Placeholder image

2023-2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సర మిధునరాశి రాశీ ఫలాలు

Sree Shobhakruth Nama Samvatsara Midhuna Rasi / Gemini Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • 2023- 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మిధున రాశీ వారికి ఆదాయం - 02, వ్యయం - 11, రాజ పూజ్యం - 02, అవమానం - 04 

  • పూర్వ పద్దతిలో మిధున రాశి వారికి వచ్చిన సంఖ్య "4". ఇది శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి తరచుగా ఎదురగు ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Midhuna Rasi / Gemini Sign nature.....

మిధున రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అనగా 22-మార్చ్-2023 నుండి 08-ఏప్రిల్-2024 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అతి చక్కటి అభివృద్ధి కర ఫలితాలు లభించును. గత శుభక్రుత్ నామ సంవత్సరంలో వలే గురు గ్రహం ఈ సంవత్సరం కుడా విద్యార్ధులకు ఆశించిన విద్యారంగంలో ప్రవేశం ఏర్పడును. మిక్కిలి ఆచారవంతమైన జీవనం అనుభవించు యోగం కలదు. నూతన వాహన యోగం సిద్దించును. ప్రమోషన్లు ఆశిస్తున్న వారికి ఈ సంవత్సరం తప్పక స్థానఉన్నతి లభించును. న్యాయవంతంగా అధిక ధనార్జన చేయుదురు. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం కలిగిన వారు ఈ సంవత్సరం సంపూర్ణ యోగం అనుభవిస్తారు. ఈ జాతకులకు ఆరోగ్య సమస్యలు కూడా బాధించు సూచన తక్కువ.

మిధునరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో శని గ్రహం వలన కెరీర్ పరంగా అనుకూల ఫలితాలు ఏర్పడును. పితృ వర్గీయులకు అంత మంచి కాలం కాదు. వారసత్వ సంపద కొన్ని ఆకస్మిక నష్టముల వలన అమ్మి వేయవలసిన వచ్చినా సంవత్సరాంతానికి తిరిగి సంపదను సమకుర్చుకోగలుగుతారు. పర దేసములందు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయు వారికి శని గ్రహం వలన చక్కటి విజయం లభించును. మిధునరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

మిదునరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో రాహువు వలన మిక్కిలి సులువుగా అధిక ధనార్జన ఏర్పడును. ఈ సంవత్సరం రాహు గ్రహ స్థితి ప్రభుత్వ ఉద్యోగులకు బాగా కలసి వస్తుంది. దూర ప్రాంత విహార యాత్రలు చేస్తారు. ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. మొత్తం మీద శ్రీ శోభకృత్ నామ సంవత్సరం అంతా రాహువు మిధున రాశి వారికి అనుకూల ఫలితాలనే ఏర్పరచును.

మిధునరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేతువు వలన లాభ వ్యయాలు సమానంగా ఉండును. సంతాన ప్రయత్నాలను మొదట ఆటంక పరచి చివరికి సంతాన ప్రాప్తిని కలుగచేయును. మాతృ వర్గీయులతో అభిప్రాయ బేధాలు అధికం అగును. 30-అక్టోబర్-2023 తదుపరి సంతానం యొక్క అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి.

ఏప్రిల్ 2023 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసం ప్రధమ వారంలో ధనాదాయం బాగుండును. వ్యాపార వ్యవయరాలలో పరిస్థితులు అనుకూలం. పెద్ద వయస్సు వారికి అనారోగ్యం. ద్వితీయ తృతీయ వారాలలో చేపట్టిన పనులు వేగంగా పూర్తి అగును. మంచి అనుకూల ఫలితాలు. బంధువర్గం సహకారం ఆనందాన్ని కలుగచేయును. చివరి వారంలో జూదం వలన ధననష్టనికి అవకాశం. తోటి ఉద్యోగులతో విమర్శ - ప్రతి విమర్శలు. మాట జారకుండా ఉండుట మంచిది.

మే 2023 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సంతాన ప్రయత్నాలు, సంబందిత విషయాలు అనుకూలంగా ఉండవు. ధనాదాయం మాత్రం బాగుండును. హృదయ సంబంధ సమస్యలు కలిగిన వారికి ప్రమాద కాలం. శత్రు ఓటమి. స్థిరాస్థి సమకురును. 14,15,16,17 తేదీలలో దీర్ఘకాల ఆలోచనలు కార్య రూపం దాల్చును. పేరు ప్రతిష్టలు పెరుగును. ఆనందకర సంఘటనలు. చివరి వారంలో ఆర్ధికంగా బలం పెరుగును. వ్యక్తిగత జీవన సంతోషాలు పుష్కలం.

జూన్ 2023 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసం అత్యంత అనుకూలమైనది. అనేక అనుకూల ఫలితాలు ఏర్పడును. మానసిక ప్రశాంతత. తలపెట్టిన పనులు విజయవంతం అగును. ఆశించిన భాగ్యం చేతికి వచ్చును. విద్యార్ధులకు విజయం. కోరుకున్న పనులన్నీ జరుగును. అదృష్టం కలసివచ్చును. నూతన బాధ్యతల వలన గౌరవం, హోదా పెరుగును. వివాహ సంబంధ ప్రయత్నాలకు, సంతాన ప్రయత్నాలకు, రాజీ ప్రయత్నాలకు ఈ మాసం అనువైనది.

జూలై 2023 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా తృతీయ వారం వరకూ లాభదాయక పరిస్థితులు కొనసాగును. పుణ్యక్షేత్ర సందర్శన, బంధువులతో కలయిక, తగాదలలో విజయం, మనోవాంచ్చా ఫలసిద్ధి, జీవన మార్గంలో అభివృద్ధి, అధిక ఆత్మవిశ్వాసం. తృతీయ వారం నుండి కొద్దిగా పరిస్థితులు అదుపు తప్పును. దురాశ వలన సమస్యలు, స్త్రీ సంబంధిత వ్యవహారాలలో చిక్కులు, ప్రయాణ మూలక వ్యయం, ఉద్యోగులకు ఒత్తిడులు ఏర్పడును. ఈ మాసంలో వ్యాపార రంగంలోని వారికి మాత్రం అంతగా కలసి రాదు.

ఆగష్టు 2023 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసం అంతగా అనుకూలమైన ఫలితాలు కలుగచెయదు. జీవన మార్గంలో సమస్యలు, ఊహించని మార్గాలలో కష్టములు, అధిక ధన వ్యయం బాధించు సూచన. కుటుంబ జీవనం ప్రశాంతంగా ఉండదు. వ్యాపార, వృత్తి వ్యవహారాలు సామాన్యం. అలవాట్ల వలన ఒక చెడు ఫలితం లేదా సమస్య. అపవాదులు, రహస్య కార్యచరణలు, కుటుంబ సభ్యుల ముందు చిన్నతనం. తలవంపులు. ఈ మాసంలో ,14,20,22 తేదీలు అనుకూలమైనవి కాదు.

సెప్టెంబర్ 2023 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసం ప్రధమ , ద్వితీయ వారాలలో గృహంలో అనారోగ్య సూచన. వ్యాపార ఉద్యోగ వ్యవహారాలలో చిక్కులు. సమస్యలు. వారం మధ్యలు సర్ప దర్శనం. లక్ష్య సాధనలో ఆటంకాలు. నమ్మక ద్రోహం వలన అశాంతి. 18 వ తేదీ తదుపరి కొంత అనుకూలత. ధనాదాయం పెరుగును. చేపట్టిన పనులు నిదానంగా ఫలించును. ఆశించిన శుభవార్త. భూ లేదా గృహ సంబంధ ప్రయత్నాలకు అనుకూలమైన కాలం. మాసాంతంలో విందు-వినోదాలు.

అక్టోబర్ 2023 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ఆశించిన ధనం చేతికి వచ్చుట కష్టం. నూతన కార్యములకు ఆటంకములు. బంధు విరోధాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి. అనవసర ప్రయాణాలు. 20 నుండి 26 వ తేదీ మధ్య కాలంలో ఖర్చులు పెరుగును. నిర్ణయాలలో తొందరపాటు వలన మాట పడుట. సంతాన ప్రయత్నాలు చేయువారికి శుభవార్త. నూతన పరిచయాలు.

నవంబర్ 2023 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కొంత అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. వాయిదా పడుతూ వస్తున్న పనులు తిరిగి మొదలు పెట్టడానికి ఇది మంచి కాలం. కుటుంబంలో పరిస్థితులు చక్కబడును. వినోదం కొరకు ధనవ్యయం. మాస తృతీయ వారంలో ఆర్ధిక లాభం. ఉన్నతమైన ఆలోచనలు ఏర్పడుచుండును. ఇతరుల పట్ల ఉవ్న్న చెడు అభిప్రాయాలలో మార్పులు ఏర్పడును. ధనాదాయం సంతృప్తికరం.ఈ మాసంలో 26 వ తేదీ తదుపరి నూతన ప్రయత్నాలకు అనువైన కాలం. సత్పలితాలు పొందేదురు. మనోవిచారం తొలగును.

డిసెంబర్ 2023 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసం కూడా అనుకూలమైన ఫలితాలనే కలుగచేయును. ధన వ్యయం కొద్దిగా తగ్గును. వైవాహిక జీవనంలో సమస్యలు తగ్గును. మనో నిగ్రహం అవసరం. మనసు బాధపడు సంఘటనలు. పట్టుదలకు పోవుట వలన సమస్యలు. ఉద్యోగ మార్పిడికి అననుకూల కాలం. మాసాంతానికి ఆర్ధిక పరిస్థితులలో అనుకూలత. ఈ మాసంలో 3,8,17,24,26 తేదీలు అనుకూలమైన ఫలితాలు ఇచ్చును.

జనవరి 2024 మిధునరాశి రాశిఫలాలు:

ఈ మాసంలో తగాదాల వలన కోర్టుకేసులు లేదా పోలిసుల జోక్యం వలన చికాకులు. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. అవసరాలకు సరిపడు ధనాదాయం. మిత్రుల తోడ్పాటు లభించును. ప్రయానములక ఆరోగ్య భంగములు. జీవిత భాగస్వామి కొరకు ధనం వ్యయం చేయుదురు. అతిగా ఆలోచించడం వలన నష్టపోవు సంఘటనలు. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం. సంతాన ప్రయత్నాలు ఫలప్రదం.

ఫెబ్రవరి 2024 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వైవాహిక జీవనంలో అననుకూల ఫలితాలు. ద్వితీయ తృతీయ వారాలలో కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు. భవిష్యత్ ప్రణాళికలు రచించుటకు లేదా పెద్ద నిర్ణయాలు తీసుకొనుటకు 21 వ తేదీ తదుపరి కొంత అనుకూలమైన కాలం. ఈ మాసంలో 9,10,11 తేదీలలో ప్రమాదం లేదా వాహనముల వలన సమస్యలు.

మార్చ్ 2023 మిధునరాశి రాశిఫలాలు:

ఈ మాసం ఆశించిన శుభ ఫలితాలు కలుగచేయును. వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలలో విజయం. పై అధికారుల వలన మన్ననలు. నూతన కార్యములను ప్రారంభించవచ్చు. అవకాశములు సద్వినియోగం చేసుకుందురు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండును. శ్రమకు తగిన గుర్తింపు. జీవన విధానాలలో పురోగతి. ఖర్చులు తగ్గును. కాలం కలసివచ్చును.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.