Placeholder image

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర ధనుర్రాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Dhanur Rasi / Sagittarius Sign Free Telugu Rasi Phalalu
2019-2020 sree vikari nama samvatsara dhanur rasi free telugu rashi phalitalu

మూల 1,2,3,4 పాదములు లేదా పూర్వాషాడ 1,2,3,4 పాదములు లేదా ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనుర్ రాశికి చెందును.

📊 2019 - 2020 ఆదాయ వ్యయాలు & రాజపూజ్యావమానాలు (Kandaya Phalalu):

ఆదాయం (Income): 02
వ్యయం (Expenditure): 08
రాజపూజ్యం (Honor): 06
అవమానం (Dishonor): 01

శ్రీ వికారి నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం - 02 వ్యయం - 08 రాజపూజ్యం - 06 అవమానం - 01. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "1". ఇది ఉద్యోగ సంబంధమైన లాభాన్ని సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to know your rasi phalitalu in English...
  • Click Here to get your manually written personalised Horoscope Report...

2019 - 2020 Horoscope & Planetary Transits Analysis:

ధనుర్ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం (ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. శ్రీ వికారి నామ సంవత్సరం ధనుర్ రాశి వారికి ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలను ఏర్పరచును. వైవాహిక జీవనంలో తీవ్ర సమస్యలను, వివాహ సంబంధాలు కుదురుటలో ఇబ్బందులను ఏర్పరచును. అయితే ఒకసారి వివాహ నష్టం జరిగి ద్వితీయ వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారికి మాత్రం చక్కటి ఫలితాలను ఏర్పరచును.

🪐 గురు గ్రహ ఫలితాలు (Jupiter Influence):

ధనుర్ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 03-నవంబెర్ - 2019 వరకూ వ్యవహరపు చిక్కులు అధికంగా ఏర్పడుచుండును. ముఖ్యమైన పనులు ఆటంకాలు ఎదురగుట వలన ముందుకు సాగక తీవ్ర ఇబ్బందులను కలుగచేయును. 04-నవంబెర్-2019 నుండి గురువు ఆర్ధికంగా అఖండమైన యోగాన్ని ఏర్పరచును. వ్యక్తిగత జీవనంలో మాత్రం నైతిక విలువలు తప్పుట వలన పతనమగునట్లు చేయును. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేయువారికి సహాయపడును.

🪐 శని గ్రహ ఫలితాలు (Saturn Influence):

ధనుర్ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా శారీరక శ్రమ అధికం అగును. కోరుకొన్న విధంగా శరీర సౌఖ్యం ఉండదు. మధ్య మధ్యలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఏర్పరస్తూ ఇబ్బందులు కలుగ చేయును. ఆర్ధికంగా మాత్రం శని ఈ సంవత్సరం ధనుర్ రాశి వారికి పెద్దగా ఇబ్బందులను కలుగచేయడు. సంవత్సరాంతానికి కొద్దిపాటి సంపాదించిన ధనం నిలువచేసుకోను పరిస్థితులను ఏర్పరచును. వ్యక్తిగత జీవనంలో జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు కలుగచేయును.

🪐 రాహు - కేతు గ్రహ ఫలితాలు (Rahu & Ketu Influence):

ధనుర్ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇరువురూ కలసి రారు. వైవాహిక జీవనంలో తగాదాలను, కళత్ర నష్టములను, జారత్వం వలన (అక్రమ సంబంధాలు) తీవ్ర సమస్యలను కలుగచేయును. అనవసర పట్టుదలకు పోవుట వలన వ్యక్తిగత నష్టములను, శరీర సౌఖ్య లేమిని కలుగచేయును.

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

Youtube Channel - Whatsapp Channel - Instagram - Facebook - Telegram - Contact Us

Connect on WhatsApp

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.