శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో సంవత్సర అధిపతి రాహువు వలన భయోత్పాతములు, ప్రకృతి ప్రకోపములు, భుకంపములు, వరదలు బాధించును. ప్రభుత్వములు ప్రజలను సక్రమముగా పరిపాలించు పరిస్థితులు ఏర్పడును. కొన్నిచోట్ల రాజకీయ కల్లోలములు ఏర్పడును. చోరులు, దుర్మార్గులు ప్రభలును. ఉరుములు, మెరుపులతో కూడిన మేఘాడంభరము ఉండును. సస్యములకు అనుకూలమైన వర్షములు వుండవు.
చైత్ర, వైశాఖ మాసములందు రోగపీడలు, జ్యేష్టాది మాసత్రయమునందు ధాన్యాదుల ధరలు పెరుగును. భాద్రపద మాసమున అకాల వర్షములు, ధాన్యాదుల ధరలు పెరుగును. కార్తీకమున ప్రకృతి వినాశనం, తీవ్రమైన పశునష్టం. మార్గశీర్ష మాస చతుష్టమందు ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు, ప్రజలు వలస పోవుదురు.
శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కుజుడు రాజు అగుట వలన దేశమున అగ్ని సంబంధ విపత్తులు, యుద్ధ వాతావరణం, పొరుగు దేశములతో కలహములు , అల్ప వర్షములు, పంటల దిగుబడి తగ్గుట, జన ధన హాని ఉండును. సైన్యమునకు నష్టం. కుజుని ఆధిపత్యం కలిగిన వస్తువుల ధరలు విపరీతముగా పెరుగును. కాయగూరలు, ధాన్యజాతులు, ఆహార పదార్దముల ధరలు ఎక్కువ వుంది సామాన్య ప్రజలకు అందుబాటులో వుండవు. రాజకీయ నాయకుల మధ్య మైత్రి సన్నగిల్లును.
శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో శుక్రుడు మంత్రి అగుటవలన కష్టం మీద వర్షములు ఉండును. ప్రజలు కార్యనీతిని విడిచిపెట్టి కామాచర పరయనులై వుందురు. పూర్వ సస్యాధిపతి రవి అగుటవలన ఈతిబాధలచే పూర్వ సస్య ధాన్యముల దిగుబడి తగ్గును. శని అపర సస్యాధిపతి అగుటవలన మినుములు, నువ్వులు, అవిశేలు, నల్ల ధాన్యములు బాగుగా ఫలించును. గురువు ఆర్ఘాధిపతి అగుట వలన యజ్ఞాదికర్మలండు శ్రద్ధ, బ్రాహ్మణులకు పేరు ప్రఖ్యాతలు, కొద్దిపాటి సువ్రిష్టి. ఈ సంవత్సరం కుజుడు రసాధిపతి అగుట వలన వర్షములు పడినప్పటికీ పంటకు తగినట్టు వుండవు. కుజుడు రసాధిపతి అగుట వలన సుగంధ ద్రవ్యములు, తీపి పదార్దములు, లోహములు, మత్తు పదార్దములు ధరలు పెరుగును. నీరసాధిపతి రవి వలన ధతులోహములు ధరలు పెరుగును.
Pages you may like to visit: