Placeholder image

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర వృచ్చికరాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Vrucchika Rasi / Scorpio Sign Free Telugu Rasi Phalalu
2019-2020 sri vikari nama samvatsara vrucchika rasi phalitalu

విశాఖ 4 వ పాదము లేదా అనురాధ 1,2,3,4 పాదములు లేదా జ్యేష్ఠ 1,2,3,4 పాదములులో జన్మించినవారు వృచ్చిక రాశికి చెందును.

📊 2019 - 2020 ఆదాయ వ్యయాలు & రాజపూజ్యావమానాలు (Kandaya Phalalu):

ఆదాయం (Income): 14
వ్యయం (Expenditure): 14
రాజపూజ్యం (Honor): 03
అవమానం (Dishonor): 01

శ్రీ వికారి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం - 14 వ్యయం - 14 రాజపూజ్యం - 03 అవమానం - 01. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "3". ఇది వాహన సంబంధ ప్రమాదాన్ని లేదా వాహన సంబంధ నష్టమును సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to know your rasi phalitalu in English...
  • Click Here to get your manually written personalised Horoscope Report...

2019 - 2020 Horoscope & Planetary Transits Analysis:

వృచ్చికరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం (ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) మిశ్రమ ఫలితాలు ఏర్పరచును. వృచ్చికరాశి వారికి ఈ సంవత్సరం 23-జనవరి-2020 నుండి ఏలినాటి శని దశ పుర్తిఅగును. గత ఆరు సంవత్సరాల నుండి ఉన్న శని దోష ప్రభావం తొలగిపోవును. ఈ సంవత్సరం కుటుంబ, ఆర్ధిక లావాదేవీలు, వ్యాపార వ్యవహరాదులు లాభదాయకంగా కొనసాగును. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఆటంకములు ఎదుర్కొనును. అవసరములకు బంధు సహకారములు లభించును. తగాదాలందు విజయం చెకూరును. ఈ సంవత్సరం వృచ్చికరాశి వారికి అనారొగ్యమూలక ధనవ్యయం తరచుగా ఏర్పడుటకు సూచనలు కలవు. కావునా ఆరోగ్య విషయాలందు జాగ్రత్తగా ఉండవలెను. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగును. ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు ద్వితియార్ధంలో సఫలమగును. విదేశీ వ్యవహారములందు ఆశించిన ఫలితాలు ఏర్పడును.

🪐 గురు గ్రహ ఫలితాలు (Jupiter Influence):

వృచ్చిక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం సంవత్సరం అంతా చాలా చక్కని ఫలితాలు కలుగచేయును. మిక్కిలి ధన భాగ్యములను ఏర్పరచును. విద్యార్ధులకు అతి చక్కటి విద్యాభ్యాసం కలుగచేయును. సమాజంలో, వంశంలో పేరు ప్రఖ్యాతలను ఏర్పరచును. శన్మానములను కలుగచేయును.

🪐 శని గ్రహ ఫలితాలు (Saturn Influence):

వృచ్చిక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం 22-జనవరి-2020 వరకూ మంచి ఫలితాలను ఇవ్వడు. సంతాన ప్రయత్నాలలో ఇబ్బందులు, అధిక ధన వ్యయం, నేత్ర హాని లేదా నేత్ర సంబంధ అనారోగ్యం వంటి సమస్యలను ఏర్పరచును. 23-జనవరి -2020 తదుపరి ఏలినాటి శని దశ పుర్తిఅగును. లాభావ్యయములు సమానంగా ఉండును.

🪐 రాహు - కేతు గ్రహ ఫలితాలు (Rahu & Ketu Influence):

వృచ్చిక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతు గ్రహముల వలన మంచి ఫలితాలు ఏర్పడవు. రాహువు ఆరోగ్య కష్టములను, కేతువు అధిక ధనవ్యయం ఏర్పరచును. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కోను వారు రాహు గ్రహ శాంతి జరిపించుకోనువలెను.

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

Youtube Channel - Whatsapp Channel - Instagram - Facebook - Telegram - Contact Us

Connect on WhatsApp

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.