Placeholder image

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర మేషరాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Mesha Rasi / Aries Sign Free Telugu Rasi Phalalu
2019 - 2020 sri vikari nama samvatsara mesha rasi rasi phalitalu

అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందును.

📊 2019 - 2020 ఆదాయ వ్యయాలు & రాజపూజ్యావమానాలు (Kandaya Phalalu):

ఆదాయం (Income): 14
వ్యయం (Expenditure): 14
రాజపూజ్యం (Honor): 03
అవమానం (Dishonor): 06

2019- 2020 శ్రీ వికారి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం - 14 వ్యయం - 14 రాజపూజ్యం - 03 అవమానం - 06. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "3". ఇది కుటుంబ విషయాలలో కొద్దిపాటి చికాకులను సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your Mesha rasi rasi phalitalu in English...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know nature of Mesha Rasi / Aries Sign...

2019 - 2020 Horoscope & Planetary Transits Analysis:

మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం (ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) మంచి ఫలితాలను కలుగచేయును. సంవత్సరం ప్రారంభం నుండి చక్కటి ఆశించిన ధనాదాయం ఏర్పడును. ఫైనాన్సు వ్యాపార రంగం వారికి ఈ సంవత్సరం బాగా కలసివచ్చును. నూతన వ్యాపార - వ్యవహరాదులు ఆశించిన విధంగా విజయవంతం అగును. సోదర వర్గం వారితో గొడవలు. మానసిక ఆందోళనలు. స్థిరాస్థి వ్యవహారాలలో తగవులు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం తప్పక ఫలించును. సంతాన ప్రయత్నములు చేయువారికి దైవ ఆశీస్సులు అవసరం. ఐ.వి.ఫ్ పద్దతి ద్వార గర్భధారణ ప్రయత్నాలు చేయువారికి ఆటంకములు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. మానసిక సంతోషం కలిగే వాతావరణంలో ఉన్నప్పటికీ శారీరక శ్రమ అధికం అగును. ఉద్యోగ మార్పిడి యత్నాలకు మంచి కాలం. విదేశీ వ్యవహారములు కొంత కష్టంతో పూర్తీ అగును. పై అధికారుల వలన నమ్మక ద్రోహం. నూతన వ్యక్తుల పరిచయాలలో జాగ్రత్త అవసరం. గృహమునందు శుభ కార్యములు వాయిదా వేయుట మంచిది. పితృ వర్గీయులకు మంచిది కాదు. తీవ్ర ఆరోగ్య భంగములకు సూచనలు కలవు. వ్రుత్తి జీవనములోని వారికి, వ్యవసాయ రంగంలోని వారికి చక్కటి ఫలితాలు కలవు. విద్యార్ధులకు చక్కటి ప్రోత్సాహవంతమైన సంవత్సరం. కళారంగం వారికి గౌరవం తగ్గును. ఆర్ధికంగా నష్టములు ఏర్పడును. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుండి తీవ్ర ఇబ్బందులు. రావలసిన బకాయిలు ఆశించిన సమయానికి చేతికి రావు.

🪐 గురు గ్రహ ఫలితాలు (Jupiter Influence):

మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన ది.03-నవంబర్-2019 వరకూ మిశ్రమ ఫలితాలు ఏర్పడును. చేపట్టిన పనులలో మొదట మంచి ఆరంభం ఏర్పడి చివరకు యోగించక కష్టములను ఏర్పరచును. అష్టమ గురు ప్రభావం వలన రక్త సంబంధ అనారోగ్యములతో బాధపడు వారికి సమస్యలు అధికం అగును. ది. 04-నవంబర్ - 2019 నుండి గురువు అతి చక్కటి అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. వారసత్వ సంబంధ భాగ్యం కలసివచ్చును. సంతాన ప్రయత్నములు చేయువారికి శుభ వార్తలను కలుగచేయును.

🪐 శని గ్రహ ఫలితాలు (Saturn Influence):

మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పడును. సంవత్సరం అంతా చక్కటి ధనలాభాలు కలుగచేయును. నల్లని భూములు మంచి దిగుబడిని ఇచ్చును. నల్లని వస్త్రములు, ధాన్యములు, లోహముల వ్యాపారములు చేయువారికి బాగా కలసివచ్చును. న్యాయవాద వృత్తిలోని వారికి బాగా రాణింపు ఏర్పడును.

🪐 రాహు - కేతు గ్రహ ఫలితాలు (Rahu & Ketu Influence):

మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇద్దరూ సంవత్సరం అంతా మంచి చేయరు. చక్కగా జరుగుతూ ఉన్న పనులలో భంగములు, ధన వ్యయములు, పిత్రువర్గీయులతో సమస్యలు, పితృ సౌఖ్య లేమి సంతాన ప్రయత్నాలలో విఘ్నాలు వంటి చికాకులను ఏర్పరచును.

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

Youtube Channel - Whatsapp Channel - Instagram - Facebook - Telegram - Contact Us

Connect on WhatsApp

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.