Placeholder image

2026 - 2027 శ్రీ పరాభవ నామ సంవత్సర కుంభరాశి రాశీఫలాలు

Sree Parabhava Nama Samvatsara Kumbha Rasi / Aquarius Sign Free Telugu Rasi Phalalu

- Predictions by Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)

2026 2027 sri parabhava naama kumbha rasi rasi phalitalu Aquarius sign astrology horoscope

 

  • శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఆదాయం - 02, వ్యయం - 08, రాజ పూజ్యం - 04, అవమానం - 02

  • పూర్వ పద్దతి లో కుంభరాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏర్పడబోవు ధనార్జన సంబంధ సమస్యలను సూచించుచున్నది.

    According to the traditional methodology, the Residual Number (Sesha Sankhya) for Kumbha Rasi (Aquarius) is "1", which indicates potential challenges in wealth accumulation and financial earnings during the Sri Parabhava year.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Kumbha Rasi / Aquarius Sign's Nature...
  • రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనగా 19 మార్చ్ 2026 నుండి 6 ఏప్రిల్ 2027 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు పొందుతారు. 31 మే 2026 వరకూ చక్కటి శ్రేయస్కరమైన ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవన మరియు సంతాన సంబంధ విషయాలలో తప్పకుండా మనోవాంచా ఫలసిద్దత లభిస్తుంది. పుత్ర సంతానం వలన వంశాభివృద్ధి  కొనసాగుతుంది. ఎదిగిన సంతానం కెరీర్ పరంగా అతి చక్కటి స్థితిని పొందగలుగుతారు. మీ సంతానం బుద్దిమంతులు ఆగుతారు. వ్యాపార వ్యవహారములను ముందుండి నడిపించి మీ కన్నా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. గృహంలో సభ్యులందరూ మీకు అనుకూలంగా ఉంటారు. మీ నిర్ణయాలను గౌరవిస్తారు. శుచి - శుభ్రత మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇంట , బయట అధిక గౌరవాభిమనాములు వృద్ధి చెందుతాయి. దైవ సంబంధ విషయాలలో సంతృప్తికర సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబంలో అందరు ఆరోగ్యవంతులై ఉంటారు. 01 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు బృహస్పతి వలన ప్రతికూల ఫలితాలు ఎదురగును. అపహాస్యానికి గురువుదురు. మీపై ఇతరుల నమ్మకం తగ్గుతూ వస్తుంది.ఈ కాలంలో పైనాన్సు వ్యాపార రంగం వారికి మాత్రం బాగా కలసి వస్తుంది. ఈ కాలంలో ఆర్ధికంగా అనుకూలత ఉండదు. ధన సంబంధ చికాకులు తరచుగా వెంటాడును. 31 అక్టోబర్ 2026 నుండి 23 జనవరి 2027 వరకు బృహస్పతి వలన తిరిగి చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఈ కాలంలో జీవిత భాగస్వామి తరపు నుండి ఆర్ధికంగా లాభపడతారు. వ్యాపార పరంగా ముఖ్య నిర్ణయాలను ఈ కాలం లో తీసుకొనవచ్చు. వ్యక్తిగత జాతకంలో బుధ మరియు గురు గ్రహ అనుకూల బలాలు కలిగి ఉన్నవారు ఈ కాలంలో ఏ వ్యాపార పరమైన పెట్టుబడి పెట్టినా అతి చక్కటి లాభములను పొందగలుగుతారు. ఎటువంటి వివాదం అయినా సులువుగా మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది.24 జనవరి 2027 నుండి శ్రీ పరాభవ నామ సంవత్సరం చివరి వరకు గురువు వలన తిరిగి ప్రతికూల ఫలితాలు పొందుతారు. సర్వదా నిరాశ ఎదురగుతుంది. అదృష్టం కలసి రాదు. వ్యావహారికంగా మీ కార్యదక్షత తగ్గుతుంది. ఈ కాలంలో సముద్ర సంబంధ ప్రయాణాలు చేయకుండా ఉండుట మంచిది. స్త్రీలకు లోభత్వం అధికం అవుతుంది. కుంభరాశి వారు  శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తరచుగా శనగలు బ్రాహ్మణులకు దానం ఇచ్చుట మంచిది. ప్రతీ రోజు క్రింది గురు గ్రహ మంత్రమును పటించుట మంచిది.

“ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్దిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతిం”

Throughout the Sri Parabhava year (March 19, 2026, to April 6, 2027), Kumbha Rasi (Aquarius) natives will experience mixed results due to the influence of Jupiter. Until May 31, 2026, highly favorable outcomes are predicted; you will achieve your heart's desires regarding marriage and progeny, with your children bringing immense pride through their stellar career achievements and wisdom. Your business reputation will grow as your children lead ventures successfully, and you will enjoy a harmonious domestic life where your decisions are deeply respected.

However, from June 1, 2026, to October 30, 2026, Jupiter may bring unfavorable results, leading to a loss of public trust or instances of ridicule; while those in the finance sector may still prosper, others will face persistent financial irritations.

Relief returns from October 31, 2026, to January 23, 2027, a golden period where you may gain financially through your spouse and see success in business investments, especially for those with strong Mercury and Jupiter placements in their birth charts. Legal disputes are likely to be resolved in your favor during this time.

Finally, from January 24, 2027, until the end of the year, Jupiter's influence turns negative again, bringing disappointment, a lack of luck, and decreased efficiency; it is advised to avoid sea voyages during this period. To mitigate these effects, it is recommended to frequently donate chickpeas (Senagalu) to priests and recite the Guru Mantra daily:

"Devanamcha Rishinamcha Gurukanchanasannibham, Buddhimantham Trilokesham Tham Namami Brihaspathim."

కుంభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా యోగించదు. ముఖ్యంగా ఏలినాటి శని దశ చివరి పాద ప్రభావం వలన తీవ్ర ఆర్ధిక ఒడిదుడుకులు, దురదృష్టత  ఎదుర్కొంటారు. ధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తారు. నేత్ర సంబంధ ఆరోగ్య సమస్య వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. విద్యార్ధులకు శ్రమ అధికం అవుతుంది. సంసార సంబంధ భాద్యతల వలన ఉక్కిరిబిక్కిరి అవుతారు. వ్యక్తిగత జాతకంలో అనుకూల స్థితిలో శని కలిగి ఉన్నవారు పరదేశాలకు వెళ్ళగలుగుతారు. వ్యక్తిగత జాతకంలో ప్రతికూల స్థితిలో శని కలిగి ఉన్న వారు పరదేశాల నుండి స్వదేశానికి తిరిగి వచ్చేయవలసి వస్తుంది. శని గ్రహ బలం లోపించిన వారు ఈ సంవత్సరం అన్ని విషయాలలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. ఈ సంవత్సరం అంతా ఎన్ని శనివారములు వీలు అయితే అన్ని శనివారములు శనికి తైలాభిషేకములు జరుపవలెను. నల్లటి వాహనాలు, ఇనుప వస్తువులు, పర్వతారోహణ విషయాలలో సదా జాగ్రత్తగా ఉండవలెను. ఈ సంవత్సరం అంతా నెలకు ఒకసారి ఐనా శని గ్రహ శాంతి జపములు జరిపించుకోనుట మంచిది. నిత్యం క్రింది శని గ్రహ మంత్రమును మనసులో పటిస్తూ ఉండడం మంచిది. వీలు ఐన ప్రతీ సారీ 100 గ్రాముల నల్ల నువ్వులు జల దానం చేయుట మంచిది. కుంభరాశి వారికి ఏలినాటి శని దశ 2027 జూలై మాసంలో ముగుస్తుంది. 

“ నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైచ్చరం”. 

Throughout the Sri Parabhava year, Kumbha Rasi (Aquarius) natives will face unfavorable results due to the influence of Saturn; specifically, the impact of the final phase of Elinati Shani (Sade Sati) will lead to severe financial fluctuations, misfortune, and excessive, reckless spending. You may encounter eye-related health issues, while students will face increased pressure, and family responsibilities may feel overwhelming. While those with a favorable Saturn in their personal birth charts may have opportunities to travel abroad, those with a weak Saturn might be forced to return to their homeland; therefore, individuals with insufficient planetary strength must remain extremely cautious in all matters this year. It is highly recommended to perform Tailabhishekam to Saturn on as many Saturdays as possible, exercise vigilance regarding black vehicles, iron objects, and mountain climbing, and conduct Shanti Japam at least once a month. Please note that the Elinati Shani period for Kumbha Rasi will finally conclude in July 2027. Additionally, you should frequently donate 100 grams of black sesame seeds in water and daily recite the Shani Mantra:

"Nilanjana Samabhasam Ravi Putram Yamagrajam, Chhaya Martanda Sambhutam Tham Namami Shanaishcharam."

కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహువు వలన సంవత్సరం ప్రారంభం నుండి 05 డిసెంబర్ 2026 వరకు కొద్దిపాటి అనుకూల ఫలితాలు ఎదురగును. 06 డిసెంబర్ 2026 నుండి శ్రీ పరాభవ నామ సంవత్సర ముగింపు వరకు తీవ్ర ప్రతికూల ఫలితాలు ఎదురగును. దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తించుట వలన మంచి మనుషులు మీ నుండి దూరం అవుతారు. దుర్జనుల సహవాసం ఏర్పడుతుంది. వారి వలన ఋణాలు చేసి మరీ ధనాన్ని వ్యయం చేయవలసిన పరిస్థితులు ఎదుర్కొంటారు. నూతన మిత్ర వర్గం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. హృదయ సంబంధ ఆరోగ్య విషయాలలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.  ఈ సంవత్సరం మీ చేయి దాటినా ధనం తిరిగి రాదు. ధనం యొక్క విలువ తెలుసుకోని ఖర్చుపెట్టవలెను. 06 డిసెంబర్ 2026 తదుపరి ఎన్ని సార్లు వీలు అయితే అన్నిసార్లు 1250 గ్రాముల మినుములను బ్రాహ్మణులకు దానం ఇచ్చుట మంచిది. నిత్యం ఈ క్రింది రాహు గ్రహ మంత్రమును పటించుట మంచిది.

“ అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం రాహుం తమ్ ప్రణమామ్యహం”

For Kumbha Rasi (Aquarius) natives, the influence of Rahu during the Sri Parabhava year will be moderately favorable from the start of the year until December 5, 2026. However, from December 6, 2026, until the conclusion of the year, you will face severe adverse results. Be cautious, as behaving without compassion or kindness may distance good people from you, potentially leading to associations with wicked individuals; these negative connections could force you into a cycle of taking loans to meet excessive expenditures. It is essential to be extremely selective with new friendships and to undergo regular health check-ups, particularly regarding heart health. Understand that any wealth lost during this period is unlikely to be recovered, so you must recognize the true value of money before spending.

From December 6, 2026, it is highly recommended to frequently donate 1,250 grams of black gram (Minumulu) to priests and to recite the Rahu Mantra daily for protection:

"Ardhakayam Mahaveeram Chandraditya Vimardhanam, Simhika Garbha Sambhootam Rahum Tham Pranamamyaham."

కుంభ రాశి వారికి  శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన 04 డిసెంబర్ 2026 వరకు వ్యతిరేక ఫలితాలు ఎదురగును. ముఖ్యంగా కళత్ర జీవనంలో ఇబ్బందులు మానసికంగా చికాకు పెట్టును. దుష్ట స్త్రీ సాంగత్య ఫలితమున ఇబ్బందులు ఎదుర్కొందురు. 05 డిసెంబర్ 2026 నుండి సంవత్సరం ముగింపు వరకు కొంత వరకు అనుకూల ఫలితాలు ఎదురగును. ఆర్ధిక సమస్యల నుండి బయట పడడానికి మార్గములు లభించును.

For Kumbha Rasi (Aquarius) natives, the influence of Ketu will bring unfavorable results during the Sri Parabhava year until December 4, 2026. During this period, you may face significant hurdles and mental distress within your marital or personal life. It is also advised to remain cautious, as associations with negative or ill-intentioned women could lead to unforeseen difficulties. However, a positive shift occurs from December 5, 2026, until the end of the year, bringing a degree of relief and favorable outcomes. You will finally discover the right paths and solutions to extricate yourself from persistent financial problems and stabilize your situation.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారు, ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగిన వారు ప్రతికూల ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరంలో తరచుగా గురు, శనైశ్చర, రాహు మరియు కేతు గ్రహ పూర్ణ కుంభ శాంతి జపములు జరిపించుకోనవలెను. 

Overall, during the Sri Parabhava year, Kumbha Rasi (Aquarius) natives—especially those with Kala Sarpa Dosham in their personal birth charts—will face unfavorable results. To mitigate these adverse effects, it is highly recommended to frequently perform Purna Kumbha Shanti Japam for Jupiter (Guru), Saturn (Shani), Rahu, and Ketu throughout the year.

మార్చ్ 2026 కుంభరాశి రాశిఫలాలు / March 2026 Aquarius Predictions:

ఈ నెలలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. గృహంలో సంతోషకర సంఘటనలు ఏర్పడతాయి. బంధువుల మిత్రుల సహాయ సహకారములు లభించును. ఆశించిన కార్యములందు విజయం అంత త్వరగా లభించదు. ఉద్యోగ జీవన సంబంధ శ్రమ అధికం అవుతుంది. శ్రమను ఒర్చుకోగలరు. ప్రతీ విషయములో కలిపించుకొని మాట్లాడు స్వభావం తగ్గించుకోవాలి. అన్ని విషయములు తెలుసు అనే భావము విడిచిపెట్టాలి. 20వ తేదీ తదుపరి జీవిత భాగస్వామి సహాయ సహకారములు సంపూర్ణంగా లభిస్తాయి. సంతాన ప్రయత్నాలలో వైద్య సహాయం వలన విజయం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నములు కష్టం మీద విజయం పొందును. ఈ నెలలో 9 మరియు 16 తేదీలు నూతన ప్రయత్నాలకు అనుకూలమైనవి. మిగిలిన రోజులలో కష్టం మీద కార్యములు పూర్తి అగును. ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా తట్టుకోలేరు. ఇటువంటి స్వభావం వలన తలనొప్పి వంటి ఒత్తిడి ఎదుర్కొంటారు. అంతరాత్మ ప్రభోదించిన మాటను వినడం మంచిది.

In this month, your financial income will remain average, but your home will be filled with joyful events and the support of friends and relatives. While success in your planned activities may not come as quickly as expected, and your professional workload increases significantly, you will possess the necessary endurance to handle the pressure. It is advisable to curb the tendency to interfere in every matter and avoid the mindset that you know everything, as this will help maintain harmony. From the 20th of the month, you will receive full cooperation from your spouse, and those seeking progeny will find success with the help of medical assistance. While efforts for new employment will succeed only after significant struggle, the 9th and 16th of this month are particularly favorable for new initiatives. Be cautious of extreme emotional swings, as being overwhelmed by either anger or joy could lead to stress-related issues like headaches; listening to your inner conscience will be your best guide.

ఏప్రిల్ 2026 కుంభరాశి రాశీఫలితాలు / April 2026 Aquarius Predictions:

ఈ మాసంలో కొంతవరకు అనుకూల గ్రహ బలములు ఏర్పడి వున్నవి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఆశించిన పనులు విజయవంతమగును. ధనాదాయం కొద్దిగా వృద్ధి చెందును. తలపెట్టిన ప్రయాణాలు ఆగిపోవును. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్త అవసరం. ప్రమాదాలు జరగవచ్చు. ఉద్యోగ జీవనంలో సామాన్య ఫలితాలు ఎదురగును. నిరుద్యోగులకు ఆశించిన స్థాయి కన్నా కొంచెం తక్కువ స్థాయి ఉద్యోగం లభించును. శతభిషా నక్షత్ర జాతకులకు అనారోగ్య సమస్యలు తగ్గును. మూడవ వారంలో వాయిదా పడుతున్న పనులను పూర్తీ చేయగలరు. ప్రత్యర్ధులతో నేరుగా మాట్లాడుట ద్వారా వివాదాలను స్వయంగా పరిష్కరించుకుంటారు. యువకులు రాజకీయాలపట్ల ఆకర్షితులవుతారు. వ్యాపారాదులు సక్రమంగా కొనసాగును. ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది.

In this month, favorable planetary positions will bring a degree of positive results. Those born under the Purvabhadra constellation will see success in their planned activities, and financial income will show a slight increase. However, scheduled travels may be postponed or canceled, and you must exercise extreme caution while driving vehicles, as there is a risk of accidents. While employees will experience average results, the unemployed may find job opportunities that are slightly below their expected level. For those born under the Shatabhisha constellation, health issues will begin to subside. During the third week, you will be able to complete long-pending tasks and resolve disputes directly by engaging in straightforward communication with your rivals. Young people will find themselves drawn toward politics, and business operations will proceed smoothly, leading to a gradual improvement in your overall financial condition.

మే 2026 కుంభరాశి రాశీఫలితాలు / May 2026 Aquarius Predictions:

ఈ మాసంలో కూడా క్రిందటి మాసం వలె అనుకూల ఫలితాలు కొనసాగును. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్థి లావాదేవీలలో అదృష్టం కలసివచ్చును. ఇతరుల మనసు తెలుసుకొని పనులను పుర్తిచేయగలుగుతారు. సంభాషణలలో చెడు పదాలను ఉపయోగించడం తగ్గించుకోవాలి. తొందరపడి మాటలు జారుదురు. ఉద్యోగులు తమ కృషికి తగిన గుర్తింపు పొందుతారు. రాజకీయవాదులు ప్రజాదరణ పెంచుకుంటారు. ఈ మాసంలో 15 నుండి 21 వ తేదీల మధ్య తీరిక లేకుండా పని ఒత్తిడి వలన శ్రమ చేయవలసి వస్తుంది. ముఖ్యమైన పనులలో మీ సామర్ధ్యాన్ని మించిన నైపుణ్యత అవసరం అవుతుంది. ఈ మాసంలో 5, 8 వ తేదీలలో ఆర్ధిక విషయాలలో జాగ్రత్తగా ఉండవలెను. స్నేహితులకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్టితులు ఎదురగును.

The favorable results from the previous month will continue into this month as well. You will establish acquaintances with prominent individuals, and luck will be on your side regarding real estate transactions. You will be able to understand the perspectives of others and complete your tasks effectively. However, it is essential to refrain from using harsh or offensive language in your conversations, as there is a tendency to speak impulsively. Employees will receive due recognition for their hard work, and politicians will see a rise in their public popularity. Between the 15th and 21st of this month, you will face heavy work pressure and a busy schedule, requiring you to demonstrate skills beyond your usual capacity to complete important tasks. Be cautious in financial matters on the 5th and 8th, as situations may arise where you have to spend significantly on your friends.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

జూన్ 2026 కుంభరాశి రాశీఫలితాలు / June 2026 Aquarius Predictions:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఇతరుల మాటలు అతిగా నమ్మి నూతన వ్యవహారాలు ప్రారంభించకపోవడం మంచిది. గృహంలో భాత్రు వర్గం తో మాట పట్టింపులు ఏర్పడతాయి. కలహములు ఏర్పడుటకు అవకాశం ఉన్నది. మీకు సరైన ఆలోచన రాదు వేరొకరు చెప్పినది వినరు. వ్యాపారాదులు మందకొడిగా నడుచును. కుటుంబ సభ్యుల పై అధికారం చేలాంచడానికి చూడకూడదు. ధనిష్టా నక్షత్ర జాతకుల సంతాన ప్రయత్నాలు విజయవంతం అగును. చివరి వారంలో వైవాహిక జీవనంలో ఎవరికివారు స్వతంత్ర భావాలు కలిగి వ్యవహరించడం వలన సంసారంలో భార్యాభర్తల మధ్య కలసికట్టుతనం తగ్గుతుంది. దీని వలన జీవిత భాగస్వామితో ఆనందకర సమయం గడుపుటను కోల్పోతారు. ఈ మాసంలో 15, 16, 17 తేదీలలో ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది.

In this month, your financial income will remain average, and it is advisable not to initiate new ventures by blindly trusting the words of others. You may face misunderstandings and potential conflicts with siblings within the family. During this period, you might find it difficult to arrive at the right decisions yourself, yet remain reluctant to listen to the advice of others. Business activities will proceed slowly, and you should avoid trying to exert undue authority over family members. For those born under the Dhanishta constellation, efforts toward progeny will be successful. However, in the final week, a tendency for both partners to act with overly independent mindsets may reduce the harmony between husband and wife, leading to missed opportunities for joyful moments with your spouse. It is best to postpone important decisions on the 15th, 16th, and 17th of this month.

జూలై 2026 కుంభరాశి రాశీఫలితాలు / July 2026 Aquarius Predictions:

ఈ మాసంలో నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు లేదా నివాస స్థాన చలన ప్రయత్నాలు సిద్ధించును. విదేశీ వ్యవహారాలలో మాత్రం ఆటంకాలు ఎదురగును. నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు 14 వ తేదీలోపు కొంత మంచి మాసం. నూతన ఆదాయ మార్గాల కొరకు చేయు ప్రయత్నాలు విజయవంతం అగును. ఆలోచనలు కార్య రూపం దాల్చును. బంధువుల, స్నేహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు పొందుతారు. పరిస్థితులకు తగిన విధంగా మీ ఆలోచనా విధానం మార్చుకొందురు. ఈ మాసంలో కుజ గ్రహ అనుకూలత వలన నూతన పదవులు లభించడానికి అవకాశం ఉన్నది. తృతీయ , చతుర్ధ వారాలలో మీ వద్ద పనిచేయు వారితో కలహములు ఏర్పడును. దీనివల్ల కష్టములు నష్టములు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ మాసంలో మూత్రాశయమున రాళ్ళు కు సంబందించిన వ్యాధులు రావచ్చు.

This month will be successful for those seeking new employment, job changes, or a change in residence. However, you may face obstacles in matters related to foreign countries. The period before the 14th is favorable for starting new business ventures, and your efforts to find new sources of income will yield positive results. Your ideas will begin to take a practical shape, and you will receive the expected support and cooperation from relatives and friends. You will find yourself adapting your mindset effectively to suit changing circumstances. Due to the favorable influence of Mars (Kuja), there are strong possibilities for attaining new positions or promotions. However, during the third and fourth weeks, conflicts may arise with those working under you, which could lead to certain difficulties and losses. On the health front, there is a possibility of issues related to kidney or bladder stones, so extra care is advised.

ఆగష్టు 2026 కుంభరాశి రాశీఫలితాలు / August 2026 Aquarius Predictions:

ఈ మాసంలో బాధ్యతలు పెరిగినప్పటికీ ఆర్ధికంగా సమస్యలు ఎదురైనా ఎటువంటి విఘాతం లేకుండా భాద్యతలు పూర్తీ చేయగలరు. శతభిషా నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక వేత్తల పరిచయ భాగ్యం ఏర్పడును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. మాతృ వర్గీయులతో చిన్న సమస్య ఏర్పడవచ్చును. ఈ మాసంలో ప్రధమ , ద్వితీయ వారాలలో ఏదో ఒక కొత్త సమస్యలు ఏర్పరచుకొందురు. తృతీయ వారం నుండి దీర్ఘకాలిక కోరికలను నేరవేర్చుకోగలరు. పిల్లలకు కావలసిన సౌకర్యాలను ఏర్పరుస్తారు. మాసాంతంలో సంతృప్తికర ఆహరం భుజిస్తారు. ఈ మాసంలో 2 వ తేదీ నుండి 8 వ తేదీ మధ్య కాలం సొంత భూ లేదా గృహ సంబంధ ప్రయత్నాలకు అనుకూలమైనది.

During this month, even though your responsibilities increase and you may face some financial challenges, you will be able to fulfill all your obligations without any major setbacks. Those born under the Shatabhisha constellation will have the fortunate opportunity to meet spiritual leaders or scholars. While your financial income will remain average, minor issues may arise with your maternal relatives. During the first and second weeks, you might inadvertently create some new complications for yourself; however, from the third week onwards, you will successfully fulfill long-held desires. You will provide the necessary comforts and facilities for your children, and the month ends with the satisfaction of enjoying wholesome and hearty meals. Additionally, the period between the 2nd and 8th of this month is highly favorable for efforts related to purchasing or developing your own land or house.

సెప్టెంబర్ 2026 కుంభరాశి రాశీఫలితాలు / September 2026 Aquarius Predictions:

ఈ మాసంలో ఉద్యోగ , వ్యాపార వ్యవహారాలలో మార్పులు శుభప్రదంగా ఉంటాయి. ధనాదాయం కొంత పెరుగుతుంది. అన్ని అడ్డంకులు తొలగించుకొని వాయిదా వేస్తూ వస్తున్న పనులు పూర్తి చేయగలరు. గృహా సంబంధ నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మార్కెటింగ్ రంగంలోని వారికీ శారీరక శ్రమ అధికం అవుతుంది. ఉద్యోగ జీవనంలో మీ హక్కులను విడువక సాధించగలుగుతారు. వ్యాపార వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. తృతీయ వారంలో ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడతాయి. చివరి వారంలో 22 వ తేదీ నుండి మాసంతం వరకూ అనుకూలమైన గ్రహ బలాలు కలవు. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన అధికారాలు ప్రాప్తించును. ఈ మాసంలో మత వ్యాపక వృత్తిలోని వారు అధికంగా ఆర్జించగలుగుతారు

In this month, changes in your professional and business affairs will prove to be auspicious and beneficial. Your financial income will show an upward trend, enabling you to overcome all obstacles and complete tasks that have been long postponed. You are likely to purchase new items or appliances for your home. While those in the marketing sector will face increased physical exertion, employees will successfully stand their ground and secure their rightful dues. The business environment remains encouraging; however, during the third week, your expenditures may exceed your income. The final week, specifically from the 22nd until the end of the month, brings highly favorable planetary support. Government employees may be bestowed with new authorities or promotions, and those in religious or spiritual professions will be able to earn significantly well during this period..

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

అక్టోబర్ 2026 కుంభరాశి రాశీఫలితాలు / October 2026 Aquarius Predictions:

ఈ మాసంలో వైవాహిక జీవన సమస్యలు తగ్గుముఖం పడతాయి. అవివాహితుల వివాహ ప్రయత్నాలు కూడా ఫలించును. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. వ్యక్తిగత జీవనంలో సంతోషాలు పొందుతారు. ప్రవాస జీవన ప్రయత్నాలకు ఎదురగుతూ వస్తున్న విఘ్నాలు తొలగును. విదేశీయాన ప్రయత్నాలు ఫలవంతమగును. వ్యాపారాదులు సక్రమంగా నడచును. ప్రభుత్వానికి అధికంగా డబ్బు కట్టవలసి వస్తుంది. నూతన వాహన కోరిక ఈ మాసంలో సిద్ధించును. సంతానం పట్ల ప్రేమాభిమానములు పెంపొందును. సంతానానికి తమ తల్లితండ్రుల పట్ల గౌరవ మర్యాదలు పెంపొందును.

In this month, issues in your marital life will begin to subside, and efforts for the marriage of the unmarried will finally bear fruit. While your financial income remains average, you will experience significant happiness and satisfaction in your personal life. Obstacles that have been hindering your plans to move abroad or pursue opportunities in foreign lands will be cleared, leading to successful international travel arrangements. Business operations will proceed smoothly; however, you may find yourself having to pay substantial amounts to the government in the form of taxes or fees. Your long-held desire to purchase a new vehicle is likely to be fulfilled this month. Furthermore, your affection for your children will deepen, and they, in turn, will develop greater respect and regard for their parents.

నవంబర్ 2026 కుంభరాశి రాశీఫలితాలు / November 2026 Aquarius Predictions:

ఈ మాసంలో చేపట్టిన పనులన్నీ ఆలస్యముగా పూర్తి అవుతాయి. సమాజంలో తగిన గౌరవం లభించును. వ్యాపార రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడతారు. వ్యాపార అభివృద్ధి పనులు చేపడతారు. హస్తకళా రంగంలోని వారికి ఈ మాసం చక్కటి కాలం. ఉద్యోగ జీవితంలో నూతన ప్రాజెక్టులు లభించి సంతృప్తికర జీవనాన్ని పొందుతారు. ఈ మాసంలో 13 నుండి 17 వ తేదీ మధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు కలవు. చివరి వారంలో సహోద్యోగులపై అనుమానాలు ఎక్కువ అగుట వలన మానసిక ఆందోళన ఎదుర్కొంటారు. ఇతరులతో మాట్లాడునపుడు జాగ్రత్త వహించవలెను. మీ గంభీరమైన కంట ధ్వని వలన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది.

In this month, all your initiated tasks will be completed, though with some delays. You will receive well-deserved respect and recognition in society. This is an excellent time to introduce new trends in your business and undertake expansion activities. Those in the field of handicrafts will find this month particularly rewarding. In your professional life, you will be assigned new projects that bring a sense of job satisfaction and stability. However, be cautious between the 13th and 17th of this month, as there are indications of potential health issues. During the final week, increased suspicions regarding your colleagues may lead to mental anxiety. It is essential to be careful during conversations; your naturally serious or loud tone of voice might be misunderstood, leading to unnecessary complications.

డిసెంబర్ 2026 కుంభరాశి రాశీఫలితాలు / December 2026 Aquarius Predictions:

ఈ మాసం అంత అనుకూలంగా ఉండదు. మాసంలో ఉద్యోగ జీవనంలో అననుకూల ఫలితాలు ఏర్పడు సూచన. నడుస్తూ ఉన్న వృత్తి ఉద్యోగాలలో వ్యతిరేక పరిస్థితులు ఉన్నవి. వ్యాపార రంగం వారికి కూడా ఆదాయం ఆశించినంతగా ఉండదు. కామోద్రేకం వలన చికాకులు తన్మూలక కోర్టు తగాదాలు ఎదురగును. ఇంత ప్రతికూల పరిస్టితులలో శత్రువుల వలన కూడా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ మాసం నూతన వ్యవహారదులకు అనుకూలమైనది కాదు. కుటుంబంలో గౌరవ మర్యాదలు మీ స్వయం కృతాపరాధం వలన తగ్గుతుంది. ఈ మాసంలో శ్రీ వైష్ణవ దేవాలయ దర్శనం ద్వారా మానసిక శాంతిని పొందగలరు. ఈ మాసంలో 6, 8, 10, 19, 26 తేదీలు అనుకూలమైనవి కావు.

This month is not very favorable and indicates potential setbacks in your professional life. You may face adverse conditions in your current job or profession, and business owners may find that their income falls short of expectations. Impulsive behavior and lack of self-control could lead to irritations and subsequent legal or court-related disputes. Amidst these challenging circumstances, you may also face problems from enemies. This month is not suitable for initiating new ventures. Furthermore, your reputation within the family may decline due to your own mistakes. Visiting Sri Vaishnava temples during this month will help you find much-needed mental peace. Please note that the 6th, 8th, 10th, 19th, and 26th are unfavorable dates.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

జనవరి 2027 కుంభరాశి రాశీఫలితాలు / January 2027 Aquarius Predictions:

ఈ మాసంలో పెద్ద వయస్సు వారికి కంటికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలం. ధనాదాయం పర్వాలేదు. అనవసర ధనవ్యయం తగ్గుతుంది. ఈ మాసంలో స్పెక్యులేషన్ కూడా కొద్ది స్థాయిలో లాభిస్తుంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు తొలగును. జీవిత భాగస్వామి అభిమానం, ప్రేమ పొందుదురు. పరదేశ విశ్వ విద్యాలయములందు అభ్యాసం కొరకు ప్రయత్నించు విద్యార్ధులకు వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారాదులు సామాన్య ఫలములనిచ్చును. పనిచేయు కార్యాలయమునందు మీ పట్ల గౌరవం పెరుగుతుంది. సంతాన ప్రయత్నాలకు ఈ మాసం అంత అనువైనది కాదు.

In this month, elderly individuals may need to undergo eye-related surgeries. Legal and court matters will turn in your favor, and your financial income remains steady as unnecessary expenditures decrease. Small-scale speculation or investments may yield modest profits during this period. Misunderstandings with your spouse will be resolved, and you will enjoy their renewed affection and love. Students aspiring to study at foreign universities will see their dreams fulfilled as their efforts bear fruit. While business activities will provide average results, your reputation and respect at your workplace will increase. However, this month is not particularly favorable for those planning for progeny or children.

ఫిబ్రవరి 2027 కుంభరాశి రాశీఫలితాలు / February 2027 Aquarius Predictions:

ఈ మాసంలో చేపట్టిన పనులలో అనుకూలత ఎదురగుతూ ఉండుట వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభించును. ఉద్యోగ జీవనంలో దీర్ఘకాళిక నూతన ఒప్పందాలు లభించును. నూతన వ్యవహరాదులు ప్రారంభంలో సమస్యలను ఎదుర్కొన్నా మాసాంతానికి విజయవంతమగును. మాస మధ్యమంలో గృహంలో స్త్రీ సంతాన సంబంధ శుభకార్యములు నిర్వహించు అవకాశం కలదు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు కోరుకున్న గుర్తింపు, పదవులు లభిస్తాయి. ఈ మాసమంతా ధనాదాయం సామాన్యంగా ఉంటుంది.

In this month, you will find a smooth flow in your ongoing tasks, which will provide much-needed relief from recent mental stress. In your professional life, you are likely to secure new long-term contracts or agreements. Although new ventures may face some initial hurdles, they will conclude successfully by the end of the month. Around mid-month, there are strong possibilities for celebrating auspicious events related to a female child in the family. Efforts by the unemployed to secure jobs will finally be successful, and politicians will attain the recognition or positions they have been aspiring for. Throughout this month, your financial income will remain steady and average.

మార్చి 2027 కుంభరాశి రాశీఫలితాలు / March 2027 Aquarius Prdictions:

ఈ మాసంలో కూడా కొంత వరకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. గత కాలపు సమస్యలు తొలగును. సంవత్సరం మొత్తం మీద ఈ మాసంలో ఆర్ధిక అభివృద్ధి ఏర్పుతుంది. వృధా ధనవ్యయమును అదుపు చేయగలుగుతారు. చేతిపై ధనం నిలుస్తుంది. శారీరక స్వస్థత ప్రాప్తిస్తుంది. గృహ సంబంధ లేదా భూ సంబంధ స్థిరాస్థి క్రయవిక్రయాలలో ఎదురగుతున్న స్తబ్దత తొలగిపోతుంది. వివాదాలు తొలగిపోవును. అరుదైన అవకాశములు లభించును. శుభవార్తలు వింటారు. మీ సాంస్కృతిక అభిరుచులు మీకు చక్కటి గుర్తింపును లభింపచేయును. 25 వ తేదీ నుండి 29 వ తేదీ మధ్య కాలంలో కుంభరాశికి చెందిన స్త్రీలకు గర్భ లేదా రక్త సంబంధ సమస్యలున్నాయి.

In this month, favorable results will continue to manifest, and past problems will finally begin to fade away. This month stands out as a period of significant financial growth compared to the rest of the year. You will successfully curb unnecessary expenditures and find that money stays in your hands. Physical health and well-being will improve, and the stagnation previously faced in real estate or land transactions will dissipate. Disputes will be resolved, and you will receive rare opportunities and joyful news. Your cultural interests and hobbies will bring you good recognition. However, between the 25th and 29th of the month, women of Kumbha Rasi should be cautious, as there are indications of pregnancy or blood-related health issues.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.