2017-2018 Midhuna Rasi Telugu Phalitalu For Sri Hemalamba Nama Telugu Year
2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర మిధున రాశి ఫలితాలు

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి వ్యాపారములందు, వ్రుత్తిజీవనంలోని వారికి మంచి అనుకూలమైన ఫలితాలను , లాభములను కలిగించును. ధనప్రాప్తి, గౌరవం, చక్కటి ఆరోగ్యం. కోరికలు ఫలించుట , బహు విధములైన వైభవములు కలుగును. కొద్దిపాటి శత్రుభయం ఆందోళన కలిగించును.సంతాన ప్రయత్నములు లాభించును.సంతానం మంచి స్థితిని పొందును. రాజకీయ వర్గం వారికి పదవీ లాభం. వివాహ ప్రయత్నములు చేయువారికి చక్కటి జీవిత భాగస్వామి లభించును.తలచిన ప్రతీ కార్యం విజయం పొందుటకు అవకాశం కలదు. బంధు వర్గం నుండి కొంత నిర్లిప్తత. గృహంలో మార్పులు లేదా గృహనిర్మాణం చేపట్టుటకు అవకాశం కలదు. వాయిదా పడిన పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేయగలరు.
శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి గురువు సంవత్సరం అంతా యోగించును. 12- సెప్టెంబర్-2017 వరకూ గృహ నిర్మాణ సంబంధమైన విషయాలలో అనుకూల ఫలితాలను, వాహన లాభమును, భూసంబంధమైన విషయాలలో అనుకూలతను కలిగించును. 13 - సెప్టెంబర్ - 2017 నుండి విశేష భాగ్యమును , ధనమును, పుత్రసంతానమును , స్థిరాస్తి సంపదను ఏర్పరచును.
శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి శని అనుకూల ఫలితాలను ఇవ్వడు. కళత్ర సంబంధ చికాకులను , వివాహ సుఖ లేమి, మధ్య మధ్య యోగమును చివరకి యోగ భంగమును కలిగించును. ఈ సంవత్సరం మిధున రాశి వారికి శని గ్రహ శాంతి అవసరం.
శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి 17 - ఆగష్టు- 2017 వరకూ రాహువు అనుకూల ఫలితాలను కలిగించును. ఉద్యోగ జీవనంలో అభివృద్దిని , విశేష ధనలాభాములను , వంశ వృద్ధిని కలిగించును. 17- ఆగష్టు - 2017 తదుపరి రాహువు అనుకూల ఫలితాలను ఇవ్వడు. అధిక ధన వ్యయమును కలుగచేయును. ఆరోగ్య సమస్యలను కూడా ఏర్పరచును. మిధున రాశి వారికి ఈ సంవత్సరం రాహు శాంతి కూడా అవసరం. కేతువు వలన మిధున రాశి వారు ఈ సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలనే పొందును.
Pages you may like to visit: