Placeholder image

2017-2018 Karkataka Rasi Telugu Phalalu for Sri Hemalamba Nama Samvatsaram

2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు

Placeholder image
  • పునర్వసు నక్షత్ర 4 వ పాదం , పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములు, ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయం - 14 వ్యయం - 02 రాజపూజ్యం - 06 అవమానం - 06

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కర్కాటక రాశికి చెందిన వ్యవసాయదారులకు , భూసంబంధమైన వ్యాపారములు చేయు వారికి చక్కటి విజయం ప్రాప్తిస్తుంది. వృత్తి జీవనం, ఇతర వ్యాపారములు చేయు వారికి లాభము, రాజ్య గౌరవం, ఆశించిన ధన లాభములు ఏర్పడును. ఉద్యోగ జీవనం చేయువారికి వ్యర్ధ సంచారం, దూరప్రాంత వాసము ఏర్పడు సూచన. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ ప్రాప్తి. వివాహాది ప్రయత్నములు చేయువారికి మధ్యమ ఫలితాలు. తీవ్ర ప్రయత్నములు చేయవలెను. పెద్ద వయస్సు వారికి నరముల బలహీనత , నరముల సంబంధమైన అనారోగ్య సమస్యలు. కుటుంభంలో బంధు బలగం పెరుగును. నూతన పరిచయాలు ఆర్ధిక లాభములను కలిగించును. సంతాన ప్రయత్నములు చేయువారికి దైవ అనుగ్రహం అవసరం.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురువు సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలు కలిగించును. విద్యార్ధుల ఆశలు నేరవేర్చును. గృహస్థులకు భూ లేదా గృహ సంబంధమైన వసతులను ఏర్పరచును. ఇష్ట వాహన సౌఖ్యమును ఏర్పరచును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో శని కర్కాటక రాశి వారికి 20- జూన్- 2017 వరకూ అననుకూల ఫలితాలను, 20- జూన్- 2017 తదుపరి మంచి ఫలితాలను కలిగించును. ఈ సంవత్సరంలో శని కర్కాటక రాశి వారికి నానాదేశ సంచారమును, సంతాన అభివృద్దిని, ఖర్చుకు సరిపడు ఆదాయమును, నల్లని వస్తువుల వలన లాభములను కలుగచేయును. 20-జూన్-2017 వరకూ తీవ్ర చెడు ఫలితాల వలన బాధలను పొందుతున్నవారు శని దేవునికి శాంతి జపములు జరిపించుకోనవలెను.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాహువు యోగించడు. అధర్మ మార్గముల ద్వారా ధనవ్యయమును, అధర్మ జీవనమును, కఠినమైన ప్రవర్తనను ఏర్పరచును. 17-ఆగష్టు-2017 వరకూ కేతువు యోగించడు . అధికమైన శారీరక శ్రమను, తగాదాలను, ఋణములను, కార్య అపజయములను, వ్యవహరపు చిక్కులను ఏర్పరచును. 18-ఆగష్టు-2017 నుండి జీవిత భాగస్వామి సంబంధ విషయములు అనుకూలంగా వుండవు. కోర్టు కేసులను ఏర్పరచు సూచన. ద్వితియ వివాహ ప్రయత్నములు చేయువారికి అనుకూలత వుండదు.

Pages you may like to visit:

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.