Placeholder image

2023-2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సర సింహరాశి రాశీ ఫలాలు

Sree Shobhakruth Nama Samvatsara Simha Rasi / Leo Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఆదాయం - 14, వ్యయం - 02, రాజ పూజ్యం - 01, అవమానం - 07.

  • పూర్వ పద్దతిలో సింహ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో సింహరాశి వారికి కీర్తిని, పలు రకాల విజయాలు పొందుటను సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Leo sign / Simha Rasi's Nature...

సింహరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అనగా 22-మార్చ్-2023 నుండ 08-ఏప్రిల్-2024 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 21-ఏప్రిల్-2023 వరకూ మిశ్రమ ఫలితాలు ఏర్పడును. కుటుంబ ఖర్చులు అధికం అగును. మానసిక అశాంతిని కలుగ చేయు పరిస్టితులు ఎదురగును. 22-ఏప్రిల్-2023 నుండి గురువు సింహరాశి వారకి అనుకూలమైన ఫలితాలు ప్రసాదించును. ముఖ్యంగా మఘా నక్షత్ర జాతకులు సంపూర్ణ ఆయుర్భాగ్యములు కలిగి ఉందురు.

సింహరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో శని గ్రహం వలన గత సంవత్సరం మాదిరిగానే మిశ్రమ ఫలితాలు ఏర్పడును. శత్రు సంబంధ తగాదాలు తరచుగా ఏర్పడుచుండును. జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా శరీర బరువుకు సంబందించిన సమస్యలు బాధించును. సింహరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

సింహరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో రాహువు మిశ్రమ ఫలితాలు ఏర్పరచును. 29-అక్టోబర్-2023 వరకూ అనుకూల ఫలితాలు ప్రసాదించును. చక్కటి ధనార్జన ప్రాప్తింపచేయును. సొంత భూమి లేదా గృహ వసతిని ఏర్పాటు చేసుకోగలుగుతారు. వ్యక్తిగత విషయాల కోసం కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికం అగును. 30-అక్టోబర్-2023 నుండి రాహువు వ్యతిరేక ఫలితాలు ప్రసాదించును. ఋణాలు తీర్చుట ఒకింత కష్టం అగును. సంతాన పరమైన చికాకులు బాధించును. మీపై శత్రువుల ఆధిపత్యం అధికం అగును.

సింహరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేతువు కూడా రాహువు వలనే మిశ్రమ ఫలితాలు ఏర్పడును. 29-అక్టోబర్-2023 వరకూ విశేష భాగ్య సంపదలను , అన్ని విధములా సంతోషకర జీవనాన్ని ప్రసాదించును. 30-అక్టోబర్-2023 నుండి శత్రు రోగ ఋణ బాధలను , స్వ శరీర పీడతను కలుగ చేయును. వ్యక్తిగత జాతకంలో రాహు - కేతు దోషం కలిగిన వారు, రాహు - కేతు గ్రహ బలాలు వ్యతిరేకంగా కలిగిన వారు 30-అక్టోబర్-2023 తదుపరి తరచుగా రాహు - కేతు గ్రహ శాంతి జరిపించుకోనుట మంచిది.

ఏప్రిల్ 2023 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఉద్యోగ, వ్యాపార వృత్తి జీవనం వారికి సామాన్య ఫలితాలు ఏర్పడును. విద్యారంగం వారికి మాత్రం విద్యా విషయాలలో విజయం ప్రాప్తించును. నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ఫలించును. నూతన వ్యాపార ప్రారంభాలకు లేదా నూతన ఆలోచనలు కార్యాచరణలో పెట్టుటకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. తృతీయ వారం మధ్య నుండి పనులు సకాలంలో పూర్తి అగును. వాతావరణం ఉత్సాహపూరితంగా ఉండును. కోరుకున్న నూతన వస్తువులు గృహంలో చేరును. గత కాలపు సమస్యలకు పరిష్కారం లభించును. మాసాంతంలో విందు వినోదాలు, కుటుంబ మిత్రులతో కలయికలు.

మే 2023 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వివాహ సంబంధ ప్రయత్నాలకు తగిన గ్రహ బలాలు లేవు. జీవిత భాగస్వామికి కూడా కొద్దిపాటి అనారోగ్య సూచనలు. భాత్రు వర్గంతో సఖ్యత లోపించును. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సామాన్యం. అవసరానికి తగిన సహహాన్ని పొందుదురు. ద్వితీయ తృతీయ వారాలు గృహంలో ఒక శుభ కార్యం వలన సందడి. బంధు సమాగమం. 20,21,22 తేదీలలో నూతన పరిచయాలు లేదా పెద్దల వలన ప్రశంశలు. చివరి వారంలో వ్యాపారస్థులకు ప్రయాణాలు. ఆదాయం కొద్దిగా తగ్గును.

జూన్ 2023 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసం చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పరచును. ఉద్యోగ, వ్యాపార వృత్తి జీవనం వారికి అనుకూలమైన రోజులు. 14, 20 తేదీలు అనుకూలంగా ఉండును. ధనాదాయం బాగుండును. నూతన ప్రయత్నాలు నెరవేరును. వాహన సంబంద లాభం. నిరుద్యోగులకు శుభవార్త. పుణ్యక్షేత్ర సందర్శన. ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలు. 29, 30 తేదీలలో కార్య ఒత్తిడి పెరుగును.

జూలై 2023 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. వ్యాపారస్థులకు ప్రోత్సాహకరం. వ్యాపార విస్తరణకు మంచి సమయం. ఉద్యోగస్తులకు నూతన భవిష్యత్ ప్రణాళికలు లభించును. ఉద్యోగ ఉన్నతి లేదా స్థాన మార్పిడికి ప్రయత్నాలు ఫలవంతం. సంకల్ప సిద్ధి లభించును. చిత్ర రంగ పరిశ్రమ వారికి అతి చక్కటి కాలం. ఈ మాసం సువర్ణ సంబంధ కోరికలు తీరును.

ఆగష్టు 2023 సింహరాశి రాశిఫలాలు:

ఈ మాసంలో ఆదాయ - వ్యయములు సమానంగా ఉండును. గృహ సంబందిత విషయాల వలన వ్యయం ఏర్పడును. ఉద్యోగ జీవనంలో ద్వితీయ వారం అంతగా కలసిరాదు. పై అధికారుల వలన సమస్యలు, మాటపడు సంఘటనలు. చేపట్టిన వ్యవహారాలలో అపజయాలు. ప్రమాద సంఘటనలు. తృతీయ వారంలో స్నేహవర్గం వలన తోడ్పాటు. ఆర్ధికంగా కొద్దిపాటి ఇబ్బందులు. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వలన సమస్యలు. 24వ తేదీ తదుపరి పరిస్థితులలో కొంత అనుకూలత. సమయానుకూల ప్రవర్తన అవసరం. ఈ మాసంలో 10,11,12,13 తేదీలలో జాగ్రత్త అవసరం.

సెప్టెంబర్ 2023 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆదాయం ఆశించిన స్థాయిలో వ్రుద్ధి చెందును. సంతాన లేమి దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించును. సంతానానికి మంచి రోజులు. వ్యాపార వ్యవహారాలు బాగుండును. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు. స్త్రీలు అవమానం పొందు సంఘటనలు. ఈ మాసంలో కుడా అధికారులతో జాగ్రత్తగా మేలగావలెను. 20,21,22 తేదీలు ఇబ్బందులు ఏర్పరచును.

అక్టోబర్ 2023 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సమస్యలు తగ్గును. శత్రువులు సయితం మిత్రులుగా మారుటకు గ్రహ సూచనలు కలవు. గృహ నిర్మాణం చేయువారికి లేదా గృహ సంబంధ ఋణములు పొందుటకు ప్రతికూల కాలం. ధనాదాయం బాగుండును. నూతన ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కలసివచ్చును. తృతీయ వారంలో స్థాయి తక్కువ వ్యక్తులతో పరిచయాలు, తన్మూలక సమస్యలు. చివరి వారంలో సామాన్య ఫలితాలు.

నవంబర్ 2023 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో చేపట్టిన పనులు క్రమంగా సఫలమగును. ఆర్ధికంగా కలసివచ్చును. భూ సంబంధ క్రయ విక్రయాలు కలసివచ్చును. ప్రధమ వారంలో ఒక శుభవార్త. మానసిక ప్రశాంతత. కుటుంబ సభ్యుల వలన సౌఖ్యం. వైవాహిక జీవనంలో సమస్యలు తగ్గును. ఆర్ధిక సంబంధ ప్రయత్నాలు ఫలవంతం అగును. ద్వితీయ తృతీయ వారాలు సామాన్య ఫలితాలు ఏర్పరచును. చివరి వారంలో అనారోగ్యములక ధనవ్యయం. ఈ మాసంలో 6,7,10,11,20,22 తేదీలు అనుకూలమైనవి.

డిసెంబర్ 2023 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసం ప్రారంభంలో ధనాదాయం సామాన్యం. విదేశీ ప్రయాణాలు, దూర ప్రాంత సంచారం, పోగొట్టుకున్న గౌరవం తిరిగి పొందుట, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం, స్నేహలాభాలు వంటి శుభ ఫలితాలు ఏర్పడును. వైవాహిక జీవనంలో కొద్దిపాటి తగవులు. అన్యవ్యక్తులతో పరిచయాలు. కోర్టు తగాదాలు. తృతీయ , చతుర్ధ వారాలలో చేపట్టిన పనులలో కార్య జయం. నూతన ఆదాయ మార్గాల లభ్యత. మాసాంతంలో నూతన వస్తు లాభాలు.

జనవరి 2024 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా చక్కటి ఫలితాలు కొనసాగును. నూతన వ్యాపార వ్యవహారాలకు , ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం చక్కటి కాలం. ఎత్తైన ప్రాంతాలు, కొండ మార్గాలలో సంచరించునపుడు జాగ్రత్తగా ఉండవలెను. విదేశే ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి కోర్కెలు నెరవేరును. కీర్తి ప్రతిష్టలు లభించును.

ఫెబ్రవరి 2024 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసం పితృ వర్గీయులకు మంచిది కాదు. ఆకస్మిక సమస్యలు లేదా కష్ట నష్టములు కలుగు సూచన. ఆదాయం తగ్గును. స్నేహితులతో విరోధాలు లేదా వారి వలన వ్యక్తిగత నష్టాలు. ఆరోగ్య సమస్యలు కలిగిన వారికి ఈ మాసంలో వ్యాధి తీవ్రత అధికం. వ్యక్తిగత జీవనం బాగుండదు. ఈ మాసంలో 1,5,6,12,19,29 తేదీలు అనుకూలమైనవి కావు.

మార్చ్ 2024 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో స్తంభించిన కార్యములు పునః ప్రారంభం అగును. పట్టుదలతో వ్యవహారాలలో విజయం. ధనాదాయం బాగుండును. కుటుంబ శ్రేయస్సుకై శ్రమించెదరు. అవకాశములను సద్వినియోగం చేసుకొందురు. సంపద వ్రుద్ధి చెందును. మాసాంతంలో కీర్తి ప్రతిష్టలు పెరుగును. కాలం అనుకూలంగా ఉండును. అన్ని విధములైన విఘ్నాలు తొలగును.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.