Placeholder image

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర తులారాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Tula Rasi / Libra Sign Free Telugu Rasi Phalalu
2019 - 2020 Sri Vikari Nama Tula rasi free telugu rasi phalitalu

చిత్త 3,4 పాదములు లేదా స్వాతి 1,2,3,4 పాదములు లేదా విశాఖ 1,2,3 పాదములులో జన్మించినవారు తులారాశికి చెందును.

📊 2019 - 2020 ఆదాయ వ్యయాలు & రాజపూజ్యావమానాలు (Kandaya Phalalu):

ఆదాయం (Income): 08
వ్యయం (Expenditure): 08
రాజపూజ్యం (Honor): 07
అవమానం (Dishonor): 01

శ్రీ వికారి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం - 08 వ్యయం - 08 రాజపూజ్యం - 07 అవమానం - 01. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "7". ఇది ఆర్ధిక విషయాలలో విజయాన్ని సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to know your rasi phalitalu in English...
  • Click Here to get your manually written personalised Horoscope Report...

2019 - 2020 Horoscope & Planetary Transits Analysis:

తులారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం (ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) సామాన్య ఫలితములను ఏర్పరచును. జీవన మార్గమునకు పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు. సంవత్సర ప్రారంభం నుండి సంవత్సర అంతానికి క్రమంగా పరిస్థితులు అనుకూలంగా మారును. నూతన వ్యాపార వ్యవహరాదులు ఆశించిన విధంగా కార్యరూపం దాల్చును. లాభించును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించును. సోదర వర్గం వార్కి అంత మంచి సంవత్సరం కాదు. స్నేహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు ఏర్పడును. దూర ప్రాంత స్థిర నివాసం కొరకు ప్రయత్నించు వారికి వ్యతిరేక ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నాలు చేయువారికి స్త్రీ సంతానం ఏర్పడు సూచనలు అధికం. స్థిరాస్థి వ్యవహారాలలో సమస్యలు కొనసాగును. చేతివృత్తి పనివారికి లాభములు ఏర్పడును. వ్యవసాయదారులకు చక్కటి పంట అభివృద్ధి. విద్యార్ధులకు ఆశించిన ఉన్నతి లభించును. వడ్ది వ్యాపారం చేయువారికి ఈ వికారి నామ సంవత్సరం బాగా కలసి వచ్చును.

🪐 గురు గ్రహ ఫలితాలు (Jupiter Influence):

తులారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం అనుకూలమైన ఫలితాలను ఇవ్వదు. ఫైనాన్సు వ్యాపారాలకు మాత్రం అతి చక్కటి ఫలితాలను కలుగచేసి వ్యాపార వృద్ధిని ఏర్పరచును. ఆరోగ్య పరంగా మధ్య మధ్య కాలంలో కీళ్ళ సంబంధమైన, రక్త సంభందమైన సమస్యలను ఏర్పరచును. భాత్రు వర్గం వారితో సంబంధాలు తెగిపోవును. మొత్తం మీద ఈ సంవత్సరం గురు గ్రహం తులారాశి వారికి కలసి రాదు.

🪐 శని గ్రహ ఫలితాలు (Saturn Influence):

తులారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. భూ సంబంధమైన ఆర్ధిక లాభములను కలుగచేయును. స్థాన చలన ప్రయత్నాలు చేయువారికి కొద్దిపాటి విఘ్నాలను కలుగ చేయును. విద్యార్ధులకు ఆశించిన విద్యను ఏర్పరచును.

🪐 రాహు - కేతు గ్రహ ఫలితాలు (Rahu & Ketu Influence):

తులారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇరువురూ యోగించును. పితృ వర్గం వారికి ఆనారోగ్య సమస్యలను ఏర్పరచుట మినహా మిగిలిన వ్యవహారములందు అనుకూలమైన ఫలితాలను ఇచ్చువారగును.

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

Youtube Channel - Whatsapp Channel - Instagram - Facebook - Telegram - Contact Us

Connect on WhatsApp

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.