పూర్వాభాద్ర 4వ పాదము లేదా ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు లేదా రేవతి 1,2,3,4 పాదములలో జన్మించిన వారు మీన రాశికి చెందును.
శ్రీ వికారి నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం - 02 వ్యయం - 08 రాజపూజ్యం - 01 అవమానం - 07. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "1". ఇది ఆర్ధిక విషయాలలో లాభాన్ని సూచించుచున్నది.
మీనరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం (ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) అన్ని విధములా కలసి వచ్చును. ఆర్ధికంగా, వ్యక్తిగత జీవన పరంగా, వృత్తి పరంగా అన్ని విధాల అనుకూలంగా ఉండును. తలచిన పనులన్నీ విజయవంతమగు గ్రహ ఫలితములు కలవు. ముఖ్యంగా గురు గ్రహం వలన మిక్కిలి యోగవంతమైన కాలాన్ని ఏర్పరచును. భూ సంబంధ లాభాలను, వారసత్వ లేదా జీవిత భాగస్వామి సంబంధిత భాగ్యమును, స్వార్జిత ధన సంపదలను ఏర్పరచును. అందరూ మెచ్చే విధంగా సంస్కారాన్ని ప్రసాదించును. చెడు వ్యసనాలనుండి బయటపడు పరిస్థితులను ఏర్పరచును. నిరుద్యోగులకు అతి చక్కటి ఉద్యోగ జీవనాన్ని ప్రసాదించును. ప్రమోషన్లు, సత్కారములను ఏర్పరచును.
మీనరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని కూడా సంవత్సరం అంతా విశేష ధనలాభములను, నూతన ఆదాయ మార్గములను ప్రసాదించును. ఆర్ధికంగా లోభత్వం ప్రదర్శించుట వలన కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పరచును. ముఖ్యంగా 24-జనవరి-2020 నుండి ఆర్ధికాభివృద్ధి చాలా వేగంగా ఉండును.
మీనరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువుల వలన మాతృ వర్గీయుల వలన లాభములను, మాత్రువర్గీయుల సహకారమును, బంధువర్గ సౌఖ్యమును, వాహన సౌఖ్యమును, విధ్యార్ధులకు అతి చక్కటి విద్యా ఫలితములను కలుగచేయును. పారమార్ధిక చింతను అలవరచును.
రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.
Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
Youtube Channel - Whatsapp Channel - Instagram - Facebook - Telegram - Contact Us
Connect on WhatsAppWe offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. మీ సంపూర్ణ జాతక నివేదిక కోసం మమ్మల్ని సంప్రదించండి.