Placeholder image

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర కన్యారాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Kanya Rasi / Virgo Sign Free Telugu Rasi Phalalu
2019- 2020 sri vikari nama samvatsara kanya rasi free telugu rasi phalitalu

ఉత్తర 2,3,4 పాదములు లేదా హస్త 1,2,3,4 పాదములు లేదా చిత్త 1,2 పాదములలో జన్మించిన వారు కన్యారాశికి చెందును.

📊 2019 - 2020 ఆదాయ వ్యయాలు & రాజపూజ్యావమానాలు (Kandaya Phalalu):

ఆదాయం (Income): 11
వ్యయం (Expenditure): 05
రాజపూజ్యం (Honor): 04
అవమానం (Dishonor): 05

శ్రీ వికారి నామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 04 అవమానం - 05. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "7". ఇది ఆర్ధిక విషయాలలో విజయాన్ని సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to know your rasi phalitalu in English...
  • Click Here to get your manually written personalised Horoscope Report...

2019 - 2020 Horoscope & Planetary Transits Analysis:

కన్యారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం (ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) చక్కటి ఆర్ధిక పురోగతిని కలుగచేయును. వ్యాపార వ్యవహరాదులలో గతంలో ఏర్పడిన అవరోధాలు అన్ని తొలగిపోవును. నూతన ఆలోచనలకు పెట్టుబడులు లభించును. ధన విషయాలలో సొంత నిర్ణయాలు కలసి వచ్చును. భాగస్వామ్యాలు కలసి వచ్చును. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు లాభించును. ప్రమోషనులు ఆశిస్తున్నవారు ఆటంకములు, పైరవీల అనంతరం అనుకున్నది సాధిస్తారు. పుత్ర సంతాన ప్రయత్నాలకు దైవ ఆశీస్సులు అవసరం. సంవత్సర మధ్యకాలంలో ఉదర సంబంధమైన సమస్య వలన బాధపడు సూచన. ఈ సంవత్సరంలో పుణ్యక్షేత్ర సందర్శనలు ఏర్పడును. మాట గౌరవం పెరుగును. కుటుంబ సభ్యుల సహకారం వలన మనశ్శాంతి పొందుతారు. విదేశీ ఉద్యోగ లేదా నివాస ప్రయత్నాలు చేయువారికి 2019 నవంబర్ తదుపరి అనుకూలత ఏర్పడును. కోర్టు వ్యవహరాదులకు సంవత్సరాంతం వరకూ వేచివుండుట అవసరం. వైవాహిక జీవనములో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సౌఖ్యం తగ్గును. విద్యార్ధులకు సామాన్య ఫలితాలు. కష్టించ వలసిన అవసరం ఉన్నది. వ్యవసాయదారులకు పెట్టుబడికి మించి ఆదాయం లభించును. కళాకారులకు నూతన అవార్డులు, చక్కటి గుర్తింపు లభించును.

🪐 గురు గ్రహ ఫలితాలు (Jupiter Influence):

కన్యారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 03-నవంబర్-2019 వరకూ చెడు ఫలితాలు ఏర్పడును. ముఖ్యంగా ఈ రాశికి చెందిన 12 సంవత్సరములలోపు పిల్లలకు బాలారిష్టములు కలుగచేయు సూచన. వారి ఆరోగ్య విషయములందు తల్లితండ్రులు జాగ్రత్త వహించవలెను. 04-నవంబర్-2019 నుండి చక్కటి ఫలితాలు ఏర్పరచును. ముఖ్యంగా మాత్రు వర్గం వారి వలన సౌఖ్యం, వారి వలన లాభం, విద్యార్ధ్యులకు ఆశించిన విద్య, నూతన వాహన సౌఖ్యం, భూ సంబంధ లాభం ఏర్పరచును.

🪐 శని గ్రహ ఫలితాలు (Saturn Influence):

కన్యారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన పిత్రార్జితం కొంత వ్యయం అగును. పుత్ర సంతాన వితవిభవములను ఏర్పరచును. స్త్రీ సంతానం వలన సౌఖ్యతను కలుగచేయును. 24-జనవరి-2020 నుండి ఆర్ధికంగా బాగా యోగించును.

🪐 రాహు - కేతు గ్రహ ఫలితాలు (Rahu & Ketu Influence):

కన్యారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువుల వలన ప్రయాణాలు అధికంగా ఏర్పడుచుండును. తీర్ధయాత్రా ఫలితమును ఏర్పరచును. స్వల్ప భూ వ్యయం ఏర్పరచు సూచన.

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

Youtube Channel - Whatsapp Channel - Instagram - Facebook - Telegram - Contact Us

Connect on WhatsApp

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.