
.
శ్రీ హేమలంబ నామ సంవత్సర కన్యారాసి వారికి అంత అనుకూలంగా లేదు. ఆకస్మిక ధన నష్టములు , ప్రయాణ క్లేశములు , అదృష్ట రాహిత్యత ,అగ్ని లేదా చోరుల వలన నష్టముల్, ప్రభుత్వ కోపము, అధికారుల దండన వంటి అనేక అననుకూల వాతావరణం కల్గు సూచన. మనోధైర్యం అవసరం. నిరుత్సాయ పడవలదు.
.శ్రీ హేమలంబ నామ సంవత్సరం కన్యా రాశి వారికి గురువు కావేరీ నది పుష్కరాలు ప్రారంభమగు వరకూ సంపుర్ణమైన శుభ ఫలితాలను ఇచ్చును. ఆయుర్భాగ్యములు కలిగించును. పుష్కరాల ప్రారంభం నుండి మిశ్రమ ఫలితాలను కలిగించును. సంవత్సరం చివరి 3 నెలలు అనగా పుష్యమాసం నుండి చేడుఫలితాలు, ఆరోగ్య భంగములను కలిగించును.
శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో శని కూడా కన్యారాసి వారికి మంచిఫలితాలను కలిగించడు. పుత్ర సంతానం వలన నష్టం, కళత్ర నష్టం, పిత్రర్జిత వ్యయం, సామాన్య ఉద్యోగ జీవనం ఏర్పరుచును. ఈ సంవత్సరం శనికి శాంతి జపములు అవసరం. శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో రాహువు ఎల్లపుడూ అపరిమితమైన ఖర్చును కలిగించును. స్వార్జితం కూడా వ్యయమగును. తీర్ధయాత్రా లేదా దూర ప్రయనములు ఏర్పరచును. కన్యా రాసివారికి కేతువు ఋణము వలన భూమి లేదా గృహమును ఏర్పరచును. సంతాన సంబంధ నష్టం వలన దుఃఖం ఏర్పరచు సూచన. సంతాన ప్రయత్రనములు చేయువారు కేతు శాంతి జరిపించిన మంచిది.
Pages you may like to visit: