2017-2018 Mesha Rasi Telugu Phalalu for Sri Hemalamba Nama Samvatsaram
2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర మేషరాశి ఫలితాలు

అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు , భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు , కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేష రాశికి చెందును.
శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఆదాయం - 08 వ్యయం - 14 రాజపూజ్యం - 04 అవమానం - 03
శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మేష రాశి వారికి సంవత్సర ప్రారంభంలో ఆశాజనకంగా కన్పించును. నెమ్మదిగా చికాకులు, సమస్యలు ఎదురగును. ధన భారం ఉండును. అవసరములకు బందుమిత్రుల సహకారం లభించును. వ్యాపార రంగంలోని వారికి చికాకులు ఉండును. వ్యవసాయ రంగంలోని వారికి నష్టములు ఎదురగను. వివాదములు కలుగు సూచన. ఈ సంవత్సరం ఉద్యోగ రంగంలోని వారికి ఆశించిన స్థానచలనం ఏర్పడును. గృహ వాతావరణంలో అసౌక్యం. యంత్ర పరిశ్రమ యజమానులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలిగించును. కోర్టు వివాదాములలో అతికష్టంతో విజయం లభించును. సంవత్సరాంతంలో స్త్రీ సంభందమైన వ్యయములు, పితృ వర్గం వారివలన ఆర్ధిక నష్టములు కలుగును. సొంత గృహం కొరకు ప్రయత్నాలు ఫలించును. విదేశీ ప్రయత్నాలు మిక్కిలి విఘ్నములను కలుగచేయును.
సంవత్సర ప్రారంభం నుండి 11-సెప్టెంబర్-2017 వరకూ మేష రాశి వారికి గురువు మంచి ఫలితాలు ఇవ్వడు. అనారోగ్య సమస్యలను, శారిరక పీడను, ఋణములను , శత్రుత్వములను, బాధలను కలిగించును. గురువుకి శాంతి జపములు జరుపుట మంచిది. 12-సెప్టెంబర్-2017 నుండి గురువు మేష రాశి వారికి శుభఫలితలను ఇచ్చును. ముఖ్యముగా అవివాహితులకు వివాహ సంబంధంగా శుభం. సంతాన ప్రయత్నములు చేయువారికి సంతాన ప్రాప్తి. ఆధ్యాత్మిక భావము , వేదాంత ప్రీతి.
సంవత్సర ప్రారంభం నుండి 20-జూన్-2017 వరకూ శని మేషరాసి వారికి విశేష ధనలాభాములను కలిగించును. పితృ సంభంద విషయాల్లో మాత్రం మంచి ఫలితాలను కలుగచేయడు. పితృ వర్గీయులతో విభేదాలను ఏర్పరచును. 21-జూన్-2017 నుండి 26-అక్టోబర్-2017 వరకూ శని ఆకస్మిక ధన నష్టములను, చోర సంభంధమైన లేదా అగ్ని సంభంధమైన నష్టమును , వ్యవహరపు చిక్కులను, శారీరక పీడను, వాహన ప్రమాదములను కలిగించును. ఈ కాలంలో శనికి శాంతి జపములు జరుపుట మంచిది.
సంవత్సర ప్రారంభం నుండి 17-ఆగష్టు-2017 వరకూ రాహువు ఆర్ధికంగా యోగించును. స్వల్పంగా సంతాన సంబంధ విషయాలలో విచారమును కలుగ చేయును. 18-ఆగష్టు-2017 నుండి సంవత్సరాంతం వరకూ రాహువు యోగించడు. ఆరోగ్య విషయాలలో మేషరాసి వారు జాగ్రత్త వహించాలి. సంవత్సర ప్రారంభం నుండి 17-ఆగష్టు-2017 వరకూ కేతువు యోగించును. చక్కటి ధనర్జనాను ఏర్పరచును. అవినీతి పరమైన ధనదాయమును ఏర్పరచును. 18-ఆగష్టు-2017 తదుపరి సంవత్సరాంతం వరకూ మంచి ఫలితాలను ఇవ్వడు. నేత్ర సంబంధ సమస్యలను, ప్రయాణములను కలిగించును. విద్యారంగంలోనివారికి మంచి చేయును.
Pages you may like to visit: