శ్రీ హేమలంబ నామ సంవత్సరం వృషభ రాశి వారికి అంత అనుకూలంగా వుండదు. కార్యమార్గంలో కష్టనష్టాలు, ఆరోగ్య భంగములు, చేపట్టిన ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో చికాకులు, అవాంచిత స్థానచలనము, సంసార జీవనంలో కలతలు, కోర్టు తగాదాలు, మానసిక అశాంతి బాధించును. విదేశీ ప్రయత్నాలు లాభించును. ప్రభుత్వ రంగంలో వ్యాపారములు చేయువారికి లాభించును. గతంలో వాయిదా పడిన దూరప్రాంత ప్రయాణములు పూర్తి అగును. ఈ సంవత్సరం ఇతరులకు హామీలు ఇచ్చుట, భాగస్వామ్య వ్యాపారములు చేయుట మంచిది కాదు. వ్యసనముల వలన దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొందురు.
శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వృషభ రాశివార్కి గురువు సంవత్సర ప్రారంభం నుండి 12-సెప్టెంబర్-2017 వరకూ అనుకూలమైన ఫలితాలను కలిగించును. సంతాన సంబంధ శుభమును, సంతానం వలన సౌఖ్యతను, అభివృద్దిని కలుగచేయును. ఎదిగిన సంతానం చక్కటి స్థితిలో స్థిరపడును. 13-సెప్టెంబర్-2017 తదుపరి గురువు శుభ ఫలితాలను ఇవ్వడు. ఆర్థికంగా తీవ్ర వ్యయమును, ఋణములను, స్వ ఆరోగ్య సమస్యలను, కుటుంబ కలహములను కలుగచేయును.
సంవత్సర ప్రారంభం నుండి 20-జూన్-2017 వరకూ వృషభ రాశి వారికి శని వలన వృధా వ్యయము ఎదుర్కొందురు. తమ కష్టార్జితాన్ని బంధువులకు, స్నేహితులకూ వినియోగించెదరు. ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. 21-జూన్-2017 నుండి 26-అక్టోబర్-2017 వరకూ శని వృషభ రాశి వారికి వైవాహిక జీవనంలో అపసవ్యతలు ఏర్పరచును. జీవిత భాగస్వామితో తగాదాలు, భాగస్వామి తరపు బంధువుల వలన సమస్యలు ఎదుర్కొందురు. ధనాదాయం బాగుండును.
సంవత్సర ప్రారంభం నుండి 17-ఆగష్టు-2017 వరకూ వృషభ రాశివారు రాహువు వలన భూసంబంధ లేదా గృహ సంబంధ వ్యయమును మాతృ వర్గీయులకు నష్టమును, అధిక శ్రమను కలుగచేయును. శరీర సౌఖ్యం తక్కువగా ఉండును. 18-ఆగష్టు-2017 నుండి రాహువు వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇచ్చును. భాతృ వర్గం వలన సహకారమును, వారి వలన అభివృద్ది ఏర్పడును. సంవత్సరం అంతా కేతువు వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలనే కలిగించును. సంవత్సరం చివరి 6 నెలలలో పితృ వర్గీయులకు ఆరోగ్య సమస్యలను, తన్మూలక ఆర్థిక వ్యయమును ఏర్పరచును.
Pages you may like to visit:
రోజూవారీ మా పంచాంగం, జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి:
Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
YouTube Channel | WhatsApp Channel | Instagram | Facebook | Telegram | Contact Us
Connect on WhatsAppWe offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.