ పెరుగుతుంది. దైవ సంబంధంమైన లేదా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల కోసం ఆర్భాటాలతో కూడిన భారీ ఏర్పాట్ల కొరకు విశేషంగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యుల తీర్ధయాత్రలు లేదా విహార యాత్రల కొరకు చక్కటి ఏర్పాట్లు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్యం మాత్రం ఈ సంవత్సరం అంతగా సహకరించదు. ఆర్ధికంగా బాగుంటుంది. ముఖ్యంగా 31 అక్టోబర్ 2026 నుండి శ్రీ పరాభవ నామ సంవత్సరం ముగిసే వరకు సులువైన ధనాదాయం లభిస్తుంది. ఫైనాన్సు వ్యాపార రంగం లోని వారికి విశేషంగా లాభాలు వరిస్తాయి. కుటుంబానికి సొంత భూ వసతి ఏర్పాటు చేయవలెను అనే మీ కోరిక ఈ సంవత్సరం ఫలిస్తుంది. మొత్తం మీద తులారాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి వలన శ్రేష్టమైన జీవితాన్ని అనుభవిస్తారు. రచనా రంగంలోని వారికి, నాటక రంగంలోని వారికి ఈ సంవత్సరం విశేష కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పితృ వర్గం వారి వలన మిక్కిలి సౌఖ్యం అనుభవిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన అధికారములు లభిస్తాయి. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం లోపించిన వారు పైన పేర్కొన్న శుభ ఫలితాలను సంపూర్ణంగా పొందలేరు.

For the Tula Rasi (Libra) natives, the Sree Parabhava Naama Samvatsaram (March 19, 2026 – April 6, 2027) promises highly favorable results and prosperity due to the positive influence of Jupiter (Guru) throughout the year. Long-standing legal disputes and ancestral property issues will finally reach an amicable resolution, leading to significant financial gains and a more stable economic outlook, particularly for those in the finance sector or those seeking to acquire new land and property. While personal health may require extra attention as it might not be fully cooperative, the year shines for professionals in the arts, writing, and government sectors, who can expect newfound authority and immense reputation. Spiritually, you will find yourself more devoted, often spending generously on grand religious arrangements and organizing memorable pilgrimages or vacations for your family. Overall, while those with a weak Jupiter in their personal birth charts may see these effects slightly diminished, the majority of Libra natives will enjoy a high quality of life and comfort from paternal relations, especially during the surge of easy income predicted from October 31, 2026, onwards.

తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శని వలన కూడా సంవత్సరం అంతా గురు గ్రహం వలననే అనుకూల ఫలితాలు లభిస్తాయి. సంతాన ప్రయత్నాలు చేయువారికి ఆరోగ్య వంతులైన పుత్ర సంతానం ప్రసాదించును. గౌరవ ప్రతిష్టలు పెరుగును. ధనమును అనుభవించుటే ధనార్జనకు నిజమైన అర్ధం అని తెలుసుకుంటారు. గతకాలంలో చేసిన తప్పులు సరిద్దిద్దుకుంటారు. ఇతరులతో వ్యవహరించుటలో చాకచక్యత నేర్చుకుంటారు. భారత సైన్యంలో చేరాలి అనే ఆకాంక్ష కలిగిన యువకులకు ఈ సంవత్సరం వారి కోరిక నెరవేరుతుంది. తులారాశికి చెందిన న్యాయమూర్తులకు కూడా శనైచ్చరుని వలన ఈ సంవత్సరం విశేషమైన సన్మానాలు, రాజ్యాంగ బద్దమైన పదవులు లభిస్తాయి. తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

During the Sree Parabhava Naama Samvatsaram (March 19, 2026 – April 6, 2027), Tula Rasi (Libra) natives will enjoy highly favorable results throughout the year due to the benevolent influence of both Jupiter and Saturn. Long-standing legal disputes and ancestral property issues that have persisted for years will finally be resolved amicably, leading to significant financial gains and the fulfillment of your desire to secure a permanent home or land for your family. This year is particularly auspicious for those aspiring for children, as it promises the birth of healthy offspring, while those in the judiciary, arts, and government sectors will receive exceptional honors, constitutional positions, and professional growth. Young aspirants seeking to join the Indian Army will see their dreams realized, and overall, you will gain the wisdom to correct past mistakes and handle others with newfound diplomacy and tact. While personal health may require some care, the absence of Sade Sati (Elinaati Shani) combined with a surge in easy income starting from October 31, 2026, ensures a period of great respect, spiritual devotion, and paternal happiness, allowing you to truly understand that the true meaning of earning wealth lies in the ability to enjoy it with family. 

తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఎదురగును. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగి ఉన్న వారికి సంతాన పరంగా చికాకులను ఏర్పరచును. స్వాతి నక్షత్రమునకు చెందిన గర్భవతులు మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. 04 డిసెంబర్ 2026 వరకు అనుకూల ఫలితాలు లభించును.  ప్రేమ వివాహం ఆశిస్తున్న యువతకు ఈ సంవత్సరం కుటుంబ పరిస్థితులు అనుకూలించును. కలుపుగోలు తనం వలన జాతకులు అందరి మన్ననలు పొందుతారు. పేరు ప్రతిష్టలు పెంపొందుతాయి. 05 డిసెంబర్ 2026 నుండి సంవత్సరం ముగింపు వరకు రాహువు వలన తీవ్ర ప్రతికూల ఫలితాలు ఎదురగును. విద్యార్థులు విఘ్నాలు ఎదుర్కొనవలసి వస్తుంది. బంధు వర్గం మీ పై అపనిందలు వేస్తారు. మాత్రు వర్గీయులతో తీవ్ర వివాదాలు ఎదుర్కొనవలసి వస్తుంది. 

During the Sree Parabhava Naama Samvatsaram (March 19, 2026 – April 6, 2027), Tula Rasi (Libra) natives will experience highly favorable results from Jupiter and Saturn, though Rahu will introduce a mixed influence throughout the year. While long-standing legal disputes and ancestral property issues reach an amicable resolution and financial gains peak after October 31, 2026, Rahu brings specific challenges, particularly for those with Kala Sarpa Dosha in their personal horoscopes who may face hurdles regarding children. Pregnant women born under the Swati Nakshatra are advised to be extra cautious, especially after December 5, 2026, when Rahu’s influence shifts from supportive to challenging. Until early December, young individuals seeking love marriages will find family support, and your sociable nature will earn widespread respect and fame; however, the final months of the Telugu year may bring obstacles for students, false accusations from relatives, and intense disputes with maternal family members. Despite these late-year pressures and the need for health precautions, the absence of Sade Sati and the fulfillment of dreams—such as joining the Indian Army or securing high judicial and government positions—ensure that the majority of the year remains a period of significant achievement and spiritual growth.

తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభిస్తాయి. మిత్ర వర్గం వలన లాభపడతారు. ముఖ్య విషయాలలో శాంతియుతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటారు. ఇష్టమైన ప్రాంతాలకు ప్రయాణం చేయగలుగుతారు. పుణ్య తీర్థాలను దర్శిస్తారు. ధనాదాయం పెంచుకొనుటకు నూతన అవకాశములు లభిస్తాయి.  మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఒక్క రాహు గ్రహం మినహా మిగిలిన గురు, శని మరియు కేతు గ్రహాల వలన చక్కటి లాభాపూరిత ఫలితాలు లభిస్తాయి.

During the Sree Parabhava Naama Samvatsaram, Tula Rasi natives will enjoy a highly prosperous year as Jupiter, Saturn, and Ketu all provide favorable alignments, while Rahu offers mixed results. Long-standing legal disputes and ancestral property issues will reach an amicable resolution, leading to significant financial gains and the fulfillment of your desire to secure a permanent home for your family. This year is auspicious for those aspiring for healthy offspring, though those with Kala Sarpa Dosha or pregnant women of Swati Nakshatra should exercise extra caution, particularly after December 5, 2026. While the year shines for professionals in the judiciary, arts, and government, and offers young aspirants a chance to join the Indian Army, Ketu specifically brings benefits through friends and a newfound sense of inner peace in decision-making. You will find yourself traveling to favorite destinations and visiting sacred pilgrimages, with new opportunities constantly arising to increase your income, especially after October 31, 2026. Although the latter part of the year may bring some obstacles for students or disputes with maternal relatives due to Rahu’s shift, the overall absence of Sade Sati ensures that the majority of the year remains a period of great respect, spiritual growth, and familial happiness.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

మార్చ్ 2026 తులారాశి రాశిఫలాలు / March 2026 Libra Predictions:

ఈ మాసంలో ధనాదాయం కొంత పెరుగును. నూతన గృహ నిర్మాణాలకు చేయు ప్రయత్నాలు ఫలించును. దీర్ఘాలోచనలు కలసి వచ్చును. వివాదాలలో రాజీలు చేసుకొందురు. నిరుద్యోగులకు కూడా ఈ మాసం ఆశాజనకంగా ఉండును. స్థాన చలన లేదా ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు చేయవచ్చు. నూతన పెట్టుబడులు కలసి వచ్చును. మాస మాధ్యమంలో సువర్ణ లాభం ఉన్నది. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ పెద్దలను మెప్పించగలరు.

Financial income will see a noticeable increase this month, and efforts toward constructing a new home will prove successful. Your long-term plans and deep thinking will yield positive results, and you will find yourself reaching amicable compromises in ongoing disputes. This is a promising month for the unemployed, and those seeking a change of location or a job transition should move forward with their efforts. New investments are likely to be profitable, and there is a specific indication of gaining gold (Suvarna Labham) toward the middle of the month. Furthermore, with the support of your spouse, you will be able to win the approval and appreciation of the family elders.

ఏప్రిల్ 2026 తులారాశి రాశీఫలితాలు / April 2026 Libra Predictions:

ఈ మాసంలో కుటుంబ సభ్యుల ఉన్నతికి మీరు దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాల ఫలితాలు అనుభవిస్తారు. కుటుంబ హోదా పెరుగుతుంది. పూర్వ వైభవాన్ని పొందగలుగుతారు. జీవిత భాగస్వామితో చక్కటి సౌఖ్యం అనుభవిస్తారు. ఈ మాసంలో 9 నుండి 18 వ తేదీల మధ్య కాలంలో ఉద్యోగ జీవనంలో స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ చివరి నిమిషానికి కార్య విజయం పొందగలుగుతారు. 20 వ తేదీ తదుపరి అన్ని రకముల వ్యాపారాదులు బాగా జరుగును. ఆర్ధికంగా చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. పరదేశ ఉన్నత విద్య కొరకు ప్రయత్నిస్తున్న విద్యార్ధుల ఆశలు నెరవేరును. వివాహ మరియు సంతాన విషయాలలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తాయి. పరదేశ స్థిర నివాసం కొరకు తీవ్ర ప్రయత్నాలు చేయవలెను. చివరి వారంలో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక దుర్వార్త వినవలసి వస్తుంది. ఈ మాసంలో 10, 24, 25, 26 తేదీలు అనుకూలమైనవి కాదు.

This month, you will experience the fruits of your long-standing efforts toward the progress of your family members, leading to an increase in your family's social status and a restoration of former glory. You will enjoy great happiness and comfort with your spouse, and while the period between the 9th and 18th may bring slight challenges in your professional life, you will ultimately achieve success at the last minute. From the 20th onwards, all types of businesses will flourish, supported by excellent financial encouragement and a steady flow of income. Students aspiring for higher education abroad will see their dreams fulfilled, and celebrations regarding marriage or the birth of children will bring immense joy to the household. While you should put in intense efforts if seeking permanent residency abroad, be prepared for some distressing news regarding a family member in the final week. Please note that the 10th, 24th, 25th, and 26th of this month are not favorable dates for important activities.

మే 2026 తులారాశి రాశీఫలితాలు / May 2026 Libra Predictions:

ఈ మాస ప్రారంభంలో మిత్ర వర్గంలో వాద వివాదాల వలన మానసిక సంఘర్షణ ఎదురగును. జీవిత భాగస్వామి అనారోగ్యత బాదిస్తుంది. యువత మనోనిగ్రహాన్ని కలిగి ఉండాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైనది. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. తలచని విధంగా ఇతరుల పనులు మీకు కార్య భారంగా మారును. జూదానికి ఈ మాసం కలసిరాదు. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అగును. ఈ మాసంలో 10 నుండి 18 వ తేదీల మధ్య తలపెట్టిన నూతన వ్యవహారాల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. చివరి వారంలో మీ అనుభవాలు ఇతరులకు మార్గదర్శన చేయును. తులారాశి కి చెందిన యుక్త వయస్సు స్త్రీలకు జీవిత యదార్ధత తెలిసివస్తుంది. అసంబద్ధమైన బంధాల నుండి బయట పడతారు.

03 మే 2026 నుండి 29 మే 2026 వరకు వాస్తు కర్తరీ ఏర్పడుతుంది. ఈ కాలంలో గృహ నిర్మాణ పనులు ఆరంభించకూడదు. నిర్మాణ దశలో ఉన్న పనులను కూడా కర్తరీ కాలం పూర్తి అగువరకు ఆపడం మంచిది. ఈ కాలం లో గృహ ప్రవేశాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఈ కాలంలో శంఖుస్థాపన ముహుర్తాలు, గృహ నిర్మాణ ఆరంభ ముహుర్తాలు  మరియు గృహ ప్రవేశ ముహుర్తాలు ఉండవు. 

At the beginning of this month, you may face mental tension due to arguments and disputes within your circle of friends. Additionally, your spouse's health issues may cause some concern, and it is vital for the youth to maintain strong self-control during this time. While income remains average, this is a favorable month for those seeking new job opportunities. You might find yourself burdened with unexpected responsibilities belonging to others, and it is strictly advised to avoid gambling as it will not yield any benefit. On a positive note, court disputes will likely be resolved in your favor. Between the 10th and 18th of the month, exercise extreme caution regarding any new ventures or dealings. By the final week, your personal experiences will serve as a guide to others. For young women of Tula Rasi, this month brings a realization of life's realities, helping you break free from illogical or unsuitable relationships.

The Vastu Kartari period will occur from May 3, 2026, to May 29, 2026. During this time, it is advised not to commence any new house construction works. It is also recommended to pause ongoing construction activities until the Kartari period concludes, and housewarming ceremonies (Gruhapravesam) should be postponed. Please note that during this interval, there are no auspicious Muhurthams available for foundation stone laying (Shankusthapana), commencement of house construction, or housewarming ceremonies. 

జూన్ 2026 తులారాశి రాశీఫలితాలు / June 2026 Libra Predictions:

ఈ మాసంలో వైవాహిక జీవనంలో తీవ్ర వ్యతిరేక సంఘటనలు ఎదురగును. భాత్రు వర్గం వారితో కూడా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ మాసంలో వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగును. ధనాదాయం సామాన్యం. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ మాసంలో తరచుగా ప్రయాణాలు ఎదురగును. ఉద్యోగులకు తమ పై అధికారుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. మీ సంతానం నూతన ఆలోచనా విధానం అలవాటు చేసుకొందురు. పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండుట వలన సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ పరమైన వ్యయం కొద్దిగా అదుపు తప్పుతుంది. రాజకీయ రంగం వారికి ప్రజాక్షేత్రంలో గౌరవ హాని సంఘటనలు ఎదురగును. భూ సంబంధ విక్రయాలు చేయువారికి ప్రభుత్వ పరంగా సమస్యలు ఎదురగును. ఈ మాసంలో 5, 9, 11, 13 మరియు 16 తేదీలు అనుకూలమైనవి. ముఖ్య విషయాలలో నిర్ణయాలు తీసుకొనవచ్చు.

01 జూన్ 2026 రాత్రి 2.09 నిమిషాలకు గురువు కర్కాటక రాశి లోనికి ప్రవేశించడంతో 02 జూన్ 2026 నుండి 13 జూన్ 2026 వరకు యమునా నదికి పవిత్ర పుష్కరములు నిర్వహించబడతాయి. 

This month, you may encounter significant adverse events in your marital life, alongside challenges involving your siblings. Business operations and overall income will remain average throughout this period. Those born under the Vishakha Nakshatra will find themselves traveling frequently. Employees can expect the anticipated support from their superiors, and your children will likely adopt new ways of thinking; however, failing to value their opinions could lead to friction within the household. Family-related expenses may slightly exceed your budget. Those in the political sphere should be cautious, as there is a risk of incidents that could harm your public reputation. Additionally, individuals involved in land sales may face government-related hurdles. On a positive note, the 5th, 9th, 11th, 13th, and 16th of this month are favorable dates, and you may proceed with making decisions on important matters.

With the entry of Jupiter (Guru) into Karkataka Rasi (Cancer) on June 2, 2026, at 2:09 AM, the sacred Yamuna River Pushkarams will be observed from June 2, 2026, to June 13, 2026

జూలై 2026 తులారాశి రాశీఫలితాలు / July 2026 Libra Predictions:

ఈ మాసంలో ఒక నూతన ఆదాయ మార్గం లభించు సూచనలు అధికంగా ఉన్నవి. దూర ప్రాంత ఆదాయం లభించును. జరుగుతూ ఉన్న గృహ నిర్మాణ పనులలో తీవ్ర ఆటంకములు ఎదురగును. వాహన క్రయ విక్రయ సంబంధ వ్యాపారులకు సమస్యలు ఎదురగును. ఈ మాసం ప్రధమ మరియు ద్వితీయ వారములలో ప్రయత్నించు వివాహ ప్రయత్నాలు విజయవంతం అగును. తృతియ వారంలో స్వ అనారోగ్యములతో ఇబ్బందులున్నాయి. పూర్వ కాలంలో ఇచ్చిన హామీల వలన కొన్ని చికాకులు ఎదుర్కొంటారు. కుటుంబ లేదా స్నేహితుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుదురు. చివరి వారంలో సంతృప్తికరమైన పరిస్థితులు ఎదురగును. కుటుంబ పెద్దలను సంప్రదించడం ద్వారా మీకు కావలసిన విలువైన సమాచారం పొందగలుగుతారు. ఈ మాసంలో 27, 28 తేదీలు అనుకూలమైనవి కాదు.

15 జూలై 2026 నుండి 13 ఆగష్టు 2026 వరకు గురు మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ గురు మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను గురు మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు. 

There are strong indications that a new source of income will emerge this month, along with earnings from distant lands or foreign sources. However, you may face significant obstacles in ongoing house construction projects, and those in the vehicle buying and selling business will encounter specific challenges. Marriage alliance efforts made during the first and second weeks of the month are likely to be successful. By the third week, you should be mindful of personal health issues that may cause some distress. You may also face some irritation or pressure regarding promises or guarantees you made in the past. Fortunately, with the cooperation of family or friends, you will be able to complete your pending tasks, leading to more satisfying circumstances in the final week. Consulting with family elders will provide you with the valuable information you need. Please note that the 27th and 28th of this month are not favorable dates.

The Guru Moodhami (Jupiter Combustion) period will occur from July 15, 2026, to August 13, 2026. During this Guru Moodhami interval, no auspicious ceremonies or functions should be performed. All significant events and celebrations must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this inauspicious time.

ఆగష్టు 2026 తులారాశి రాశీఫలితాలు / August 2026 Libra Predictions:

ఈ మాసంలో కూడా కెరీర్ పరంగా పని భారం అధికమగును. ఆరోగ్య విషయాలలో మరియు ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్త అవసరం. అహంకార తత్వమును విడిచిపెట్టాలి. చేతికి అందివచ్చిన సంతానం వలన మీ ఆర్ధిక ఋణ భారం తగ్గుతుంది. జీవిత భాగస్వామి తరపు బందువలతో పంతానికి పోకుండా ఉండుట మంచిది. ఈ మాసంలో ధనాదాయం కొంచెం తగ్గును. ఫలితం లేని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ మాసంలో 26 వ తేదీ నుండి 30 వ తేదీ వరకూ ఆశించిన శుభ ఫలితాలు ఏర్పడును. అన్ని రకముల శుభకార్య సంబంధ ప్రయత్నాలకు ఇది మంచి కాలం.

In this month as well, you will experience an increased workload in your career. It is essential to be cautious regarding your health and dietary habits, and it is advised to let go of any egoistic tendencies. Your grown children, who are now coming into their own, will help reduce your financial debt burden. It is better to avoid being stubborn or getting into confrontations with your spouse's relatives. Financial income may decrease slightly this month, and you might have to undertake travels that do not yield any results. However, from the 26th to the 30th of the month, you will see the expected positive outcomes. This is an excellent period for all efforts related to auspicious events and ceremonies.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

సెప్టెంబర్ 2026 తులారాశి రాశీఫలితాలు / September 2026 Libra Predictions:

ఈ మాసంలో తలనొప్పి సంబంధమైన అనారోగ్యం వలన చికాకులు ఎదురగును. అవమాన పడు సంఘటనలు కూడా ఎదుర్కొందురు. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా సమయానికి ధనం చేతికి వచ్చును. దూర ప్రయాణాలు చేయుటకు ఈ మాసం అనుకూలమైనది కాదు. కుటుంబ సభ్యులతో మనోవికాసానికి సమయం కేటాయించడం మంచిది. శ్రమకు తగిన ఫలితాన్ని ఈ మాసంలో పొందుట కష్టం. వ్యవసాయంలో ధాన్య హాని వలన నష్టములు ఎదురగును. ఈ మాసంలో నవగ్రహ మండపారాధన శాంతి హోమం జరిపించుకోనుట మంచిది.

In this month, you may experience persistent irritation due to health issues related to headaches. You might also encounter situations that could lead to feelings of humiliation or loss of face. While your financial income remains average, you will find that money arrives just in time to meet your rising expenses. This is not a favorable month for long-distance travel, and it is better to dedicate your time to mental relaxation and bonding with family members. It may be difficult to see results that match your hard work this month. Additionally, those in the agricultural sector may face losses due to crop damage or grain loss. To mitigate these effects, it is recommended to perform a Navagraha Mandaparadhana Shanti Homam.

అక్టోబర్ 2026 తులారాశి రాశీఫలితాలు / October 2026 Libra Predictions:

ఈ మాసంలో ప్రధమ , ద్వితీయ వారాలలో మాత్రు వర్గం వారికి ఆరోగ్య పరంగా మంచిది కాదు. కుటుంబ విరోధముల వలన మానసిక అశాంతి ఎదుర్కొందురు. వాహన సంబంధమైన సమస్య లేదా ప్రమాదం వలన అనుకోని ధన వ్యయం ఎదురగును. ఏకపక్ష నిర్ణయాల వలన సమస్యలు ఎక్కువ చేసుకొంటారు. న్యాయవాదుల సలహా తీసుకోవడం మంచిది. 17 వ తేదీ తదుపరి అనుకూల ఫలితాలు ప్రారంభం అవుతాయి. కుటుంబ పరిస్థితులు క్రమంగా చక్కబడును. విదేశీ నివాస సంబంధ ప్రయత్నాలు సఫలమగును. వైవాహిక జీవనంలో వివాదాలు కలిగిన వారికీ ఒక శుభ మార్పు సంభవిస్తుంది. బంధు మిత్రులను దూరం చేసుకోకూడదు. నూతన వ్యాపారాలు ఆరంభించగలరు.

17 అక్టోబర్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు శుక్ర మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ శుక్ర మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను శుక్ర మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.  

In the first and second weeks of this month, the health of maternal relatives may be a cause for concern. You are likely to experience mental unrest due to family conflicts, and unexpected financial expenses may arise from vehicle-related problems or accidents. Making unilateral decisions could further complicate your issues, so it is advisable to seek legal counsel or professional advice. From the 17th onwards, positive results will begin to manifest as family situations gradually improve. Efforts regarding foreign residency will be successful, and those facing disputes in their marital life will see a favorable turning point. It is important not to distance yourself from friends and relatives during this time. Additionally, this is a good period to launch new business ventures.

The Shukra Moodhami (Venus Combustion) period will occur from October 17, 2026, to October 30, 2026. This is considered an inauspicious time. During this Shukra Moodhami interval, no auspicious ceremonies or sacred rituals should be performed. All significant celebratory events must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this time.

నవంబర్ 2026 తులారాశి రాశీఫలితాలు / November 2026 Libra Predictions:

ఈ మాసంలో ఆశించినంత ధనాదాయం బాగుండును. అన్ని వర్గముల వారికి ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉండును. నూతన పరిచయాలు, నూతన సంబంధాలు కలసి వచ్చును. వివాహ ప్రయత్నాలు వేగవంతంగా ముందుకు సాగును. ఉద్యోగ జీవనంలో కోరుకొన్న ఉన్నతి లభిస్తుంది. సహోద్యోగులతో వివేకంతో ప్రవర్తించాల్సిన సమయం. ఆకస్మిక ఫలవంతమగు ప్రయాణాలు చేయుదురు. ప్రేమ వ్యవహరాలు ఆర్ధికంగా నష్టపరచును. ఈ మాసంలో 10, 11, 12 తేదీలలో జీవిత భాగస్వామిని లేదా గురువులను లేదా స్నేహితులను ద్వేషించు పరిస్థితులు ఎదుర్కొందురు. దాన ధర్మములు చేయుదురు. అందరి అందు సమదృష్టి ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ మాసంలో ధన లాభం ఏదో ఒక విధంగా పొందగలరు.

In this month, your financial income will be as strong as expected, and people from all walks of life will find their economic situations quite satisfying. New acquaintances and relationships will prove beneficial, and efforts toward marriage alliances will move forward rapidly. In your professional life, you will achieve the advancement or promotion you have been desiring; however, this is a time to handle your colleagues with wisdom and tact. You may undertake sudden but fruitful travels. On the other hand, romantic affairs may lead to financial losses. Between the 10th and 12th of the month, you may face situations that lead to feelings of resentment toward your spouse, teachers, or friends. You will find yourself inclined toward charity and will develop an impartial, balanced perspective toward everyone. Overall, you are likely to gain wealth in one form or another this month.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

డిసెంబర్ 2026 తులారాశి రాశీఫలితాలు / December 2026 Libra Predictions:

ఈ మాసంలో నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించును. నూతన వాహన యోగానికి అనుకూలమైన కాలం. ఈ మాసంలో ధనాదాయం కూడా బాగుండును. తలపెట్టిన వ్యవహరాదులను విజయవంతంగా పూర్తీ చేయగలరు. గత కాలంలో ఆపివేసిన పనులను తిరిగి ప్రారంభించుటకు ఈ మాసం అనుకూలమైనది. సజ్జన సాంగత్యం లభిస్తుంది. భాత్రు వర్గం వారి జీవన స్థిరత్వం కోసం ఆందోళన చెందవలసిన పరిస్తుతులు ఎదురగును. ఇతరులకు మీరు ఇచ్చే సలహాలకు విలువ ఉండదు. సమయానుకూలంగా ప్రవర్తించి పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి. ఈ మాసంలో రావలసిన ధనం చేతిలోకి వస్తుంది. ఈ మాసంలో 8, 9, 10 తేదీలలో కుటుంబ పరమైన ఒక సమస్య ఎదురగు సూచన ఉన్నది. ఉద్యోగ జీవితంలో అనుకూలం కాని ప్రదేశానికి స్థానచలనం ఏర్పడుతుంది.

In this month, the efforts of newlywed couples seeking children will be successful, and it is an auspicious time for the purchase of a new vehicle. Financial income will remain strong, allowing you to successfully complete your planned tasks. This is also a favorable period to restart projects that were previously put on hold. You will enjoy the company of virtuous people; however, you may face situations that cause concern regarding the stability of your siblings' lives. Be aware that the advice you offer others may not be valued at this time, so it is important to act with maturity and tact to maintain your dignity. Any money owed to you is likely to be recovered this month. Between the 8th, 9th, and 10th, there are signs of a family-related problem arising. Additionally, in your professional life, you may face a transfer or relocation to a place that is not to your liking.

జనవరి 2027 తులరాశి రాశీఫలితాలు / January 2027 Libra Predictions:

ఈ మాసం లాభావంతంగా ఉంటుంది. నూతన వ్యాపార , ఉద్యోగ ప్రయత్నాలు లాభించును. ధనాదాయం బాగుండును. గృహంలో నూతన వస్తువల అమరిక ఏర్పడును. చక్కటి మానసిక ఆనందం పొందేదురు. మధ్య వయస్సు వారికి ఆరోగ్యం కొద్దిపాటి ఒడిదుడుకులు కలిగించును. వారసత్వ లబ్ది పొందేదురు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మాత్రం కలసిరావు. చివరి వారంలో సమాజంలో వ్యక్తిగత గౌరవం పెరుగును.

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పుష్యమాస శుక్ల షష్ఠి గురువారం రాత్రి గం. 9.07 ని. లకు అనగా 14 జనవరి 2027న ఉత్తరాభాద్ర నక్షత్రంలో శ్రీ సూర్య భగవానుడు మకరరాశి లోకి ప్రవేశించును. సూర్యాస్తమయం తదుపరి మకర సంక్రమణ సంభవిస్తుంది కాబట్టి మరునాడు అనగా 15 జనవరి 2027 న సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. పితృ వర్గ సంస్కరణలు 15 జనవరి 2027 సూర్యోదయం ఉదయం 6.38 నిముషాల తరువాత నిర్వహించుకోవాలి.  

భోగి పండుగ: 14 జనవరి 2027 (గురువారం). 

సంక్రాంతి పండుగ: 15 జనవరి 2027 (శుక్రవారం)

కనుమ పండుగ : 16 జనవరి 2027 (శనివారం)

ముక్కనుమ పండుగ: 17 జనవరి 2027 (ఆదివారం) 

This month will be highly profitable. Efforts toward starting new businesses or securing new job opportunities will be successful, and your financial income remains strong. You will likely acquire new items or furnishings for your home, leading to great mental satisfaction and happiness. While middle-aged individuals may experience minor health fluctuations, there are strong indications of gaining through inheritance. However, this is not a favorable time for house construction efforts. In the final week, you will see a significant rise in your personal reputation and respect within society.

In the Sri Parabhava year, on Pushya Masa Shukla Shashti, Thursday night at 9:07 PM (specifically on January 14, 2027), Lord Surya will enter Makara Rasi (Capricorn) while in the Uttarabhadra Nakshatra. Since the Makara Sankramanam occurs after sunset, the Sankranti festival should be celebrated the following day, January 15, 2027. Regarding ancestral rites (Pitru Karma/Tarpanam), they should be performed on January 15, 2027, after sunrise at 6:38 AM.

Sankranti Festival Dates:

ఫిబ్రవరి 2027 తులారాశి రాశీఫలితాలు / February 2027 Libra Predictions:

ఈ మాసంలో విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన పనులకు రూపకల్పన చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగ విషయాలలో ఆశించిన అభివృద్ధి ఏర్పడును. కోరుకొన్న విధంగా జీవితంలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. అందివచ్చిన ప్రతీ అవకాశమును చక్కగా వినియోగించుకోగలరు. వివాహ ప్రయత్నాలు మరియు సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ మాసంలో ధనాదాయం కూడా పెరుగుతుంది. విద్యార్ధులకు చదువు బాగుంటుంది. ఈ మాసంలో 14, 15, 24, 27 తేదీలు నూతన కార్యములు ప్రారంభించుటకు అనుకూలమైనవి.

In this month, you will participate in festive gatherings and celebrations. You will be able to successfully design and plan new ventures, and your professional life will see the growth and progress you have been expecting. Favorable changes will take place in your life just as you desired, and you will be able to make excellent use of every opportunity that comes your way. Efforts related to marriage and children will yield positive results, and your financial income will also see an increase. It is a good time for students, as they will perform well in their studies. For starting any new tasks or important activities, the 14th, 15th, 24th, and 27th of this month are highly auspicious.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

మార్చి 2027 తులారాశి రాశీఫలితాలు / March 2027 Libra Predictions:

ఈ మాసం కూడా తులారాశి వారికి చక్కటి ఫలితాలను కలుగచేయును. తలపెట్టిన ప్రతీ ప్రయత్నం విజయవంతం అగును. ధనాదాయం సంతృప్తికరంగా ఉండును. కుటుంబంలో కుమార్తెలకు సంబందించిన శుభకార్యములకు సూచనలు ఉన్నవి. ద్వితీయ తృతీయ వారములలో అకాల భోజన ప్రాప్తి వలన వాత సంబంధ అనారోగ్యం ఎదురగును. చివరి వారంలో చేసిన పనుల ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక నూతన పరిజ్ఞానం నందు నిపుణత సాధించవలసిన పరిస్థితులు ఎదురగును. అన్ని రకముల వ్యాపార వ్యవహరాదులు కలసివచ్చును. ఆర్ధిక సంవత్సరం విజయవంతంగా పూర్తీ అగును. ఈ మాసంలో 18,19 తేదీలు ఆరోగ్య పరంగా మంచివి కాదు.

This month will also bring excellent results for Tula Rasi natives, with every effort you undertake reaching a successful conclusion. Your financial income will remain satisfactory, and there are strong indications of auspicious events (Shubhakaryam) related to your daughters within the family. During the second and third weeks, you may face health issues related to gastric or wind imbalances (Vata) due to irregular eating habits. By the final week, you will gain significant recognition for the work you have accomplished, and circumstances will arise where you may need to master a new skill or field of knowledge. All types of business dealings will be profitable, allowing the financial year to conclude on a highly successful note. Please be cautious on the 18th and 19th, as these dates are not favorable for health matters.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.