స్వస్తి శ్రీ చంద్ర మాన శ్రీ హేమలంబ నామ సంవత్సర పుష్యమాస బహుళ త్రయోదశి ఆదివారం అనగా ది.14 - జనవరి - 2018 న మధ్యాన్నం గం.01.38 నిముషములకు రవి మకర సంక్రమణ పుణ్యకాలం. మరియు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ఘోరనామకుడు.
సంక్రాంతి పురుషుని ఫలం:
శూద్రులకు అరిష్టము, ధాన్య నష్టం, రోగ ప్రధము, నాయకుల మధ్య విరోధములు, ఉత్తర భారత దేశంలో అరిష్టము, ధాన్యముల ధరలు పెరుగుట.
రవి మకర సంక్రమణ తదుపరి జనులందరు తమ తమ శక్తికొలదీ బ్రాహ్మణ స్వయంపాక దానులు, వంశ పెద్దలకు ఖర్మలు , వస్త్ర దానములు, ఇష్ట దైవ సందర్శనాది కార్యములు చేయవలెను.